సాక్షి,ముంబై: వాహనదారులకు చుక్కలు చూపిస్తున్న పెట్రో ధరలపై దేశంలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైతోంది. ఈ నేపథ్యంలో హీరో సిద్ధార్థ విమర్శలు గుప్పించారు. ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌పై సోషల్ మీడియాలో తన దాడిని ఎక్కుపెట్టారు. ‘మామి తరువాతి స్థాయికి చేరుకున్నారు. ‘ఉల్లిపాయలు లేవు, మెమరీ లేదు, ప్రిన్సిపల్స్ లేవు.. మామి రాక్స్’ అంటూ ట్వీట్ చేశారు. అయితే పెట్రోల్, డీజిల్ ధరలపై తీవ్ర వ్యతిరేక వ్యక్తమవుతున్న నేపథ్యంలో పెట్రోలును జీఎస్‌టీ పరిధిలోకి తీసుకువస్తే.. ధరలు దిగొచ్చే అవకాశం ఉందని నిర్మలా గతవారం వ్యాఖ్యానించారు. ధరల అదుపునకు కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఒక యంత్రాంగాన్ని రూపొందించాల్సి ఉంటుందన్నారు.
మరోవైపు హద్దే లేకుండా పెరుగుతున్నపెట్రోలు, డీజిల్ ధరలపై నెటిజన్లు మండిపడుతున్నారు. దీనికి సంబంధించి సోషల్ మీడియాలో ఇప్పటికే మీమ్స్, వ్యంగ్యోక్తులతో బీజేపీ సర్కార్‌పై నెటిజన్లు విరుచుక పడుతున్నారు. పెట్రోలు ధరలను భారీగా పెంచుతూ సామాన్యులపై భారం మోపుతున్నారంటూ 2013లో కాంగ్రెస్ ప్రభుత‍్వంపై మండిపడిన నిర్మలా సీతారామన్, తాజా పెంపుపై మాత్రం ఆర్థికమంత్రిగా విభిన్నంగా స్పందించారు. దీనికి ఆయిల్ కంపెనీలే బాధ్యత వహించాలని, ఇంధన ధరల నియంత్రణ కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉండదని పేర్కొనడం గమనార్హం. ఈ వీడియో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. మరోవైపు ఫిబ్రవరి మాసంలో రికార్డు స్తాయిలో పుంజుకున్న పెట్రోలు, డీజిల్ గత రెండు రోజులుగా స్థిరంగా ఉన్నాయి.
Maami is next level flexible in her belief system. No onions, no memory, no principles. Maami rocks! https://t.co/4WZ791m1HV
— Siddharth (@Actor_Siddharth) February 22, 2021
Comments
Please login to add a commentAdd a comment