రోడ్డు దాటుతున్న మహిళను గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో.. ఆమె అక్కడికక్కడే మృతిచెందింది.
రోడ్డు దాటుతున్న మహిళను గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో.. ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. ఈ సంఘటన పశ్చిమగోదావరి జిల్లా వీరవాసంలో శుక్రవారం చోటుచేసుకుంది. తోలేరుకు చెందిన జడ్డు కళావతి(50) వీరవాసంలో రోడ్డు దాటుతుండగా.. గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. దీంతో ఆమె మృతిచెందింది. సమచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.