
సాక్షి, పశ్చిమగోదావరి జిల్లా: రోడ్డు ప్రమాదంలో పీడీఎఫ్ ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ దుర్మరణం చెందారు. ఉండి మండలం చెరుకువాడలో రెండు కార్లు ఢీకొన్న ఘటనలో సాబ్జీ మృతి చెందారు. సాబ్జీ కారు డ్రైవర్, గన్‌మెన్, పీఏకి తీవ్రగాయాలు కాగా, వారిని ఆసుపత్రికి తరలించారు. ఏలూరు నుంచి భీమవరం వెళ్తుండగా ఈ ఘటన జరిగింది.
సీఎం జగన్ దిగ్భ్రాంతి
మంత్రివర్గ సమావేశం జరుగుతుండగా ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ మరణవార్త తెలుసుకున్న సీఎం జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సాబ్జీ మృతికి కేబినెట్ సంతాపం తెలిపింది. కేబినెట్ సభ్యులు 2 నిమిషాలు మౌనం పాటించారు.
Comments
Please login to add a commentAdd a comment