
పశ్చిమ గోదావరి: పశ్చిమ గోదావరి జిల్లాలో మంగళవారం విషాదం చోటు చేసుకుంది. నిడమర్రు మండలం మందలపర్రులో వద్ద రోడ్డుప్రమాదం జరిగింది. కారు అదుపుతప్పి రోడ్డుపక్కనే ఉన్న కాల్వలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు.
స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. మృతిచెందిన వారిని సుమంత్(35), శరత్(28)లుగా పోలీసులు గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment