డబ్బు కోసం దారుణం
కర్ణాటకలో హైదరాబాదీ హత్య
ముగ్గురు నిందితుల అరెస్టు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌కు చెందిన రమేష్ కుమార్ అనే వ్యాపారి కర్ణాటకలో దారుణ హత్యకు గురయ్యారు. కారులో హత్య చేసి మృతదేహాన్ని అక్కడి ఓ కాఫీ ఎస్టేట్‌లో పడేసి కాల్చేశారు. ఈ నెల 3న చోటుచేసుకున్న ఈ ఘాతుకానికి ఆయన భార్య నిహారిక సూత్రధారిగా తేలింది. ఈమెతో పాటు ప్రి యుడు, స్నేహితుడిని శనివారం అరెస్టు చేసిన కొడగు పోలీసులు హతుడి కారును స్వా«దీనం చేసుకున్నారు. కొడగు ఎస్పీ ఆర్.రామరాజన్ చెప్పిన వివరాల ప్రకారం.. నిహారిక స్వస్థలం యాదాద్రి– భువనగిరి జిల్లా మునీరాబాద్. గతంలో హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తిని వివాహం చేసుకుని విడాకులు తీసుకుంది.
ఆ తర్వాత హరియాణాకు చెందిన మరో వ్యక్తిని ఆమె పెళ్లి చేసుకుంది. అక్కడ నివసిస్తుండగా ఓ చీటింగ్ కేసులో భార్యాభర్తలు జైలుకు వెళ్లారు. జైలులో ఉండగా హరియాణాలోని కర్నాల్ ప్రాంతానికి చెందిన ఓ మహిళతో వీరికి పరిచయమైంది. ఆ మహిళను కలవడానికి తరచూ జైలుకు వచ్చే ఆమె కుమారుడు అంకుర్ రాణాతోనూ స్నేహం ఏర్పడింది. ఈ నేపథ్యంలో రెండో భర్తను కూడా నిహారిక వదిలేసి.. హైదరాబాద్‌కు చెందిన వ్యాపారి రమేష్ కుమార్ (54)ను వివాహం చేసుకుంది. బెంగళూరులో నివసిస్తూ ఓ ప్రముఖ సంస్థలో పని చేసేది.
రూ.8 కోట్లు కాజేయాలని..
ఏపీలోని కడప జిల్లా వాసవీ నగర్ నుంచి బెంగళూరులోని రామమూర్తి నగర్‌లో వెటర్నరీ డాక్టర్‌గా స్థిరపడిన నిఖిల్ మైరెడ్డితో నిహారికకు ఏర్పడిన పరిచయం ప్రేమకు దారి తీసింది. ఈ క్రమంలో రమేష్ కుమార్ ఇటీవల తన స్తిరాస్థిని విక్రయించగా వచి్చన రూ.8 కోట్లు కాజేయాలని నిహారిక పథకం పన్నింది. రమేష్‌ను హత్య చేసేందుకు అంకుర్ రాణాను సంప్రదించింది. ఈ నెల 1న అంకుర్‌తో కలిసి హైదరాబాద్ చేరుకున్న నిహారిక తన భర్త వద్ద ఉంది. 3వ తేదీన తమను బెంగళూరులో దింపి రావాలంటూ భర్తకు కోరింది. దీనికి అంగీకరించిన రమేష్ కుమార్ తన మెర్సిడెజ్ బెంజ్ కారులో ఇద్దరినీ తీసుకుని బయలుదేరారు. అంకుర్ కారు నడుపుతుండగా.. పక్క సీటులో రమేష్, వెనుక నిహారిక కూర్చున్నారు. మార్గంమధ్యలో హైవేపై కారు ఆపి.. ఊపిరి ఆడకుండా చేసి రమే‹Ùను హత్య చేశారు. మృతదేహాన్ని కారులోనే ఉంచి బెంగళూరులోని హోరామావూ ప్రాంతం వరకు వెళ్లారు.
మృత దేహాన్ని కాల్చేసి..
ఆపై నిఖిల్‌ను సంప్రదించిన నిహారిక తన భర్త రమే‹Ùకుమార్ హత్య విషయం చెప్పింది. అతడి సలహా మేరకు మృతదేహాన్ని ఊటీ సమీపంలోని సుంటికొప్పలో ఉన్న కాఫీ ఎస్టేట్‌లోకి తీసుకువెళ్లారు. పెట్రోల్ పోసి నిప్పింటించి అక్కడి నుంచి కారులో ఉడాయించారు. ఈ నెల 8న సగం కాలిన మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు కొడగు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసిన అధికారులు వివిధ ప్రాంతాల్లోని దాదాపు 500 సీసీ కెమెరాల్లో ఈ నెల 1 తేదీ నుంచి రికార్డు అయిన ఫీడ్‌ను పరిశీలించారు. ఓ కెమెరాలో కారు కదలికలతో పాటు దాని నంబర్ కూడా పోలీసులకు కనిపించింది. దీని ఆ«ధారంగా హైదరాబాద్ వచి్చన కొడగు పోలీసులు హతుడి వివరాలు సేకరించారు. ఆపై నిహారిక, నిఖిల్‌లను బెంగళూరులో, అంకుర్‌ను హరియాణాలో అరెస్టు చేశారు. వీరి కారుతో పాటు సెల్‌ఫోన్లు స్వా«దీనం చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment