
చిత్తూరు , పాకాల: మండలంలోని నేండ్రగుంట–పెనుమూరు రోడ్డులోని సమీప గుట్టలో బుధవారం గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. సీఐ హరి నాథ్, పోలీసులు అక్కడికి చేరుకుని పరి శీలించారు. కత్తితో గాయపరిచి, ప్లాస్టిక్ వైర్‌తో గొంతుకు బిగించి హత్య చేసినట్టు అభిప్రాయపడ్డారు. మృతుడికి 40 ఏళ్లు ఉంటాయని, ఎరుపు, తెలుపు, నీలి రంగు సారల చొక్కా, లేత నీలి రంగు డ్రాయర్ ధరించాడని తెలిపారు. మృతదేహాన్ని పీలేరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment