సాక్షి, క్రిష్ణగిరి: క్రిష్ణగిరి సమీపంలో ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేసిన దుండగుడు అతని చేతిని నరికి గోనెసంచిలో వేసుకుని తీసుకెళ్లి ప్రేయసి ఇంటి ముందు పడేసి వెళ్లిన ఉదంతం చోటు చేసుకుంది. వివరాల మేరకు.. వేలూరు జిల్లా వాలాజ ప్రాంతానికి చెందిన తమిళరసన్‌కు క్రిష్ణగిరి భారతీనగర్ ప్రాంతానికి చెందిన ఓ మహిళతో అక్రమ సంబంధం ఉండేది. మంగళవారం రాత్రి క్రిష్ణగిరికి వచ్చిన ఇతడు ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేసి అతని చేతిని గోనెసంచిలో వేసుకుని ప్రేయసి ఇంటి ముందు పడేసి వెళ్లాడు.
(కొద్ది సేపట్లో భర్త రెండో పెళ్లి.. )
విషయం తెలుసుకొన్న క్రిష్ణగిరి తాలూకా పోలీసులు చేతిని స్వాధీనపరుచుకొని శవం కోసం గాలించగా గిడ్డంబట్టి వద్ద ప్రైవేట్ ఆస్పత్రి పక్కన శవం కనిపించింది. పోలీసులు శవాన్ని స్వాదీనపరుచుకొని విచారణ జరుపగా తమిళరసన్ ఇంతకు ముందే రౌడీగా ఉన్నట్లు కేసులు నమోదయ్యాయని, క్రిష్ణగిరిలోని రౌడీలతో అతనికి సంబంధం ఉన్నట్లు తెలిసింది. దారుణహత్యకు గురైన వ్యక్తి ఆచూకీ తెలియలేదని పోలీసులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని నిందితున్ని పట్టుకొనేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. (భర్త హత్యకు పక్కాగా స్కెచ్)
Comments
Please login to add a commentAdd a comment