
సాక్షి, హైదరాబాద్: నగరంలోని ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్‌లో ఓ మృతదేహం కలకలం రేపుతోంది. ముషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హరినగర్ రీసాలగడ్డ వాటర్ ట్యాంక్‌లో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. వాటర్ ట్యాంక్‌ను శుభ్రం చేయడానికి వచ్చిన వాటర్ వర్క్స్ సిబ్బందికి మృతదేహం కనిపించడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో సంఘటన స్థలానికి చేరుకున్న ముషీరాబాద్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
చదవండి: నన్ను ఎందుకు కొట్టావు? పోలీసులకు చుక్కలు చూపించిన వ్యక్తి
మంచి నీటి ట్యాంకులో లభించిన మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. వ్యక్తి ప్రమాదవశాత్తూ వాటర్ ట్యాంక్‌లో పడి ఉంటాడా? లేక ఎవరన్నా హత్య చేసి వాటర్ ట్యాంక్‌లో పడేసి ఉంటారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహం విషయం తెలియడంతో సంఘటన స్థలం వద్దకు స్థానికులు భారీ ఎత్తున్న చేరుకున్నారు. కాగా గత కొన్ని రోజులుగా వాటర్ ట్యాంక్‌లోని నీటిని తాగిన స్థానికులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.
చదవండి: డ్రంకెన్ డ్రైవ్.. రక్తంలో ఆల్కహాల్‌ని ఎలా లెక్కిస్తారు?
Comments
Please login to add a commentAdd a comment