Musheerabad police station
-
హైదరాబాద్: వాటర్ ట్యాంక్‌లో డెడ్‌బాడీ కలకలం..ఆందోళనలో జనం
సాక్షి, హైదరాబాద్: నగరంలోని ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్‌లో ఓ మృతదేహం కలకలం రేపుతోంది. ముషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హరినగర్ రీసాలగడ్డ వాటర్ ట్యాంక్‌లో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. వాటర్ ట్యాంక్‌ను శుభ్రం చేయడానికి వచ్చిన వాటర్ వర్క్స్ సిబ్బందికి మృతదేహం కనిపించడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో సంఘటన స్థలానికి చేరుకున్న ముషీరాబాద్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. చదవండి: నన్ను ఎందుకు కొట్టావు? పోలీసులకు చుక్కలు చూపించిన వ్యక్తి మంచి నీటి ట్యాంకులో లభించిన మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. వ్యక్తి ప్రమాదవశాత్తూ వాటర్ ట్యాంక్‌లో పడి ఉంటాడా? లేక ఎవరన్నా హత్య చేసి వాటర్ ట్యాంక్‌లో పడేసి ఉంటారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహం విషయం తెలియడంతో సంఘటన స్థలం వద్దకు స్థానికులు భారీ ఎత్తున్న చేరుకున్నారు. కాగా గత కొన్ని రోజులుగా వాటర్ ట్యాంక్‌లోని నీటిని తాగిన స్థానికులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. చదవండి: డ్రంకెన్ డ్రైవ్.. రక్తంలో ఆల్కహాల్‌ని ఎలా లెక్కిస్తారు? -
‘విశ్వాసం’ మంటగలిసింది
-
‘విశ్వాసం’ మంటగలిసింది
- కుక్కపిల్లల సజీవ దహనం - వీడియో తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ - ముషీరాబాద్ డివిజన్ దాయరకమాన్లో ఘటన - జంతు ప్రేమికురాలి ఫిర్యాదుతో కేసు నమోదు.. పోలీసుల అదుపులో ముగ్గురు హైదరాబాద్: విచక్షణ కోల్పోయిన కొందరు బాలురు కుక్క పిల్లల్ని కట్టేసి, మంటల్లో పడేసి సజీవంగా కాల్చేశారు.. ఆ దృశ్యాలను వీడియో తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు.. దీనిపై జంతు ప్రేమికురాలైన ఓ న్యాయవాది ఫిర్యాదు చేయడంతో పోలీసులు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. ‘విశ్వాసం’ మంటగలసిన ఈ పైశాచిక ఘటన నగరంలోని ముషీరాబాద్ పోలీసుస్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. శనివారం మధ్యాహ్నం చోటు చేసుకున్న ఈ ఉదంతంపై మంగళవారం కేసు నమోదు కాగా.. బుధవారం వెలుగులోకి వచ్చింది. ముషీరాబాద్ డివిజన్ దాయరకమాన్ పక్కన పఠాన్లకు చెందిన శ్మశానవాటిక ఉంది. అందులో అనేక కుక్కలు జీవిస్తుంటాయి. శనివారం మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో పది మంది బాలురు చిన్న చిన్న కుక్క పిల్లల్ని పట్టుకున్నారు. వాటి కాళ్లను తాళ్లతో కట్టేసి ఒక దగ్గరకు చేర్చారు. వీరిలో కొందరు వాటిని బతికుండగానే కాల్చాలని చెప్పారు. దీంతో కర్రలు, కట్టెల్ని పొగేసి మంటపెట్టి మూడు కుక్క పిల్లల్ని సజీవంగా ఆ మంటల్లో వేశారు. మంటల్ని తట్టుకోలేని కుక్క పిల్లలు దీనంగా అరుస్తూ బయటకొచ్చేందుకు ప్రయత్నించినా.. వదిలిపెట్టకుండా మళ్లీ పట్టుకుని మంటల్లో వేయడంతో పాటు అవి బయటకు రాకుండా కర్రలతో అదిమిపెట్టి సజీవ దహనం చేశారు. ఈ దృశ్యాలను తమ సెల్ఫోన్లలో రికార్డు చేశారు. ఆపై 2.22 నిమిషాలు, 2.50 నిమిషాల నిడివి ఉన్న రెండు వీడియోలను సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. ఈ దృశ్యాలను నల్లకుంటలోని పద్మకాలనీకి చెందిన న్యాయవాది శ్రేయ పరోపకారి చూశారు. ఈమె పీపుల్స్ ఫర్ యానిమల్ సంస్థ వలంటీర్‌గా, కేంద్ర పర్యావరణ శాఖ ఆధీనంలోని ఏడబ్ల్యూబీఐలో గౌరవ యానిమల్ వెల్ఫేర్ ఆఫీసర్‌గా పని చేస్తున్నారు. పాశవికమైన ఈ ఉదంతంపై మంగళవారం రాత్రి ముషీరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై ఎస్సై బి.భాస్కరరావు ‘ప్రివెన్షన్ ఆఫ్ క్రూయాలిటీ టు యానిమల్స్ యాక్ట్-1960’లోని 11(1)(ఎ), 11(1)(ఎల్) సెక్షన్లతో పాటు ఐపీసీ సెక్షన్ 429 కింద కేసు నమోదు చేశారు. వీడియో ఆధారంగా ముగ్గురు బాలురను గుర్తించి బుధవారం అదుపులోకి తీసుకున్నారు. ముషీరాబాద్ ఫిష్ మార్కెట్లో వ్యాపారం చేసే ఓ వ్యాపారి కుమారుడి సెల్‌ఫోన్ నుంచి వీడియోలను రికవరీ చేశారు. నాంపల్లి పోలీసులకు మరో ఫిర్యాదు మరోవైపు ఓ వ్యక్తి ఎయిర్‌గన్‌తో వీధి కుక్కల్ని కాలుస్తున్న వీడియోలతో మరో వ్యక్తి నాంపల్లి పోలీసుల్ని ఆశ్రయించారు. 22 సెకన్ల నిడివి ఉన్న సదరు వీడియోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టాలని కోరారు. ఓ వ్యక్తి ఎయిర్‌గన్‌తో రెండు కుక్కలపై కాల్పులు జరిపినట్లు ఆ వీడియోలో ఉంది. బహిరంగ ప్రదేశంలో లారీల మధ్య ఉన్న దాంతో పాటు ఓ ప్రాంగణంలో మరో శునకంపై కాల్పులు జరిపినట్లు రికార్డైంది. మొదటి కుక్క పారిపోగా, రెండోది అక్కడేపడి చనిపోయినట్లు కనిపిస్తోంది. ఫిర్యాదును పరిశీలించిన నాంపల్లి పోలీసులు ఏ ప్రాంతంలో జరిగిందో చెప్పాలని ఫిర్యాదుదారుడిని కోరారు. ఆ విషయం తనకు తెలియదని అతడు చెప్పడంతో వీడియో మూలాలు కనుక్కోవడం సైబర్ క్రైమ్ అధికారులతోనే సాధ్యమని, వారికే ఫిర్యాదు చేయాలని సూచించి పంపారు. -
మంత్రి దత్తాత్రేయ సెల్‌ఫోన్‌ను కొట్టేశారు!
చిక్కడపల్లి (హైదరాబాద్): కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ సెల్‌ఫోన్‌ను ఆగంతకులు ఎవరో కొట్టేశారు. మంత్రి దత్తాత్రేయ రామ్‌నగర్‌లోని మీ సేవా కేంద్రం సమీపంలో నివాసం ఉంటారు. శనివారం అర్ధరాత్రి వీచిన గాలులకు చెట్లు విరిగి పడిపోవడంతో ఆ ప్రాంతంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో దత్తాత్రేయ శామ్సంగ్ సెల్ఫోన్లో చార్జింగ్ అయిపోయింది. ఆదివారం ఉదయం 8.30 గంటల ప్రాంతంలో ఆయన ఇంటి ముందున్న గదిలో చార్జింగ్ పెట్టారు. బయట సందర్శకులు చాలా మంది వచ్చి ఉన్నారు. కొద్దిసేపటి తర్వాత చూస్తే సెల్‌ఫోన్ కనిపించలేదు. దీంతో మంత్రి పీఏ యుగేందర్ ముషీరాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చోరీకి గురైన సెల్‌ఫోన్ విలువ సుమారు రూ.25వేల వరకు ఉంటుందని అంచనా. -
పోలీస్ ఓ సోషల్ డాక్టర్
ముషీరాబాద్: శరీరంలో రుగ్మతలను డాక్టర్ నయం చేస్తే, సమాజంలో చెడును, చీడపురుగులను ఏరివేసే సోషల్ డాక్టర్ పోలీసు అని యూనివర్సల్ ఇస్లామిర్ రెసర్చ్ సెంటర్ (యూఐఆర్సీ) అధ్యక్షుడు బ్రదర్ షఫీ కొనియాడారు. మంగళవారం ముషీరాబాద్ పోలీసు స్టేషన్ సిబ్బందికి పరివర్తన, వ్యక్తిత్వ వికాసంపై ఆయేషా ఫంక్షన్ హాల్లో శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమానికి ము ఖ్యఅతిథులుగా సెంట్రల్ జోన్ డీసీపీ కమలాసన్‌రెడ్డి, చిక్కడపల్లి ఏసీపీ అమర్‌కాంత్‌రెడ్డి, యూఆర్ఐసీ ప్రధాన కార్యదర్శి బ్ర దర్ సిరాజుల్ రహెమాన్ తదితరులు హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా షఫీ మాట్లాడుతూ పోలీసులది ఇచ్చే చేయిగా ఉండాలి తప్ప పుచ్చుకునే చేయిగా ఉండరాదని, అప్పుడే ఆత్మగౌరవం పెరుగుతుందన్నారు. తద్వారా యూనీఫాంకు మర్యాద ఉంటుందన్నారు. ప్రస్తుతమున్న పరిస్థితుల నేపథ్యంలో గంట సేపు పోలీసులు లేని సమాజం ఊహించుకోవడమే కష్టమన్నా రు. పోలీసు సంస్కృతిలో ప్రవర్తనలో మార్పు రావాలని కోరారు. ఆకట్టుకున్న బ్రదర్ ప్రసంగం... పోలీసులకు ఇచ్చే శిక్షణ కార్యక్రమానికి హాజరైన యూనివర్సల్ ఇస్లామిక్ రిసెర్చ్ సెంటర్ (యూఐఆర్సీ) అధ్యక్షుడు బ్రదర్ షపీ, ప్రధాన కార్యదర్శి బ్రదర్ సిరాజుల్ రెహమాన్ ప్రసంగించిన తీరు మంత్రముగ్ధుల్ని చేసింది. ఉపనిషత్తులు, మహాభారతం, రామాయణం వంటి ఇతిహాసలోని ప్రధాన ఘట్టాలను శాస్త్రోక్తంగా.. చూడకుండా పఠించడంతో పాటు అందులోని అర్థాలను సవివరంగా చెప్పారు. అంతేకాకుండా బైబిల్, ఖురాన్లలో దేవుని గురించి చేసిన ఒకే రకమైన వ్యాఖ్యలను వివరించారు.