‘విశ్వాసం’ మంటగలిసింది | Pet dogs burnt alive by youth, recorded and uploaded in social media | Sakshi
Sakshi News home page

Published Thu, Jul 21 2016 8:00 AM | Last Updated on Wed, Mar 20 2024 3:50 PM

విచక్షణ కోల్పోయిన కొందరు బాలురు కుక్క పిల్లల్ని కట్టేసి, మంటల్లో పడేసి సజీవంగా కాల్చేశారు.. ఆ దృశ్యాలను వీడియో తీసి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశారు.. దీనిపై జంతు ప్రేమికురాలైన ఓ న్యాయవాది ఫిర్యాదు చేయడంతో పోలీసులు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. ‘విశ్వాసం’ మంటగలసిన ఈ పైశాచిక ఘటన నగరంలోని ముషీరాబాద్ పోలీసుస్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. శనివారం మధ్యాహ్నం చోటు చేసుకున్న ఈ ఉదంతంపై మంగళవారం కేసు నమోదు కాగా.. బుధవారం వెలుగులోకి వచ్చింది. ముషీరాబాద్ డివిజన్ దాయరకమాన్ పక్కన పఠాన్‌లకు చెందిన శ్మశానవాటిక ఉంది.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement