లక్నో: ఉత్తర ప్రదేశ్‌లో గురువారం నుంచి అసెంబ్లీ ఎన్నికలు ప్రారంభమైన విషయం తెలిసిందే. యూపీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో ఓ సంచలన ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో కాన‍్పూర్‌కు చెందిన ఓ వ్యాపారి ఇంట్లో కోట్ల రూపాయల డబ్బును అధికారులు సీజ్ చేసిన ఘటన మరువక ముందే మరో వార్త దుమారం రేపుతోంది. యూపీ మాజీ మంత్రి కుమారుడికి చెందిన ఆశ్రమం దగ్గరలో గురువారం కుళ్లిపోయిన స్థితిలో మెడ కోసి ఉన్న ఓ యువతి మృతదేహం దొరకడం సంచలనంగా మారింది.
ఈ ఘటనపై ఉన్నావ్ ఎస్పీ శశి శేఖర్ సింగ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఉన్నావ్‌లో యువతి(22) కనిపించడంలేదంటూ డిసెంబర్ 8వ తేదీన ఆమె తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో డిసెంబర్ 10న ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్టు వెల్లడించారు. కేసు విచారణలో భాగంగా ఓ వ్యక్తి అరెస్ట్ చేసినట‍్టు తెలిపారు. అలాగే దర్యాప్తులో భాగంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న సమాజ్ వాదీ పార్టీ(ఎస్పీ)కి చెందిన దివంగత మాజీ మంత్రి ఫతే బహదూర్ సింగ్ కుమారుడు రాజోల్ సింగ్‌ను జనవరి 24న అరెస్ట్ చేసినట్టు పేర్కొన్నారు.
చదవండి: హిజాబ్ అంశాన్ని పెద్దది చేయకండి: సుప్రీం కోర్టు
అయితే తాజాగా యువతి మృతదేహాన్ని రాజోల్ సింగ్ ఆశ్రమం సమీపంలో స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. పోస్టుమార్టం అనంతరం శుక్రవారం యువతి మెడ భాగంగా కట్ చేసి ఉన్నట‍్టు నివేదికలో వెల్లడించారు. ఇదిలా ఉండగా.. బాధితురాలి తల్లి విలేకరులతో మాట్లాడుతూ.. తన కుమార్తెను రాజోల్ సింగ్ అతని ఆశ్రమంలో చంపి పాతిపెట్టాడని ఆరోపించారు. వారిపై అనుమానంతోనే తాను ఆశ్రమానికి వెళ్లి అక్కడ కొంత స్థలం తనిఖీ చేసినట్టు వెల్లడించారు. ఈ విషయంలో తనకు పోలీసులు సహకరించలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు సరైన సమయంలో స్పందించి ఉంటే తన కుమార్తె బతికుండేదని కన్నీటిపర్యంతమయ్యారు.
చదవండి: మోదీలు, ఈడీలు, సీబీఐలు నన్ను భయపెట్టలేవు
Comments
Please login to add a commentAdd a comment