సాక్షి, అచ్చంపేట : కృష్ణానదిలో సోమవారం గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. ఎడమ పాతాళగంగ వద్దనున్న మత్స్యకారులు నదిలో తేలియాడుతున్న మృతదేహాన్ని గుర్తించి వెంటనే అమ్రాబాద్ పోలీసులకు సమాచారం తెలియపరిచారు. దీంతో అచ్చంపేట డీఎస్పీ నర్సింహులు, అమ్రాబాద్ సీఐ బీసన్న, ఈగలపెంట ఎస్‌ఐ వెంకటయ్య పోలీస్ సిబ్బందితో సంఘటనా స్థలికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి పరిస్థితులను సమీక్షించారు.
ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ మృతదేహం పూర్తిగా కుళ్లిపోవడంతో పంచనామా చేసి దో మలపెంటలోని శ్మశాన వాటికలో ఖననం చేశామన్నారు. మృతుడు బ్లూకలర్ షర్టు, బ్లాక్ ప్యాంట్ ధరించి ఉన్నాడని, వయస్సు 38– 40 ఏళ్లు, 5.7 అడుగుల ఎత్తు ఉన్నాడన్నారు. ఎక్కడైనా మిస్సింగ్ కేసు ఉంటే పోలీసులను సంప్రదించాలని కోరారు. కాగా శ్రీశైలం ఆ నకట్ట దిగువన గత శనివారం కృష్ణానది వంతెనపై కలకలం రేపిన రక్తపు మరకలకు సంబంధించి గుర్తుతెలియని వ్యక్తులు ఓ వ్యక్తిని హత్య చేసి కృష్ణానదిలో పడేసి ఉం టారని పోలీసులు అనుమానం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.
(చదవండి : కృష్ణానది బ్రిడ్జిపై రక్తపు మరకలు)
Comments
Please login to add a commentAdd a comment