Krishna Bridge
-
కృష్ణానదిలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం
సాక్షి, అచ్చంపేట : కృష్ణానదిలో సోమవారం గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. ఎడమ పాతాళగంగ వద్దనున్న మత్స్యకారులు నదిలో తేలియాడుతున్న మృతదేహాన్ని గుర్తించి వెంటనే అమ్రాబాద్ పోలీసులకు సమాచారం తెలియపరిచారు. దీంతో అచ్చంపేట డీఎస్పీ నర్సింహులు, అమ్రాబాద్ సీఐ బీసన్న, ఈగలపెంట ఎస్ఐ వెంకటయ్య పోలీస్ సిబ్బందితో సంఘటనా స్థలికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి పరిస్థితులను సమీక్షించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ మృతదేహం పూర్తిగా కుళ్లిపోవడంతో పంచనామా చేసి దో మలపెంటలోని శ్మశాన వాటికలో ఖననం చేశామన్నారు. మృతుడు బ్లూకలర్ షర్టు, బ్లాక్ ప్యాంట్ ధరించి ఉన్నాడని, వయస్సు 38– 40 ఏళ్లు, 5.7 అడుగుల ఎత్తు ఉన్నాడన్నారు. ఎక్కడైనా మిస్సింగ్ కేసు ఉంటే పోలీసులను సంప్రదించాలని కోరారు. కాగా శ్రీశైలం ఆ నకట్ట దిగువన గత శనివారం కృష్ణానది వంతెనపై కలకలం రేపిన రక్తపు మరకలకు సంబంధించి గుర్తుతెలియని వ్యక్తులు ఓ వ్యక్తిని హత్య చేసి కృష్ణానదిలో పడేసి ఉం టారని పోలీసులు అనుమానం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. (చదవండి : కృష్ణానది బ్రిడ్జిపై రక్తపు మరకలు) -
కృష్ణానది బ్రిడ్జిపై రక్తపు మరకలు
సాక్షి, అచ్చంపేట : శ్రీశైలం ఆనకట్ట దిగువన కృష్ణానది బ్రిడ్జిపై రక్తపు మరకలు కనిపించడంతో కలకలం రేగింది. ఈగలపెంట ఎస్ఐ వెంకటయ్య కథనం ప్రకారం.. ఆనకట్ట దిగువన కృష్ణానది బ్రిడ్జిపై రక్తపు మరకలు, సిగరెట్ ప్యాకెట్, లైటర్, ఓ పెన్ పడి ఉన్నాయి. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అచ్చంపేట డీఎస్పీ నర్సింహులు, అమ్రాబాద్ సీఐ బీసన్న సంఘటనా స్థలికి చేరుకుని పరిశీలించారు. డాగ్ స్క్వాడ్, క్లూస్‌టీంతో ఆధారాలు, రక్తం నమూనాలు సేకరించారు. ఈ సందర్భంగా డీఎస్పీ నర్సింహులు మాట్లాడుతూ మగ వ్యక్తిని చంపి నదిలో పడేసినట్లు తెలుస్తుందన్నారు. సంఘటన తెల్లవారుజామున జరిగి ఉండవచ్చని అనుమానిస్తున్నామన్నారు. రెండు రోజుల్లో మృతదేహం నదిలో నుంచి బయటపడవచ్చని, ఆ తర్వాత కేసును కేసును ఛేదిస్తామన్నారు. అయితే స్థానిక వ్యాపారులు, ఇళ్ల వారు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకునేందుకు ముందుకు రావాలని డీఎస్పీ కోరారు. -
వంతెన ప్రారంభం
మాగనూర్: మండల పరిధిలోని కృష్ణానదిపై రాకపోకలు ప్రారంభమయ్యాయి. గత జూన్ 23 నుంచి బ్రిడ్జి పై సీసీ రోడ్డు నిర్మాణం కొరకు కర్ణాటక ప్రభుత్వం దాదాపు రెండు నెలల పాటూ వాహన రాకపోకలను నిల్పివేసిన విషయం పాఠకులకు విధితమే. కాగ ఎట్టకేలకు బ్రిడ్జిపై వాహనాలు వెళ్లుటకు మంగళవారం రాత్రి నుంచి అధికారులు అనుమతించారు. దీంతో ఈ ప్రాంత ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు. రెండు నెలలుగా నిల్చిపోయిన వ్యాపారాలు పునఃప్రారంభం కానున్నాయి.