కృష్ణానది బ్రిడ్జిపై రక్తపు మరకలు  | Blood Marks Found On Krishna Bridge Near Acchampet | Sakshi
Sakshi News home page

కృష్ణానది బ్రిడ్జిపై రక్తపు మరకలు 

Published Sun, Sep 22 2019 12:10 PM | Last Updated on Sun, Sep 22 2019 12:10 PM

Blood Marks Found On Krishna Bridge Near Acchampet - Sakshi

సాక్షి, అచ్చంపేట : శ్రీశైలం ఆనకట్ట దిగువన కృష్ణానది బ్రిడ్జిపై రక్తపు మరకలు కనిపించడంతో కలకలం రేగింది. ఈగలపెంట ఎస్‌ఐ వెంకటయ్య కథనం ప్రకారం.. ఆనకట్ట దిగువన కృష్ణానది బ్రిడ్జిపై రక్తపు మరకలు, సిగరెట్‌ ప్యాకెట్, లైటర్, ఓ పెన్‌ పడి ఉన్నాయి. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అచ్చంపేట డీఎస్పీ నర్సింహులు, అమ్రాబాద్‌ సీఐ బీసన్న సంఘటనా స్థలికి చేరుకుని పరిశీలించారు. డాగ్‌ స్క్వాడ్, క్లూస్‌టీంతో ఆధారాలు, రక్తం నమూనాలు సేకరించారు. ఈ సందర్భంగా డీఎస్పీ నర్సింహులు మాట్లాడుతూ మగ వ్యక్తిని చంపి నదిలో పడేసినట్లు తెలుస్తుందన్నారు. సంఘటన తెల్లవారుజామున జరిగి ఉండవచ్చని  అనుమానిస్తున్నామన్నారు. రెండు రోజుల్లో మృతదేహం నదిలో నుంచి బయటపడవచ్చని, ఆ తర్వాత కేసును కేసును ఛేదిస్తామన్నారు. అయితే స్థానిక వ్యాపారులు, ఇళ్ల వారు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకునేందుకు ముందుకు రావాలని డీఎస్పీ కోరారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement