పిల్లలు ఊయల్లో.. తల్లులు ఆపరేషన్ థియేటర్‌లో..
అచ్చంపేట: ఈ ఫొటోలో ఉన్న చెట్లకు ఇన్ని ఊయలలు వేలాడుతున్నాయంటే.. ఇదేదో బాలికా శిశు సంరక్షణ కేంద్రం అయ్యింటుందేమో అనుకుంటే పొరపాటే. కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించుకునేందుకు వచ్చిన తల్లులు ఆపరేషన్ థియేటర్‌లోకి వెళ్లేముందు వారి పిల్లలను ఆస్పత్రి ఆవరణలో ఉన్న చెట్లకు ఊయలలు కట్టి అందులో పడుకోబెట్టారు.
ఈ సంఘటన గురువారం మహబూబ్‌నగర్ జిల్లా అచ్చంపేట ప్రభుత్వ సివిల్ ఆస్పత్రిలో దర్శనమిచ్చింది. ఎనిమిది నెలల తర్వాత కుటుంబ నియంత్రణ శిబిరం ఏర్పాటు చేయడంతో 176 మంది మహిళలు ఆపరేషన్ల కోసం తరలివచ్చారు.