Family planning operation
-
ఇబ్రహీంపట్నం ఘటన.. డాక్టర్ శ్రీధర్ సస్పెన్షన్‌ను రద్దు చేసిన హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం సామాజిక ఆరోగ్య కేంద్రంలో(సీహెచ్‌సీ) నిర్వహించిన వైద్య శిబిరంలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు వికటించి నలుగురు మరణించిన ఘటనలో కేంద్రం ఇన్చార్జీ డాక్టర్ శ్రీధర్‌ను సస్పెండ్ చేయడాన్ని హైకోర్టు రద్దు చేసింది. సస్పెన్షన్ ఉత్తర్వులకు సంబంధించి కౌంటర్ దాఖలు చేయాలని తెలంగాణ వైద్య విధాన పరిషత్‌ను ఆదేశించింది. నలుగురు మహిళల మృతికి కారకులుగా పేర్కొంటూ పలువురిని వైద్య విధాన పరిషత్ సస్పెండ్ చేసింది. వీరిలో ఇబ్రహీంపట్నం సామాజిక ఆరోగ్య కేంద్రం ఇన్చార్జీ, సివిల్ అసిస్టెంట్ సర్జన్ శ్రీధర్ కూడా ఉన్నారు. ఈ ఉత్తర్వులను ఆయన హైకోర్టులో సవాల్ చేశారు. దీనిపై జస్టిస్ మాధవీదేవి తాజాగా విచారణ చేపట్టారు. పిటిషనర్ తరఫున పీవీ కృష్ణయ్య వాదనలు వినిపించారు. ఆగస్టు 25న ఇబ్రహీంపట్నంలోని సీహెచ్‌సీలో పలువురికి కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేశారని.. అయితే, ఆ రోజున పిటిషనర్ రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ భవన ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారని చెప్పారు. దీనికి సంబంధించిన ఐడీకార్డును, ఫొటోలను కోర్టుకు అందజేశారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ భవన ప్రారంభోత్సవంలో పాల్గొన్నారని వివరించారు. సస్పెండ్ చేయడం శిక్షేమీ కాదని, నలుగురు మృతికి ఎవరు కారణమో జరిగే విచారణ పూర్తి అయ్యే వరకు సస్పెన్షన్‌లో పెట్టడం తప్పుకాదని ప్రభుత్వ న్యాయవాది పేర్కొన్నారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. డాక్టర్ శ్రీధర్ సస్పెన్షన్‌ను ఎత్తివేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. విచారణకు సహకరించాలని పిటిషనర్‌ను ఆదేశించింది. -
అవగాహన లేక ‘కు.ని’కి పాట్లు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో అవగాహన లేక చాలామంది కుటుంబ నియంత్రణ(కు.ని.) ఆపరేషన్ల కోసం ముందుకు రావడంలేదు. దానివల్ల కలిగే దుష్ప్రభావాలపై బాధితులకు పూర్తిస్థాయిలో అవగాహన కలిగించడంలో వైద్యసిబ్బంది అలసత్వం ప్రదర్శిస్తున్నారు. ఫలితంగా కు.ని. ఆపరేషన్ల ప్రక్రియ గణనీయంగా సాగడంలేదు. ఈ మేరకు కౌన్సిల్ ఫర్ సోషల్ డెవలప్మెంట్ తాజాగా నివేదిక విడుదల చేసింది. కు.ని. ఆపరేషన్లకు అర్హులైనవారిలో 49.2 శాతం మందికే వైద్యసిబ్బంది అవగాహన కల్పిస్తున్నారని తెలిపింది. గతంలో అది 25 శాతం ఉండేది. నల్లగొండ జిల్లాలో అత్యధికంగా 62.8 శాతం మందికి, అత్యంత తక్కువగా జగిత్యాలలో 24 శాతం మందికి అవగాహన కల్పిస్తున్నారు. కు.ని. ఆపరేషన్ల వల్ల కలిగే దుష్ప్రభావాలపై అవగాహన కల్పించకపోవడం వల్ల సమస్యలు వస్తున్నాయని నిపుణులు అంటున్నారు. కాగా, కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌పై రాష్ట్రంలో ఆరోగ్య కార్యకర్తలు కేవలం 17 శాతమే అవగాహన కల్పిస్తున్నారు. 31.4 శాతంతో మహబూబాబాద్ జిల్లాలో అత్యధికంగా అవగాహన కల్పిస్తుండగా, వికారాబాద్, నిజామాబాద్ జిల్లాలో అత్యల్పంగా 8.6 శాతం ఉందని వివరించింది. నివేదికలోని అంశాలు... ►రాష్ట్రంలో 68.1 శాతం మంది కుటుంబ నియంత్రణకు సంబంధించి ఏదో ఒక పద్ధతిని అవలంబిస్తున్నారు. గతంతో పోలిస్తే 11 శాతం పెరిగింది. అత్యధికంగా 78.7% మంది ఖమ్మం జిల్లాలో, అత్యంత తక్కువగా 49.4% కొమురంభీం జిల్లాలో అనుసరిస్తున్నా రు. ఉత్తర తెలంగాణలో తక్కువగా ఉంది. ►అధునాతన పద్ధతుల్లో కుటుంబ నియంత్రణ జరుగుతోంది. 15–49 ఏళ్లలోపు పెళ్లయిన మహిళలు తెలంగాణలో 66.7% అధునాతన పద్ధతులు అవలంభిస్తున్నారు. సూర్యాపేట జిల్లాలో అత్యంత ఎక్కువగా 77.9%, అత్యంత తక్కువగా కొమురంభీం జిల్లాలో 49.1% అవలంభిస్తున్నారు. ►ట్యుబెక్టమీ పద్ధతిలో మహిళలు 61.9% మంది కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించుకుంటున్నారు. అంతకుముందుతో పోలిస్తే 7 శాతం పెరిగింది. సూర్యాపేటలో 75.9%, కరీంనగర్ జిల్లాలో 44.4% ఉన్నారు. ►పురుషుల్లో కుటుంబ నియంత్రణ వెసెక్టమీ అనేది తెలంగాణ సగటు కేవలం రెండు శాతమే. గతం కంటే 0.5% పెరిగింది. జయశంకర్ జిల్లాలో అత్యధికంగా అవసరమైనవారిలో 11.3% మంది పురుషులు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించుకుంటున్నారు. హైదరాబాద్, జోగులాంబ, మహబూబ్‌నగర్, నల్లగొండ, నాగర్‌కర్నూలు, వికారాబాద్, నిజామాబాద్, వనపర్తి జిల్లాల్లో ఒక్కరూ చేయించుకోలేదు. ►గర్భ నియంత్రణ మాత్రల ద్వారా కుటుంబ నియంత్రణ పద్ధతులు పాటించేవారు మహిళలు 0.8 శాతమే ఉన్నారు. సంగారెడ్డి జిల్లాలో రెండు శాతం, వికారాబాద్, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో జీరో శాతం ఉంది. గతంతో పోలిస్తే రాష్ట్రంలో 0.5 శాతం పెరిగింది. ►మహిళలకు గర్భాశయంలో ఒక డివైజ్ (ఐయూడీ)ను ప్రవేశపెట్టడం ద్వారా కుటుంబ నియంత్రణ పాటించే పద్ధతి రాష్ట్రంలో 0.5 % గా ఉంది. హైదరాబాద్‌లో 1.8 శాతం మంది ఉపయోగిస్తున్నారు. వరంగల్, మహబూబాబాద్, భూపాలపల్లి, మెదక్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, సూర్యాపేటల్లో ఈ పద్ధతిని పాటించడంలేదు. ►కండోమ్స్‌ను వినియోగించే పురుషులు 0.8 శాతమే. గతంతో పోలిస్తే 0.3% పెరిగింది. సిరిసిల్ల జిల్లాలో 1.8% మంది ఉపయోగిస్తున్నారు. మంచిర్యాలలో జీరో శాతం ఉన్నారు. ►ఇంజెక్షన్ రూపంలో రాష్ట్రంలో మహిళలు కుటుంబ నియంత్రణ పాటించేవారు 0.1% మాత్రమే ఉన్నారు. ►అసలు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకునే అవకాశం ఉన్నా చేయించుకోనివారు రాష్ట్రంలో 6.4% ఉన్నారు. జగిత్యాల జిల్లాలో 13.4% కాగా, నల్లగొండ జిల్లాలో రెండు శాతం ఉన్నారు. -
కు.ని. మరణాలపై డబ్ల్యూహెచ్ఓ విచారణ
ఇబ్రహీంపట్నం రూరల్: కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు వికటించి నలుగురు మహిళలు మరణించిన ఘటనపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) విచారణ చేపట్టింది. కుటుంబ సంక్షేమ శాఖ రాష్ట్ర ప్రోగ్రాం అధికారి డాక్టర్ సూర్యశ్రీరావు ఆధ్వర్యంలో వైద్య బృందం గురువారం రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ప్రభుత్వ ఆస్పత్రిని సందర్శించింది. గత నెల 25న జరిగిన ఆపరేషన్లపై వైద్యుల నుంచి బృందం సభ్యులు వివరాలు తెలుసుకున్నారు. శస్త్రచికిత్సల సమయంలో ఉపయోగించిన ఆపరేషన్ పరికరాలను పరిశీలించారు. వాటిని ఎలా స్టెరిలైజ్ చేశారో ఆపరేషన్ థియేటర్లో పని చేసే సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అలాగే ఆపరేషన్లు జరిగిన అనంతరం మహిళలను ఇంటికి పంపే ముందు వాడిన మందుల గురించి రికార్డు చేసుకున్నారు. -
మళ్లీ ‘కు.ని.’ కలకలం.. పేట్ల బురుజు ఆసుపత్రిలో ఘటన?
సాక్షి, హైదరాబాద్/దూద్‌బౌలి/షాద్‌నగర్‌రూరల్: పేట్లబురుజు ప్రభుత్వ ఆధునిక ప్రసూతి ఆసుపత్రిలో డెలివరీ కోసం వచ్చిన మహిళ ప్రసవానంతరం తీవ్ర అనారోగ్యంతో ఉస్మానియా ఆసుపత్రిలో మృతి చెందింది. దీంతో బంధువులు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ వికటించి మృతి చెందిందంటూ గురువారం అఫ్జల్‌గంజ్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అయితే మహిళకు సిజేరియన్ మాత్రమే జరిగిందని, కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్స చేయలేదని ఆస్పత్రి వైద్యులు, ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. ఇబ్రహీంపట్నం ఘటన మరవకముందే ఈ ఉదంతం చోటు చేసుకోవడం కలకలం సృష్టించింది. వివరాలు ఇలా ఉన్నాయి. రెండురోజులు ఆరోగ్యంగానే.. రంగారెడ్డి జిల్లా ఫారూఖ్‌నగర్ మొగలిగిద్ద గ్రామానికి చెందిన సురేందర్ భార్య అలివేలు (26) ఈ నెల 4వ తేదీన ప్రసవం కోసం పేట్లబురుజు ప్రభు త్వ ఆసుపత్రిలో చేరింది. అదే రోజు సాయంత్రం ఆమెకు పురిటి నొప్పులు వచ్చాయి. శిశువు కాళ్లు అడ్డం తిరిగి ఉండటంతో వై ద్యులు సిజేరియన్ ఆపరే షన్ నిర్వహించగా మగ శిశు వుకు జన్మనిచ్చింది. ప్రసవానంతరం 2 రోజులు ఆరోగ్యంగానే ఉన్న అలివేలుకు జ్వరం వచ్చి తగ్గింది. 7వ తేదీన తిరిగి జ్వరం, వాంతులు, విరోచనాలతో తీవ్ర అనారోగ్యానికి గు రి కావడంతో ఉస్మానియా ఆసుపత్రికి తరలించా రు. అక్కడ చికిత్స పొందుతూ అదేరోజు సాయంత్రం మృతి చెందింది. అయితే పేట్లబురుజు ఆసు పత్రిలో సిబ్బంది.. ప్రసవానంతరం అలివేలుకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేసేందుకు భర్త సంతకాలు తీసుకోవడంతో, ఆ ఆపరేషన్ వల్ల నే ఆమె మరణించిందంటూ బంధువులు ఆ ఆసుపత్రి వైద్యులను నిలదీశారు. కు.ని ఆపరేషన్ జరగలేదు: ఆసుపత్రి సూపరింటెండెంట్ అలివేలుకు వైద్యులు పూర్తిస్థాయిలో వైద్య సేవలు అందించారని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మాలతి తెలిపారు. ప్రసవానంతరం తల్లి, బిడ్డ క్షేమంగా ఉన్నారని, అలివేలుకు కు.ని శస్త్రచికిత్స చేయలేదని స్పష్టం చేశారు. అయితే రెండురోజుల తర్వాత అనారోగ్యానికి గురైందని, ఉస్మానియా ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వివరించారు. అలివేలుకు కోవిడ్ పరీక్ష కూడా నిర్వహించగా నెగెటివ్ వచ్చినట్లు తెలిపారు. అదే రోజు 40 ప్రసవాలు కాగా.. అందులో 16 ఆపరేషన్లు జరిగినట్లు ఆమె తెలిపారు. అలివేలు మృతికి వైరల్ ఇన్ఫెక్షన్ కారణం అయి ఉండవచ్చునని ఉస్మానియా వైద్యులు పేర్కొన్నారు. మహిళ మృతి కలకలం సృష్టించడంతో గురువారం డీఎంఈ రమేశ్‌రెడ్డి ఆసుపత్రిని సందర్శించి వైద్యులతో మాట్లాడారు. కు.ని ఆపరేషన్ కారణం కాదు ఆ మహిళ డెలివరీ కోసం ఆసుపత్రిలో జేరింది. సిజేరియన్ సెక్షన్లో వైద్యులు ఆపరేషన్ చేశారు. అంతే తప్ప ఆమెకు కు.ని ఆపరేషన్ చేయలేదు. అయితే రెండవరోజు కొన్ని అనారోగ్య సమస్యలు రావడంతో ఉస్మానియాకు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది. – డా.కె.రమేశ్‌రెడ్డి, వైద్య విద్య సంచాలకుడు -
తెలంగాణలో మరోసారి ఫెయిలైన కుటుంబ నియంత్రణ ఆపరేషన్
-
బాధ్యులపై చర్యలు తప్పవు
ఇబ్రహీంపట్నం రూరల్/ ఇబ్రహీంపట్నం: కుటుంబ నియంత్రణ ఆపరేషన్ల కారణంగా నలుగురు మహిళలు మృతి చెందిన ఘటనలో బాధ్యులను వదిలిపెట్టేది లేదని జాతీయ మహిళా కమిషన్ కార్యదర్శి మీటా రాజీవ్ లోచన్ హెచ్చరించారు. జాతీయ మహిళా కమిషన్ బృందం శనివారం రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ప్రభుత్వ ఆస్పత్రిని సందర్శించింది. బృందం సభ్యులు వైద్యులతో సమీక్ష నిర్వహించి కుటుంబ నియంత్రణ ఆపరేషన్ల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం సీతారాంపేట్ గ్రామానికి వెళ్లి కు.ని. ఆపరేషన్ వికటించి మృతి చెందిన లావణ్య కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆపరేషన్ జరిగిన సమయం నుంచి.. లావణ్య మరణించే వరకు ఏం జరిగిందని ఆరా తీశారు. ఈ సందర్భంగా మీటా రాజీవ్ లోచన్ మాట్లాడుతూ.. ఇబ్రహీంపట్నం ఘటనపై ప్రాథమిక స్థాయిలో విచారణ చేపట్టనున్నట్లు తెలిపారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై చర్యలు తప్పవన్నారు. బాధితులకు అందాల్సిన పరిహారంపై కేంద్ర ప్రభుత్వానికి నివేదిస్తామని చెప్పారు. ఆరు నెలల్లో పూర్తి స్థాయిలో వివరాలు సేకరించి నివేదిక అందజేస్తామన్నారు. చివరగా కేంద్ర బృందం రంగారెడ్డి కలెక్టరేట్‌కు చేరుకుంది. అక్కడ అదనపు కలెక్టర్ ప్రతీక్‌జైన్‌తో బృందం సభ్యులు సమావేశమయ్యారు. పూర్తిస్థాయిలో విచారణకు వైద్యాధికారులను ఆదేశించాలని.. వివరాలను మహిళా కమిషన్‌కు అందజేయాలని సూచించారు. -
కు.ని. మరణాలపై ఫోరెన్సిక్ రిపోర్ట్ వచ్చాకే..
సాక్షి, హైదరాబాద్: ఇబ్రహీంపట్నం ప్రభుత్వ ఆస్పత్రిలో డీపీఎల్ ఆపరేషన్ల ఘటనపై విచారణ అత్యంత పారదర్శ కంగా చేస్తున్నట్లు ప్రజారోగ్య విభాగంసంచాలకుడు జి.శ్రీనివాసరావు తెలిపారు. ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి రిపోర్టు వచ్చిన తర్వాతే తుది నివేదికను రూపొందించనున్నట్లు వివరించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకు నేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నా రు. ఈ మేరకు శనివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకు 12 లక్షల కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు నిర్వహించినట్లు ఆయన వెల్లడించారు. దురదృష్టవశాత్తూ తొలిసారిగా ఇబ్రహీంపట్నం సీహెచ్‌సీలో కుటుంబ నియంత్రణ చికిత్స చేయించుకున్న వారిలో నలుగురు ప్రాణాలు కోల్పోయా రని, ఇది అత్యంత బాధాకరమని అన్నా రు. ఈ ఘటనకు కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభు త్వం నిర్ణయం తీసుకుందని, సర్జరీలు నిర్వహించిన ఆస్పత్రి వైద్య విధాన పరి షత్ పరిధిలో ఉండగా, ఫ్యామిలీ ప్లానింగ్ ప్రోగ్రాం కుటుంబ సంక్షేమ శాఖ కమిషనరేట్ పరిధిలో ఉందన్నారు. ఈ నేపథ్యంలో విచారణ నిష్పక్షపాతంగా జరగాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం, ఆ రెండు విభాగాలకు కాకుండా ప్రజారోగ్య విభాగానికి విచారణ బాధ్యతలను అప్పగించిందని పేర్కొన్నా రు. ప్రాథమిక చర్యల్లో భాగంగా ఆస్పత్రి సూపరింటెండెంట్‌ను సస్పెండ్ చేసినట్లు వివరించారు. అదేవిధంగా చికిత్స చేసిన వైద్యుడికి తెలంగాణ మెడికల్ కౌన్సిల్ నోటీసులు ఇచ్చిందని, వైద్యుడి లైసెన్స్‌ను తాత్కాలికంగా రద్దు చేశామని వెల్లడించారు. స్టెరిలైజేషన్‌లో జరిగిన లోపాల వల్లే బాధి తులు ఇన్ఫెక్షన్కు గురైనట్లు ప్రాథమికంగా భావి స్తున్నామని తెలిపారు. ప్రభుత్వ అనుమతితో ఆ నివేదికను మీడియాకు సైతం ఇస్తామన్నారు. బాధ్యులపై చర్యలు తీసుకోవడంతో పాటు, ఇలాంటి ఘటనలు పునరావృతంకాకుండా చర్య లు తీసుకోవాలని ప్రభుత్వం కుటుంబ సంక్షేమ కమిషనర్‌ను ఆదేశించిందన్నారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా క్యాంపులో చికిత్స చేయించు కున్న మిగతా వారిని నిమ్స్, అపోలో ఆస్పత్రులకు తరలించి ఉచితంగా చికిత్స అందిస్తున్నట్లు వివ రించారు. వారి ఆరోగ్యాన్ని పర్యవేక్షించేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా అక్కడ వైద్యాధికారులను నియమించిందని, చికిత్స పొందుతున్న వారంతా ప్రస్తుతం పూర్తి ఆరోగ్యంగా ఉండగా, ఇప్పటికే 12 మందిని డిశ్చార్జ్ చేశామని వెల్లడించారు. ఒకట్రెండు రోజుల్లో మిగతావారిని కూడా డిశ్చార్జ్ చేస్తామని శ్రీనివాసరావు తెలిపారు. -
కు.ని. ఆపరేషన్లపై పారదర్శకంగా విచారిస్తాం
ఇబ్రహీంపట్నం: కుటుంబ నియంత్రణ (కు.ని.) ఆపరేషన్లు వికటించి నలుగురు మహిళలు చనిపోయిన ఘటనలో ప్రభుత్వానికి 2 రోజుల్లో పూర్తిస్థాయి నివేదిక ఇస్తామని నిపుణుల కమిటీ విచారణాధికారి, ప్రజారోగ్యశాఖ సంచాలకుడు డాక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. ఆయన శుక్రవారం ఇబ్రహీంపట్నం ప్రభుత్వాస్పత్రిని ఆయన సందర్శించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. కు.ని. ఆపరేషన్లు చేయించుకున్నవారిలో నలుగురు మృతి చెందడం బాధాకరమన్నారు. ఈ ఘటనపై పారదర్శకంగా విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఏప్రిల్ నుంచి ఈ ఆస్పత్రిలో 5 క్యాంపులు నిర్వహించగా గత నెల 25న జరిగిన ఆపరేషన్లు వికటించాయన్నారు. ఇక్కడ ఆపరేషన్లు చేసిన వైద్యులు ఆ మరుసటి రోజు చేవెళ్లలో 60 మందికి, సూర్యాపేటలో 100 మందికి శస్త్రచికిత్సలు చేశారని చెప్పారు. ఎక్కడా ఇలాంటి ఘటనలు చోటుచేసుకోలే దన్నారు. ఆరోజు ఆపరేషన్లు చేసుకున్న మరో 30 మంది ఆరోగ్య పరిస్థితి నిలకడ గా ఉందన్నారు. నిమ్స్ నుంచి ఐదుగురిని, అపోలో నుంచి ఆరుగురిని శుక్రవారం డిశ్చార్జి చేశామన్నారు. వైద్యులు, వైద్య సిబ్బందిని విచారిస్తున్నామని.. పోస్టు మార్టం, ఫోరెన్సిక్ నివేదికలు వస్తే పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంటుందన్నారు. -
కు.ని. మృతుల కుటుంబాలకు రూ.కోటి పరిహారమివ్వాలి: సంజయ్
సాక్షి, హైదరాబాద్: కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు విఫలమై చనిపోయిన నలుగురు మహిళల కుటుంబాలకు రూ.కోటి చొప్పున పరిహారం, ఇల్లు, పిల్లల చదువుకయ్యే ఖర్చును ప్రభుత్వమే భరించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు. నలుగురు మహిళలు చనిపోయిన ఘటనకు బాధ్యుడైన ఆ శాఖ మంత్రి హరీశ్‌రావును వెంటనే బర్తరఫ్ చేయాలని సీఎం కేసీఆర్‌ను డిమాండ్ చేశారు. హరీశ్ తమ కుటుంబసభ్యుడు కాబట్టే ఆయనపై సీఎం చర్యలు తీసుకోవడం లేదన్నారు. బుధవారం బాధితులను పరామర్శించిన అనంతరం సంజయ్ మీడియాతో మాట్లాడుతూ ఈ ఆపరేషన్లు వికటించి నలుగురు మహిళలు మృతిచెందినా, మరో 30 మంది ఆసుపత్రులపాలైన కేసీఆర్ వారిని కనీసం పరామర్శించలేదని దుయ్యబట్టారు. కేసీఆర్ ప్రభుత్వ ఘోర వైఫల్యానికి ఇది నిదర్శనమని, ఇవి సర్కారీ హత్యలేనని ఆరోపించారు. ‘ఆపరేషన్ చేసేటప్పుడు కనీసం మత్తు ఇంజక్షన్ ఇయ్యలేదు. సర్జరీ చేస్తుంటే ఏడ్చినం. ఆపరేషన్ అయినంక ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నం’అని బాధిత మహిళలు కన్నీటిపర్యంతమయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంత ఘోరం జరిగినా పట్టించుకోకుండా ఏమి ఉద్ధరించడానికి కేసీఆర్ బీహార్ వెళ్లారని ప్రశ్నించారు. ‘ఇక్కడి పైసలు తీసుకుపోయి బీహార్ల పెడతరా?’అని నిలదీశారు. ‘రోజులో 24 గంటలూ ఎవరి కొంపలు ముంచాలనే రాజకీయాలు చేయడమే తప్ప పేదల గురించి ఆలోచనే లేని దుర్మార్గుడు కేసీఆర్’అని మండిపడ్డారు. ‘హరీష్ రావు అబద్దాల మంత్రి. మంత్రులు, టీఆర్ఎస్ నేతల పనంతా నిత్యం లిక్కర్, ల్యాండ్, డ్రగ్స్, సాండ్ దందాలే’నని ఆరోపించారు. రికార్డు కోసం గంటలో 34 మందికి కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయటాన్ని ఖండిస్తున్నామని అన్నారు. -
ఇవ్వాళ వచ్చి హడావుడి చేస్తున్నారు
లక్డీకాపూల్: ‘రెండు రోజుల అనంతరం విపక్షాల నేతలు ఇవ్వాళ హాస్పిటల్‌కు వచ్చి హడావుడి చేస్తున్నారంటూ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి టి హరీశ్‌రావు మండిపడ్డారు. బుధవారం ఆయన నిమ్స్ ఆస్పత్రిలో వైద్యసేవలు పొందుతున్న ‘ఇబ్రహీంపట్నం కుటుంబ నియంత్రణ ఆపరేషన్’బాధితులను పరామర్శించారు. ఘటన జరిగిన మరుక్షణం నుంచి రాత్రింబవళ్లు వాళ్లను కాపాడుకుంటున్నామని స్పష్టం చేశారు. ఇబ్రహీంపట్నం ఘటనలో ఇన్ఫెక్షన్ సోకి నలుగురు చనిపోవడం దురదృష్టకరమని అన్నారు. ఈ ఘటనకు బాధ్యులైన వైద్యుడి లైసెన్స్ రద్దు చేశామని, సూపరింటెండెంట్ని సస్పెండ్ చేశామని చెప్పారు. భవిష్యత్‌లో ఇలాంటివి పునరావృతం కాకుండా జాగ్రత్త పడతామని, విచారణ కమిటీ నివేదిక రాగానే చర్యలు ఉంటాయని పేర్కొన్నారు. తాము రాజకీయాలు చేయబోమని, ప్రజల ప్రాణాలు కాపాడతామని మంత్రి స్పష్టం చేశారు. ఇళ్లల్లో ఉన్న మిగిలిన బాధితులను కూడా అంబులెన్స్‌ల్లో తీసుకువచ్చి అపోలో, నిమ్స్ ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తున్నామని చెప్పారు. ఆరోగ్య శాఖ అధికారులు ఆయా ఆస్పత్రుల వద్దే ఉంటూ బాధితుల పరిస్థితిని గంటగంటకూ పర్యవేక్షిస్తున్నారని, నిమ్స్‌లో 17 మంది, అపోలోలో 13 మంది బాధితులు ఆరోగ్యంగా, క్షేమంగా ఉన్నారన్నారు. ఇన్ఫెక్షన్ కూడా తగ్గుముఖం పట్టిందని, రెండు మూడు రోజుల్లో అందరూ డిశ్చార్జి అవుతారని చెప్పారు. ఆరేడేళ్లలో 12 లక్షల కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు జరిగాయని, ఇలాంటి ఘటన ఎప్పుడూ జరగలేదన్నారు. మరణించిన వారి కుటుంబాలకు రూ. 5 లక్షల నష్టపరిహారాన్ని అందజేశామని, డబుల్ బెడ్ రూం ఇళ్లను కూడా ఇస్తామని మంత్రి హరీశ్ తెలిపారు. -
కు.ని. మరణాలపై గవర్నర్ సీరియస్
సాక్షి, హైదరాబాద్: ఇబ్రహీంపట్నం సీహెచ్‌సీలో కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలు వికటించి కొందరు మహిళలు మృతిచెందిన ఘటనపై గవర్నర్ తమిళిసై సీరియస్‌గా స్పందించారు. ఘటనపై సమగ్ర నివేదిక సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆమె కోరినట్టు సమాచారం. చనిపోయిన మహిళల కుటుంబాలకు అండగా ఉండాలని, చికిత్స పొందుతున్న ఇతర మహిళలకు మెరుగైన వైద్యం అందించాలని ఆమె సూచించినట్టు తెలిసింది. ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న బాధిత మహిళలను పరామర్శించాలని ఆమె నిర్ణయించినట్టు తెలిసింది. -
కు.ని. బాధితుల్లో 28 మందికి ఇన్ఫెక్షన్
సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం సామాజిక ఆరోగ్య కేంద్రం (సీహెచ్‌సీ)లో కుటుంబ నియంత్రణ (కు.ని.) ఆపరేషన్లు వికటించి ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న 30 మంది బాధితుల్లో 28 మందికి తీవ్రమైన ఇన్ఫెక్షన్ సోకినట్లు నిర్ధారణ అయింది. వారికి అపోలో, నిమ్స్ ఆస్పత్రుల్లో చికిత్స నిర్వహిస్తున్నారు. ఆపరేషన్లు వికటించి నలుగురు మృతి చెందడంతో అప్రమత్తమైన ప్రభుత్వం మిగిలిన 30 మంది మహిళలనూ వేరే ఆసుపత్రులకు తరలించింది. ఇన్ఫెక్షన్కు గురైన వారిని సకాలంలో ఆసుపత్రులకు తీసుకురావడంతో వారు ప్రమాదం నుంచి బయటపడ్డారని వైద్య వర్గాలు చెబుతున్నాయి. కుటుంబ నియంత్రణకు ఉపయోగించే వైద్య పరికరాలు సరిగా స్టెరిలైజేషన్ చేయకపోవడం వల్లే ఇన్ఫెక్షన్ సోకినట్లు అధికారులు చెబుతున్నారు. దీనిపై సమగ్రంగా విచారణ చేపడుతున్నారు. కాగా, ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న 30 మందిలో 10 మందిని శుక్రవారం డిశ్చార్జి చేయాలని భావిస్తున్నారు. వారి ఆరోగ్యం నిలకడగా ఉందని చెబుతున్నారు. విడతల వారీగా బాధితులను డిశ్చార్జి చేస్తామని ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. ప్రస్తుతం బాధితులంతా వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారన్నారు. ఎవరికీ ఎలాంటి ప్రమాదం లేదని స్పష్టంచేశారు. ఇన్ఫెక్షన్ కారణంగానే మృతి ఇబ్రహీంపట్నంలో మృతి చెందిన నలుగురి పోస్ట్‌మార్టం వివరాలను వైద్య వర్గాలు వెల్లడించాయి. వారి రిపోర్టులు సాధారణంగానే ఉన్నాయని తెలిపాయి. ఇతరత్రా అవయవాలపై ఎలాంటి ప్రభావం కనిపించలేదని స్పష్టం చేశాయి. ప్రస్తుతానికి ఇన్ఫెక్షన్ కారణంగానే వారు మరణించినట్లు భావిస్తున్నామన్నాయి. కాగా, డబుల్ పంక్చర్ లాప్రోస్కోపీ (డీపీఎల్) పద్ధతిలో క్యాంపుల ద్వారా జరిగే కుటుంబ నియంత్రణ ఆపరేషన్లను ప్రభుత్వం తాత్కాలికంగా నిలిపివేసింది. ఒక్కో రోజు 10–15 మంది కంటే ఎక్కువగా కు.ని. ఆపరేషన్లు చేయకూడదని నిర్ణయించినట్లు వైద్య విధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ అజయ్‌కుమార్ తెలిపారు. ఇతర విధానాల్లో కు.ని. సర్జరీలు యథావిధిగా కొనసాగుతాయని స్పష్టం చేశారు. మరోవైపు ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ శ్రీనివాసరావు గురువారం జిల్లా వైద్యాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇబ్రహీంపట్నం ఘటన నేపథ్యంలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు జాగ్రత్తగా నిర్వహించాలని ఆదేశించారు. ఎక్కడైనా వికటించే సంఘటనలు జరిగితే జిల్లా వైద్యాధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. -
కు.ని. విషాద ఘటన.. అయ్యో దేవుడా! ఈ పిల్లల బతుకులెట్లా?
మౌలిక సదుపాయాల లేమి, ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపం వెరసి అనేక మంది తల్లీపిల్లలకు తీరని కడుపుకోతను మిగుల్చుతోంది. పైసా ఖర్చు లేకుండా ప్రభుత్వ ఆస్పత్రిలో మెరుగైన వైద్యసేవలు పొందవచ్చని భావించి ఎంతో ఆశతో ఆస్పత్రులకు చేరుకుంటున్న గర్భిణులు, బాలింతలను మృత్యుపాశాలు వెంటాడుతున్నాయి. ఇబ్రహీంపట్నం సీహెచ్‌సీలో కు.ని చికిత్సలు వికటించి రెండు రోజుల్లో నలుగురు తల్లులు మృత్యువాతపడటం యావత్ రాష్ట్రాన్ని ఆందోళనకు గురిచేస్తోంది. రోగుల నిష్పత్తికి సరిపడా మౌలిక సదుపాయాలు, వైద్య సిబ్బందిని ఏర్పాటు చేయాల్సిన వైద్య ఆరోగ్యశాఖ అధికారులు పట్టానట్టుగా వ్యవహరించడమే ఇందుకు కారణమని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సాక్షి, ఇబ్రహీంపట్నం: కుటుంబ నియంత్రణ ఆపరేషన్ వికటించడంతో మృత్యువుతో పోరాడి ప్రాణాలొదిలిన అవుతపురం లావణ్య (22) అంత్యక్రియలు సీతారాంపేటలో ప్రశాంతంగా ముగిశాయి. లావణ్యకు ఇద్దరు కుమార్తెలు అక్షర (6), భావన (4) కుమారుడు యశ్వంత్ (ఏడు నెలలు) ఉన్నారు. చివరి చూపుల సందర్భంగా అత్తమామలు,, బంధువుల రోదనలతో అక్కడ విషాదఛాయలు అలుముకున్నాయి. ఏమి జరిగిందో తెలియని పసిమొగ్గలను చూసి వారు కన్నీటి పర్యంతమయ్యారు. బరువెక్కిన హృదయంతో ఓదార్చారు. అసలు ఏం జరిగిందో తెలియక పసిమొగ్గలు దీనంగా చూస్తుండటాన్ని అందరినీ కదిలించింది. తమ తల్లి తిరిగిరాని లోకాలకు వెళ్లి పోయిందని, ఇక తాము చూడ లేమని తెలియని ఆ చిన్నారులను చూసి చలించి పోయారు. భర్త లింగస్వామి ఓ రైతు వద్ద జీతం చేస్తూ అతని వ్యవసాయ పనులు చేస్తుంటాడు. సొంత ఇల్లు కూడలేని దీనస్థితి ఆ కుటుంబానిది. ప్రభుత్వం ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు. తలకొరివి పెట్టిన మామ కట్టుకున్న భర్త, కన్న కుమారుడు ఉన్నప్పటికీ అర్ధంతరంగా తనువు చాలించడంతో లావణ్య మామ యాదయ్య అంత్యక్రియల ప్రక్రియ నిర్వహించారు. ఏడు నెలల బాబు చేతిని ముట్టించి దహన సంస్కారాల కార్యక్రమంలో మామ యాదయ్య ముందు నడిచాడు. ఏ జన్మలో రుణపడి ఉన్నానో నంటూ కో డలి మృతదేహం చుట్టూ తిరిగి దహన సంస్కా రాలు చేయడం అక్కడున్న వారిని కదిలించింది. సుష్మ కూతురు శాన్వి, కుమారుడు శ్రేయన్ను ఓదార్చుతున్న జెడ్పీటీసీ సభ్యురాలు నిత్యారెడ్డి లింగంపల్లిలో సుష్మ అంత్యక్రియలు మంచాల: కుటుంబ నియంత్రణ ఆపరేషన్ వికటించి మృతి చెందిన మైలారం సుష్మ స్వగ్రామం లింగంపల్లిలో మంగళవారం విషాదఛాయలు అలుముకున్నాయి. ఆమె అంత్యక్రియలకు వివిధ గ్రామాల నుంచి ప్రజా ప్రతినిధులు, ప్రజలు భారీగా తరలివచ్చారు. బాధిత కుటుంబ సభ్యులను ఓదార్చారు. సుష్మ కూతురు శాన్వి, కుమారుడు శ్రేయన్ అమ్మ కావాలని ఏడవడం అక్కడున్న వారిని కంటతడి పెట్టిస్తోంది. మంచాల జెడ్పీటీసీ మర్రి నిత్యారెడ్డి.. సుష్మ మృతదేహానికి నివాళులర్పించారు. అనంతరం సుష్మ భర్త ఈశ్వర్, వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు. కొంత ఆర్ధిక సాయం చేశారు. ఇది పూర్తిగా ప్రభుత్వం వైఫల్యమే కారణమని జెడ్పీటీసీ ఆరోపించారు. ప్రభుత్వమే పూర్తి బాధ్యత తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆమె వెంట సర్పంచ్ వినోద మూర్తి, ఎంపీటీసీ జయనందం తదితరులు పాల్గొన్నారు. మౌనిక పిల్లలు పిల్లల ఆమయాక చూపులు అదే విధంగా మాడ్గుల మండలం కొలుకుల పల్లి పంజాయతీ పరిధిలోని రాజీవ్ తండాకు చెందిన మౌనికకు నాలుగేళ్ల కిందట శ్రీనివాస్ నాయక్‌తో పెళ్లి జరిగింది. వీరికి మాను శ్రీ(3), గౌతమ్(15 నెలలు) ఇద్దరు పిల్లలు. శ్రీనివాస్ నాయక్ వ్యవసాయం, కూలీ పనులు చేస్తుంటాడు. మౌనిక భర్తతో కలిసి పనులకు వెళ్తూ కుటుంబానికి ఆసరాగా ఉండేది. అయితే మౌనిక తల్లి తిరిగిరాదని లోకాలకు వెళ్లిందని తెలియక పిల్లలు అమాయక చూపులు చూస్తున్నారు. భర్త శ్రీనివాస్ నాయక్ సైతం కన్నీటి పర్యంతమవుతున్నాడు. మమత, ఇద్దరు పిల్లలు భర్తకు చేదోడువాదోడు ఇక ఇదే మండలం నర్సాయపల్లికి చెందిన మమత, మల్లేష్ గౌడ్లకు అయిదేళ్ల కిందట వివాహమైంది. వీరికి ఇద్దరు కుమార్. వర్షిత్(4), విహాన్(2). పేద కుటుంబానికి చెందిన మల్లేష్ గౌడ్ వ్యవసాయం చేసుకుంటూ డీసీఎం వ్యాన్ నడుపుకుంటున్నాడు. వ్యవసాయంలో భర్తకు చేదుడో వాదోడుగా ఉండే మమత ఇలా తిరిగి రాని లోకాలకు వెళ్లడంతో పిల్లలు, భర్త భోరున విలపిస్తున్నారు. -
కు.ని.ఆపరేషన్‌తో నలుగురు మృతి.. ఇంతకూ ట్యూబెక్టమీ అంటే ఏంటి?
సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు వికటించి నలుగురు మహిళలు ప్రాణాలు విడిచారు. 35 గంటల వ్యవధిలోనే నలుగురు మహిళలు మృత్యువాత పడటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. అంతేగాక రాష్ట్రంలో ఇంతటి దుర్ఘటన చోటుచేసుకోవడం ఇదే మొదటిసారని ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ శ్రీనివాసరావు వెల్లడించారు. మరణాలకు కారణాలపై ఇప్పటి వరకు ఎలాంటి ప్రాథమిక అంచనాకు రాలేమని తెలిపారు. కు.ని ఆపరేషన్లు కేవలం ఆడవారికే పరిమితమతున్నాయని, దీనివల్ల మహిళలకు ఇబ్బంది ఆవుతోందని తెలిపారు. తెలంగాణలో జరిగే కు. ని ఆపరేషన్లలో మగవారి శాతం కేవలం మూడేనేనని, ఈ పరిస్థితి మారాలని ఆకాంక్షించారు. చదవండి: తెలంగాణలో ఇలాంటి ఘటన ఇదే తొలిసారి.. విచారణకు ఆదేశించాం: డీహెచ్ ట్యూబెక్టమీ అంటే మహిళలకు లాపరోస్కోపిక్ ట్యూబెక్టమీ అనే డే కేర్ ఆపరేషన్ ద్వారా కుటుంబ నియంత్రణకు శాశ్వత పరిష్కారం పొందవచ్చు. ఈ చికిత్సలో గర్భం రాకుండా ఫాలోపియన్ ట్యూబ్స్‌ను బ్లాక్ చేసేస్తారు. జనరల్ ఎనస్తీషియా ఇచ్చి, పొట్ట మీద పెద్ద గాట్లేమీ లేకుండా చిన్నగా రెండు రంధ్రాలు చేసి ఈ చికిత్స చేస్తారు. ఆపరేషన్ తర్వాత కొన్ని గంటల్లోనే ఇంటికి వెళ్లిపోవచ్చు. పొట్ట మీద ఆపరేషన్ తాలూకు మచ్చలు కూడా చాలా చిన్నగా చర్మంలో కలిసిపోయేలా ఉంటాయి. ఈ చికిత్సకు అరగంట నుంచి నలభై నిమిషాల సమయం పడుతుందంతే! ఎనస్తీషియా ప్రభావం తగ్గాక కాస్త నొప్పిగా అనిపిస్తుంది. నొప్పి తెలియకుండా ఉండడానికి పెయిన్ కిల్లర్స్, వాంతి రాకుండా మందులు ఇస్తారు. ఆపరేషన్ అయిన కాసేపటి తర్వాత మంచి నీళ్లు, తేలికపాటి ఆహారాన్ని ఇస్తారు. బొడ్డు దగ్గర ఒకటి, పొట్ట సైడ్‌లో ఒకటి కట్స్ ఉంటాయి. వీటిని బ్యాండ్ ఎయిడ్‌తో కవర్ చేసుకోవాలి. ప్రతిరోజూ స్నానం చేసిన తర్వాత కట్స్ దగ్గర శుభ్రంగా తుడుచుకొని, డ్రెస్సింగ్ చేసుకోవాలి. ఇతర ఆరోగ్య సమస్యలేమీ లేకపోతే ఆపరేషన్ అయిన వారానికి అంతా మానిపోయి చక్కగా కోలుకుంటారు. కుట్లు తీయాల్సిన అవసరం లేదు. వారం వరకు విశ్రాంతి తీసుకోవాలి. ఈ కట్స్ దగ్గర చీము పట్టినా, జ్వరం వచ్చినా, బాడీ రాష్ ఉన్నా, నొప్పి ఉన్నా వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి. కొంతమందికి ఒకటి రెండు రోజులు కొంచెం స్పాటింగ్ అవచ్చు. కంగారు పడొద్దు. మీ శరీర తత్వాన్ని బట్టి రెండు రోజుల్లో తేలికపాటి రోజూవారీ పనులు చేసుకోవచ్చు. కానీ బరువులు ఎత్తడం, దూర ప్రయాణాలు వంటివి చేయకూడదు. బోర్లా పడుకోవద్దు. వ్యాయామాలు, జిమ్‌కి వెళ్లడం వంటివి నెల రోజుల తరువాతే మొదలుపెట్టాలి. శారీరకంగా, మానసికంగా పూర్తిగా కోలుకున్నాక దాంపత్య జీవితాన్ని కొనసాగించవచ్చు. మహిళలకు రిస్క్.. అయితే, కుటుంబ నియంత్రణ కోసం మహిళలకు చేసే ట్యూబెక్టమీ ఆపరేషన్ పురుషులకు చేసే వ్యాసెక్టమీ ఆపరేషన్‌తో పోల్చితే రిస్క్‌తో కూడుకున్న వ్యవహారం. కు.ని కోసం ఆపరేషన్లు విఫలమైన సందర్భాలు ఎక్కువగా మహిళల్లోనే కనిపిస్తుంది. మరోవైపు పురుషుల కంటే శస్త్రచికిత్సలు చేయించుకుంటున్న వారిలో మహిళలే అధికంగా ఉన్నట్లుగా వైద్యులు గుర్తించారు. ప్రస్తుతం ప్రసవానంతరం మహిళలే ట్యుబెక్టమీ చేయించుకోవడం రివాజుగా మారిపోయింది. పురుషులు దూరంగా.. వంద మంది మహిళలు ట్యుబెక్టమీ ఆపరేషన్లు చేయించుకుంటుంటే.. పురుషులకు చేసే కుటుంబ నియంత్రణ ఆపరేషన్ వెసక్టమీ చేయించుకునే వారి సంఖ్య చాలా తక్కువగా ఉంటోంది. మహిళలకు ట్యుబెక్టమీ చేయడం మేజర్ ఆపరేషన్ లాంటిదని.. అదే పురుషుల విషయంలో వెసక్టమీ మాత్రం చాలా సులువైన, సులభమైన ప్రక్రియ అని వైద్యులు అంటున్నారు. పురుషులకు కు.ని. ఆపరేషన్ చాలా సులభమని ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టినప్పటికీ పురుషులు చొరవ తీసుకోకపోవడం కలవరానికి గురిచేస్తోంది. ఈ ఆపరేషన్ల విషయంలో సరైన అవగాహన లేకపోవడం వల్లే పురుషులు ముందుకు రావడం లేదని తెలుస్తోంది. చదవండి: కుడి చేతిపై లవ్ సింబల్.. భార్య ప్రవర్తనతో భర్త షాక్.. చివరికి ఏం చేశాడంటే? ఎటువంటి కోతలు, కుట్లు అవసరం లేకుండానే సాంకేతిక పరిజ్ఞానంతో వెసక్టమీ ఆపరేషన్లు చేస్తున్నారు. అయినా కు.ని.ఆపరేషన్ చేయించుకుంటే లైంగిక జీవితంలో ఇబ్బందులు ఎదురవుతాయోమోననే భయం, అపోహతోనే పురుషులు ఈ ఆపరేషన్‌కు దూరంగా ఉంటున్నారని పలు సర్వేలు తేల్చిచెప్పాయి. అయితే పురుషులకు సంబంధించి 90 శాతానికి పైగా ఆపరేషన్లు విజయవంతమైనట్లు రికార్డులు చెబుతున్నాయి. అలాగే వారి లైంగిక జీవితానికి ఎలాంటి ఇబ్బంది ఉండదని వైద్యులు భరోసా ఇస్తున్నారు. అయినప్పటికీ పురుషులు ముందుకు రాకపోవడం గమనార్హం. -
తెలంగాణలో ఇలాంటి ఘటన ఇదే తొలిసారి.. విచారణకు ఆదేశించాం: డీహెచ్
సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి ఇబ్రహీంపట్నం ప్రభుత్వాసుపత్రిలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు వికటించిన ఘటనలో నలుగురు మహిళలు మృతి చెందారు. సోమవారం రోజున ఇద్దరు మృతి చెందగా, ఇవాళ ఇబ్రహీంపట్నం మున్సిపల్ సీతారాంపేటకు చెందిన లావణ్య, కొలుకుల పల్లికి చెందిన మౌనిక ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. దీంతో మృతుల సంఖ్య నాలుగుకి చేరింది. ఈనెల 25 మృతుల బంధువులు ఆందోళనకు దిగే అవకాశం ఉందన్న వార్తల నేపథ్యంలో ముందస్తు చర్యగా పోలీసులు ఇబ్రహీంపట్నం- సాగర్ హైవేపై భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ ఘటనపై తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ.. కుని ఆపరేషన్లు తెలంగాణలోనే కాకుండా దేశవ్యాప్తంగా జరిగే ప్రక్రియ. గతేడాది రాష్ట్రంలో 38వేల మందికి పైగా కు.ని. ఆపరేషన్లు నిర్వహించాం. ఇబ్రహీంపట్నంలో ఆపరేషన్లు చేసిన వైద్యుడు చాలా అనుభవజ్ఞుడు. తెలంగాణ ఏర్పాటైన తర్వాత ఇలాంటి ఘటనలు మొదటసారి. కాజ్ ఆఫ్ డెత్ కోసం నలుగురికి పోస్టుమార్టం నిర్వహించాం. మిగతా 30 మంది ఇళ్లకు వెళ్లి ఆరోగ్య పరిస్థితి మానిటరింగ్ చేస్తున్నాం. 30 మందిలో ఏడుగురిని హైదరాబాద్ ఆస్పత్రికి తరలించాం. మరో ఇద్దరు మహిళలను నిమ్స్‌కు తరలించాం. చనిపోయిన వారికి రూ.5లక్షల ఎక్స్‌గ్రేషియా, డబుల్ బెడ్రూం, వారి పిల్లల చదువులకు ప్రభుత్వం సహకారం అందిస్తుంది. ఈ ఘటనలో ఇద్దరు వైద్యాధికారులపై సస్పెన్షన్ వేటు వేశాము. ఘటనపై విచారణ జరిపి వారం రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించామని హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు పేర్కొన్నారు. చదవండి: (వికటించిన కుటుంబనియంత్రణ ఆపరేషన్) -
వికటించిన కుటుంబనియంత్రణ ఆపరేషన్
-
వికటించిన కుటుంబనియంత్రణ ఆపరేషన్.. ముగ్గురు మృతి
సాక్షి, రంగారెడ్డిజిల్లా: మౌలిక సదుపాయాల లేమి, ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపం వెరసి అనేక మంది తల్లీపిల్లలకు తీరని కడుపుకోతను మిగుల్చుతోంది. పైసా ఖర్చు లేకుండా ప్రభుత్వ ఆస్పత్రిలో మెరుగైన వైద్యసేవలు పొందవచ్చని భావించి ఎంతో ఆశతో ఆస్పత్రులకు చేరుకుంటున్న గర్భిణులు, బాలింతల ను మృత్యుపాశాలు వెంటాడుతున్నాయి. రోగుల నిష్పత్తికి సరిపడా మౌలిక సదుపాయాలు, వైద్య సిబ్బ ందిని ఏర్పాటు చేయాల్సిన జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు పట్టానట్టుగా వ్యవహరించడమే ఇందుకు కారణమని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తల్లులను కోల్పోయిన పిల్లలు ►ఇబ్రహీంపట్నం సీహెచ్‌సీలో కు.ని చికిత్సలు వికటించి రెండు రోజుల్లో ముగ్గురు తల్లులు మృత్యువాత పడగా, మరొకరు వెంటిలేటర్‌పై చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. పిల్లలు గుక్కపట్టి ఏడుస్తున్నారు. ►ఆమనగల్లు మండలం గౌరారం గ్రామానికి చెందిన ఆశా కార్యకర్త ఈశ్వరమ్మ కొంత కాలంగా తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతోంది. కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం స్థానిక ప్రైవేటు ఆస్పత్రికి (ఆదిలక్ష్మీ నర్సింగ్ హోం/సీబీఎం) తరలించారు. ఈ నెల 23న వైద్యులు ఆమెకు గర్భసంచి తొలగింపు సర్జరీ చేశారు. తీవ్ర రక్తస్రావంతో ఆమె మృతిచెందగా పిల్లలు అనాథలయ్యారు. బిడ్డలను కోల్పోయిన తల్లులు ►కొందుర్గు మండలం, తంగెళ్లపల్లికి చెందిన మేఘమాల పురిటి నొప్పులతో బాధపడుతుండటంతో కుటుంబ సభ్యులు గత గురువారం చికిత్స కోసం చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అడ్మిట్ చేసుకున్న సిబ్బంది ఆ తర్వాత నిర్లక్ష్యం చేశారు. రాత్రి పొద్దుపోయిన తర్వాత నొప్పులు అధికమై బిడ్డ కడుపులో అడ్డం తిరగడంతో తమ వల్ల కాదంటూ చేతులెత్తేశారు. హుటాహుటిన ప్లేట్లబురుజు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అప్పటికే బిడ్డ చనిపోయింది. ►నందనవనంలో నివసించే సరిత(24) పురిటి నొప్పులు రావడంతో ప్రసవం కోసం ఈ నెల 4న వనస్థలిపురం ఏరియా ఆస్పత్రికి చేరుకుంది. పరీక్షించిన వైద్యులు ప్రసవానికి మరో నెల ఉందన్నారు. నొప్పులు భరించలేక పోతున్నానని సరిత చెప్పడంతో అడ్మిట్ చేశారు. ఉదయం అడ్మిటైన గర్భిణిని సాయంత్రం వరకు ఎవరూ పట్టించుకోలేదు. చివరికి సిజేరియన్ చేయగా అప్పటికే కడుపులోని బిడ్డ కడుపులోనే కన్నుమూసింది. అట్టుడికిన ఇబ్రహీంపట్నం ఇబ్రహీంపట్నం: కు.ని ఆపరేషన్లు వికటించి ముగ్గు రు మహిళలు మృతి చెందిన సంఘటనతో సోమవా రం ఇబ్రహీంపట్నంలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. మృతుల కుటుంబసభ్యులు, బంధువులు స్థానిక అంబేడ్కర్ చౌరస్తాలో బైఠాయించారు. బాధితులకు న్యాయం జరిగేంత వరకు కదిలేది లేదని భీష్మించుకు కూర్చున్నారు. సుష్మ మృతదేహన్ని అంబులెన్స్‌లో ఉంచి ఆందోళనకు దిగారు. మాజీ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, కాంగ్రెస్ నాయకులు చిలుక మధుసూదన్‌రెడ్డి తదితరులు వీరికి మద్దతుగా నిలిచారు. మృతుల కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జిల్లా వైద్యాధికారి స్వరాజ్వలక్ష్మిని చుట్టుముట్టి నిలదీశారు. ఎక్స్‌గ్రేషియా.. డబుల్ బెడ్రూం.. విచారణకు హామీ ఆందోళన చేస్తున్న వారికి ఆర్డీఓ వెంకటాచారి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లిస్తామని ప్రకటించినా ససేమిరా అనడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. దీంతో ఆర్డీఓ విషయాన్ని ఫోన్‌ద్వారా కలెక్టర్‌కు విన్నవించారు. రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లిస్తామని, డబుల్ బెడ్రూం ఇల్లు ఇస్తామని, పూర్తిస్థాయి విచారణ జరిపి సంబంధిత వైద్యాధికారులపై చర్యలు తీసుకుంటామని సర్దిచెప్పారు. దీంతో బాధిత కుటుంబ సభ్యులు శాంతించారు. సమగ్ర విచారణ జరిపిస్తాం ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపిస్తామని కమిషనర్ ఆఫ్ హెల్త్ ఫ్యామిలీ ప్లానింగ్ అడిషనల్ డైరెక్టర్ రవీందర్ నాయక్ తెలిపారు. సోమవారం ఆయన ఇబ్రహీంపట్నం ప్రభుత్వ ఆస్పత్రిని డిప్యూటీ డీహెంహెచ్‌ఓ నాగజ్యోతితో కలిసి పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ ఈ నెల 25న డీపీఎల్ క్యాంపులో 34 మందికి ట్యూబెక్టమీ ఆపరేషన్లు చేసినట్లు చెప్పారు. వీరిలో నలుగురికి మాత్రమే ఆరోగ్య సమస్యలు తలెత్తాయన్నారు. వీరిలో ముగ్గురు చనిపోవడం బాధాకరమన్నారు. ఈ ఘటనపై ఎక్స్పర్ట్ కమిటీ వేసి విచారణ జరిపిస్తామని, త్వరలోనే ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామన్నారు. – ఫ్యామిలీ ప్లానింగ్ అడిషనల్ డైరెక్టర్ రవీందర్ నాయక్ చదవండి: (తెలంగాణలో భారీగా పెరిగిన క్రైం రేటు.. దేశంలోనే నెం.1) -
కు.ని ఆపరేషన్ తర్వాత అనారోగ్యం
ఇబ్రహీంపట్నం రూరల్: కుటుంబ నియంత్రణ ఆపరేషన్ తర్వాత అనారోగ్యం పాలైన నలుగురు మహిళల్లో ఒకరు మరణించగా మరో ముగ్గురు ప్రాణాపాయస్థితిలో ఉన్నారు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే ఇలా జరిగిందని వారి కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. వివరాలిలా ఉన్నాయి.. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ప్రభుత్వ ఆస్పత్రిలో ఈ నెల 25న వివిధ మండలాలకు చెందిన 37 మంది మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేశారు. ఇద్దరు వైద్యులు శస్త్రచికిత్సలు నిర్వహించారు. ఆపరేషన్ల అనంతరం ఇంటికి వెళ్లిన వారిలో మాడ్గులకు చెందిన మమత (30) రెండు రోజుల క్రితం వాంతులు, విరోచనాలతో తీవ్ర ఇబ్బందులు పడింది. దీంతో కుటుంబ సభ్యులు నగరంలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం సాయంత్రం 5.30 గంటలకు ఆమె మరణించింది. మంచాల మండలం లింగంపల్లి గ్రామానికి చెందిన సుష్మ ఆపరేషన్ చేయించుకున్న రెండు రోజులు బాగానే ఉన్నప్పటికీ ఈ నెల 27 ఉదయం నుంచి వాంతులు, విరోచనాలతో ఇబ్రహీంపట్నంలోని ప్రైవేటు ఆస్పత్రిలో చేరింది. తర్వాత పూర్తిగా కోమాలోకి వెళ్లింది. సుష్మ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. మరో ఇద్దరు మహిళలు కూడా వాంతులు, విరోచనాలతో నగరంలోని ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు. వారి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు తెలిసింది. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే తమ పిల్లలు ప్రాణాపాయ పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నారని కుటుంబసభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆపరేషన్ చేసినప్పుడు బాగానే ఉన్నారు ఈ నెల 25న కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేసిన సమయంలో అందరూ బాగానే ఉన్నట్లు తెలిసింది. వైద్యుల పర్యవేక్షణలోనే ఆపరేషన్లు జరిగాయి. ఆపరేషన్లు చేసిన ఇద్దరు వైద్యులు అనుభవం ఉన్నవారే. ఆపరేషన్ చేసిన చోట ఎలాంటి సమస్యలు రాలేదు. ఇప్పుడు అనారోగ్యానికి గురైన మహిళలకు వ్యక్తిగత ఆరోగ్య సమస్యలు ఉన్నట్లు తెలిసింది. వైద్యులతో సమీక్షించి పూర్తి స్థాయిలో విచారణ చేపడతాం. – నాగజ్యోతి, డిప్యూటీ డీఎంహెచ్ఓ, ఇబ్రహీంపట్నం -
నా వయసు 32, ఎంత కాలం ఆగాలి?
నా వయసు 32 సంవత్సరాలు. రెండేళ్ల కిందట నాకు సిజేరియన్ కాన్పు జరిగింది. బిడ్డ ఎదురు కాళ్లతో ఉండటం వల్ల సిజేరియన్ తప్పనిసరి అని డాక్టర్లు చెప్పారు. ఇప్పుడు నేను మళ్లీ గర్భిణిని. ఏడోనెల. ఈసారి సాధారణ కాన్పు కోసం ప్రయత్నించవచ్చా? కాన్పు తర్వాత కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకోవాలనుకుంటే ఎంతకాలం ఆగాల్సి ఉంటుంది? – శైలజ, కర్నూలు సాధారణ కాన్పు అవ్వాలి అంటే అనేక అంశాలను పరిగణనలోకి తీసుకోవలసి ఉంటుంది. వీటిలో మొదటిది బిడ్డ బరువు, బిడ్డ తల పొజిషన్, ఉమ్మనీరు వంటివి. రెండవది తల్లి శారీరక, మానసిక పరిస్థితి, అదుపులో లేని బీపీ, షుగర్, ఇంకా ఇతర మెడికల్ కాంప్లికేషన్స్ ఏమైనా ఉన్నాయా? బిడ్డ బయటకు వచ్చే దారి పెల్విస్ ఎలా ఉంది? వంటి అంశాలు. మూడవది కాన్పు సమయంలో నొప్పులు ఎలా ఉంటాయి? వాటికి గర్భాశయ ద్వారం ఎలా తెరుచుకుంటుంది, బిడ్డ తల దిగుతుందా లేదా, నొప్పుల వల్ల బిడ్డ మీద భారం పడి గుండె కొట్టుకోవడం తగ్గిపోవడం, ఆయాసపడి బిడ్డ తల్లి గర్భంలోనే మలవిసర్జన చేసి, అది మింగేయడం, దానివల్ల ప్రాణాపాయ స్థితి వంటి ఎన్నో అంశాలను పరిశీలించవలసి ఉంటుంది. మొదటి రెండు అంశాలను కాన్పుకి ముందు అంచనా వేయవచ్చు. కానీ, మూడో అంశం మాత్రం కాన్పు నొప్పులు మొదలయిన తర్వాతనే తెలుస్తుంది. మీకు మొదటిది సిజేరియన్. ఇందులో గర్భాశయం మీద గాటు పెట్టి బిడ్డను బయటకు తీసి మళ్లీ కుట్లు వేయడం జరుగుతుంది. మళ్లీ గర్భం దాల్చి, బిడ్డ పెరిగే కొలదీ గర్భాశయం కూడా సాగడం జరుగుతుంది. ఈ క్రమంలో ఇంతకుముందు ఆపరేషన్ చేసిన కుట్ల దగ్గర పలుచబడడం జరుగుతుంది. సాధారణ కాన్పుకి ప్రయత్నం చేసేటప్పుడు, కాన్పు నొప్పులు మొదలయినప్పుడు ఒక్కొక్కరి శరీరతత్వాన్ని బట్టి, ముందు కుట్లు సాగే తీరును బట్టి, వాటి పటిష్టతను బట్టి, కొందరిలో పలుచబడిన కుట్లు పగిలిపోయి గర్భసంచి తెరుచుకుని బిడ్డ కడుపులోకి వచ్చి రక్తసరఫరా ఆగిపోయి బిడ్డ చనిపోవటం, కుట్లు పగిలి తల్లిలో విపరీతమైన రక్తస్రావం జరిగి ప్రాణాంతకం అయ్యే పరిస్థితులు ఉండవచ్చు. కొందరిలో అంతా సజావుగానే జరిగి సాధారణ కాన్పు జరగవచ్చు. కానీ, ఎవరికి ఎలా జరుగుతుంది అనేది ముందుగానే ఊహించి చెప్పడం కష్టం. ఆపరేషన్ తర్వాత కాన్పుకి కాన్పుకి కనీసం మూడు సంవత్సరాలైనా గ్యాప్ ఉండి, మొదటి రెండు అంశాలు అంటే బిడ్డ మరీ ఎక్కువ బరువు లేకుండా ఉండి, తల కిందకు ఉండి, ఉమ్మనీరు సరిపడా ఉండి, పెల్విస్ వెడల్పుగా ఉండి, బిడ్డ బయటకు వచ్చేందుకు అనువుగా ఉంటే, అప్పుడు డాక్టరు పైన చెప్పిన ప్రమాదాల గురించి వివరించి, మీరు ఆ రిస్కులను తీసుకునేందుకు అంగీకరిస్తే అప్పుడు సాధారణ కాన్పుకి నొప్పులు వాటంతట అవి వచ్చేవరకు ఆగి ప్రయత్నం చెయ్యడం జరుగుతుంది. దీనినే వీబీఏసీ (వజైనల్ బర్త్ ఆఫ్టర్ సిజేరియన్) అంటారు. కానీ, ఈ ప్రయత్నం 24 గంటలూ గైనకాలజిస్టులు, మత్తు డాక్టర్లు, పిల్లల డాక్టర్లు ఉండే, అన్ని వసతులూ కలిగి ఉన్న హాస్పిటల్లోనే చెయ్యటం మంచిది. దీనివల్ల ఉన్నట్లుండి కుట్లు పగిలేటట్లు ఉన్నాయి లేదా పగిలిపోయాయి అనగానే నిమిషాలలో ఆపరేషన్ చేసి, బిడ్డను బయటకు తీసి ఇద్దరినీ కాపాడే ప్రయత్నం చేయవచ్చు. కొన్నిసార్లు ఎన్ని చేసినా బిడ్డను కాపాడలేకపోవచ్చు. తల్లిలో రక్తస్రావం అధికమయ్యి ప్రాణాపాయస్థితికి చేరవచ్చు. మీకు మొదటి బిడ్డ ఎదురుకాళ్లతో(బ్రీచ్ పొజిషన్) ఉంది. ఇప్పుడు ఏడో నెలనే. కాన్పు సమయానికి ఏ పొజిషన్లో ఉంటుందో ఎదురుచూడవలసి ఉంటుంది. కాకపోతే మీకు ముందు సిజేరియన్ అయ్యి రెండు సంవత్సరాలే అవుతోంది. కాబట్టి ఒకసారి మీ కండిషన్ తెలిసిన గైనకాలజిస్ట్‌తో డిస్కస్ చేసి చూడండి. మామూలుగా అయితే రెండోది సిజేరియన్ ఆపరేషన్ అయితే, ఆపరేషన్ చేసి బిడ్డను తీసిన తర్వాత పిల్లల డాక్టర్ బిడ్డను 5 నిమిషాలు పరీక్ష చేసి, ఆ సమయంలో ఉన్న బిడ్డ ఆరోగ్య పరిస్థితిని చూసి, ఎలా ఉంది అనేది చెప్పడం జరుగుతుంది. బాగుంది అంటే సిజేరియన్ సమయంలోనే పిల్లలు పుట్టకుండా ట్యూబెక్టమీ ఆపరేషన్ కూడా చేసుకోవచ్చు. కాకపోతే అప్పుడే పుట్టిన పిల్లల్లో వందలో ఒక్కరికో ఇద్దరికో కొన్ని ఊపిరితిత్తులు, గుండె సమస్యలు, ఇంకా ఇతర ఆరోగ్య సమస్యలు వెంటనే బయటపడకపోవచ్చు. పుట్టిన వెంటనే బాగానే ఉన్నా కొన్ని గంటల తర్వాత లేదా కొన్ని రోజులు, నెలల తర్వాత కొన్ని తీవ్రమైన సమస్యలు బయటపడి, అవి ప్రాణాంతకమయ్యే పరిస్థితులు ఏర్పడవచ్చు. కాబట్టి ఈ విషయాలను పరిగణనలోకి తీసుకొని, ప్రస్తుత కాలంలో అందరికీ 6 నెలల తర్వాత, బిడ్డ పెరిగి అంతా బాగుంటే అప్పుడు ట్యూబెక్టమీ ఆపరేషన్ చెయ్యించుకోమని సలహా ఇవ్వడం జరుగుతుంది. ఇది ల్యాపరోస్కోపీ ద్వారా చెయ్యించుకోవచ్చు. లేదు ఎలాగైనా సిజేరియన్లోనే చేసేయ్యండి అని సంతకం పెడితే అందులోనే ట్యూబెక్టమీ ఆపరేషన్ కూడా చెయ్యడం జరుగుతుంది. - డా. వేనాటి శోభ, గైనకాలజిస్ట్, హైదరాబాద్ -
50 ఏళ్ల వయసులో మళ్లీ తల్లయింది
అశ్వారావుపేట రూరల్: ఐదు పదులు దాటిన వయసులో ఓ మహిళ ప్రసవించింది. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలంలో శుక్రవారం చోటుచేసుకుంది. మండల పరిధిలోని అనంతారం గ్రామానికి చెందిన రాములమ్మ, రాముడు దంపతులకు 36 ఏళ్ల క్రితమే వివాహమైంది. వీరికి ఇద్దరు ఆడపిల్లలు జన్మించారు. అనంతరం రాములమ్మకు కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్స చేయించారు. ప్రస్తుతం రాములమ్మ, రాముడు దంపతులు కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. కాగా.. శుక్రవారం ఉదయం రాములమ్మకు కడుపులో తీవ్రమైన నొప్పి రావడంతో గ్రామంలోని ఓ ఆశ కార్యకర్త వద్దకు వెళ్లి మాత్ర తెచ్చుకుని వేసుకుంది. కొద్దిసేపటి తర్వాత నొప్పి అధికం కావడంతో ఇంటి వద్దే ఉన్న బాత్రూమ్కు వెళ్లి ప్రసవించింది. ఆడబిడ్డ జన్మించింది. గమనించిన కుటుంబీకులు ఆశ కార్యకర్తకు సమాచారం అందించగా.. ఆమె 108 ద్వారా తల్లీబిడ్డలను అశ్వారావుపేట ప్రభుత్వ సామాజిక ఆస్పత్రికి తరలించారు. తల్లికి రక్తహీనత.. శిశువు కేవలం 800 గ్రాముల బరువు ఉండటంతో మెరుగైన చికిత్స కోసం భద్రాచలం ఆస్పత్రికి తరలించారు. సీహెచ్‌సీ వైద్యురాలు నీలిమను వివరణ కోరగా.. రాములమ్మ పెద్ద వయసులో ప్రసవించడం ఆశ్చర్యకరమేనని పేర్కొన్నారు. కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్స గురించి ఆమె స్పష్టంగా చెప్పలేకపోతోందని తెలిపారు. -
18మంది పిల్లలు పుట్టాకే కుటుంబ నియంత్రణ..
మనోహరాబాద్ (తూప్రాన్) : 18 మంది బిడ్డలు పుట్టాకే కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకుంటానని భీష్మించుకుంది ఓ బాలింత. మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం రంగాయపల్లిలో నివసిస్తున్న జార్ఖండ్‌కు చెందిన ప్యారేలాల్, మహంతి దేవి దంపతులకు ఇప్పటికే ఏడుగురు పిల్లలు. జూలై 28న మహంతి దేవి ఎనిమిదో బిడ్డకు జన్మనిచ్చింది. అయితే ఇప్పటికైనా కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకోవాలని డాక్టర్లు సూచించగా ఆమె నో అంటూ మొండికేసింది. కారణమేంటని అడగ్గా తమ గ్రామానికి చెందిన ఓ దంపతులకు 18 మంది సంతానం ఉన్నారని, వారికంటే ఒక బిడ్డ ఎక్కువ పుట్టేవరకు ఆపరేషన్ చేయించుకోమని ఆ దంపతులు చెప్పారు. ఈ సమాధానంతో అవాక్కయిన వైద్యులు బుధవారం వారి ఇంటికి వచ్చి నచ్చజెప్పారు. ఇప్పటికే ఉన్న పిల్లల భవిష్యత్‌పై దృష్టి పెట్టాలని కౌన్సెలింగ్ ఇవ్వడంతో ఎట్టకేలకు వారు కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌కు ఒప్పుకున్నారు. -
ఆ భారం ఆమెపైనే...!
కుటుంబ సంక్షేమ శస్త్రచికిత్సచేయించుకుంటే ఇక బరువైనపనులేమీ చేయకూడదనీ...ముందు ముందు ఏదైనా అనుకోనిసమస్య ఎదురైతే ప్రాణాలకే ముప్పువాటిల్లుతుందనీ... శస్త్రచికిత్సఫెయిలయ్యే ప్రమాదం ఉందనీమగవారిలో కాస్త అనుమానాలుఎక్కువవుతున్నాయి. ఈ కారణంగా శస్త్రచికిత్సలకు వారు దూరంగా ఉంటున్నారు. ప్రసవ వేదనఅనుభవించే మాతృమూర్తే దీనికిముందుకు రావాల్సి వస్తోంది. ప్రస్తుతం జిల్లాలో పెరుగుతున్నగణాంకాలు ఈ విషయాన్నిరుజువు చేస్తున్నాయి. విజయనగరం ఫోర్ట్: మాతృమూర్తులకు ప్రసవ వేదనతో పాటు కుటుంబ సంక్షేమ శస్త్రచికిత్సల బాధ్యతా తప్పడం లేదు. ఇప్పటికే సాధారణ ప్రసవాలు తగ్గిపోయి సిజేరియన్ల సంఖ్య పెరుతుండగా మహిళలకు కడుపుకోతలు తప్పడం లేదు. దీనికితోడు కుటుం బ సంక్షేమ శస్త్రచికిత్సలకు పురుషులు ఆసక్తి చూపకపోవడంతోఆ భారం మహిళలపైనే పడుతోంది. 99 శాతం మహిళలు కుటుంబ సంక్షేమ శస్త్రచికిత్సలు చేసుకుంటుండగా, ఒకశాతం మంది పురుషులు మాత్రమే శస్త్రచికిత్సలు చేసుకుంటున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అవగాహన లేకపోవడంవల్లే... కుటుంబ సంక్షేమ శస్త్రచికిత్సలు ఆడవారి కంటే మగవారికే సుల భం. పైగా పారితోషకం కూడ మగవారికే ప్రభుత్వం ఎక్కువగా ఇస్తుంది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచితంగా శస్త్రచికిత్సలు కూడా చేస్తున్నారు. అయినా పురషులు ముందుకు రావడం లేదు. కేవలం కొద్ది మంది మాత్రమే దానికి సుముఖత వ్యక్తం చేస్తున్నారు. ఈ శస్త్రచికిత్స చేయించుకుంటే సమాజంలో తమను చిన్న చూపు చూస్తారని, హేళన చేస్తారనే భావంతో కొందరు, దాంపత్య జీవి తంలో ఇబ్బందులు ఉంటాయని మరి కొందరు పురుషులు దూరంగా ఉంటున్నట్టు తెలుస్తోంది. అంతేకాదు... వ్యాయామం చేసేటపుడు, బరువైన పనులు చేసేటపుడు ఏమైనా ఇబ్బందులు వస్తాయని కొందరు భావిస్తుండగా... ఇంకొందరు ఉద్యోగానికి లేదా పనికి సెలవు పెట్టాల్సివస్తుందన్న భయం కూడ ఉంది. పురుషులకే పారితోషికం ఎక్కువ ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచితంగా కుటుంబ సంక్షేమ శస్త్రచికిత్సలు చేయడంతో పాటు ప్రభుత్వం పారితోషకం కూడా ఇస్తుంది. మహిళలకు రూ.600లు, పురుషులకు రూ.1100లు చొప్పున అందిస్తున్నారు. మహిళలు చేయించుకునే శస్త్రచికిత్సకు ట్యూబెక్టమీ అని, మగవారికి చేసే శస్త్రచికిత్సను వేసెక్టమీ అని అంటారు. వాస్తవానికి ఈ శస్త్రచికిత్స ఆడవారికంటే మగవారు చేయించుకుంటేనే మంచిదని వైద్యులు చెబుతున్నారు. ఆపరేషన్ చేయించుకున్న పురుషులు విశ్రాంతి తీసుకోవాల్సిన సమయం కూడా తక్కువే అని, మహిళలు దాదాపు నెల రోజులు విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుందని చెబుతున్నారు. అంతేగాదు మహిళలు మూడు నెలల వరకు బరువు పనులు చేయ కూడదని కూడా చెబుతున్నారు. కొన్ని సందర్భాల్లో మహిళల ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంది. తొందరగా వారు బలహీనులు కావడం... ఎక్కువ పనిచేస్తే అలసట ఎక్కువగా ఉండటం... దూరం నడవలేకపోవడం వంటి సమస్యలు తలెత్తుతున్నాయని కొందరు మహిళలే చెబుతున్నారు. మూఢ నమ్మకాలే కారణం కుటుంబ సంక్షేమ శస్త్రచికిత్సలపై అపోహలు, మూఢ నమ్మకాలు చాలా మందిలో ఉన్నాయి. అందువల్లే పురుషులు వీటికి దూరంగా ఉంటున్నారు. వాస్తవానికి పురుషులకు వేసెక్టమీ శస్త్రచికిత్స చాలా సులభంగా చేయొచ్చు. ఉదయం ఆపరేషన్ చేయించుకోవడానికి వస్తే సాయంత్రానికి ఇంటికి వెళ్లిపోవచ్చు. మరునాటి నుంచి యాధావిధిగా పనులు చేసుకోవచ్చు.– డాక్టర్ సి.పద్మజ, అదనపు వైద్య ఆరోగ్యశాఖాధికారి -
ప్రభుత్వాస్పత్రి వైద్యుడి నిర్వాకం
నెల్లూరు, వాకాడు: ప్రభుత్వ వైద్యుడు నగదు తీసుకుని కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేశానని మోసం చేశాడని మండలంలోని దుర్గవరం అరుంధతీయవాడకు చెందిన భారతి అనే మహిళ వాపోయింది. శుక్రవారం ఆమె భర్త సోము సుధాకర్‌తో కలిసి వివరాలు వెల్లడించింది. సుధాకర్, భారతిలు నిరుపేదలు. వారికి ఇప్పటికే ముగ్గురు సంతానం ఉన్నారు. భారతి అనారోగ్యం, బలహీనంగా ఉంటూ తరచూ ఫిట్స్‌తో బాధపడుతోంది. ఈ క్రమంలో మళ్లీ గర్భం దాల్చడంతో ఇక సంతానం వద్దనుకుని జూలై 8వ తేదీన కోటలోని ప్రభుత్వ ఆస్పత్రి వైద్యుడిని భార్యాభర్తలు సంప్రదించారు. డాక్టర్ ముందుగా అబార్షన్ చేసి, ఆపై కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేస్తానని చెప్పాడు. అందుకోసం రూ.10 వేలు ఖర్చవుతుందన్నాడు. ఆయన చెప్పిన విధంగానే దంపతులు తమ పొలాన్ని తాకట్టుపెట్టి వైద్యుడికి నగదు చెల్లించారు. దీంతో డాక్టర్ తన సొంత క్లీనిక్‌లో ట్రీట్మెంట్ చేసి ప్రభుత్వాస్పత్రిలో చేసినట్లుగా సర్టిఫికెట్ ఇచ్చి 12వ తేదీన డిశ్చార్జి చేశాడు. మూడు నెలల తర్వాత వైద్యుడి నిర్వాహకం బయట పడింది. భారతికి పొట్ట పెరుగుతుండటంతో తిరిగి అదే డాక్టర్‌ను దంపతులు సంప్రదించారు. నెల్లూరుకు వెళ్లి స్కానింగ్ చేయించుకురావాలని అతను చెప్పారు. దీంతో సుధాకర్ మళ్లీ అప్పు చేసి భార్యకు స్కానింగ్ చేయించాడు. రిపోర్ట్‌లో ఆమె గర్భవతి అని తేలడంతో ఇద్దరూ ఆందోళన చెందారు. వెంటనే ఆపరేషన్ చేసిన వైద్యుడిని నిలదీశారు. అయితే అను సమాధానం చెప్పకుండా తిట్టి పంపేశాడని భార్యాభర్తలు విలపిస్తున్నారు. -
కాసులిస్తేనే కు.ని.
కర్నూలు , కోవెలకుంట్ల: ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితంగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయాల్సి ఉండగా కోవెలకుంట్ల సీహెచ్‌సీలో కాసులిస్తే తప్ప చేయడం లేదు. వైద్య పరికరాల కొనుగోలు పేరుతో కొందరు ఉన్నత స్థాయి సిబ్బందే డబ్బు డిమాండ్ చేస్తున్నారని, డబ్బు ఇవ్వకపోతే ఆపరేషన్ చేయకుండా వెనక్కి పంపుతున్నారని బాధితులు వాపోతున్నారు. నాలుగు మండలాలకు వైద్య సేవలు.. కోవెలకుంట్ల, సంజామల, ఉయ్యాలవాడ, దొర్నిపాడు మండలాల ప్రజలకు వైద్య సేవలతోపాటు, కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేసేందుకు వీలుగా పట్టణంలో కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఏర్పాటైంది. ఆయా మండలాల్లోని బాలింతలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేసేందుకు ఆపరేషన్ థియేటర్ సౌకర్యం కూడా కల్పించారు. గతంలో సీహెచ్‌సీలో డాక్టర్ నాగరాజు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు నిర్వహించేవారు. 2015వ సంవత్సరంలో ఆయన ఉన్నత చదువుల నిమిత్తం వెళ్లిపోవడంతో అప్పటి నుంచి ఆపరేషన్ థియేటర్ మూత పడింది. దీంతో ఆయా మండలాల బాలింతలు నంద్యాల, ఆళ్లగడ్డ, కర్నూలు, బనగానపల్లె పట్టణాలకు వెళ్లి ఆపరేషన్లు చేయించుకోవాల్సి వచ్చేది. ఈ ఏడాది ఆగస్టు 27వ తేదీ నుంచి ఆసుపత్రిలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లను పునరుద్ధరించారు. రెండు నెలల కాలంలో 45 మందికి ఆపరేషన్లు చేశారు. డబ్బివ్వకుంటే వెనక్కి.. పట్టణంలోని సీహెచ్‌సీలో పనిచేస్తున్న కొందరు సిబ్బంది కు.ని. ఆపరేషన్లకు డబ్బులు వసూలు చేస్తున్నట్లు పలువురు బాధితులు ఆరోపిస్తున్నారు. రూ. 2500 ఇవ్వాలని, లేని పక్షంలో అంతే విలువ చేసే బీపీ మిషన్, ఇతర వైద్య పరికరాలు కొనుగోలు చేసి తీసుకురావాలని చెబుతున్నట్లు బాధితులు వాపోతున్నారు. ఇవేవీ ఇవ్వని పక్షంలో ఏదో సాకుతో ఆపరేషన్లు చేయకుండా వెనక్కి పంపుతున్నారని వాపోతున్నారు. నిరు పేద కుటుంబాలు అంత మొత్తం ఇచ్చుకోలేక ఆపరేషన్లు చేయించుకోకుండా వెనుదిరిగి వెళ్తున్నట్లు తెలుస్తోంది. ఉన్నతాధికారులు ఆపరేషన్ల వ్యహరంపై విచారణ జరిపి న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు. ఆపరేషన్ చేయకుండా పంపారు మూడో సంతానంగా కుమారుడు జన్మించడంతో కుటుంబ సభ్యులు ఇటీవలే కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించేందుకు స్థానిక కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తీసుకెళ్లారు. ఆపరేషన్‌కు ముందు బీపీ, రక్తపరీక్ష, మూత్ర పరీక్ష, తదితర పరీక్షలు చేసి.. మత్తు ఇంజక్షన్ కూడా వేశారు. కొన్ని నిమిషాల్లో ఆపరేషన్ చేయాల్సి ఉండగా ప్రస్తుతం ఆపరేషన్ చేసే ఉద్దేశం లేదని, కర్నూలు వెళ్లి చేయించుకోవాలని వెనక్కు పంపారు. ఇంజక్షన్ చేసి వదిలేయడంతో వారం రోజుల నుంచి అనారోగ్యంతో బాధపడుతున్నాను. – లక్ష్మీదేవి, కోవెలకుంట్ల బీపీ మిషన్ తీసుకొస్తేనే ఆపరేషన్ చేస్తామన్నారు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ కోసం నా కుమార్తె షాహినాను కోవెలకుంట్లలోని ఆసుపత్రికి తీసుకెళ్లాను. ఆపరేషన్ చేసేందుకు అన్ని పరీక్షలు చేశారు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఆపరేషన్ చేయాల్సి ఉండగా బీపీ మిషన్ కొనుగోలు చేసి తీసుకురమన్నారు. తన వద్ద అంత డబ్బులేదని చెప్పాను. అయితే రూ. 2500 ఇవ్వమని అడిగారు. అంత ఇచ్చే స్తోమత లేదన్నాను. అయితే వారం రోజుల తర్వాత రమ్మని పంపించేశారు. దీంతో బనగానపల్లె ఆసుపత్రికి తీసుకెళ్లి ఆపరేషన్ చేయించాను.– మహబూబ్‌బీ, సౌదరదిన్నె, కోవెలకుంట్ల మండలం విచారణ జరిపిస్తాం కోవెలకుంట్ల సీహెచ్‌సీలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లకు డబ్బు వసూలు చేస్తున్న విషయం మా దృష్టికి రాలేదు. ఈ సంఘటనలపై విచారణ జరిపిస్తాం. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆపరేషన్లకు ప్రజలు డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదు. ఆపరేషన్లు, మందులు, తదితర సదుపాయాలు ఉచితంగా కల్పిస్తాం.– రామకృష్ణరావు, డీసీహెచ్, నంద్యాల -
రూ.కోటి.. దోచు‘కుని’
సాక్షి, హైదరాబాద్: కుటుంబ నియంత్రణ (కు.ని.) కార్యక్రమం అక్రమాలకు నెలవుగా మారింది. జనాభా నియంత్రణ కోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమం నిధులను వైద్యారోగ్య శాఖ అధికారులు అందినకాడికి దోచుకున్నారు. కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్స చేసుకున్న వారికిచ్చే ప్రోత్సాహకం నిధులు స్వాహా చేశారు. 2002–2007 మధ్య జరిగిన అవకతవకలపై ప్రభుత్వం విచారణకు ఆదే శించగా..వైద్యారోగ్య శాఖలోని 29 మంది అక్రమాలకు పాల్పడినట్లు తేలింది. వీరిలో ఏడుగురిపై క్రిమినల్ కేసులు నమోదు చేయడంతోపాటు నిధులు రికవరీ చేయాలని విచారణ నివేదిక స్పష్టం చేసింది. మిగిలిన వారిపై చర్యలు తీసుకోవాలని పేర్కొంది. ఇటీవల ఈ నివేదికను, ప్రతిపాదనలను ప్రజారోగ్య విభాగం డైరెక్టర్ ప్రభుత్వానికి అందించారు. చర్యల విషయమై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఫిర్యాదులు రావడంతో.. జనాభా నియంత్రణ విషయమై ఎప్పటికప్పుడు రాష్ట్రాలకు కేంద్రం ఆదేశాలు జారీ చేస్తోంది. కుటుంబ నియంత్రణ చేయించుకున్న వారికి ప్రోత్సాహకాలు ఇస్తోంది. గతేడాది వరకు కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్స చేయించుకున్న పురుషుడికి రూ.1,100.. మహిళలకు రూ.880 చొప్పున నేరుగా నగదు రూపంలో కేంద్రం చెల్లించింది. 2002–2007 మధ్య కాలంలో జరిగిన కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్సల కార్యక్రమంలో భారీగా అక్రమాలు జరిగినట్లు ప్రభుత్వానికి ఫిర్యాదులందడంతో విచారణకు ఆదేశించింది. ఒక్క జాబితానే ఐదారు ఆస్పత్రుల్లో.. ఒక ఆస్పత్రిలో శస్త్ర చికిత్సలు చేయించుకున్న వారి జాబితానే మరో ఐదారు ఆస్పత్రుల్లో నమోదు చేసి నట్లు విచారణలో వెల్లడైంది. ఉమ్మడి వరంగల్‌లో అక్రమాలు ఎక్కువగా జరిగాయని, ఈ ఒక్క జిల్లాలోనే రూ.కోటికి పైగా నిధులు దుర్వినియోగమయ్యాయ ని విచారణలో తేలింది. అక్రమాలకు పాల్పడిన వారిలో ఒక సీనియర్ అసిస్టెంట్ మినహా అందరూ వైద్యులే ఉన్నట్లు నివేదికలో పేర్కొన్నారు. అక్రమాలకు పాల్పడిన వారిలో 8 మంది ఇప్పటికే పదవీ విరమణ చేశారు. క్రిమినల్ కేసులు/రికవరీ చర్యలు: ఎం. సరస్వతి, రఘురాం, టి.వీరస్వామి, ఎన్.రాజేశ్వర్, టి.ప్రకాశ్‌రావు, ఎం.సుగుణాకర్‌రావు, సీహెచ్ ప్రసాదరావు శాఖాపరమైన చర్యలు: శ్రీరాం, మదన్మోహన్, ప్రవీణ్, బి.నెహ్రూ, ఎన్.గోపాల్‌రావు, నర్సింహస్వా మి, ఎస్.వెంకటేశ్వర్లు, కె.రాజు, బి.ఆర్.అంబేద్కర్, శ్రీనివాస్, రూబీ జాక్సన్, సుదర్శన్‌రావు, వెంకన్న, రంగారెడ్డి, కరుణశ్రీ, దమయంతి, విజయ కుమార్, ఎం.సత్యవతి, బి.వెంకటలక్ష్మి, సరస్వతి, రఘురాం, ఉదయ్‌సింగ్, జి.వి.పద్మజ, ఆర్.చైతన్య.