కేజీహెచ్లో మహిళ మృతి: బంధువుల ఆందోళన | woman Dies in King George Hospital, visakhapatnam | Sakshi
Sakshi News home page

కేజీహెచ్లో మహిళ మృతి: బంధువుల ఆందోళన

Jul 27 2014 10:59 AM | Updated on May 3 2018 3:17 PM

కుటుంబ నియంత్రణ ఆపరేషన్ వికటించడంతో యువతిని ఆమె బంధువులు మెరుగైన వైద్య చికిత్స కోసం మరో ఆసుపత్రికి తరలించారు.

విశాఖపట్నం: కుటుంబ నియంత్రణ ఆపరేషన్ వికటించడంతో యువతిని ఆమె బంధువులు మెరుగైన వైద్య చికిత్స కోసం మరో ఆసుపత్రికి తరలించారు. ఆ యువతి అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది. దాంతో మృతురాలి బంధువులు ఆగ్రహం కట్టలు తెంచుకుంది. వైద్యుడిపై చర్యలు తీసుకోవాలంటూ బంధువులు ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. ఆ సంఘటన విశాఖపట్నంలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి...

విశాఖ జిల్లా పద్మనాభపురం మండలం రేవిడి ఆసుపత్రిలో ఓ యువతి ఇటీవల కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకుంది. ఆ తర్వాత ఆ యువతికి తీవ్ర రక్తస్రావం కావడంతో మెరుగైన వైద్య చికిత్స కోసం విశాఖలోని కేజీహెచ్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మరణించింది. వైద్యుడి నిర్లక్ష్యం వల్లే ఆ యువతి మరణించిందని మృతురాలి బంధువులు ఆరోపించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement