కేజీహెచ్‌లో గర్భిణులకు అష్టకష్టాలు
ఒకే మంచంపై ముగ్గురేసి బాలింతలు
కేజీహెచ్ : ‘బాలింతలు కష్టాలు పడనక్కర్లేదు. మాతా శిశు మరణాలు అదుపులోకి వచ్చారుు. గర్భిణీలకు ప్రభుత్వం తరఫున ఎన్నో ప్రోత్సహకాలు. గర్భిణీగా ఆస్పత్రికి వస్తే డెలివరీతో పాటు తల్లి, పిల్లను ఇంటికి చేర్చే బాధ్యత కూడా మాదే’ లాంటి ప్రగల్భాలు పలుకుతున్న ప్రభుత్వం ఆచరణలో మాత్రం ఆయా ప్రకటనలు..ప్రకటనలుగానే మిగిలిపోతున్నారుు. ఉత్తరాంధ్రతో పాటు ఒడిశా, చత్తీస్‌గడ్, గోదావరి జిల్లాల నుంచి కేజీహెచ్‌కు వస్తున్న గర్భిణీలు, బాలింతల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది.
అయినా ఇక్కడ వారికి కష్టాలు తప్పడం లేదు. ఒకే బెడ్‌పై ఇద్దరేసి, ముగ్గురేసి చొప్పున చికిత్స పొందడం, డెలీవరీ అయిన తరువాత నలుగురైదుగుర్ని తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌లో కుక్కేయడం, బాలింతలకు బెడ్‌లు లేక కిందనే కూర్చోవడం ఇక్కడి కేజీహెచ్‌తో నిత్యకృత్యమైపోతోంది. సాధారణ కాన్పు, సిజేరియన్ కాన్పు బాలింతలు ప్రసూతి వార్డుల్లో పడుతున్న కష్టాలు చూస్తుంటే 9నెలలపాటు బిడ్డను మోసే కష్టాల కంటే ఇవే ఎక్కువంటూ ఆడపడుచులు రోధిస్తున్నారు.
పౌష్టికాహారం తీసుకుంటే తల్లి, పిల్ల ఇద్దరూ క్షేమం అంటూ సూచనలిస్తున్న ప్రభుత్వం ప్రసూతి, లేబర్ రూం. ఎన్‌ఐసీయూ, తల్లి, బిడ్డను ఇంటికి చేర్చడం వంటి అంశాలపై పూర్తిస్థాయిలో దృష్టిసారించడం లేదన్న ఘటనలతో బుధవారం కేజీహెచ్‌లో సాక్షికి చిక్కిన ఈ దృశ్యాలే ఉదాహారణ.
పురుడు కోసం వస్తే..
Published Fri, Oct 7 2016 9:56 AM | Last Updated on Thu, May 3 2018 3:20 PM
Advertisement
Advertisement