విశాఖపట్నం కింగ్ జార్జీ ఆసుపత్రిలో ఇటీవల పసికందును అపహరించిన కేసును నగర పోలీసులు ఛేదించారు. ఆ కేసుకు సంబంధించి ఇద్దరు కాంట్రాక్ట్ కార్మికులు, ఇద్దరు మహిళ ఉద్యోగులతోపాటు అపహరించిన పసికందును కొనుగోలు చేసిన రాణి అనే మహిళను పోలీసులు అరెస్ట్ చేసి, స్టేషన్కు తరలించారు. పసికందు అపహరణపై కింగ్ జార్జీ ఆసుపత్రి సూపరింటెండెంట్ స్పందించారు.
ఆసుపత్రిలో ఇటువంటి సంఘటనలు చోటు చేసుకోవడం దురదృష్టకరమని అన్నారు. ఆ కేసుతో సంబంధం ఉన్న ఆసుపత్రి సిబ్బందిని సస్పెండ్ చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఆసుపత్రిలో మరిన్ని సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. అయితే అత్యంత వేగంగా ఆ కేసును ఛేదించిన సిబ్బందికి నగర వన్టౌన్ సీఐ మహ్మద్ రూ. 10 వేలు రివార్డు అందజేశారు.