
అమ్మకు శిక్ష
కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌లప్పుడు వైద్య,ఆరోగ్య శాఖ తీరు మారడం లేదు. శస్త్రచికిత్స చేయించుకున్న మహిళలు అష్టకష్టాలకు గురవుతున్నారు. గురువారం పాడేరు ప్రాంతీయ ఆస్పత్రిలో ఈ దయనీయ పరిస్థితి కనిపించింది. మినుములూరు పీహెచ్‌సీ పరిధిలోని 88 మంది మహిళలకు మధ్యాహ్నం నుంచి కు.ని.ఆపరేషన్‌లు చేపట్టారు.
సాయంత్రం 6.30 గంటలకు పూర్తయ్యాయి. ఆపరేషన్ అనంతరం మహిళలను బెడ్లపై కాకుండా కటిక నేలపై పడుకోబెట్టడంతో నరకయాతనకు గురయ్యారు. వారు సేదతీరేందుకు కనీసం ఫ్యాన్‌లు ఏర్పాటు చేయలేదు. కొందరు చీకటిలో చంటి పిల్లలతో ఇబ్బందులకు గురయ్యారు. వారిని ఇళ్లకు చేర్చేందుకు ఎటువంటి వాహన సదుపాయం కల్పించలేదు. - పాడేరు రూరల్