
సాక్షి, హైదరాబాద్: ఇబ్రహీంపట్నం సీహెచ్సీలో కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలు వికటించి కొందరు మహిళలు మృతిచెందిన ఘటనపై గవర్నర్ తమిళిసై సీరియస్‌గా స్పందించారు. ఘటనపై సమగ్ర నివేదిక సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆమె కోరినట్టు సమాచారం. చనిపోయిన మహిళల కుటుంబాలకు అండగా ఉండాలని, చికిత్స పొందుతున్న ఇతర మహిళలకు మెరుగైన వైద్యం అందించాలని ఆమె సూచించినట్టు తెలిసింది. ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న బాధిత మహిళలను పరామర్శించాలని ఆమె నిర్ణయించినట్టు తెలిసింది.