కు.ని. చేశారు ... కాటికి పంపారు | woman dies due to family planning operation at west godavari district | Sakshi
Sakshi News home page

కు.ని. చేశారు ... కాటికి పంపారు

Published Wed, Mar 19 2014 10:19 AM | Last Updated on Sat, Sep 2 2017 4:55 AM

woman dies due to family planning operation at west godavari district

పశ్చిమగోదావరి జిల్లా చింతపూడి ప్రభుత్వ ఆసుపత్రిలో మధులత అనే మహిళ బుధవారం ఉదయం మరణించింది. కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్స వికటించి మధులత మరణించిందని ఆమె బంధువులు ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. దాంతో స్థానికంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దాంతో పోలీసులు రంగప్రవేశం చేసి మధులత బంధువులను శాంతింప చేసేందుకు యత్నిస్తున్నారు.

 

మధులతా ఇటీవలే కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్స కోసం చింతలపూడి ప్రభుత్వ ఆసుపత్రిలో చేరింది. అయితే కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్స అనంతరం ఆమె ఆకస్మాత్తుగా తీవ్ర అనారోగ్యం పాలై మరణించింది. దాంతో ఆమె బంధువులు ఆందోళనకు దిగారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement