
సాక్షి, హైదరాబాద్ : కూకట్ పల్లి కైతలపూర్ డంపింగ్ యార్డు సమీపంలో కాలిపోయిన మృతదేహం లభ్యమైంది. మృతుడు బోరబండ రాధాకృష్ణ నగర్ వాసి జున్నాడా శ్రీనివాస్ (38)గా గుర్తించారు. శ్రీనివాస్ ఏసీ మెకానిక్‌గా పనిచేస్తున్నట్టుసమాచారం. మృతుడికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. తలపై గాయాలు ఉన్నట్టు తెలుస్తోంది. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేస్ నమోదు చేసి విచారణ చేపట్టారు.