కూకట్‌పల్లిలో మట్టుబెట్టి.. అందోల్‌కు తరలించి..
అనారోగ్యంతో మృతిచెందిందని నమ్మించే యత్నం
మృతురాలి కుటుంబీకుల నిలదీతతో విషయం వెలుగులోకి
ఫిర్యాదు మేరకు పోలీసులఅదుపులో నిందితుడు
జోగిపేట(అందోల్): భార్యపై అనుమానంతో కూకట్‌పల్లిలో హత్య చేసి మృతదేహాన్ని అందోల్‌కు తరలించాడు. అనారోగ్యంతో చనిపోయిందని నమ్మించేందుకు యత్నించాడు. మృతురాలి కుటుంబీకులు అనుమానంతో నిలదీస్తే హత్య చేసిన విషయాన్ని బయటపెట్టాడు. ఈ సంఘటన సంగారెడ్డి జిల్లా జోగిపేట మండలంలో ఆదివారం చోటు చేసుకుంది.
పోలీసుల కథనం ప్రకారం.. అందోల్‌కు చెందిన వెండికోలు నర్సింహులు చాలాకాలంగా రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ ప్రాంతంలో స్థిరపడి ఇక్కడే నివసిస్తూ గ్యాస్ డెలివరీ ఏజెంట్‌గా పనిచేస్తున్నాడు. 13 ఏళ్ల క్రితం మెదక్ జిల్లా చిటు్కల్‌కు చెందిన ఇందిర (33)ను వివాహం చేసుకున్నాడు. ఆమెకు సంతానం కలగకపోవడంతో ఐదేళ్ల క్రితం మరో మహిళను రెండో వివాహమాడాడు. దీంతో ఆమెకు ఇద్దరు సంతానం. ఈ క్రమంలో అతను కూకట్‌పల్లిలో మూడంతస్తుల భవనాన్ని నిర్మించాడు. అందులోనే ఇద్దరు భార్యలతో సంసార జీవితాన్ని గడుపుతున్నాడు. మొదటి భార్య ఆ భవనంలోనే కిరాణ షాపు నడుపుతోంది.
కొన్ని రోజులుగా ఇందిరకు ఫోన్‌కాల్స్ ఎక్కువగా రావడంపై నర్సింహులు అనుమానం పెంచుకున్నాడు. దీనివల్ల కొంతకాలంగా ఇద్దరూ గొడవపడుతున్నారు. ఆదివారం కూడా గొడవ పడ్డారు. ఈ క్రమంలోనే కోపాద్రిక్తుడైన అతను టవల్‌ను గొంతుకు చుట్టి ఇందిరకు శ్వాస ఆడకుండా చేసి హత్య చేశాడు. కూకట్‌పల్లి నుంచి అందోల్‌కు మృతదేహం తీసుకెళ్లి అనారోగ్యంతో మృతిచెందినట్లుగా చెప్పే ప్రయత్నం చేశాడు. మృతురాలి కుటుంబీకులు అనుమానంతో గట్టిగా నిలదీస్తే తానే చంపినట్లు కుటుంబ సభ్యులకు తెలిపాడు. దీంతో మృతురాలి తల్లి మొగులమ్మ పోలీసులకు ఫిర్యాదు చేయగా నర్సింహులుపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకుని విచారిస్తే నేరం ఒప్పు కున్నట్లు సీఐ అనిల్‌కుమార్ తెలిపారు. ఇందిర మృతదేహన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment