Husband murder wife
-
కూకట్‌పల్లిలో మట్టుబెట్టి.. అందోల్‌కు తరలించి..
జోగిపేట(అందోల్): భార్యపై అనుమానంతో కూకట్‌పల్లిలో హత్య చేసి మృతదేహాన్ని అందోల్‌కు తరలించాడు. అనారోగ్యంతో చనిపోయిందని నమ్మించేందుకు యత్నించాడు. మృతురాలి కుటుంబీకులు అనుమానంతో నిలదీస్తే హత్య చేసిన విషయాన్ని బయటపెట్టాడు. ఈ సంఘటన సంగారెడ్డి జిల్లా జోగిపేట మండలంలో ఆదివారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. అందోల్‌కు చెందిన వెండికోలు నర్సింహులు చాలాకాలంగా రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ ప్రాంతంలో స్థిరపడి ఇక్కడే నివసిస్తూ గ్యాస్ డెలివరీ ఏజెంట్‌గా పనిచేస్తున్నాడు. 13 ఏళ్ల క్రితం మెదక్ జిల్లా చిటు్కల్‌కు చెందిన ఇందిర (33)ను వివాహం చేసుకున్నాడు. ఆమెకు సంతానం కలగకపోవడంతో ఐదేళ్ల క్రితం మరో మహిళను రెండో వివాహమాడాడు. దీంతో ఆమెకు ఇద్దరు సంతానం. ఈ క్రమంలో అతను కూకట్‌పల్లిలో మూడంతస్తుల భవనాన్ని నిర్మించాడు. అందులోనే ఇద్దరు భార్యలతో సంసార జీవితాన్ని గడుపుతున్నాడు. మొదటి భార్య ఆ భవనంలోనే కిరాణ షాపు నడుపుతోంది. కొన్ని రోజులుగా ఇందిరకు ఫోన్‌కాల్స్ ఎక్కువగా రావడంపై నర్సింహులు అనుమానం పెంచుకున్నాడు. దీనివల్ల కొంతకాలంగా ఇద్దరూ గొడవపడుతున్నారు. ఆదివారం కూడా గొడవ పడ్డారు. ఈ క్రమంలోనే కోపాద్రిక్తుడైన అతను టవల్‌ను గొంతుకు చుట్టి ఇందిరకు శ్వాస ఆడకుండా చేసి హత్య చేశాడు. కూకట్పల్లి నుంచి అందోల్‌కు మృతదేహం తీసుకెళ్లి అనారోగ్యంతో మృతిచెందినట్లుగా చెప్పే ప్రయత్నం చేశాడు. మృతురాలి కుటుంబీకులు అనుమానంతో గట్టిగా నిలదీస్తే తానే చంపినట్లు కుటుంబ సభ్యులకు తెలిపాడు. దీంతో మృతురాలి తల్లి మొగులమ్మ పోలీసులకు ఫిర్యాదు చేయగా నర్సింహులుపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకుని విచారిస్తే నేరం ఒప్పు కున్నట్లు సీఐ అనిల్‌కుమార్ తెలిపారు. ఇందిర మృతదేహన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
మహిళ అనుమానాస్పద మృతి.. భర్త రాత్రికి రాత్రే ...
కర్నాటక: ఓ మహిళ అనుమానాస్పద రీతిలో మృతి చెందిన ఘటన నగరంలోని జవహర్ నగర్లో జరిగింది. శిల్ప(28) అనే మహిళకు ఏడాది క్రితం శరత్‌తో వివాహమైంది. మంగళవారం రాత్రి ఆమెను భర్త హత్య చేసి పరారైనట్లు మృతురాలి తల్లిదండ్రులు తెలిపారు. భర్త శరత్, అత్త శశికళ, మామ సురేష్ తమ కుమార్తెను హత్య చేసి మేడ మీద నుంచి పడి మరణించిందని అబద్ధం చెబుతున్నారని వారు ఆరోపించారు. భర్త వచ్చేంత వరకు మృతదేహానికి అంత్యక్రియలు జరపనీయబోమన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు నేతాజీనగర్ సీఐ నాగరాజ్ వవెల్లడించారు. -
షాకింగ్ వీడియో: భార్యను ట్రైన్ కింద తోసేసి పిల్లలతో పరార్!
ముంబై: మహారాష్ట్ర రాజధాని ముంబైకి సమీపంలోని వసాయి రైల్వే స్టేషన్లో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. పిల్లలతో నిద్రిస్తున్న మహిళను లాక్కెళ్లి వేగంగా దూసుకొస్తున్న ట్రైన్ కింద తోసేశాడు ఓ కిరాతక భర్త. ఆ తర్వాత తన ఇద్దరు పిల్లలను తీసుకుని అక్కడి నుంచి పరారయ్యాడు. రైల్వే స్టేషన్‌లోని సీసీటీవీ కెమెరాలో నమోదైన ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. మహిళను ట్రైన్ కింద తోసేసిన సంఘటన సోమవారం తెల్లవారుజామున 4 గంటలకు జరిగింది. వీడియోలో.. ప్లాట్‌ఫామ్‌పై ఉన్న బల్లపై తన పిల్లలతో బాధితురాలు పడుకుని ఉంది. అక్కడికి వచ్చిన వ్యక్తి ఆమెను నిద్రలేపాడు. ఆ తర్వాత కొద్దిసేపు ఇరువురు మాట్లాడుకున్నారు. ట్రైన్ వస్తుండడాన్ని గమనించి.. అకస్మత్తుగా మహిళను లాక్కెళ్లి రైల్వే ట్రాక్‌పై తోసేశాడు. దాంతో ఆమె పైనుంచి అవాధ్ ఎక్స్‌ప్రెస్ రైలు దూసుకెళ్లింది. మహిళ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. అనంతరం ఇద్దరు కుమారులతో అక్కడి నుంచి పరారయ్యాడు నిందితుడు. వారు ఇరువురు ఆదివారం మధ్యాహ్నం నుంచి స్టేషన్‌లోని ఉన్నట్లు గుర్తించారు రైల్వే పోలీసులు. ఈ ఘటన జరిగిన తర్వాత నిందితుడు దాదర్ వెళ్లాడని, అక్కడి నుంచి కల్యాన్ ప్రాంతానికి వెళ్లినట్లు చెప్పారు. థానేలోని బీవండి నగరంలో అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. shocking video has emerged of a woman sleeping on the platform at Vasai railway station being pushed down by her husband. @saamTVnews @SaamanaOnline @ANI @AmhiDombivlikar @zee24taasnews @ pic.twitter.com/q0OrFTlePg — 𝕄𝕣.ℝ𝕒𝕛 𝕄𝕒𝕛𝕚 (@Rajmajiofficial) August 22, 2022 ఇదీ చదవండి: ‘రియల్ హీరో’.. పిల్లలతో విధులకు జొమాటో డెలివరీ బాయ్ -
కట్టుకున్నోడే కాలయముడు!
అరకులోయలో ఘోరం జరిగింది. మొదటి భార్య ఉందని తెలిసి కూడా తననూ బాగా చూసుకుంటాడని నమ్మి పెళ్లి చేసుకున్న యువతి ఆ మృగాడి చేతిలోనే దారుణ హత్యకు గురైంది.ఈ దారుణంలో మరికొంతమంది పాత్ర ఉన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. శనివారం ఉదయం హత్యా ఘటన వెలుగులోకి రావడంతో అరకులోయ పట్టణంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. చినలబుడు గ్రామానికి చెందిన గిరిజన యువతి కిల్లో పుష్ప (20) భర్త చేతిలోనే ప్రాణాలు కోల్పోవడం విషాదాంతమైంది. సాక్షి, అరకులోయ: భార్య ఉంటుండగానే నెల రోజుల క్రితం మరో యువతిని రెండో వివాహం చేసుకున్న భర్త కిరాతంగా వ్యవహరిం చాడు. నమ్మివచ్చిన పాపానికి దారుణంగా చం పేచాడనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మొదటి సాముహికంగా అత్యాచారం చేసి చంపేసి ఉంటారనే ప్రచారం జరిగినప్పటికీ హత్యగా పోలీసులు నిర్ధారించారు. ఈ హత్య ఘటనకు నిందితుడి మొదటి భార్య, ఆమె తల్లిదండ్రులే సూత్రధారులనే ఆరోపణలూ వ్యక్తమవుతున్నాయి. వివరాల్లోకి వెళితే.. చినలబుడు గ్రామానికి చెందిన గిరిజన యువతి కిల్లో పుష్ప (20)ను అరకులోయకు చెందిన గిరి జనుడు కె.రమేష్ (అలియాస్ మహేష్)(25) ప్రేమించాడు. అతనికి అప్పటికే భార్య, ఇద్దరు పిల్లలున్నారు. పుష్ప ను నెల రోజుల క్రితం రెండవ వివాహం చేసుకుని స్థానిక సీ కాలనీలో కాపురం పెట్టాడు. రమేష్ రెండో పెళ్లి చేసుకున్న తరువాత కుటుం బ కలహాలు అధికమైనట్టు తెలిసింది. మొదటి భార్య రాజేశ్వరి గిరిజనేతర కులానికి చెందినావిడ. ఆమెను కూడా ఐదేళ్ల క్రితం రమేష్ ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. మొదటి భార్య రాజేశ్వరి నుంచి ఒత్తిడి అధికంగా ఉండడంతో పుష్పను అడ్డు తొలగించుకునేందుకు రమేష్ ఈ దారుణానికి ఒడికట్టినట్టు తెలిసింది. మొదటి భార్య రాజేశ్వరి, ఆమె తల్లిదండ్రులు కూడా పుష్ప హత్యకు రమేష్‌కు సహకరించినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. పుష్ప స్థానిక మీసేవ కేంద్రంలో డేటా ఎంట్రీ ఆపరేటర్‌గా పనిచేస్తుంది. సీ కాలనీలో నివాసం ఉన్న ఆమెను శుక్రవారం రాత్రి 8 గంటల సమయంలో భర్త రమేష్ బయటకు తీసుకొని వెళ్లినట్టు ఇంటి పక్కన ఉన్న పలు కుటుంబాలు చెబుతున్నాయి. స్థానికుల సమాచారంతో వెలుగు చూసిన హత్య.. శనివారం ఉదయాన్నే శరభగుడ సమీపంలోని నీలగిరి తోటల్లో శరీరం సగం వరకు దుస్తుల్లేకుండా ఉన్న మహిళ మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వగా.. సీఐ పైడయ్య, ఎస్సై అరుణ్‌కుమార్‌లు సంఘటన స్థలానికి చేరుకున్నారు. అదే సమయంలో రమేష్ కూడా అక్కడకు చేరుకుని మృతిచెందినది తన రెండో భార్య పుష్పఅని, ఎవరో అత్యాచారం చేసి హత్య చేసి ఉంటారని కన్నీళ్లు కార్చాడు. అనుమానం వచ్చిన పోలీసులు రమేష్‌ను అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. అలాగే రమేష్ మొదటి భార్య రాజేశ్వరి, ఆమె తల్లిదండ్రులు అనసూయ, ధర్మారావులను కూడా అదుపులోకి తీసుకొని విచారించారు. పుష్పను ఆమె చున్నీనే మెడకు బిగించి హత్య చేశారని పోలీసుల విచారణలో తేలింది. మెడకు గట్టిగా చున్నీని బిగించడంతో నోరు, ముక్కు నుంచి రక్తస్రావం అయ్యిందని వైద్యపరీక్షల్లో వైద్యులు నిర్ధారించారు. ఎవరో అత్యాచారం చేసినట్టు అనుమానించే విధంగా మృతురాలు పుష్ప శరీరంపై దుస్తులను ఊడదీసి ఉంచారు. మృతదేహాన్ని చూసినవారంతా చలించిపోయారు. గిరిజనుల ధర్నా.. పుష్ప హత్య ఘటనతో అరకులోయలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకున్నాయి. పుష్ప తల్లిదండ్రులు కిల్లో పరశురామ్, పుణ్యవతితో పాటు కుటుంబ సభ్యులు, బంధువులు, చినలబుడు గ్రామానికి చెందిన గిరిజనులంతా అరకులోయ పట్టణంలో ఆందోళనకు దిగారు. తమ కుమార్తెను అన్యాయంగా పొట్టనపెట్టుకున్న భర్త రమేష్, అతని మొదటి భార్య, తల్లిదండ్రులను వెంటనే ఉరితీయాలని, లేని పక్షంలో తమకు అప్పగించాలని పోలీసులను డిమాండ్ చేశారు. పోలీసుస్టేషన్ వద్ద ఆందోళన చేపట్టిన తరువాత మెయిన్‌రోడ్డులో బైఠాయించారు. పుష్పకు శవపరీక్షలు జరగకుండా మధ్యాహ్నం వరకు అడ్డుకున్నారు. నిందితులను అరెస్టు చేశామని, కఠినంగా శిక్షిస్తామని పోలీసు అధికారులు బాధిత గిరిజనులకు హమీ ఇవ్వడంతో వారు శాంతించారు. పుష్ప మృతదేహానికి శవపరీక్షలు నిర్వహించిన తరువాత చినలబుడుకు తరలించారు. అలాగే నిందితులుగా భావిస్తున్న పుష్ప భర్త రమేష్ ఎస్టీ కులానికి చెందినవాడు కాగా, మిగిలిన మొదటి భార్య, ఆమె తల్లిదండ్రులు గిరిజనేతరులు కావడంతో వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. కేసును దర్యాప్తు చేస్తున్నామని పాడేరు డీఎస్పీ రాజ్‌కమల్ తెలిపారు. తల్లడిల్లిన కుటుంబ సభ్యులు.. పుష్ప మరణంతో కన్నవారు తల్లడిల్లిపోయారు. రమేష్‌ను నమ్మి సర్వస్వం అనుకుని వెళ్లిన ఆమె చివరకు క్రూరమైన హత్యకు గురికావడంతో కన్నవారు కన్నీరుమున్నీరుగా రోదిస్తున్నారు. శుక్రవారం రాత్రి పుష్పను సీ కాలనీలోని నివాసం నుంచి బయటకు తీసుకెళ్లిన రమేష్ ఒక్కడే ఆమె హత్య చేసాడా..లేక అతని మొదటి భార్య, ఆమె తల్లిదండ్రులు సహకరించారా అన్నది పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది. డిగ్రీ వరకూ చదువు... వ్యవసాయం చేస్తూనే అష్టకష్టాలు పడి, కుమార్తె పుష్పను తల్లిదండ్రులు పరశురామ్, పుణ్యవతిలు డిగ్రీ వరకు చదివించారు. అరకులోయలోని మీసేవ కేంద్రంలో డేటా ఎంట్రీ అపరేటర్‌గా పనిచేస్తున్న ఆమెకు ప్రతి నెల రూ.7 వేల వరకు వేతనం వస్తుంది. ఈ డబ్బులో కొంత ఆమె తన తల్లిదండ్రులకు అందజేసి వారి జీవనంలో చేదోడు వాదోడుగా ఉంటుంది. సోదరుడు కిరణ్‌కుమార్ డిగ్రీ చదువుకు కూడా పుష్ప ఆర్థికంగా సహకరించేది. నిందితులను కఠినంగా శిక్షించాలి: ఎమ్మెల్యే చెట్టి పాల్గుణ.. కిల్లో పుష్పను కిరాతకంగా హత్య చేసిన భర్త రమేష్‌తో పాటు, ఇతర నిందితులను కఠినంగా శిక్షించాలని ఎమ్మెల్యే చెట్టి పాల్గుణ పోలీసు అధికారులకు విజ్ఞప్తి చేశారు. గిరిజన మహిళ హత్యను ఆయన ఖండించారు. విశాఖలో మంత్రుల పర్యటనలో ఉన్న ఆయన పుష్ప హత్య ఘటనను తెలుసుకుని విచారం వ్యక్తం చేశారు. రమేష్‌తో పాటు, అతని మొదటి భార్య రాజేశ్వరి, ఆమె తల్లిదండ్రులపై ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి,కఠినంగా శిక్షించాలని, ఈ ఘటనపై సమగ్ర విచారణ చేయాలన్నారు. -
గొడవపడి.. గొడ్డలితో తల నరికేశాడు !
అనుమానం పెనుభూతమైంది. జీవితంలో కడదాకా అండగా ఉండాల్సిన భర్తే ఆమె పాలిట యముడయ్యాడు. క్షణికావేశంలో కట్టుకున్న భార్యను కడతేర్చి తానూ బలవన్మరణం పొందాడు. ఫలితంగా అభంశుభం తెలియని ఆ చిన్నారి అనాథగా మారింది. పండగ పూట ఈ దారుణం చోటు చేసుకోవడంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఎమ్మిగనూరు: భార్యపై అనుమానం పెంచుకున్న ఓ భర్త ఆమెను గొడ్డలితో నరికి చంపి, తాను ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఎమ్మిగనూరులో చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.. పట్టణంలోని కబరస్తాన్ ప్రాంతానికి చెందిన ఉసేని, మైబున్ కుమార్తె పర్వీన్(30))ను చంద్రయ్యకొట్టాలకు చెందిన మాబుదౌల, సలీమ కుమారుడు బాషా(33))కు ఇచ్చి నాలుగేళ్ల కిత్రం వివాహం జరిపించారు. వీరికి కుమార్తె ఆఫ్రిన్(1)ఉంది. ప్రస్తుతం పర్వీన్ మూడు నెలల గర్భిణి. పెళ్లయిన కొన్ని నెలలుపాటు వారి సంసారం సాఫీగా సాగింది. తర్వాత భార్య ప్రవర్తనపై భర్త అనుమానం పెంచుకున్నాడు. ఈక్రమంలో బతుకుదెరువు కోసం బెంగళూరులో ఉన్న తన అన్న మన్సూర్ దగ్గరకు వెళ్లాడు. అక్కడ భర్త ఒక చోట, భార్య మరో చోట పనిచేస్తుండేవారు. ఈ క్రమంలో అతడు భార్య ప్రవర్తనను అనుమానిస్తూ గొడవకు దిగేవాడు. ఆమె విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పడం, వారు సర్దిచెప్పి పంపడం చేస్తుండేవారు. తమ్ముడి ప్రవర్తనపై విసుగుచెందిన మన్సూర్ అతడిని మందలించి ఎమ్మిగనూరుకు వెళ్లాలని చెప్పాడు. ఎమ్మిగనూరుకు వెళ్తామని చెప్పి భార్యను కేరళకు తీసుకెళ్లాడు. అక్కడ కూడా గొడవ పడడంతో పోలీసులు కేసు నమోదు చేసి ఎమ్మిగనూరులో ఉన్న తల్లిదండ్రులకు చెప్పటంతో వారు తమ కుమార్తెను ఇంటికి పిలుచుకొచ్చారు. భార్యతో పాటు వచ్చిన బాషా ఖాళీగా ఉండేవాడు. గొడవపడి.. తల నరికి.. శుక్రవారం అర్ధరాత్రి ఇంట్లో అందరు నిద్రిస్తుండగా భార్యతో మళ్లీ గొడవకు దిగాడు. ఈక్రమంలో కోపోద్రిక్తుడై ఒక్కసారిగా గొడ్డలితో ఆమె తలపై నరికాడు. కేకలు వినిపించడంలో తల్లిదండ్రులు వెళ్లి చూడగా ఆమె రక్తపుమడుగులో కనిపించింది. చేతిలో గొడ్డలితో ఉన్న బాషా అక్కడి నుంచి పరారయ్యాడు. వెంటనే కుటుంబ సభ్యులు ఆమెను స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో కర్నూల్‌కు తీసుకెళ్లారు. చికిత్స ఫలించకపోవడంతో ఆమె మృతి చెందింది. భార్య చనిపోయిందనే విషయం తెలుసుకున్న భర్త భయపడి పట్టణంలోని సంజీవయ్య నగర్ చివరన శనివారం తెల్లవారు జామున చెట్టుకు తాడుతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. అటుగా వెళ్తున్న వారు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. తల్లిదండ్రులను కొల్పోయిన చిన్నారి అనాథగా మిగిలిపోయింది. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ ఎస్ఐ హరిప్రసాద్ తెలిపారు. -
భార్యను చంపి భర్త ఆత్మహత్యాయత్నం
గుంటూరు: రేపల్లె మండలం బండిగలమూడి గ్రామంలో ఓ దారుణం జరిగిపోయింది. ఓ భర్త భార్యను హత్య చేసి, తనూ ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించాడు. విషయం తెలిసిన స్థానికులు వెంటనే అతనిని ఆస్పత్రికి తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉంది. అతను భార్యను ఎందుకు హత్య చేసింది? తను ఎందుకు ఆత్మహత్యా చేసింది? ఆ వివరాలు తెలియలేదు. -
భార్యను ముక్కలుగా నరికిన భర్త
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం జూకల్‌లో ఓ భర్త తన భార్యను అతి దారుణంగా ముక్కలు ముక్కలుగా నరికి హత్య చేశాడు. గుర్తు తెలియని వ్యక్తులు హత్యచేసినట్లు నమ్మించడానికి ప్రయత్నించాడు. పోలీసుల కథనం ప్రకారం 500 రూపాయలు పోగొట్టిందని యాదయ్య అనే వ్యక్తి తన భార్యను కర్రలతో అతి దారుణంగా కొట్టాడు. ఆ తరువాత ఆమె శరీరాన్ని ముక్కలు ముక్కలుగా నరికేశాడు. మొదటి భార్యను కూడా అతనే యాదయ్య హత్య చేసినట్లు చెబుతున్నారు. చిన్న కారణంగానే రెండవ భార్యను ఇంత దారుణంగా హత్య చేయడంతో అతని మానసిక పరిస్థితిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.