
శిల్ప(28) అనే మహిళకు ఏడాది క్రితం శరత్‌తో వివాహమైంది. మంగళవారం రాత్రి ఆమెను భర్త హత్య చేసి పరారైనట్లు మృతురాలి తల్లిదండ్రులు తెలిపారు.
కర్నాటక: ఓ మహిళ అనుమానాస్పద రీతిలో మృతి చెందిన ఘటన నగరంలోని జవహర్ నగర్‌లో జరిగింది. శిల్ప(28) అనే మహిళకు ఏడాది క్రితం శరత్‌తో వివాహమైంది. మంగళవారం రాత్రి ఆమెను భర్త హత్య చేసి పరారైనట్లు మృతురాలి తల్లిదండ్రులు తెలిపారు.
భర్త శరత్, అత్త శశికళ, మామ సురేష్ తమ కుమార్తెను హత్య చేసి మేడ మీద నుంచి పడి మరణించిందని అబద్ధం చెబుతున్నారని వారు ఆరోపించారు. భర్త వచ్చేంత వరకు మృతదేహానికి అంత్యక్రియలు జరపనీయబోమన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు నేతాజీనగర్ సీఐ నాగరాజ్ వవెల్లడించారు.