సాక్షి, హైదరాబాద్: నగరంలోని ఓ ప్రముఖ హోటల్‌లో దారుణం చోటు చేసుకుంది. ఓ నర్సింగ్ విద్యార్థిని అనుమానాస్పద రీతిలో మృతి చెందగా.. ఆమెపై హత్యాచారం జరిగిందని బంధువులు ఆరోపిస్తూ ధర్నాకు దిగారు.
గచ్చిబౌలి రెడ్‌స్టోన్ హోటల్‌లోని ఓ గదిలో ఓ యువతి ఉరికొయ్యకు వేలాడుతుండడంతో పోలీసులకు సమాచారం వెళ్లింది. వెంటనే క్లూస్ టీం, ఫోరెన్సిక్ బృందం ఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించాయి. గదిలో అంతా రక్తపు మరకలు ఉండగా, మరోవైపు మద్యం బాటిల్స్ పడి ఉన్నాయి.
మృతిరాలిని నర్సింగ్ చదువుతున్న శృతిగా పోలీసులు నిర్ధారించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. గది మొత్తం చెల్లాచెదురుగా పడి ఉండడంతో గొడవ జరిగి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు పోలీసులు. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.
అయితే ఘటన గురించి తెలిశాక హోటల్ వద్దకు చేరుకున్న మృతురాలి బంధువులు ఆందోళనకు దిగారు. తమ బిడ్డపై అఘాయిత్యానికి ఒడిగట్టి, ఆపైనే ఉరి వేసి హత్య చేశారని తల్లిదండ్రులు ఆరోపించారు. పోలీసులను అడ్డుకుని హోటల్ ముందు ధర్నాకు దిగారు.
ఇదీ చదవండి: ప్రియుడి మోజుతో ఆ కూతురు చేసిన పనికి..
Comments
Please login to add a commentAdd a comment