nursing student
-
Hyderabad: నర్సింగ్ విద్యార్థిని ఆత్మహత్య
బౌద్ధనగర్,హైదరాబాద్: ప్రేమించిన వ్యక్తి తరచూ అనుమానిస్తూ..వేధింపులకు పాల్పడడంతో భరించలేక ఓ నర్సింగ్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. వారాసిగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటనపై ఇన్స్పెక్టర్ సైదులు తెలిపిన వివరాల ప్రకారం..బౌద్ధనగర్‌లోని అంబర్‌నగర్‌కు చెందిన నాగయ్య కుమార్తె ప్రవళిక (23) కోఠి ఉమెన్స్ కాలేజీలో బీఎస్సీ ఫైనలియర్ చదువుతుంది. కాలేజీ అయ్యాక సాయంత్రం 6 నుండి రాత్రి 10 గంటల వరకు వారాసిగూడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో పార్ట్‌టైమ్ జాబ్ చేస్తుంది. కాగా నాలుగేళ్లుగా ప్రవళిక..సృజన్ అనే యువకుడిని ప్రేమిస్తోంది. ఈ క్రమంలో కొద్ది రోజులుగా సృజన్ ఆమెను వేధిస్తూ వేధింపులకు దిగాడు. మరో యువకుడితో మాట్లాడుతున్నావని అనుమానించేవాడు. ఇదే విషయంపై పలుమార్లు గొడవలు జరిగాయి. ఈ నెల 6వ తేదీన సాయంత్రం ఉస్మానియా యూనివర్సిటీలోని ఓ బేకరీలో ప్రవళిక, సృజన్‌ల మధ్య వాగి్వవాదం జరిగింది. దీంతో మరో స్నేహితుడు మధుకర్ వచ్చి ఇద్దరిని సముదాయించాడు. ఈ క్రమంలో గురువారం రాత్రి 10 గంటల సమయంలో ఇంటికి వచ్చిన ప్రవళిక తన తండ్రి నాగయ్యకు ఫోన్ చేయగా, తాను ఫంక్షన్‌కు వెళ్తున్నానని ఆలస్యంగా వస్తానని చెప్పాడు. అర్థరాత్రి ఒంటి గంటకు ఇంటికి వచ్చిన నాగయ్యకు బెడ్రూమ్లో ప్రవళిక దుప్పటితో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరేసుకొని కనిపించింది. వెంటనే స్థానికుల సహాయంతో ప్రవళికను ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ప్రవళిక స్నేహితుడు మధుకర్..సృజన్‌తో ప్రేమ, గొడవల గురించి నాగయ్యకు తెల్పగా..ఆయన ఫిర్యాదు మేరకు సృజన్‌పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
HYD: నర్సింగ్ విద్యార్థినిపై హత్యాచారం?
సాక్షి, హైదరాబాద్: నగరంలోని ఓ ప్రముఖ హోటల్లో దారుణం చోటు చేసుకుంది. ఓ నర్సింగ్ విద్యార్థిని అనుమానాస్పద రీతిలో మృతి చెందగా.. ఆమెపై హత్యాచారం జరిగిందని బంధువులు ఆరోపిస్తూ ధర్నాకు దిగారు.గచ్చిబౌలి రెడ్‌స్టోన్ హోటల్లోని ఓ గదిలో ఓ యువతి ఉరికొయ్యకు వేలాడుతుండడంతో పోలీసులకు సమాచారం వెళ్లింది. వెంటనే క్లూస్ టీం, ఫోరెన్సిక్ బృందం ఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించాయి. గదిలో అంతా రక్తపు మరకలు ఉండగా, మరోవైపు మద్యం బాటిల్స్ పడి ఉన్నాయి. మృతిరాలిని నర్సింగ్ చదువుతున్న శృతిగా పోలీసులు నిర్ధారించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. గది మొత్తం చెల్లాచెదురుగా పడి ఉండడంతో గొడవ జరిగి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు పోలీసులు. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అయితే ఘటన గురించి తెలిశాక హోటల్ వద్దకు చేరుకున్న మృతురాలి బంధువులు ఆందోళనకు దిగారు. తమ బిడ్డపై అఘాయిత్యానికి ఒడిగట్టి, ఆపైనే ఉరి వేసి హత్య చేశారని తల్లిదండ్రులు ఆరోపించారు. పోలీసులను అడ్డుకుని హోటల్ ముందు ధర్నాకు దిగారు. ఇదీ చదవండి: ప్రియుడి మోజుతో ఆ కూతురు చేసిన పనికి.. -
వాట్సాప్ స్టేటస్‌గా గర్ల్ ఫ్రెండ్ డెడ్‌బాడీ ఫొటో!
చెన్నై: గర్ల్ ఫ్రెండ్‌ను గొంతు పిసికి చంపేసిన ఓ యువకుడు, ఆమె మృతదేహం ఫొటోను తీసి వాట్సాప్ స్టేటస్‌లో పెట్టుకున్నాడు. మృతురాలి స్నేహితులు గుర్తు పట్టి, పోలీసులను అప్రమత్తం చేయడంతో అతగాడు దొరికిపోయాడు. ఈ ఘటన చెన్నైలో చోటుచేసుకుంది. కేరళలోని కొల్లంకు చెందిన ఫౌసియా(20) చైన్నైలోని ఓ హాస్టల్లో ఉంటూ క్రోంపేట్‌లోని కాలేజీలో నర్సింగ్ చదువుతోంది. ఆషిక్(20)అనే యువకుడితో అయిదేళ్లుగా సన్నిహితంగా ఉంటోంది. మైనర్‌గా ఉన్నప్పుడే ఫౌసియా గర్భవతి అయింది. ఆషిక్‌పై పోక్సో కేసు నమోదు కావడంతో జైలుకు వెళ్లాడు. ఫౌసియా పుట్టిన బిడ్డను దత్తతకిచ్చింది. జైలు నుంచి విడుదలయ్యాక ఆషిక్, ఫౌసియా సంబంధం తిరిగి కొనసాగుతోంది. శుక్రవారం చెన్నై వచ్చిన ఆషిక్ హోటల్లో రూం బుక్ చేసి, ఫౌసియాను వెంట తీసుకెళ్లాడు. అదే రోజు సాయంత్రం, మృతదేహం ఫొటోను తన వాట్సాప్ స్టేటస్‌లో పెట్టాడు. ఫౌసియా స్నేహితులు ఆ ఫొటోను గుర్తించి, పోలీసులకు సమాచారమిచ్చారు. వారు వెంటనే వెళ్లి హోటల్ రూంలో చూడగా ఫౌసియా మృతదేహం కనిపించింది. పరారీలో ఉన్న ఆషిక్‌ను సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా పట్టుకున్నారు. తనకు మరో యువతితో సంబంధముందని అనుమానిస్తూ మాట్లాడటంతో కోపం పట్టలేక ఫౌసియాను టీ షర్టుతో గొంతుకు బిగించి, చంపేసినట్లు పోలీసుల విచారణలో ఒప్పుకున్నాడు. -
పాముకాటుతో నర్సింగ్ విద్యార్థిని షఫీనా మృతి
వరంగల్: పాముకాటుతో ఓ విద్యార్థిని మృతి చెందింది. ఈ ఘటన సీరోలు మండలం కొత్తూరు(సీ) గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకుడు, ఆర్ఎంపీ షేక్ యాకూబ్ కుమార్తె నర్సింగ్ విద్యార్థిని షఫీనా(22) శనివారం రాత్రి ఇంట్లో నిద్రిస్తోంది. ఈ సమయంలో పాము కాటు వేసింది. దీంతో షఫీనా లేచి తండ్రి యాకూబ్‌తో ఏదో కుట్టిందని చెప్పింది. ఇంతలోనే షఫీనాకు వాంతులు అవుతుండగా యాకూబ్ వెంటనే మహబూబాబాద్‌లోని ఓ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో ఖమ్మంలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందింది. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే రెడ్యానాయక్ గ్రామానికి చేరుకుని షఫీనా మృతదేహంపై పూలమాల వేసి నివాళులరి ్పంచారు. కార్యక్రమంలో కాంపల్లి సొసైటీ చైర్పర్సన్ కొండపల్లి శ్రీదేవి, బీఆర్ఎస్ జిల్లా అధికార ప్రతినిధి బజ్జూరి పిచ్చిరెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు తోటలాలయ్య, సర్పంచ్ యానాల గంగాధర్‌రెడ్డి, నాయకులు రవి, భిక్షమయ్య, సత్యనారాయణ, సైదులు, రాందాస్‌నాయక్ పాల్గొన్నారు. -
నర్సింగ్ విద్యార్థి కావ్య ఆత్మహత్య
ఖమ్మంక్రైం: ఖమ్మంలో ఓ నర్సింగ్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. బుధవారం జరిగిన ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలం మద్దుకూరుకు చెందిన కోడెం కృష్ణ – రమాదేవి రెండో కుమార్తె కావ్య(19) ఖమ్మంలోని పారా మెడికల్ కాలేజీలో నర్సింగ్ (ఏఎన్ఎం) చదువుతోంది. ఖమ్మం, బీకే బజార్‌లోని ఆస్పత్రిలో నర్స్‌గా పనిచేస్తూ స్నేహితురాలు సీతామహాలక్ష్మితో కలిసి అద్దె గదిలో ఉంటోంది. అయితే, మంగళవారం నైట్ డ్యూటీకి వెళ్లి వచ్చిన ఆమె బుధవారం ఉదయం నిద్రపోయింది. స్నేహితురాలు సీతామహాలక్ష్మి విధులకు వెళ్లింది. తరువాత కావ్య మరో స్నేహితురాలు తనుశ్రీ వచ్చి కాసేపు మాట్లాడి తిరిగి కిందకు వెళ్తుండగా పెద్ద శబ్దం వచ్చింది. ఏం జరిగిందోనని తనుశ్రీ వెళ్లి చూడగా కావ్య ఉరి వేసుకుని కనిపించింది. వెంటనే చుట్టుపక్కల వారిని పిలవడంతో వచ్చి కిందకు దించారు. అప్పటికే ఆమె మృతి చెందింది. తాను మాట్లాడినప్పుడు కావ్య నీరసంగా ఉందని తనుశ్రీ తెలిపింది. ఘటనకు ముందు కావ్య తనకు ఫోన్ చేసి జాగ్రత్తలు చెప్పిందని తల్లి రమాదేవి వెల్లడించింది. తన కూతురు ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదంది. తల్లి ఫిర్యాదుతో ఖమ్మం వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇది కూడా చదవండి: ఎమ్మెల్యే రాజయ్య, సర్పంచ్ నవ్య ఎపిసోడ్లో కీలక ట్విస్ట్ -
వికారాబాద్‌లో దారుణం.. పాపం శిరీష..
సాక్షి, పరిగి: వికారాబాద్ జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ యువతి దారుణ హత్యకు గురైంది. నిన్నటి నుంచి కనిపించని యువతి శిరీష(19) హత్యకు గురై నీటికుంటలో రక్తపు మరకలతో మృతదేహం కనిపించింది. గుర్తు తెలియని దుండగులు యువతి కనుగుడ్డుపై బలమైన ఆయుధంతో దాడి చేసి, కాళ్లు, చేతి నరాలను కత్తితో కోశారు. వివరాల ప్రకారం.. పరిగి మండలం కాలాపూర్ గ్రామంలో శిరీష దారుణ హత్యకు గురైంది. శనివారం రాత్రి ఇంటి నుంచి బయటకు వెళ్లిన శిరీష తిరిగి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు టెన్షన్ పడ్డారు. ఈ క్రమంలో పోలీసులను ఆశ్రయించారు. దీంతో, పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అనంతరం.. ఆదివారం ఉదయం గ్రామ సమీపంలోని నీటికుంటలో రక్తపు మరకలతో శిరీష మృతదేహం కనిపించింది. కాగా, గుర్తు తెలియని దుండగులు శిరీషను దారుణంగా హత్య చేశారు. ఆమె కనుగుడ్డుపై బలమైన ఆయుధంతో దాడి చేసి, కాళ్లు, చేతి నరాలను కత్తితో కోశారు. దుండగలు యువతిని హత్య చేసి నీటికుంటలో పడేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఇక, శిరీష ఇంటర్మీడియట్ పూర్తి చేసి వికారాబాద్‌లోని ఓ ప్రైవేటు కళాశాలలో నర్సింగ్ శిక్షణ తీసుకుంటోంది. ఇటీవల బాలిక తల్లికి గుండెపోటు రావడంతో హైదరాబాద్‌లోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. తల్లి అనారోగ్య సమస్య కారణంగా శిరీష రెండు నెలల క్రితం చదువు మానేసింది. ఈ క్రమంలో ఇలా దారుణ హత్యకు గురికావడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. మరోవైపు.. ఈ హత్య కేసులో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. నిన్న శిరీషపై ఆమె అక్క భర్త అనిల్ చేయిచేసుకున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. దీంతో, పోలీసులు అనిల్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఇదిలా ఉండగా.. శిరీష గొంతుపై పోలీసులు గాట్లను గుర్తించారు. శిరీష తండ్రి, తమ్ముడికి కూడా పోలీసులు ప్రశ్నిస్తున్నారు. కాగా, శిరీషను అక్క భర్త అనిల్ కొట్టడం వల్లే మనస్తాపానికి గురైనట్టు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇది కూడా చదవండి: బిగ్ ట్విస్ట్.. అప్సరకు గతంలోనే వివాహం?..పెళ్లి ఫోటోలు వైరల్.. -
Nursing Student: ‘నాన్న తాగొద్దు, అమ్మను కొట్టొద్దు, అంతా అన్న చూసుకుంటాడు'
సాక్షి, చెన్నై(తిరువొత్తియూరు): నర్సింగ్ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన పెరుమాలైలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. నాగై జిల్లా వేదార ణ్యం తాలూకా పెరుమాలై గ్రామానికి చెందిన ఇళయరాజా కుమార్తె ఇందుజ (18) కడినాల్ వైయల్ ప్రాంతంలో ఉంటూ ప్రైవేటు నర్సింగ్ శిక్షణ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతోంది. ఇక్కడ 14 మంది విద్యార్థులు మాత్రమే చదువుతున్నారు. వీరిలో 13 మంది రోజు ఇంటికి వచ్చి వెళుతున్నారు. ఇందుజా మాత్రం పేదరికం కారణంగా కళాశాలలోనే ఉన్న స్త్రీల గదిలో ఉంటోంది. ఈ క్రమంలో ఆదివారం రాత్రి విద్యార్థిని బాత్రూమ్లో చున్నీతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న వేదారణ్యం పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి, విద్యార్థిని రాసి ఉంచిన ఉత్తరాన్ని స్వాధీనం చేసుకున్నారు. ‘నాన్న తాగవద్దు, అమ్మను కొట్టవద్దు, నేను మీకు ఏదో చేయాలని తలుచుకున్నానని, కానీ వీలు కాలేదు. అంతా అన్న చూసుకుంటాడు.’అని రాసి ఉంది. పోలీసులు విద్యార్థిని మృతదేహాన్ని శవపరీక్ష కోసం వేదారణ్యం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ క్రమంలో విద్యార్థి మృతిపై తమకు సందేహం ఉన్నట్లు ఆమె బంధువులు ఆస్పత్రిని ముట్టడించి, ఆందోళన చేపట్టారు. పోలీసులు దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సాయుధ దళ పోలీసు.. తిరుపూర్‌లో సాయుధ దళం పోలీసు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల కథనం మేరకు.. తేనె జిల్లా సురులిపట్టికి చెందిన ఈశ్వరన్ (33) తిరుపూరు జిల్లా సాయుధ దళంలో పోలీసుగా పనిచేస్తున్నాడు. కుటుంబంతోసహా నల్లూరు ప్రాంతంలో ఉన్న జిల్లా సాయుదళ పోలీస్ క్వార్టర్స్‌లో నివాసం ఉంటున్నాడు. ఈ క్రమంలో కొన్ని రోజులుగా ఈశ్వరన్ తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నాడు. ఈ క్రమంలో సోమవారం పని ముగించుకుని, ఇంటికి వచ్చిన తర్వాత ఇంట్లోని ఓ గదిలోకి వెళ్లిని ఫ్యాన్‌కు భార్య చీరతో ఉరి వేసుకున్నాడు. గుర్తించిన కుటుంబసభ్యులు దీనిపై పోలీసులకు సమాచారం అందజేశారు. నల్లూరు పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి, కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ఏం జరిగిందో.. ఏమో.. హాస్టల్లో నర్సింగ్ విద్యార్థిని ఆత్మహత్య
తిరువళ్లూరు(తమిళనాడు): ఓ నర్సింగ్ విద్యార్థిని హాస్టల్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. వివరాలు.. తిరువళ్లూరు జిల్లా తిరువేర్కాడు సమీపంలోని మాదిరవేడులో మహిళా నర్సింగ్ కళాశాల, దానికి అనుబంధంగా హాస్టల్ కూడా ఉంది. ఇక్కడ ఈరోడ్‌కు చెందిన సుమతి(19) నర్సింగ్ ద్వితీయ సంవత్సరం చదువుతూ హాస్టల్లో ఉంటోంది. శనివారం మధ్యాహ్నం కళాశాల ముగిసిన తరువాత లంచ్ కోసం విద్యార్థులు హాస్టల్‌కు వచ్చారు. అయితే సుమతి డైనింగ్‌హాల్‌కు వెళ్లకుండా తన రూమ్‌కి వెళ్లినట్లు తెలుస్తోంది. చదవండి: ఒంటరి మహిళలే టార్గెట్.. నమ్మించి నగ్న వీడియోలు తీసి.. తన గది నుంచి చాలా సమయం వరకు బయటకు రాకపోవడంతో సహచర విద్యార్థునులు లోపలికి వెళ్లి చూశారు. అక్కడ సుమతి ఫ్యాన్‌కు ఉరికి వేలాడుతుండడంతో తిరువేర్కాడు పోలీసులకు తెలియజేశారు. పోలీసులు మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం చెన్నై కీల్పాక్కం వైద్యశాలకు తరలించారు. కాగా సుమతి ఆత్మహత్య విషయాన్ని తెలుసుకున్న తల్లిదండ్రులు, బంధువులు ఈరోడ్ నుంచి నేరుగా హాస్టల్ వద్దకు చేరుకున్నారు. తమ బిడ్డ ఆత్మహత్యకు కళాశాల యాజమాన్యం వేధింపులే కారణమని ఆరోపిస్తూ రాస్తారోకోకు యత్నించారు. అప్రమత్తమైన పోలీసులు వారితో చర్చించారు. మృతిపై అనుమానం ఉంటే తమకు ఫిర్యాదు చేయాలంటూ ఆందోళనను విరమింపజేశారు. సీబీసీఐడీ విచారణ ప్రారంభం నర్సింగ్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న నేపథ్యంలో తిరువేర్కాడు పోలీసులు కేసు నమోదు చేయగా, సీబీసీఐడీ పోలీసులు విచారణ ప్రారంభించారు. ఆదివారం హాస్టల్ కళాశాల సిబ్బంది, సహచర విద్యార్థులను ప్రశ్నించారు. విచారణలో సుమతి ఓ యువకుడితో సన్నిహితంగా మెలుగుతున్నట్లు గుర్తించారు. ఈ విషయంపై తల్లిదండ్రులతో సుమతి గొడవపడినట్లు పోలీసులు నిర్ధారించారు. రెండుమూడు రోజుల్లో హాస్టల్ నుంచి తీసుకెళ్లాలని నిర్ణయించిన క్రమంలో విద్యార్థిని ఆత్మహత్య కలకలం రేపింది. ఇదిలా ఇండగా ఇటీవల కల్లకురిచ్చి, కీళచ్చేరి హాస్టల్లో ప్లస్–2 విద్యార్థినుల అనుమానాస్పద మృతి ఘటనలను మరువకముందే నర్సింగ్ విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడడం కలకలం రేపింది. ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
మావోయిస్టులతో లింకులపై... ఎన్ఐఏ సోదాలు
సాక్షి, హైదరాబాద్: నిషేధిత మావోయిస్టు పార్టీ భావజాలాన్ని వ్యాప్తిజేస్తూ యువత మావోయిస్టుల్లో చేరేలా ప్రోత్సహిస్తున్నారన్న అభియో గంపై చైతన్య మహిళా సంఘం (సీఎంఎస్) నాయకులు డొంగరి దేవేంద్ర, దుబాసి స్వప్న, చుక్కా శిల్పను జాతీయ భద్రతా సంస్థ (ఎన్ఐఏ) గురువారం అరెస్టు చేసింది. వారిలో శిల్ప హైకోర్టు న్యాయవాది. ఏపీలోని విశాఖపట్నంలో 2017 డిసెంబర్లో అదృశ్యమైన రాధ అనే నర్సింగ్ విద్యార్థిని కేసు దర్యాప్తులో భాగంగా ఎన్ఐఏ బృం దాలు సికింద్రాబాద్, రంగారెడ్డి, మెదక్ జిల్లాలో ఉన్న నిందితుల ఇళ్లపై ఏకకాలంలో దాడులు చేశాయి. దాదాపు 4 గంటలపాటు సోదాలు చేపట్టి కీలక పత్రాలు, డిజిటల్ పరికరాలు స్వాధీనం చేసుకున్నాయి. అనంతరం వారిని అరెస్టు చేశాయి. ఇదీ కేసు... పోలీసుల కథనం ప్రకారం కాప్రాలోని సాయిబాబా కాలనీకి చెందిన పల్లెపాటి పోచమ్మ చిన్న కుమార్తె రాధ నర్సింగ్ విద్యార్థిని. మావోయిస్టు పార్టీకి అనుబంధంగా పని చేస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న చైతన్య మహిళా సంఘం (సీఎంఎస్) నాయకులు డొంగరి దేవేంద్ర, దుబాసి స్వప్న, చుక్క శిల్ప తదితరులు తరచూ రాధను కలిసేవారు. 2017 డిసెంబర్లో రాధను కలిసిన దేవేంద్ర... కొందరికి వైద్యం చేయాల్సి ఉందంటూ బలవంతంగా ఆమెను తీసుకుకెళ్లాడు. అప్పటి నుంచి రాధ తిరిగి ఇంటికి చేరుకోలేదు. ఆమె కోసం పోచమ్మ అనేక ప్రాంతాల్లో గాలించి చివరకు తన కుమార్తె మావోయిస్టు పార్టీలో చేరిందని... విశాఖపట్నం జిల్లా పెద్దబయలు అటవీ ప్రాంతంలో అగ్రనేతలు ఉదయ్, అరుణలతో కలసి పనిచేస్తున్నట్లు తెలుసుకుంది. రాధ అదృశ్యంపై ఈ ఏడాది జనవరిలో విశాఖ జిల్లాలోని పెద్దబయలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. అదృశ్యమైన సమయంలో రాధ మైనర్ కావడంతో దీన్ని కిడ్నాప్ కేసుగా పోలీసులు నమోదు చేసుకున్నారు. బలహీన వర్గాల కేసులు వాదిస్తున్న శిల్ప... హైకోర్టు అడ్వొకేట్‌గా పని చేస్తున్న శిల్ప 6 నెలలుగా బోడుప్పల్‌లోని హేమానగర్లో భర్త కిరణ్, అత్త హేమతో కలసి అద్దెకు ఉంటోంది. పేద, బడుగు బలహీన వర్గాలకు చెందిన పలు కోర్టు కేసులను శిల్ప వాదిస్తోంది. కాగా, తన భార్యను ఎన్ఐఏ అక్రమంగా అరెస్టు చేసిందని శిల్ప భర్త కిరణ్ ఆరోపించారు. రంగంలోకి ఎన్ఐఏ... కేంద్ర హోంశాఖ ఆదేశాలతో ఈ కేసు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ)కు బదిలీ అయింది. దీంతో ఈ నెల 3న ఈ కేసును రీ–రిజిస్టర్ చేసిన ఎన్ఐఏ... సీఎంఎస్ నాయకులే కుట్రపూరితంగా రాధను మావోయిస్టు పార్టీలో చేర్చారని, అడవిలో ఆమెను నిర్బంధించి ఉంచారని ఆరోపించింది. మావోయిస్టు పార్టీ ఆంధ్రా–ఒడిశా బోర్డర్ స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి గాజర్ల రవి అలియాస్ ఉదయ్, అరుణ, దేవేంద్ర, స్వప్న, శిల్ప తదితరులను నిందితులుగా చేర్చింది. -
‘మూడు సబ్జెక్టుల్లో ఫెయిల్.. అమ్మా, నాన్నా క్షమించండి..’
తణుకు(పశ్చిమ గోదావరి): పరీక్షల్లో ఫెయిల్ అయ్యాను... అమ్మా, నాన్నా నన్ను క్షమించండి... నేను చనిపోతున్నాను అంటూ నర్సింగ్ విద్యార్థిని సూసైడ్ నోట్ రాసి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన సోమవారం తణుకు పట్టణంలో చోటు చేసుకుంది. పట్టణంలోని ఆపిల్ ఆసుపత్రికి అనుబంధంగా కొనసాగుతున్న నర్సింగ్ కళాశాలలో రెండో సంవత్సరం చదువుతున్న మాత్రపు షారోన్ కుమారి (21) సోమవారం మధ్యాహ్నం ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఆసుపత్రి మూడో అంతస్తు హాస్టల్ గదిలో ఎవరూ లేని సమయంలో ఆత్మహత్య చేసుకుంది. చదవండి👉: బాలిక అదృశ్యం.. పాపం ఏమైందో? భీమడోలు మండలం పూళ్ల గ్రామానికి చెందిన షారోన్‌కుమారి మొదటి సంవత్సరం పరీక్ష ఫలితాలు ఇటీవల విడుదలయ్యాయి. మూడు సబ్జెక్టుల్లో ఫెయిల్ అయ్యింది. మనస్తాపం చెందిన ఆమె ఇటీవల స్వగ్రామం వెళ్లి తిరిగి హాస్టల్‌కు చేరుకుంది. సోమవారం తోటి విద్యార్థులంతా తరగతులకు వెళ్లారు. తనకు ఆరోగ్యం బాగాలేదని చెప్పి ఆమె హాస్టల్ గదిలోనే ఉండిపోయింది. మధ్యాహ్నం సమయంలో స్వీపర్ వచ్చి చూసి ఆత్మహత్య చేసుకున్నట్లు గుర్తించి యాజమాన్యానికి సమాచారం అందించారు. తణుకు సీఐ సీహెచ్ ఆంజనేయులు, ఎస్సై ఎం.వీరబాబు సంఘటనా స్థలానికి చేరుకుని మృతురాలి బంధువులు, ఆసుపత్రి యాజమాన్యం నుంచి వివరాలు సేకరించారు. సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
కట్నంతో లాభాలెన్నో!
ముంబై: వరకట్నంతో చాలా ప్రయోజనాలున్నాయంటూ పలు ఉదాహరణలను పేర్కొన్న బీఎస్సీ నర్సింగ్ రెండో ఏడాది పాఠ్యపుస్తకం ఉదంతం తీవ్ర చర్చనీయాంశమైంది. టీకే ఇంద్రాణి రచించిన సోషియాలజీ ఫర్ నర్సింగ్ పుస్తకంలోని ఒక పేరాలో పేర్కొన్న అంశాలను నెటిజన్లు తీవ్రంగా తప్పుబట్టారు. ఆ పేజీ ప్రస్తుతం మీడియాలో చక్కర్లు కొడుతోంది. ‘ ఇంట్లోకి కొత్త కుటుంబసభ్యురాలిగా అడుగుపెట్టేందుకు వరకట్నం ఎంతగానో సాయపడుతుంది. ఇంట్లోకి సమస్త సామగ్రి, వాహనాలు ఇలా అన్నీ కట్నం రూపంలో వచ్చిపడతాయి. అమ్మాయి తన తల్లిదండ్రుల ఆస్తిలో భాగాన్ని ఇలా కట్నంరూపంలో అత్తవారింటికి తెచ్చుకోవచ్చు. కట్నాలు ఇచ్చే స్తోమత లేకే కొందరు తల్లిదండ్రులు అమ్మాయిలను ఉన్నత చదువులు చదివిస్తున్నారు. వారు చదివి, ఉద్యోగం సంపాదిస్తే కట్నం డిమాండ్ తగ్గుతుంది. ఇదొక మంచి ప్రయోజనం. అందవిహీన అమ్మాయిలకు మంచి/అందవిహీన అబ్బాయిలతో పెళ్లి అవ్వాలంటే కట్నం ముట్టజెప్పాల్సిందే’ అంటూ పలు వ్యాఖ్యానాలు ఆ పుస్తకంలో ఉన్నాయి. ఇలాంటి పాఠ్యపుస్తకాలు ఉండటం మన భారతజాతికే సిగ్గుచేటు’ అంటూ శివసేన మహిళా ఎంపీ ప్రియాంకా చతుర్వేది ఆగ్రహం వ్యక్తంచేశారు. పాఠ్య ప్రణాళిక నుంచి వెంటనే ఈ పుస్తకాన్ని తొలగించి, సంబంధికులపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కు ఆమె లేఖ రాశారు. -
నర్సింగ్ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం.. తల్లికి వీడియో కాల్ చేసి..
సాక్షి, వరంగల్: హన్మకొండలో నర్సింగ్ స్టూడెంట్ రవళి ఆత్మహత్యాయత్నం కలకలం సృష్టించింది. రోహిణి నర్సింగ్ కళాశాల హాస్టల్లో బీఎస్పీ నర్సింగ్ సెకండియర్ చదువుతున్న కుందారపు రవళి ఉరివేసుకుని ఆత్మహత్యకు యత్నించింది. ఆత్మహత్యకు ముందు భీమదేవరపల్లి మండలం ములకనూరులో నివాసముండే తల్లికి వీడియో కాల్ చేసి ఆత్మహత్య చేసుకుంటున్నట్లు తెలిపింది. కంగారుపడ్డ తల్లి వారించే లోగానే రవళి ప్యాన్‌కు ఉరి వేసుకుంది. వెంటనే హాస్టల్లో ఉండే తోటి విద్యార్థులు, హాస్టల్ నిర్వాహకులు అప్రమత్తమై రవళిని రోహిణి ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రవళిని చూసేందుకు కుటుంబ సభ్యులను అనుమతించకపోవడంతో బంధువులు ఆందోళనకు దిగారు. ఆత్మహత్యాయత్నానికి గల కారణాలు స్పష్టంగా తెలియకపోయినప్పటికీ విద్యార్థులు, బంధువులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగారు. ఆత్మహత్యాయత్నానికి నర్సింగ్ కాలేజీ యాజమాన్యమే కారణమంటూ ఆస్పత్రి ముందు బైఠాయించారు. చదవండి: (వివాహేతర సంబంధం: ఆమె ఫోటో, నంబర్ సంపాదించి..) -
మనీషాయే దిక్కు.. ‘తమిళనాడు థెరిస్సా’
దిక్కు లేని వారికి దేవుడే ఏదో ఒక దిక్కు చూపిస్తాడు. తమిళనాడులో అయితే ఆ దిక్కును ‘మనీషా’ పేరుతో పిలుస్తారు. 24 ఏళ్ల మనీషా ఈరోడ్‌లో నర్సింగ్ కాలేజీలో పాఠాలు చెబుతుంది. కాని ఆ కాసేపు మినహాయిస్తే తక్కిన సమయమంతా దీనులకు ఆమె అమ్మగా మారుతుంది. మతిస్తిమితం తప్పి వీధుల్లో ఉన్నవారిని మామూలు మనిషిని చేసే వరకూ ఆమె విశ్రమించదు. దూరం నుంచి దానం అందరూ చేస్తారు. దగ్గరి నుంచి సేవ చేసే మనీషి మనీషా. మనీషా చిన్నప్పుడు చెన్నైలో తన తండ్రితో పాటు కలిసి తండ్రి నడిపే మటన్షాప్కు వెళ్లేది. నాలుగు రోజులు వెళ్లాక తండ్రి ఎంత కష్టంగా సంపాదన చేస్తున్నాడో, ఎంత కష్టంగా పేదరికంలో తాము బతకాల్సి వస్తోందో ఆమెకు అర్థమైంది. మూడు పూట్ల అంతో ఇంతో తినడానికి ఉన్న తమ పరిస్థితి ఇలా ఉంటే రోడ్డు మీద ఏ దిక్కూ లేకుండా తిరిగే దౌర్భాగ్యుల పరిస్థితి ఏమిటి అని ఆ వయసులో ఆమెకు అనిపించేది. ఎందుకంటే షాపులో ఉన్నంత సేపు పిచ్చివాళ్లో, దిక్కులేని వాళ్లో కనిపిస్తూనే ఉండేవారు. పెద్దయ్యాక అయినా వారి కోసం ఏమైనా చేయగలనా అనుకునేది మనీషా. డాక్టర్ అవ్వాలని బాగా చదివి డాక్టర్ అవ్వాలని అనుకునేది మనీషా. కాని అంత డబ్బు లేదు. అందుకు ప్రిపేర్ అయ్యేందుకు కూడా డబ్బు లేదు. సైన్యంలో చేరి దేశం కోసం పని చేయాలనుకుంది. కాని ఆడపిల్లను పంపడానికి తల్లిదండ్రులు, బంధువులు ఎన్నో విధాలుగా సంశయించారు. అందుకని నర్సింగ్ కోర్స్ చదివి ఈరోడ్‌లో లెక్చరర్ అయ్యింది మనీషా. డాక్టర్‌గా చేయాల్సిన సమాజ సేవ, సైనికురాలిగా చేయాల్సిన దేశ సేవ రెండూ ఒక సామాజిక కార్యకర్తగా చేయాలని నిశ్చయించుకుంది. 2018లో ఒక న్యూస్పేపర్లో ఆమె తంజావూరులో ఒక దీనుడి ఫొటో చూసింది. ఎవరూ పట్టించుకోక ఆ దీనుడు ఆకలితో అలమటిస్తున్నాడని ఆ ఫొటో సారాంశం. వెంటనే మనీషా ఆ ఫొటోను ఫేస్బుక్లో పెట్టి అందరి సాయం కోరింది. తంజావూరు వెళ్లి మరీ ఆ దీనుడి షెల్టర్‌కు చేర్చడంలో సాయపడింది. అలా ఆమె పని మొదలయ్యింది. ఇలాంటి వారు కావాలి డబ్బు సాయం చేయమంటే చేసేవారు చాలామంది ఉంటారు. కాని ప్రత్యక్షంగా సేవ చేయమంటే వెనుకాడుతారు. కాని మనీష తానే స్వయంగా సేవ చేస్తుంది. పిల్లలు బాగా మురికి పడితే కన్న తల్లే విసుక్కుంటుంది. కాని సంవత్సరాల తరబడి స్నానపానాలు లేకుండా శుభ్రత లేకుండా తిరిగే పిచ్చివాళ్లకు, డ్రగ్ అడిక్ట్స్‌కు, అనాథలకు, ఇళ్ల నుంచి పారిపోయిన వారికి తానే స్వయంగా సేవ చేస్తుంది మనీషా. వారికి క్షవరం చేస్తుంది. స్నానం చేసేలా చూస్తుంది. బట్టలు ఇస్తుంది. వారి షెల్టర్ కోసం ప్రయత్నిస్తుంది. ఈరోడ్ చుట్టుపక్కల ప్రాంతాల్లోని నిరాశ్రయులకు ఆశ్రయం కల్పిస్తూ ఆదుకుంటోంది. వీరిలో ఎవరైనా పనిచేసి సంపాదించే సత్తా ఉన్నవారికి వివిధ నైపుణ్యాలలో శిక్షణ ఇప్పించి ఉపాధి మార్గాలను చూపుతోంది. జీవితం ఫౌండేషన్ తాను సంపాదించే దాంట్లో తన ఖర్చులకు పోగా మిగిలిందంతా ఊరి దిమ్మరుల కోసం ఖర్చు చేస్తుంది మనీష. కాని అది చాలదు. సమాజం ఆసరాతో ఈ పని చేయాలని ‘జీవితం ఫౌండేషన్’ పేరుతో ఒక సంస్థను ప్రారంభించింది. దాదాపు 500 మంది దిమ్మరులకు స్వస్థత, భద్రత, భరోసా కలిగించడంలో కృషి చేసింది. ఆమెతో పాటు అలాంటి స్ఫూర్తి ఉన్న యువతరం కూడా తోడయ్యింది. వీరంతా ఒక టీమ్‌గా పని చేస్తూ దీన బాంధవులుగా మారారు. ముఖ్యంగా కరోనా సమయంలో మనీష ఒక గొప్ప మానవిగా మారింది. ఆ సమయంలో అన్నీ మూతపడగా ఈరోడ్ చుట్టుపక్కల కొత్తగా వచ్చే లేదా ముందు నుంచి ఉన్న దిమ్మరులకు అన్నమే లేకుండా పోయింది. వారికి నిలువ నీడ లేదన్న సంగతి కూడా కనిపెట్టింది. వెంటనే ఆమె ఈరోడ్ కమిషనర్ని కలిసి ఒక స్కూల్‌ను టెంపరరీ షెల్టర్‌గా అడిగింది. వెంటనే కమిషనర్ అందుకు అంగీకరించాడు. మనీష ఆ ఇరుగు పొరుగు వారికి వంట చేయమని దినుసులు సరఫరా చేసింది. ఊళ్లో ఉన్న దాదాపు 80 మంది అభాగ్యులను ఆ స్కూల్లో ఉండేలా చూసింది. వారికి మాస్కులు, శానిటైజర్లు, రేషన్, మూడుపూటల భోజనాన్ని అందించింది. వ్యాయామం చేయించి ఆరోగ్యాన్ని మెరుగుపరచడమేగాక, కొంతమందికి వొకేషనల్ ట్రైనింగ్ ఇప్పించి 54 మందికి ఉపాధి కల్పించింది. మరికొంత మందిని వృద్ధాశ్రమాలకు, కుటుంబాల ఆచూకి తెలిసిన వారిని, కుటుంబ సభ్యులకు అప్పచెప్పింది. మైనర్లకు అరిక ప్లేట్లు, గ్లాసులు తయారు చేసే మెషిన్లను అందించి వారికి ఉపాధి కల్పించింది. మనిషి బాధ్యత ‘ఎదుటివారి కష్టానికి స్పందించడం మనిషి కనీస బాధ్యత. మన దేశంలో ఎందరో ఎన్నో కారణాల రీత్యా రోడ్డు మీదే బతుకుతుంటారు. వారి గోడు ఎవరూ పట్టించుకోరు. వారి వేదన ప్రభుత్వాలకు అర్థం కాదు. కాని వారిని అక్కున జేర్చుకుని మనుషులుగా చేసే ప్రయత్నం చేసినప్పుడు వారి ముఖాల్లో కూడా చిరునవ్వు వెలుగుతుంది. అలాంటి చిరునవ్వు నాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది. నేను నా జీవితం అంతా ఆ పనికి వెచ్చిస్తాను. పిల్లలు గెంటేసిన వృద్ధులు, డ్రగ్స్ బానిసలైన యువకులు, వీధి బాలలు... వీరందరి కోసం ఒక సొంత షెల్టర్ కట్టాలని నా కోరిక. ఏదో ఒకరోజు దానిని సాధిస్తాను. ఈలోపు సమాజంలోని మంచి మనసున్న వారితో ఈ సహాయాన్ని కొనసాగిస్తాను’ అంటోంది మనీషా. భవిష్యత్తులో ఆమెను జనం తమిళనాడు థెరిస్సా అని పిలిచినా ఆశ్చర్యం లేదు. -
ఏమైందో తెలియదు.. తరగతి గది నుంచి బయటకి వచ్చి..
కాకినాడ క్రైం: ఓ నర్సింగ్ విద్యార్థిని సోమవారం కాకినాడలో ఆత్మహత్యకు పాల్పడింది. ప్రతాప్‌నగర్ నర్సింగ్ కళాశాలలో చదువుతున్న 18 ఏళ్ల దిడ్ల ఉమామహేశ్వరిది కపిలేశ్వరపురం మండలం టేకి గ్రామం. ఈ నెల 23న జీఎన్ఎం మొదటి సంవత్సరంలో చేరింది. సోమవారం స్నేహితులతో కలిసి తరగతులకు హాజరై ఉదయం 11.40 సమయంలో తరగతి గది నుంచి బయటకి వచ్చింది. నేరుగా తన గదిలోకి వెళ్లి చున్నీతో ఫ్యానుకు ఉరేసుకుంది. జ్వరం వచ్చి తరగతులకు వెళ్లకుండా పక్కగదిలో విశ్రాంతి తీసుకుంటున్న ఓ విద్యార్థిని ఈ విషయాన్ని గమనించింది. వెంటనే కళాశాల ప్రిన్సిపాల్‌కు తెలిపింది. ప్రిన్సిపాల్ సమాచారంతో ఘటనా స్థలికి చేరుకున్న టూ టౌన్ పోలీసులు విద్యార్థిని మృతదేహాన్ని పరిశీలించారు. టేకి గ్రామానికి చెందిన శ్రీనివాస్‌రావు, విజయలక్ష్మి దంపతులకు ఉమామహేశ్వరి రెండవ సంతానం, నిరుపేద రైతు కూలీ కుటుంబానికి చెందిన ఈమె ఇంటర్మీడియెట్ కాకినాడలోని ఎస్సీ హాస్టల్లో ఉండి చదువుకుంది. ఉమామహేశ్వరి సున్నిత మనస్కురాలని తోటి విద్యార్థులు, బంధువులు పోలీసులకు తెలిపారు. విగత జీవిగా పడున్న కుమార్తెను చూసి తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. మృతదేహాన్ని జీజీహెచ్‌లోని మార్చురీకి తరలించినట్టు సీఐ ఈశ్వరుడు తెలిపారు. బలవన్మరణానికి కారణాలు తెలియలేదన్నారు. దర్యాప్తు ప్రారంభించామన్నారు. ఇవీ చదవండి: ప్రియుడి ఘాతుకం: నడిరోడ్డుపై యువతి దారుణ హత్య త్వరలో 1,180 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు -
ఒకే చిత్రాన్ని.. ఒకేసారి చేతులు, కాళ్లు, నోటితో భిన్న శైలీలో
తిరువనంతపురం: మహభారతంలో అర్జునుడికి గొప్ప ప్రత్యేకత ఉంది. అదేంటంటే.. ఒకేసారి తన రెండు చేతులను ఉపయోగించి శత్రువులపై బాణాలను వేయగలడు. అందుకే, ఈయనకు సవ్యాసాచి మరొక పేరుతో పిలుస్తారు. అయితే, ఇక్కడ కొందరు రెండు చేతులతో ఒకేసారి రాయడం.. కాలి వేళ్లతో, నోటితో బొమ్మలు గీయడం వంటి కళలో నిష్ణాతులని మనకు తెలిసిందే. ఇక్కడ గొప్పతనం ఏంటంటే.. ఈ యువతి, ఒకేసారి తన రెండు చేతులను, కాళ్లను, నోటిని కూడా ఉపయోగించి బొమ్మలు గీయగలదు. దీంతో ప్రస్తుతం ఈ యువతి వార్తల్లో నిలిచింది. వివరాలు.. కేరళలోని త్రిషుర్కు చెందిన దివ్య అనే యువతి నర్సింగ్ మూడో సంవత్సరం చదువుతుంది. ఆమె గత సంవత్సరం నుంచి లాక్డౌన్ కారణంగా ఇంట్లోనే ఉంటూ ఆన్లైన్ క్లాస్‌లలో చదువుకుంటుంది. ఈ క్రమంలో ఖాళీ సమయంలో ఏదైనా కొత్తగా చేయాలనుకుంది. ఈ క్రమంలో ఆమె క్యారికేచర్ (వ్యంగ్య బొమ్మలు గీయడం)పై ఆసక్తి పెంచుకుంది. మొదట ఆ యువతి తన కుడిచేత్తో బొమ్మలను గీయడాన్ని నేర్చుకుంది. మెల్లగా దానిలో నైపుణ్యం సాధించింది. అయితే, ఆ తర్వాత ఎడమ చేత్తో కూడా బొమ్మలు గీయటాన్ని ప్రాక్టిస్ చేయడం ప్రారంభించింది. కొన్ని రోజుల తర్వాత ఎడమ చేతితో కూడా చాలా బాగా బొమ్మలు గీయసాగింది. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. దీనికోసం నా తల్లిదండ్రులు ఎంతగానో ప్రోత్సాహం అందించారని తెలిపింది. కొన్ని రోజులకి నాకు ఒక ఐడియా వచ్చింది.. కాళ్లతో, నోటితో ఎందుకు ప్రయత్నించోద్దు అనుకుని.. వెంటనే దాన్ని అమలులోకి పెట్టేశానని తెలియజేసింది. కొన్ని రోజుల కఠోర శ్రమ తర్వాత .. ఈ నైపుణ్యాన్ని కూడా తన సొంతం చేసుకున్నట్లు వివరించింది. కాగా, ఒకేసారి రెండు చేతులు, కాళ్లు, నోటిని ఉపయోగించి ఒకే చిత్రాన్ని విభిన్న శైలీలో గీస్తానని తెలిపింది. అయితే, తొలిసారి గీసిన వ్యంగ్య చిత్రానికి కేరళ నటుడు జయసూర్య ప్రశంసలు కురిపించారని తెలియజేసింది. తనకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారని తెలియజేసింది. ఈ ప్రశంస నాలోపల మరింత మనోధైర్యాన్ని, ఉత్సాహన్ని రెట్టింపు చేసిందని తెలిపింది. ఈ సందర్బంగా దీని తర్వాత ఎవరి చిత్రాన్ని గీస్తారని ప్రశ్నించగా.. వెంటనే మళయాళ సూపర్ స్టార్ మమ్ముట్టీ చిత్రాన్ని గీస్తానని తెలిపింది. అయితే, మొదట్లో తనకు ఈ బొమ్మలు గీయడానికి ఆరు గంటల సమయం పట్టేదని, ఇప్పుడు నాలుగు గంటలు మాత్రమే పడుతుందని దివ్య తెలియజేసింది. చదవండి: ఆమె ఆరోగ్యం బాగు చేయడానికి ఆ దేవుడే ఇలా వచ్చాడేమో! -
సీతానగరం ఘటనలో మృగాళ్ల గుర్తింపు
తాడేపల్లి రూరల్/గుంటూరు ఈస్ట్: ప్రేమికుడి కాళ్లు, చేతుల్ని కట్టేసి.. కదిలితే పీక కోస్తామని బెదిరించి.. అతడి కళ్లెదుటే నర్సింగ్ విద్యార్థినిపై అకృత్యానికి తెగబడిన మృగాళ్లు ఎవరనేది పోలీసులు గుర్తించారు. పరారీలో ఉన్న నిందితులు షేర్ కృష్ణ, వెంకటేష్‌లను పట్టుకునేందుకు ఆరు ప్రత్యేక బృందాలు అన్వేషిస్తున్నాయి. ఈ నెల 19న గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం సీతానగరం పుష్కర ఘాట్ సమీపంలో కృష్ణా నది ఒడ్డున ప్రేమ జంటపై ఇద్దరు దుండగులు దాడి చేసి యువతిపై అత్యాచారానికి ఒడిగట్టిన విషయం విదితమే. విజయవాడ గాంధీనగర్‌లోని ఓ పెట్రోల్ బంక్‌లో పనిచేస్తున్న యువకుడు, ఓ నర్సింగ్ విద్యార్థిని కొంతకాలంగా ప్రేమించుకుంటుండగా.. వారి ప్రేమను అంగీకరించిన పెద్దలు వివాహం చేయాలని నిశ్చయించారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో వివాహం వాయిదా పడగా.. ఆ జంట ఏకాంతంగా మాట్లాడుకునేందుకు కృష్ణా నది ఒడ్డున రైల్వే బ్రిడ్జి వద్ద గల పుష్కర ఘాట్‌కు వెళ్లగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. కీలక ఆధారాల సేకరణ కేసు దర్యాప్తులో పోలీసులు కీలక ఆధారాలు సేకరించారు. నిందితులిద్దరూ పాత నేరస్తులేనని గుర్తించారు. వారిలో ఒక యువకుడు ప్రకాశం జిల్లా చినగంజాం నుంచి వచ్చి తాడేపల్లిలోని మహానాడు ప్రాంతంలో కొంతకాలంగా నివాసం ఉంటున్నట్టు సమాచారం. మరో యువకుడి స్వస్థలం తాడేపల్లి. బోసు బొమ్మ సెంటర్ సమీపంలోనే అతడు నివాసం ఉంటున్నట్టు తెలిసింది. రైల్వే ట్రాక్‌ను అడ్డాగా చేసుకుని వారిద్దరూ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్టు తెలిసింది. రైల్వే ట్రాక్‌ల వెంబడి తిరుగుతూ సీతానగరం బ్రిడ్జి వద్ద రైలు ఆగి.. తిరిగి బయలుదేరే సమయంలో ఆ యువకులిద్దరూ రైలు బోగీల్లోని తలుపులు, కిటీకీల వద్ద కూర్చునే ప్రయాణికుల నుంచి సెల్ఫోన్లు, మెడలోని గొలుసుల్ని లాఘవంగా తస్కరించి ఉడాయిస్తుంటారు. వాటిని తాకట్టు పెట్టగా.. లేదా విక్రయించగా వచ్చే డబ్బుతో మద్యం, గంజాయి తాగుతుంటారని సమాచారం. వారిద్దరూ రైల్వే ట్రాక్ వెంబడి ఎంత దూరమైనా నడుచుకుంటూ వెళతారని, ఏదైనా పెద్ద నేరం చేసినప్పుడు రెండు మూడు నెలల వరకు కనిపించరని స్థానికులు చెబుతున్నారు. కేసులో అనుమానితులు షేర్ కృష్ణ, వెంకటేశ్ విక్రయించిన సెల్‌ఫోన్ ఆధారంగా... అత్యాచారానికి పాల్పడిన తరువాత నిందితులిద్దరూ పడవలో కృష్ణా నది మీదుగా విజయవాడ వైపు చేరి అక్కడి నుండి రైల్వే ట్రాక్ మీదుగా తాడేపల్లి బోసుబొమ్మ సెంటర్‌కు చేరుకున్నట్టు గుర్తించారు. అక్కడ కోర్టు వేలంలో ఉన్న ఓ భవనంలో తలదాచుకున్నట్టు సమాచారం. అనంతరం బకింగ్‌హామ్ కెనాల్‌పై గల రైల్వే బ్రిడ్జిపై మీదుగా చెన్నై రూట్లోని ట్రాక్ మీదుగా నడుచుకుంటూ వెళ్లినట్టు విశ్వసనీయ సమాచారం. రైల్వే పోలీసులు వీరువురినీ వెంబడించడంతో పరారాయ్యరు. తాడేపల్లిలోని బోసుబొమ్మ సెంటర్లో టైలరింగ్ చేసే ఓ మహిళ వద్ద వారు ఓ ఫోన్ తాకట్టు పెట్టినట్టు సమాచారం అందడంతో పోలీసులు ఆమెను విచారించారు. ఆమె ఆ ఫోన్‌ను పోలీసులకు అప్పగించింది. కానీ ఆ ఫోన్ అత్యాచారానికి గురైన యువతిది కాదని తేలింది. కాగా.. అదే ప్రాంతంలో నివసిస్తున్న తాపీమేస్త్రి కుటుంబానికి నిందితులు రెండు ఫోన్లు విక్రయించినట్టు తెలుసుకున్న పోలీసులు ఆ కుటుంబం నుంచి వాటిని స్వాధీనం చేసుకున్నారు. అవి తమ ఫోన్లేనని అత్యాచారానికి గురైన యువతి, ఆమె ప్రియుడు గుర్తించారు. దాంతో ఆ ఇద్దరు యువకులే ఈ దురాగతానికి పాల్పడినట్టు పోలీసులు నిర్థారణకు వచ్చారు. వారిలో ఓ యువకుడు ఈ నెల 17న రోడ్డుపై మద్యం సేవిస్తూ గొడవ చేయగా.. తాడేపల్లి పోలీసులు అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో బుద్ధిచెప్పి విడిచిపెట్టినట్టు కూడా తెలిసింది. పలు ప్రాంతాల్లో విస్తృత తనిఖీలు నిందితులిద్దరి కోసం పోలీసులు ఆరు ప్రత్యేక బృందాలతో విస్తృతంగా గాలిస్తున్నారు. ఓ నిందితుడి స్వస్థలం చినగంజాం పరిసర ప్రాంతాల్లో ప్రత్యేకంగా దృష్టిసారించారు. నిందితులు హైదరాబాద్‌కు పరారయ్యాయనే సమాచారంతో ఓ బృందాన్ని అక్కడికి పంపారు. కృష్ణా, విజయవాడ, ప్రకాశం జిల్లాల్లో రైల్వే స్టేషన్లు, రైల్వే గోడౌన్లు, రైల్వే ట్రాక్ వెంబడి నిర్జన ప్రదేశాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. నిందితులకు కఠిన శిక్షలు తప్పవు : హోం మంత్రి నర్సింగ్ విద్యార్థినిపై లైంగిక దాడికి పాల్పడిన నిందితులను పట్టుకుని కఠిన శిక్ష పడేలా ప్రభుత్వం చర్యలు చేపట్టిందని హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత చెప్పారు. గుంటూరు జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న బాధితురాలిని హోం మంత్రి మంగళవారం మరోసారి పరామర్శించారు. ఆమె కుటుంబానికి ప్రభుత్వం తరఫున రూ.5 లక్షల చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. నిందితుల్ని ఇప్పటివరకు పట్టుకోలేదంటూ ప్రతిపక్షాలు వ్యాఖ్యానించడం సరికాదన్నారు. ఎవరిని పడితే వారిని కేసుల్లో ఇరికించేందుకు ప్రభుత్వం సిద్ధంగా లేదని.. అసలైన నిందితుల్ని గుర్తించి కఠినంగా శిక్షించడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. బాధితురాలి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని చెప్పారు. మహిళల భద్రత విషయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చిత్తశుద్ధితో ఉన్నారన్నారు. మాదక ద్రవ్యాల వినియోగాన్ని నిరోధించడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని, అందుకోసం ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహిస్తున్నామని చెప్పారు. హోం మంత్రి వెంట కలెక్టర్ వివేక్ యాదవ్, ఎమ్మెల్యే ముస్తఫా, జాయింట్ కలెక్టర్ ప్రశాంతి, జీజీహెచ్ సూపరింటెండెంట్ ప్రభావతి ఉన్నారు. -
గుంటూరు: యువతి అత్యాచార కేసులో పురోగతి
సాక్షి, గుంటూరు: గుంటూరు జిల్లా యువతి అత్యాచారం కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఘటనకు సంబంధించి అనుమానితులను పోలీసులు విచారిస్తున్నారని హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత తెలిపారు. ఇప్పటికే పోలీసులు చాలా మందిని విచారించారని, ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారని పేర్కొన్నారు. బాధితురాలి స్టేట్మెంట్ కూడా రికార్డు చేస్తామని, దర్యాప్తు అనంతరం నిందితులను మీడియా ముందు ప్రవేశపెడతామని ఆమె పేర్కొన్నారు. కాగా గుంటూరు జిల్లా తాడేపల్లి రూరల్ మండలం సీతానగరం పుష్కర ఘాట్ సమీపంలో శనివారం రాత్రి(జూన్ 19) నర్సింగ్ విద్యార్థినిపై అత్యాచారం జరిగిన విషయం విదితమే. నిందితుల గొంతు విన్నా గుర్తు పడతానని బాధితురాలు చెబుతుండటంతో అనుమానితుల వాయిస్ బాధితురాలికి వినిపించి నిందితులను నిర్ధారణ చేసుకోవాల్సి ఉందని మంత్రి సుచరిత అన్నారు. ప్రతిపక్షాలు ఇప్పటివరకు నిందితులను పట్టుకోలేదని కామెంట్ చేస్తున్నాయని, తమ ప్రభుత్వం నిజమైన నిందితుల్ని పట్టుకొని కఠిన శిక్ష పడేలా చూస్తుందని స్పష్టం చేశారు. ఎవరిని పడితే వారిని అమాయకుల్ని కేసులో ఇరికించడానికి ప్రభుత్వం సిద్ధంగా లేదని అన్నారు. మహిళల భద్రతపై ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చిత్తశుద్ధితో ఉన్నారని పేర్కొన్నారు. ఇక ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గా స్పందించింది. అత్యాచార ఘటన తన మనసును కలచివేసిందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు భవిష్యత్తులో ఎక్కడా జరగకూడదన్నారు. డీజీపీ గౌతమ్ సవాంగ్‌ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం తన క్యాంప్ కార్యాలయానికి పిలిపించుకుని ఘటనపై ఆరా తీశారు. నిందితులు ఎంతటి వారైనా సరే ఉపేక్షించకూడదని.. కేసు దర్యాప్తు కోసం ప్రత్యేక బృందాలను నియమించి దర్యాప్తు వేగవంతం చేయాలని ఆదేశించారు. మరోవైపు బాధితురాలిని పరామర్శించి ప్రభుత్వం తరఫున భరోసా ఇవ్వాలని రాష్ట్ర హోం మంత్రి మేకతోటి సుచరితను, స్త్రీ శిశు సంక్షేమ శాఖ తానేటి వనితను ముఖ్యమంత్రి ఆదేశించారు. సీఎం ఆదేశాల మేరకు బాధితురాలికి ప్రభుత్వం తరఫున 5 లక్షల రూపాయల పరిహారం అందజేస్తున్నట్లు ఏపీ మంత్రులు సుచరిత, తానేటి వనిత ప్రకటించారు. చదవండి: అత్యాచార ఘటనపై సర్కారు సీరియస్ ఆ ఘటన నా మనసును కలచివేసింది: సీఎం జగన్ -
ఆ ఘటన నా మనసును కలచివేసింది: సీఎం జగన్
సాక్షి, తాడేపలి: ప్రకాశం బ్యారేజీ వద్ద నర్సింగ్ విద్యార్థినిపై జరిగిన అత్యాచార ఘటన తన మనసును కలచివేసిందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు భవిష్యత్తులో ఎక్కడా జరగకూడదన్నారు. మహిళలు అర్ధరాత్రి కూడా తిరగగలిగే పరిస్థితి ఉన్నప్పుడే.. నిజమైన స్వాతంత్ర్యం వచ్చినట్టు గట్టిగా నమ్మే వ్యక్తిని తానని సీఎం జగన్ స్పష్టం చేశారు. ఇక మీదట ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. మహిళల కోసం దిశ, అభయం యాప్‌లతో పాటు వారి రక్షణ కోసం దిశ చట్టం చేశాం అన్నారు సీఎం జగన్. మహిళల రక్షణకై దిశ పోలీస్స్టేషన్లు ఏర్పాటు చేశామని తెలిపారు. గ్రామ, వార్డు సచివాలయంలో మహిళా పోలీసులను నియమించాం.. మహిళల కోసం ప్రత్యేకంగా 900 మొబైల్ టీమ్స్ ఏర్పాటు చేశామని సీఎం జగన్ తెలిపారు. ఈ ఘటనను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. ఇప్పటికే డీజీపీ డి.గౌతం సవాంగ్‌ను సీఎం జగన్ సోమవారం తన క్యాంప్ కార్యాలయానికి పిలిపించుకుని ఘటనపై ఆరా తీశారు. నిందితులు ఎంతటి వారైనా సరే ఉపేక్షించకూడదని.. కేసు దర్యాప్తు కోసం ప్రత్యేక బృందాలను నియమించి దర్యాప్తు వేగవంతం చేయాలని ఆదేశించారు. చదవండి: అత్యాచార ఘటనపై సర్కారు సీరియస్ -
అత్యాచార ఘటనపై సర్కారు సీరియస్
సాక్షి, అమరావతి/తాడేపల్లి రూరల్/గుంటూరు ఈస్ట్: గుంటూరు జిల్లా తాడేపల్లి రూరల్ మండలం సీతానగరం పుష్కర ఘాట్ సమీపంలో శనివారం రాత్రి నర్సింగ్ విద్యార్థినిపై జరిగిన అత్యాచారం ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గా స్పందించింది. డీజీపీ డి.గౌతం సవాంగ్‌ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం తన క్యాంప్ కార్యాలయానికి పిలిపించుకుని ఘటనపై ఆరా తీశారు. నిందితులు ఎంతటి వారైనా సరే ఉపేక్షించకూడదని.. కేసు దర్యాప్తు కోసం ప్రత్యేక బృందాలను నియమించి దర్యాప్తు వేగవంతం చేయాలని ఆదేశించారు. మరోవైపు బాధితురాలిని పరామర్శించి ప్రభుత్వం తరఫున భరోసా ఇవ్వాలని రాష్ట్ర హోం మంత్రి మేకతోటి సుచరితను, స్త్రీ శిశు సంక్షేమ శాఖ తానేటి వనితను ముఖ్యమంత్రి ఆదేశించారు. ఇదిలావుండగా.. ఇప్పటికే పోలీస్ శాఖ ఆరు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపి దర్యాప్తును ముమ్మరం చేసింది. ఘటనపై డీజీపీ గౌతం సవాంగ్ స్పందిస్తూ.. అత్యాచారం చేసినవారు ఎంతటి వారైనా గుర్తించి కఠినంగా శిక్షిస్తామని ప్రకటించారు. ఇటువంటి అమానవీయ ఘటనలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. నిందితులకు కఠిన శిక్ష తప్పదు కేసులో నిందితులకు కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత స్పష్టం చేశారు. గుంటూరు జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న బాధితురాలిని సుచరిత, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత సోమవారం పరామర్శించారు. ప్రభుత్వం పూర్తి స్థాయిలో అండగా ఉంటుందని బాధితురాలికి, ఆమె కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారు. అనంతరం హోం మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. మహిళల భద్రత కోసం అనేక చట్టాలు చేస్తున్నా ఉన్మాదులు బరి తెగిస్తున్నారన్నారు. పుష్కర ఘాట్‌లో నిఘా పెంచుతున్నామని, అదనంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. తానేటి వనిత మాట్లాడుతూ బాధితురాలిని పరామర్శించి భరోసా ఇవ్వాల్సిందిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తమను పంపించారని తెలిపారు. బాధితురాలికి రూ.5 లక్షల ఆర్థిక సాయం అందించాల్సిందిగా ఆదేశించారన్నారు. తమ శాఖ నుంచి రూ.50 వేలు ఇస్తున్నట్టు చెప్పారు. ఇదిలావుండగా.. బాధితురాలిని మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ పరామర్శించారు. నిందితులను కఠినంగా శిక్షించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కేసు దర్యాప్తులో పురోగతి ఈ కేసు దర్యాప్తులో పోలీసులు పురోగతి సాధించారు. సోమవారం తాడేపల్లి పోలీస్ స్టేషన్లో గుంటూరు అర్బన్ ఎస్పీ ఆరిఫ్ హఫీజ్, అడిషనల్ ఎస్పీ ఈశ్వరరావు కలిసి కొంతమంది అనుమానితులను విచారించారు. అనంతరం అడిషనల్ ఎస్పీ ఈశ్వరరావు విలేకరులతో మాట్లాడుతూ.. ఇప్పటికే ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిందితుల కోసం అన్వేషణ ప్రారంభించామని చెప్పారు. తాడేపల్లి, మంగళగిరి, విజయవాడ కృష్ణలంక, రాణిగారితోట ప్రాంతాలకు చెందిన అనుమానితులను అదుపులోకి తీసుకుని పూర్తి విచారణ చేపట్టామన్నారు. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే కొంత సమాచారం వచ్చిందని, ఇందుకు కారణమైన ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసేంతవరకు వివరాలు వెల్లడించబోమని పేర్కొన్నారు. మరో 24 గంటల్లో కేసును పరిష్కరించే అవకాశం ఉందని చెప్పారు. కృష్ణా తీరంలో గతంలోనే ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని, 19న పోలీసులందరూ హడావుడిగా ఉండటంతో అక్కడ ఆ రోజు నిఘా కొరవడిందన్నారు. గత 15 రోజుల వ్యవధిలో కృష్ణా తీరంలో మద్యం, గంజాయి సేవిస్తున్న వారిపై 15 కేసులు నమోదు చేశామని చెప్పారు. పుష్కర ఘాట్‌లోకి రాత్రి 9 గంటల తరువాత ఎవరినీ అనుమతించేది లేదని స్పష్టం చేశారు. ఈ ప్రాంతం ఆహ్లాదకరమైనది కావడం, కృష్ణా నదిపై మూడు రైల్వే బ్రిడ్జిలు ఉండటం, నిర్జన ప్రదేశం కావడంతో అసాంఘిక శక్తుల కదలికలు ఎక్కువయ్యాయన్నారు. వారిని నివారించేందుకు రైల్వే పోలీసులతో సంయుక్త కార్యాచరణ రూపొందించి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. మహిళలు, యువతుల భద్రతకు సీఎం ఆదేశాలు నర్సింగ్ విద్యార్థినిపై అత్యాచారం ఘటన కేసులో దర్యాప్తు వేగవంతం చేసి నిందితులను గుర్తించాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారని డీజీపీ గౌతం సవాంగ్ తెలిపారు. దిశ చట్టంలో ప్రభుత్వం నిర్దేశించిన గడువులోగా నిందితులను గుర్తించి శిక్ష పడేట్టుగా చూడాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారని చెప్పారు. నిందితులు ఎంతటి వారైనా ఉపేక్షించకూడదని, ప్రత్యేక బృందాలను నియమించి దర్యాప్తు వేగవంతం చేయాలని ఆదేశాలిచ్చారని వివరించారు. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో కృష్ణా నది పరిసరాలతోపాటు రాష్ట్రవ్యాప్తంగా మహిళలు, యువతుల భద్రత కోసం కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారని చెప్పారు. అన్ని జిల్లాల ఎస్పీలను అప్రమత్తం చేయాలని, అరాచక శక్తుల పట్ల కఠినంగా వ్యవహరించాలని స్పష్టం చేశారని తెలిపారు. ఈ కేసును ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నానని.. నిందితులను త్వరలోనే గుర్తించి అరెస్ట్ చేస్తామని డీజీపీ చెప్పారు. పాత నేరస్తుల పనేనా! పోలీసులు అనుమానిస్తున్న ఇద్దరు వ్యక్తులూ తాడేపల్లి ప్రాంతానికి చెందిన వారేనని విశ్వసనీయ వర్గాల సమాచారం. లైంగిక దాడికి పాల్పడిన ఇద్దరు యువకులు బ్రిడ్జి వద్ద రైళ్లు ఆగి.. బయలుదేరే సమయంలో ప్రయాణికుల నుంచి సెల్ఫోన్లు, మెడలో చైన్లు లాక్కొని పరారయ్యే బృందంగా తెలియవచ్చింది. ఇందులో ఓ యువకుడికి పడవ నడిపే అనుభవం ఉంది. మరో యువకుడు రెండేళ్ల క్రితం ఓ హత్య కేసులో నిందితుడని సమాచారం. పడవ నడిపే అనుభవం ఉన్న వ్యక్తి బందరు బీచ్‌లో ప్రేమ జంటపై దాడి చేయగా అక్కడ కూడా కేసు నమోదైనట్టు చెబుతున్నారు. చదవండి: ప్రేమికుడిని బంధించి.. యువతిపై అత్యాచారం -
కరోనాను వ్యాప్తి చేస్తుందని నర్సింగ్ స్టూడెంట్‌పై కత్తితో దాడి
బెంగళూరు: కోవిడ్ విజృంభిస్తోన్న వేళ ఫ్రంట్‌లైన్ వారియర్స్ అయిన వైద్య సిబ్బంది తమ ప్రాణాలను పణంగా పెట్టి మరి సేవలు అందిస్తున్నారు. ఈ తరుణంలో వారి పట్ల కృతజ్ఞత చూపకపోయిన పర్వాలేదు కానీ అవమానించడం సమంజసం కాదు. కానీ చాలా చోట్ల జనాలు తమ చుట్ట పక్కల నివాసం ఉండే వైద్య సిబ్బందిని అవమానిస్తూ.. వారిపై దాడులకు కూడా వెనకాడటం లేదు. తాజాగా ఇలాంటి సంఘటన ఒకటి బెంగళూరులో చోటు చేసుకుంది. తమ ఇంటి పక్కన ఉండే నర్సింగ్ విద్యార్థిని వల్ల తమకు వైరస్ సోకిందని ఆరోపిస్తూ ముగ్గురు వ్యక్తులు ఆమెపై కత్తితో దాడి చేశారు. అంతటితో ఆగక ఆమె తండ్రిని బూతులు తిడుతూ.. అవమానించారు. ఆ వివరాలు.. బెంగళూరు ఇందిరానగర్ లక్ష్మీపురం ప్రాంతానికి చెందిన ప్రియదర్శి(20) నర్స్ ట్రైనింగ్ చేస్తుంది. ఈ క్రమంలో గతేడాది సెప్టెంబర్‌లో ఆమె తల్లి కోవిడ్ బారిన పడింది. ఆ తర్వాత వారి ఇంటి పక్కన నివాసం ఉండే ప్రభుకి గత నెలలో కోవిడ్ సోకింది. ఈ క్రమంలో ప్రభు, ప్రియదర్శి వల్లే తాను కోవిడ్ బారిన పడ్డానని ఆరోపించసాగాడు. ఆమె కుటుంబం వల్లనే తనకు కరోనా సోకిందని ఆరోపిస్తూ.. మూడు రోజుల క్రితం ప్రియదర్శి తండ్రితో గొడవకు దిగాడు. ఆ సమయంలో ప్రభు సోదరులు ఇద్దరు అతడితో కలిసి బాధితురాలి తండ్రిని బూతులు తిడుతూ.. అవమానించసాగారు. ఈ క్రమంలో ప్రియదర్శి వారిని వారించడం కోస ప్రయత్నించగా.. ప్రభు ఆమెపై కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో ప్రియదర్శి చెయ్యి తెగింది. దాంతో ఆమె వారిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ తర్వాత ఆస్పత్రికి వెళ్లింది. ఈ సందర్భంగా ప్రియదర్శి సోదరి సప్న మాట్లాడుతూ.. ‘‘ప్రభుకి కరోనా సోకిన నాటి నుంచి మమ్మల్ని శత్రువులుగా చూస్తున్నారు. మాపై ప్రతీకారం తీర్చుకుంటామని బెదిరిస్తున్నారు’’ అని తెలిపింది. ప్రియదర్శి ఫిర్యాదు మేరకు పోలీసులు ప్రభు, అతడి సోదరుల మీద కేసు నమోదు చేశారు. చదవండి: కుంభమేళా ఎఫెక్ట్: ఒక్కరి వల్ల 33 మందికి కోవిడ్ -
నర్సింగ్ విద్యార్థిని కిడ్నాప్: రూ. 2 కోట్లిస్తే వదిలేస్తాం
బనశంకరి: నర్సింగ్ విద్యార్థిని కిడ్నాప్ చేసి రూ.2 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేసిన నలుగురు కిడ్నాపర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. బాణసవాడి పోలీసులు ఏడు గంటల్లోనే కేసును ఛేదించారు. వివరాలు... నగరానికి చెందిన రబీజ్ అరాఫత్ యూకేలో నర్సింగ్‌లో ఎంఎస్ చదువుతున్నాడు. కొద్దికాలంగా అతను బెంగళూరులోనే ఉంటూ ఇంటి నుంచి ఆన్లైన్ క్లాసులు వింటున్నాడు. గురువారం మధ్యాహ్నం రబీజ్ మొబైల్‌కు ఫోన్ రావడంతో తన ద్విచక్ర వాహనంలో బయటకు వెళ్లాడు. ఈ సమయంలో కిడ్నాపర్లు అతడిని కారులో అపహరించుకుని పోయారు. అనంతరం అతని తండ్రికి ఫోన్ చేసి కిడ్నాప్ సమాచారం ఇచ్చారు. దీంతో ఆయన కుమారుడి సెల్‌కు ఫోన్ చేస్తే స్విచాఫ్ వచ్చింది. వెంటనే కేజీ హళ్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఏడు గంటల్లోనే పట్టబడ్డారు.. డీసీపీ శరణప్ప బాణసవాడి, ఏసీపీ సక్రి నేతృత్వంలో ఐదు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. సీసీ కెమెరాల ఆధారంగా జల్లెడ పట్టాయి. ఏడు గంటల్లోనే కిడ్నాపర్లను పోలీసులు అరెస్ట్ చేసి యువకుడిని రక్షించారు. అప్పులు తీర్చడానికి కిడ్నాప్ పథకం అప్పులు తీర్చడానికి నిందితులు అబ్దుల్ పహాద్, జబీవుల్లా, సయ్యద్‌సల్మాన్, తౌహిద్‌లు మరికొందరితో కలిసి కిడ్నాప్ పథకం వేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో నగరంలో శ్రీమంతుల గురించి ఆరా తీశారు. రబీజ్ అరాఫత్ వివరాలు సేకరించి కిడ్నాప్ చేయడానికి పథకం వేశారు. అంతకు ముందే ఓ కారును కొనుగోలు చేశారు. పథకం ప్రకారం రబీజ్‌ను బయటకు రప్పించి కిడ్నాప్ చేశారు. అన్నిదారులు దిగ్బంధం చేయడంతో కిడ్నాపర్లు సులువుగా దొరికిపోయారు. కిడ్నాప్ సూత్రధారి అబ్దుల్ పహాద్‌పై గతంలో కూడా కేజీహళ్లి పోలీస్ స్టేషన్లో కిడ్నాప్ కేసు నమోదైంది. చదవండి: ప్లీజ్ డాడీ.. అమ్మను ఏం చేయొద్దు -
ధన్యవాదాలు వర్ఘీస్
తల్లి కువైట్‌లో ఉంది. తండ్రి ఇండియాలో ఉన్నాడు. షరాన్ వర్ఘీస్ ఆస్ట్రేలియాలో ఉంది. కరోనా అంతటా ఉంది. తల్లి నర్సు. కూతురు నర్సింగ్ డిగ్రీ పూర్తయింది. ‘‘అమ్మా.. ఏం చేయమంటావ్’’ అని అడిగింది. ‘‘నీ ఇష్టం.. నేనైతే వదిలి రాలేను’’ అంది. ఆమె వదిలి రాలేనన్నది కువైట్‌లోని కరోనా రోగులను. కూతురు కూడా ఆస్ట్రేలియాను వదల్లేదు. వృద్ధులకు సేవ చేస్తూ అక్కడే ఉండిపోయింది. ఈ యువ నర్సుకు గిల్‌క్రీస్ట్ ధన్యవాదాలు తెలిపాడు. షరాన్, ఆడమ్ గిల్‌క్రీస్ట్ షరాన్ వర్ఘీస్ బియస్సీ నర్సింగ్ పూర్తి చేసి యూనివర్సిటీ బయటికి అడుగు పెట్టే వేళకు కరోనా ఆస్ట్రేలియా వరకు వచ్చేసింది. వచ్చేసింది కానీ, మరికొంతకాలమైనా ఉండకుండా పోయేది కాదని అప్పటికెవరికీ తెలీదు. షరాన్ నర్సుగా అక్కడే తన పేరు నమోదు చేసుకుని ఉంది. తొలి ఉద్యోగాన్ని ఏదైనా పెద్ద ఆసుపత్రిలో వెతుక్కోవడమే మిగిలింది. ఆ సమయంలో ఆస్ట్రేలియా నుంచి విదేశీయుల తిరుగు ప్రయాణాలు మొదలయ్యాయి! కరోనా భయంతో అంతా విమానాశ్రయాలకు చేరుకుంటున్నారు. షరాన్ సందిగ్ధంలో పడింది. కేరళలో తనకు మంచి ఉద్యోగం దొరక్కపోదు. వెళ్లడమా? ఉండటమా? ‘‘అమ్మా... ఏం చేయమంటావ్?’ అని కువైట్‌లో ఉన్న తల్లికి ఫోన్ చేసింది. ఆమె కూడా నర్సే. కువైట్‌లో చేస్తున్నారు. ‘‘నేను ఇక్కడే ఉండిపోతాను. వీళ్లనిలా వదిలేసి రాలేదు’’ అన్నారు ఆవిడ! అది మనసులో పడిపోయింది షరాన్‌కు. తనూ ఆస్ట్రేలియాలోనే ఉండిపోదలచుకుంది. అయితే ఆసుపత్రిలో కాకుండా వృద్ధులకు మాత్రమే వైద్యసేవలు (జెరియాట్రిక్) అందించే ఆరోగ్య కేంద్రంలో చేరింది. ఆస్ట్రేలియాలో 60 ఏళ్లు పైబడిన వారి జనాభా ఎక్కువ. వారికి సేవలు అందించడానికి అందుబాటులో ఉండే నర్సుల సంఖ్య తక్కువ. అందుకే షరాన్ జెరియాట్రిక్ నర్స్ అయింది. అప్పటికి కరోనా కూడా ఆస్ట్రేలియా అంతటికీ విస్తరించింది. కరోనా నుంచి వృద్ధులను కాపాడటం అంటే ఒళ్లంతా హూనం చేసుకోవడం మాత్రమే కాదు. ఒళ్లంతా కళ్లు చేసుకోవడం కూడా. ∙∙ రోజుకు ఆరేడు గంటలు పని చేస్తోంది షారన్. కరోనా భయంతో దూర ప్రాంతాల్లో ఉండే నర్సులు రావడం మానేశారు. కొంతమంది రాగలిగి ఉన్నా ఇంట్లో పసిపిల్లలు ఉండటంతో జాగ్రత్తకోసం ఉద్యోగాన్ని వదిలేశారు. ఆ పని కూడా షరాన్ మీదే పడింది. కష్టమనుకోలేదు షరాన్. ‘‘వదిలేసి రాలేను’’ అని తల్లి అన్నమాట ఆమెకు శక్తిని, ఉత్సాహాన్ని ఇస్తోంది. నాలుగు నెలలుగా అవిశ్రాంతంగా వృద్ధుల్ని కనిపెట్టుకుని ఉంటోంది షారన్. ఇటీవల ఓ రోజు.. షరాన్ చదివొచ్చిన ఉలాంగ్గాంగ్ యూనివర్సిటీ నుంచి ఆమెకు ఒక మెయిల్ వచ్చింది. యూనివర్సిటీలోని కోవిడ్ –19 హెల్ప్ గ్రూప్ పంపిన మెయిల్ అది. విదేశాల నుంచి వచ్చి ఆస్ట్రేలియాలో వైద్యసేవలు అందిస్తున్న నర్సులు తమ ఉద్యోగ వివరాలను తెలియజేయాలని హెల్ప్ గ్రూప్ కోరింది. షరాన్ వెంటనే తన వివరాలు మెయిల్ చేసింది. వీడియో తీసి పంపమని మళ్లీ ఒక మెయిల్ వచ్చింది. షరాన్ కాస్త తీరిక చేసుకుని అప్పటికప్పుడు కోటు వేసుకుని, కొంచెం లిప్‌స్టిక్ అద్దుకుని.. ‘హాయ్.. నేను షరాన్’ అంటూ తన వివరాలను రికార్డ్ చేసి పంపింది. ఆ తర్వాత ఆ సంగతే మర్చిపోయింది.. కొన్ని రోజుల తర్వాత తనకు ఫోన్లు, మెజేస్‌లు వరదలా వచ్చి పడేవరకు! అవి కేరళ నుంచి, కువైట్ నుంచి.. ఇంకా విదేశాల్లో ఉన్న స్నేహితుల నుంచి. ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం ఆడమ్ గిల్‌క్రీస్ట్ ఆ అమ్మాయికి ధన్యవాదాలు తెలిపాడని! ఆస్ట్రేలియాలోనే ఉండి ఇక్కడి వారికి సేవ చేయాలనుకున్న షరాన్‌కు, మిగతా భారతీయ విద్యార్థులకు ధన్యవాదాలు తెలుపుతున్న గిల్క్ట్రీస్ వీడియో క్లిప్ అప్పటికే వైరల్ అవుతోంది. ‘‘మా నాన్న దేనినీ మెచ్చరు. ఆయన క్రికెట్ అభిమాని. గిల్‌క్రీస్ట్ నన్ను ప్రశంసించారు అనగానే ఫోన్ చేసి ‘వెల్ డన్’ అన్నారు అని సంతోషపడిపోయింది షరాన్. ఇక కేరళలో ఉన్న ఆమె తమ్ముడు, అతడి ఫ్రెండ్స్ అయితే సోషల్ మీడియాలో ఇంచుమించు ఒక ఉత్సవాన్నే జరుపుకుంటున్నారు. షరాన్కి ఇదంతా థ్రిల్లింగ్‌గా ఉంది. ∙∙ కొట్టాయంలోని కురుప్పుంత్ర షరాన్ వర్ఘీస్ స్వస్థలం. తల్లి ఎప్పట్నుంచో కువైట్‌లో నర్సు. షరాన్ తల్లి దగ్గరే ఉండి స్కూల్‌కి వెళ్లింది. ఆస్ట్రేలియాలో కాలేజ్ చదువు. సెలవుల్లో కేరళ వచ్చి వెళ్తుంటుంది. ఇక రెండేళ్ల వరకు ఉలాంగ్గాంగ్ ను వదిలి వెళ్లేది లేదని అంటోంది. ఆ ప్రాంతంలోనే ఒక ‘ఏజ్డ్ కేర్’ సెంటర్లో తనిప్పుడు పని చేస్తోంది. గ్రామీణ ప్రాంతాలలో వైద్య సేవలు అందించడం తనకు ఇష్టమని అంటోంది. -
ప్రియుడు పెళ్లికి నిరాకరించాడని..
తూర్పుగోదావరి, కాకినాడ క్రైం: ప్రేమించిన యువకుడు పెళ్లికి నిరాకరించడంతో నర్సింగ్ విద్యార్థిని మనస్తాపానికి గురై మూడంతస్తుల నర్సింగ్ స్కూల్ హాస్టల్ మేడపై నుంచి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. మారేడుమిల్లి మండలం సెట్లవడ గ్రామానికి చెందిన డి.శిరీష 2018లో కాకినాడ జీజీహెచ్ నర్సింగ్ స్కూల్లో జీఎన్ఎం మూడేళ్ల ట్రైనింగ్ కోర్సులో చేరింది. కాకినాడ జీజీహెచ్‌లో ప్రైవేట్ ఎలక్ట్రీషియన్‌గా పని చేస్తున్న (ప్రస్తుతం మానేశాడు) బాలు అనే యువకుడితో శిరీష పరిచయం ఏర్పడి, అది కాస్తా ప్రేమగా మారింది. బాలు హాస్టల్ వెనుక భాగం నుంచి నేరుగా శిరీష ఉంటున్న గది వద్దకు రావడం మొదలుపెట్టాడు. గురువారం రాత్రి కూడా వచ్చి ఆమెతో మాట్లాడడంతో ఇద్దరి మధ్య పెళ్లి ప్రస్తావన వచ్చింది. తాను పెళ్లి చేసుకోబోనని, ఇదే విధంగా ఉండవచ్చని బాలు యువతితో చెప్పడంతో మనస్తాపానికి గురైన శిరీష శుక్రవారం ఉదయం హాస్టల్ మేడపైకి వెళ్లి అక్కడి నుంచి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. వెంటనే గుర్తించిన తోటి విద్యార్థులు జీజీహెచ్‌లోని అత్యవసర విభాగానికి తరలించారు. ఈ ఘటనలో ఆమె తలకు తీవ్ర గాయమైంది. దవడ, పక్కటెముక, కాలు విరిగిపోయిందని, పరిస్థితి విషమంగానే ఉందని వైద్యులు తెలిపారు. వన్‌టౌన్ పోలీసులు హాస్టల్‌కు వచ్చి శిరీషతో పాటు చదువుతున్న విద్యార్థులను విచారించి సమాచారం రాబట్టారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని త్రీటౌన్ సీఐ శ్రీరామకోటేశ్వరరావు తెలిపారు. శిరీష ఆత్మహత్యాయత్నాకి పాల్పడేందుకు కారణమైన బాలు అనే ఎలక్ట్రీషియన్ కోసం పోలీసులు గాలిస్తున్నట్టు తెలిసింది. -
ప్రిన్సిపాల్ వేధింపులే కారణమా?
సాక్షి, తిరుపతి (అలిపిరి): రుయాలో జీఎన్ఎం (జనరల్ నర్సింగ్ మిట్‌వైఫరీ) ద్వితీయ సంవత్సరం విద్యార్థిని పౌజియా(19) మంగళవారం సాయంత్రం ఆత్మహత్యాయత్నం చేసింది. నిద్రమాత్రలు మింగడంతో అపస్మారక స్థితికి చేరుకుంది. ప్రభుత్వ నర్సింగ్ స్కూల్ ప్రిన్సిపాల్ వేధింపులే ఆత్మహత్యాయత్నానికి కారణమని బాధితురాలు మీడియా ముందు గోడును వెళ్లబోసుకుంది. ప్రస్తుతం విద్యార్థిని ఆర్‌ఐసీయులో కోలుకుంటోంది. ప్రిన్సిపాల్ వేధింపులు దామలచెరువుకు చెందిన పౌజియా జీఎన్ఎం ద్వితీయ సంవత్సరం చదువుతోంది. హాస్టల్లో వంటలు బాగుండడం లేదని ఇటీవల ఫిర్యాదు చేసింది. దీంతో ప్రిన్సిపాల్ ఆమెను దుర్భాషలాడినట్లు తెలుస్తోంది. ప్రిన్సిపాల్ ఇష్టానుసారంగా తిడుతూ మానసిక వేదనకు గురిచేస్తున్నట్లు నర్సింగ్ విద్యార్థినులు ‘సాక్షి’ ఎదుట గోడును వెళ్లబోసుకున్నారు. తల్లిదండ్రుల గురించి తప్పుగా మాట్లాడడం వల్ల మానసిక వేదనకు గురవుతున్నట్లు వివరించారు. 10 మందికి అపెండిసైటిస్ ఆపరేషన్లు నర్సింగ్ హాస్టల్లో ఆహారం సరిగా లేదని విద్యార్ధినులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో రెండు నెలల కాలంలో 60 మంది విద్యార్థినుల్లో 10 మందికి అపెండిసైటిస్ ఆపరేషన్లు నిర్వహించినట్లు వెల్లడించారు. నాసిరకం భోజనం అందిస్తుండడం వల్లే అనారోగ్యం బారినపడుతున్నట్లు విమర్శలున్నాయి. పౌజియా ఆత్మహత్యాయత్నానికి ఇది కూడా ఓ కారణంగా విద్యార్థినులు చెబుతున్నారు. విచారించి చర్యలు తీసుకుంటాం.. రుయాలో నర్సింగ్ విద్యార్థిని ఆత్మహత్యయత్నానికి గల కారణాలపై విచారిస్తాం. విచారణలో తేలిన వివరాల ఆధారంగా చర్యలు తీసుకుంటాం. ప్రిన్సిపాల్ రష్యారాణి విద్యార్థుల పట్ల దురుసుగా ప్రవర్తిస్తున్నట్లు ఫిర్యాదులందాయి. – డాక్టర్ సిద్ధానాయక్, సూపరింటెండెంట్, రుయా ఆస్పత్రి నర్సింగ్ విద్యార్థినులు నా బిడ్డలతో సమానం నర్సింగ్ విద్యార్థినులు నా బిడ్డలతో సమానం. వారి పట్ల నేను ఎప్పుడూ దురుసుగా ప్రవర్తించలేదు. కుటుంబ సమస్యల కారణంగా పౌజియా నిద్రమాత్రలు మింగినట్లు తెలిసింది. ఇందులో నాకు ఎటువంటి సంబంధమూ లేదు. – రష్యారాణి, ప్రిన్సిపాల్, స్కూల్ ఆఫ్ నర్సింగ్, రుయా ఆస్పత్రి -
నర్సింగ్ యువతిపై ఆత్యాచారం కన్నడ నటుడిపై కేసు
యశవంతపుర : యువతిపై అత్యాచారం చేసిన కేసులో ఓ కన్నడ నటుడితోసహా ముగ్గురిపై కేసు నమోదై ఘటన చోటు చేసుకుంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన వివరాలు... కెంగేరిలోని ఓ నర్సింగ్ కళాశాలలో చదువుతున్న యువతి మణిపురి వాసి. ఇక్కడి కోరమంగళలోని ఓ అపార్టుమెంట్లో నివాసం ఉంటోంది. ఒంటరిగా ఉందన్న విషయం గుర్తించిన నటుడు రాజేశ్ తన స్నేహితులు మణి, సూర్యలు యువతి ఉంటున్న అపార్ట్‌మెంట్‌కు ఆమెను చాకుతో బెదిరించి అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. -
అమ్మానాన్నను అర్థం చేసుకోలేక..
తల్లిదండ్రులు గట్టిగా కసురుకున్నారని బాధపడ్డారుగానీ.. ఆ బిడ్డలు క్షణం లేకపోతే అమ్మానాన్న కంట్లో నీటి ఊట ఆగదని గుర్తించలేకపోయారు.. తమ ఇష్టాలను గౌరవించలేదని అపోహపడ్డారుగానీ.. పిల్లలకంటే వారికి లోకంలో ఏదీ ఇష్టంకాదనే విషయాన్ని తెలుసుకోలేకపోయారు. యుక్త వయసుకొచ్చాక కూడా మాకు చెప్పేదేమిటని ఆలోచించారుగానీ.. ఈ వయసులోనే జీవన మార్గదర్శకులుగా నిలుస్తున్నారనే విషయాన్ని గమనించలేకపోయారు. తమ గుండెల్లో బాధను గుర్తించలేదని తొందరపడ్డారుగానీ.. బిడ్డలు ఒక్కపూట కానరాకపోతే వారి గుండె కొట్టుకోదనే విషయాన్ని మరిచిపోయారు. జిల్లాలోని తాడికొండలో యువకుడు, మంగళగిరిలో యువతి తల్లిదండ్రుల ప్రేమను అర్థం చేసుకోలేక నిండు జీవితాన్ని బలి తీసుకున్నారు. ఆ తల్లిదండ్రులకు నూరేళ్లకు సరిపడా విషాదాన్ని మిగిల్చారు. మంగళగిరి టౌన్: తన పెళ్లి విషయంలో పెద్దలు మనస్తాపం చెందారని మంగళగిరి పట్టణం ఇందిరానగర్‌లో నివాసం ఉంటున్న ఓ నర్సింగ్ విద్యార్థిని శుక్రవారం విషం తాగి ఆత్మహత్య చేసుకుంది. సేకరించిన వివరాల ప్రకారం.. జిల్లాలోని నగరంకు చెందిన పి.రోజా పట్టణంలోని ఇందిరానగర్‌లో గత ఐదు నెలలుగా తన స్నేహితురాలితో అద్దె ఇంటిలో నివాసం ఉంటోంది. చినకాకానిలోని ఎన్ఆర్ఐ కాలేజీలో ఎమ్మెస్సీ నర్సింగ్ మొదటి సంవత్సరం చదువుతుంది. కొద్ది రోజుల క్రితం గుంటూరుకు చెందిన ఓ అబ్బాయితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమగా మారింది. వీరి ప్రేమ వ్యవహారం తెలిసిన పెద్దలు వీరి పెళ్లికి నిరాకరించారు. అయితే వారు ఇరువురి తల్లిదండ్రులను ఒప్పించి నెల క్రితం నిశ్చితార్థం చేసుకున్నారు. తాను వేరే కులస్తుడిని పెళ్లి చేసుకోవడంతో తల్లిదండ్రుల పరువుపోతుందని ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సూసైడ్ నోట్లో పేర్కొంది. ఇంట్లో వాళ్లు బాధపడటం ఇష్టంలేని ఆమె తీవ్ర మనస్తాపానికి గురైంది. చెల్లిని బాగా చదివించండి అని సూసైడ్ నోట్లో రాసి ఆత్మహత్య చేసుకుంది. సూసైడ్‌నోట్ ఆధారంగా పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. రోజా మృతితో ఆమె కుటుంబ సభ్యులు బోరున విలపించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం తల్లిదండ్రులకు అప్పగించారు. -
విద్యార్థినిని కిడ్నాప్ చేసి వివాహం
టీ.నగర్: చెన్నై పల్లావరం సమీపంలో నర్సింగ్ విద్యార్థినిని కిడ్నాప్ చేసి, వివాహమాడిన యువకుడిని పోలీసులు సోమవారం అరెస్టు చేసి జైలుకు పంపారు. పల్లావరం సమీపం పమ్మల్‌కు చెందిన రాజపాండి (21). పెయిం టింగ్ కార్మికుడు. ఇతనికి బస్సులో వెళుతుండగా 17 ఏళ్ల యువతితో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. ఈ యువతి నర్సింగ్ రెం డో సంవత్సరం చదువుతోంది. వీరి ప్రేమకు యువతి తల్లిదండ్రులు వ్యతిరేకించారు. ఇది లాఉండగా రాజపాండి, నర్సింగ్ యువతి కొన్ని రోజుల కిందట అదృశ్యమయ్యారు. దీని పై విద్యార్థిని తల్లిదండ్రులు పమ్మల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. యువకుడు రాజపాండి నర్సింగ్ విద్యార్థినిని కిడ్నాప్ చేసినట్టు కేసు నమోదైంది. వీరి కోసం పోలీసులు గాలిస్తుండగా ఇరువురు తేనిలో ఉన్నట్లు సమాచారం అందింది. దీంతో పోలీసులు అక్కడికి వెళ్లారు. అక్కడ యువకుడు రాజపాండి నర్సింగ్ విద్యార్థినిని వివాహం చేసుకున్నట్లు తెలిసింది. దీంతో ఇరువురిని పమ్మల్‌కు తీసుకువచ్చారు. మైనర్ బాలికను వివాహమాడినందున రాజపాండిని కోర్టులో హాజరుపరిచి జైలుకు పంపారు. దీనిపై విచారణ జరుగుతోంది. -
అపోలో నర్స్పై యాసిడ్ దాడి
హైదరాబాద్: అపోలో ఆస్పత్రి నర్సింగ్ విద్యార్థిని పై ఓ యువకుడు యాసిడ్ దాడి చేసి పరారైన ఘటన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం చోటుచేసుకుంది. కేరళలోని ఎర్నాకులంకు చెందిన జీషాషాజీ(22) గత జూలై నుంచి అపోలో నర్సింగ్ స్కూల్లో శిక్షణ పొందుతూ కేర్ ఆస్పత్రిలో నర్స్‌గా పనిచేస్తుంది. ఆమె అపోలో ఆస్పత్రి ఆవరణ లోని నర్స్‌ల వసతి గృహంలో ఉంటుంది. ఆమె గ్రామానికి చెందిన ప్రమోద్(28) అనే యువకుడు గురువారం హాస్టల్‌కు వచ్చి తనతో పాటు తెచ్చుకున్న యాసిడ్‌ను చల్లి పరారయ్యాడు. దీంతో కుడిచేతితోపాటు భుజం వరకు 9 శాతం కాలిపోయింది. వెంటనే ఆమె అపోలో ఆస్పత్రిలో చేరింది. ప్రమోద్‌కు తాను ఇక్కడ ఉన్నట్లు తెలియదని, ఎప్పుడు వచ్చాడో చూడలేదని పేర్కొంది. ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
తల్లిదండ్రులు అంగీకరించలేదని ..
నెలమంగల(దొడ్డబళ్లాపురం): ప్రేమ వివాహానికి తల్లిదండ్రులు నిరాకరించారనే మనస్తాపంతో నర్సింగ్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆదివారం నెలమంగల రూరల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పశ్చిమ బెంగాల్‌కు చెందిన మోషమి రాయ్(20) నెలమంగల తాలూకా టీ బేగూరులోని నర్సింగ్ కాలేజీలో డిప్లోమా ఇన్ నర్సింగ్ చదువుతోంది. ఆమే రాయ్ పాపన్ అనే యువకుడిని ప్రేమిస్తోంది. ఈ విషయాన్ని తన తల్లితండ్రులకు తెలియజేసింది. తమ వివాహానికి అంగీకరించాలని కోరింది. తల్లిదండ్రులు నిరాకరించడంతో మనస్తాపం చెందిన విద్యార్థిని కాలేజీ పీజీ కట్టడంలోనే ఆదివారం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. నెలమంగల రూరల్ పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. -
అయ్యో..భవ్య
అనంతపురం న్యూసిటీ: ఓ వైపు తీవ్ర జ్వరం (107సెంటీగ్రేడ్). మరో వైపు చివరి పరీక్ష. పరీక్ష రాసిన తర్వాత వైద్యం తీసుకుందామనుకున్న ఆ అమ్మాయి...పరీక్ష హాల్లోనే కుప్పకూలి పోయింది. తోటి విద్యార్థినులు హుటాహుటీన సర్వజనాస్పత్రికి తరలించినా కోలుకలేక మృత్యుపడింది. వివరాల్లోకి వెళితే...మడకశిరలోని అమరాపురం మండలం రంగాపురం గ్రామానికి చెందిన కేఎన్ లక్ష్మణమూర్తి, శాంతమ్మల కూతురు ఎం.భవ్య (21) నగరంలోని ఆదర్శ నర్సింగ్ కళాశాలలో మూడో సంవత్సరం విద్యనభ్యసిస్తోంది. శుక్రవారం ఓబీజీ పరీక్ష రాసేందుకు వైద్య కళాశాలకు వచ్చింది. అయితే పరీక్ష కేంద్రంలో భవ్యకు ఫిట్స్ వచ్చాయి. నోటిలో నురుగ వస్తూ ఊపిరి తీసుకునేందుకు ఇబ్బంది పడింది. దీంతో తోటి విద్యార్థులు కేకలు వేయడంతో అక్కడున్న సిబ్బంది సర్వజనాస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు పరీక్షించి రక్త పరీక్షలకు సిఫార్సు చేశారు. ప్లేట్లెట్స్ 29,000 మాత్రమే ఉండడం... సెలైన్ పెట్టిన ప్రాంతంలో రక్తం రావడంతో వైద్యులు వెంటిలేటర్ ద్వారా కృత్రిమ శ్వాసనందించే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కోలుకోని భవ్య మధ్యాహ్నం 3 గంటల సమయంలో మృతి చెందింది. దీంతో భవ్య స్నేహితులు కన్నీరు మున్నీరయ్యారు. ఆదర్శ కళాశాల యాజమాన్యం భవ్య తండ్రి కేఎన్ లక్ష్మణమూర్తికు సమాచారం అందించగా...ఆమె పెద్దనాన్న నాగరాజు అనంతపురం వచ్చి మృతదేహాన్ని సొంతూరుకు తీసుకెళ్లారు. తలలో రక్తం గడ్డ కట్టడం, ప్లేట్ లెట్స్ తక్కువగా ఉండడంతోనే భవ్య మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. కాగా, భవ్య వారం రోజులుగా జ్వరంతో బాధపడుతోందని స్నేహితులు చెబుతున్నారు. -
చదువుకుంటా..చందాలివ్వండి!
చదువుకునేందుకు చందాలివ్వండి అంటూ శ్రీవాణి అనే నర్సింగ్ విద్యార్థిని వేడుకుంటోంది. అయినవారు పట్టించుకోకపోవడంతో అనాథలా మారిన తనకు దాతలు ఆర్థిక సహాయం చేయాలని కోరుతోంది. సోమవారం కలెక్టరేట్ ఎదుట కన్పించిన ఈ అమ్మాయి తన వివరాలను తెలిపింది. బాలయపల్లి మండలం సంఘవరం గ్రామానికి చెందిన సుధరరావు, శాంతకుమారిలకు ముగ్గురు సంతానం. వి.శ్రీవాణి చివరి సంతానం. తల్లిదండ్రులు ఆనారోగ్య కారణంగా మరణించారు. అక్క, అన్నా, బాబాయిలు ఆదరించలేదు. తల్లిదండ్రులు మరణించే సమయానికి శ్రీవాణి 7వ తరగతి చదువుతుంది. రేషన్‌కార్డు, ఆధార్‌కార్డు లేని కారణంగా స్కాలర్షిప్ అర్హత లేదు. తల్లిదండ్రులు మరణించడంతో నాయుడుపేటలోని క్రిష్టియన్ మిషనరీ శ్రీవాణిని చేరదీసింది. ఇంటర్ వరకు అక్కడే చదువు చెప్పించారు. ఇంటర్లో 60 శాతం మార్కులు సాధించిన శ్రీవాణి పోతిరెడ్డిపాళెంలోని గ్లోబల్ నర్సింగ్ కళాశాలలో మేనేజ్మెంట్ కోటాలో బీఎస్సీ నర్సింగ్ కోర్సులో చేరింది. మొదటి సంవత్సరం పీజు మిషనరీ వారు చెల్లించారు. రెండవ సంవత్సరం ఫీజులు చెల్లించలేమని తెలిపారు. నానా ఇక్కట్లు ఎదుర్కొంది. నాయుడుపేట ఆమ్మా హాస్పిటల్లో పనిచేస్తూ కొంతకాలం జీవనం సాగించింది. కళాశాల యాజమాన్యం సహకారం, తనకొచ్చే వేతనంతో రెండో సంవత్సరం ఫీజులు చెల్లించి పరీక్షలు రాసింది. మంచి మార్కులు వచ్చాయి. మూడో సంవత్సరానికి మళ్లీ ఇబ్బందులు ఎదురయ్యాయి. నవంబర్‌లో పరీక్షలున్నాయి. దాతలు సహకరిస్తే చదువు పూర్తి చేస్తానని తెలిపారు. సాయం చేయదలచినవారు 99857 51662, 98667 87051 ఫోన్ నంబర్లకు దయతో సంప్రదించాలని కోరుతోంది. – నెల్లూరు(పొగతోట) -
ర్యాగింగ్: విద్యార్థినితో యాసిడ్ తాగించారు!
ర్యాగింగ్ భూతం వెర్రితలలు వేస్తోంది. కర్ణాటకలోని ఓ నర్సింగ్ కాలేజిలో సీనియర్లు జూనియర్ విద్యార్థినితో బలవంతంగా బాత్రూంలు శుభ్రం చేసే యాసిడ్ తాగించారు. గుల్బర్గాలోని అల్ ఖమర్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్‌లో గత నెలలో ఈ ఘటన జరిగింది. అప్పటినుంచి ఇప్పటివరకు బాధితురాలు ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడుతూనే ఉంది. కేరళకు చెందిన మొదటి సంవత్సరం విద్యార్థిని పరిస్థితి విషమంగా ఉండటంతో ఆమెను కోజికోడ్‌లోని వైద్యకళాశాలకు తరలించారు. ఆమెకు శరీరం లోపలి భాగాల్లో కాలిన గాయాలయ్యాయి. కర్ణాటక ఆస్పత్రిలోని ఐసీయూలో వారం ఉంచిన తర్వాత కోజికోడ్ తీసుకొచ్చారు. ఆమె పరిస్థితి ఇప్పటికీ విషమంగానే ఉంది. బాధితురాలి తల్లి రోజుకూలీగా పనిచేస్తుంటారు. తన కూతురు మంచి నర్సు కావాలన్న ఉద్దేశంతో రూ. 3 లక్షలు అప్పు చేసి మరీ ఆమెను గుల్బర్గా కాలేజిలో చేర్పించారు. తన కూతురు కనీసం తిండి కూడా తినలేకపోతోందని, వాళ్లు ఎందుకిలా చేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తనను దాదాపు ఐదు నెలలుగా చిత్రహింసలు పెడుతున్నారని, మూడో సంవత్సరం విద్యార్థినులు ఈ ఆగడాలకు పాల్పడ్డారని బాధితురాలు చెప్పింది. తాను నల్లగా ఉన్నానని, అందుకే ఎవరూ తనను ఇష్టపడరని, తనకు తండ్రి లేరని కూడా వాళ్లు కామెంట్లు చేస్తున్నారని వాపోయింది. బలవంతంగా చేతులు పైకెత్తి, తననోరు తెరిచి, యాసిడ్ తాగించారని తెలిపింది. అయితే ఇది ర్యాగింగ్ కాదని నర్సింగ్ కాలేజి ప్రిన్సిపాల్ డాక్టర్ ఈస్తర్ అంటున్నారు. ఆమె కుటుంబ సమస్యల కారణంగానే ఫినాయిల్ తాగిందని చెప్పారు. ఈ కేసు విచారణకు గుల్బర్గా పోలీసులు ప్రత్యేక బృందాన్ని నియమించారు. -
నర్సింగ్ విద్యార్థినిపై గ్యాంగ్ రేప్.. ముగ్గురి అరెస్ట్
నర్సింగ్ విద్యార్థినిపై ఆటోలో సామూహిక అత్యాచారం చేసిన ఘటనకు సంబంధించి ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. షైజు, సుజిత్ తో సహా మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు ముగ్గురిపై కేసు నమోదు చేశామని, ఈ వివరాల మేరకు నిందితులను అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించినట్లు వార్కాల ఇన్ స్పెక్టర్ వినోద్ వివరించారు. దేశవ్యాప్తంగా ఈ హత్యాచార ఘటన కలకలం రేపింది. తిరువనంతపురం జిల్లా వార్కాల పట్టణ శివారులోని అయంతి వద్ద మంగళవారం ఈ ఘటన చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం బాధితురాలు ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. దారుణం జరిగిందిలా.. 19 ఏళ్ల దళిత విద్యార్థిని తిరువనంతపురంలోని కాలేజీలో బీఎస్సీ నర్సింగ్ రెండో సంవత్సరం చదువుతోంది. ఆమెకు షైజు అనే ఓ స్నేహితుడు ఉన్నాడు. ఆటోడ్రైవర్ అయిన ఇతను మంగళవారం తన ఆటోలో విద్యార్థినిని వార్కాలకు తీసుకెళ్లాడు. దారి మధ్యలో షైజు స్నేహితుడు సుజిత్ తో పాటు మరో వ్యక్తి కూడా ఆటో ఎక్కాడు. వార్కాల శివారులోని నిర్జన ప్రదేశంలో ఆటోను నిలిపి, బాధితురాలిపై అత్యాచారానికి పాల్పడ్డారు. తీవ్రమైన భయంతో మూర్ఛకు గురైన ఆమెను అక్కడే వదిలేసి నిందితులు పారిపోయారు. -
'దేవుని రాజ్యం'లో మరో దారుణం
తిరువనంతపురం: నిర్భయ ఘటనను తలపిస్తూ దళిత విద్యార్థినిని సామూహిక అత్యాచారం చేసి, దారుణంగా చంపిన ఉదంతంలో ఆగ్రహజ్వాలలు చల్లారకముందే కేరళలో మరో ఘాతుకం చోటుచేసుకుంది. 19 ఏళ్ల నర్సింగ్ విద్యార్థినిని ఆమె స్నేహితుడు, మరో ఇద్దరు వ్యక్తులతో కలిసి ఆటోలో గ్యాంగ్ రేప్ చేశాడు. తిరువనంతపురం జిల్లా వార్కాల పట్టణ శివారులోని అయంతి వద్ద మంగళవారం ఈ ఘటన జరిగింది. పోలీసులు చెప్పిన వివరాలనుబట్టి.. 19 ఏళ్ల దళిత విద్యార్థిని తిరువనంతపురంలోని కాలేజీలో బీఎస్సీ నర్సింగ్ రెండో సంవత్సరం చదువుతోంది. ఆమెకు షైజు అనే ఓ స్నేహితుడు ఉన్నాడు. ఆటోడ్రైవర్ అయిన ఇతను మంగళవారం తన ఆటోలో విద్యార్థినిని వార్కాలకు తీసుకెళ్లాడు. దారి మధ్యలో షైజు స్నేహితులు మరో ఇద్దరు ఆటో ఎక్కారు. వార్కాల శివారులోని నిర్జన ప్రదేశంలో ఆటోను నిలిపి, బాధితురాలిపై అత్యాచారానికి పాల్పడ్డారు. తీవ్రమైన భ్రాంతితో మూర్ఛకు గురైన ఆమెను అక్కడే వదిలేసి పారిపోయారు. కొద్ది సేపటి తర్వాత బాధితురాలి ఆర్తనాదాలు విన్న కొంరు వ్యక్తులు ఆమెను కాపాడే ప్రయత్నం చేశారు. ఆసుపత్రికి తరలించి, పోలీసులకు సమాచారం అందించారు. ప్రస్తుతం బాధితురాలు తిరువనంతపురం మెడికల్ కాలేజీలో చికిత్స పొందుతోంది. బుధవారం కేసు నమోదుచేసుకున్న పోలీసులు నిందితులకోసం గాలిస్తున్నారు. షైజుతో పాటు మరో నిందితుడిని సుజిత్ గా బాధితురాలు గుర్తించిందని పోలీసులు చెప్పారు. 'దేవుని రాజ్యం(గాడ్స్ ఓన్ కంట్రీ)' గా పేరుపొందిన కేరళలో వారంరోజుల వ్యవధిలోనే రెండు దారుణ సామూహిక అత్యాచార సంఘటనలు వెలుగులోకి రావడం, అదికూడా ఎన్నికలు జరుగుతున్న సమయంలోనే చోటుచేసుకోవడం గమనార్హం. ఎర్నాకుళం జిల్లా పెరంబవూర్ లో లా కాలేజి విద్యార్థినిపై ఆమె ఇంట్లోనే అత్యాచారం చేసి, హత్యచేసిన కేసును జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్ సుమోటోగా స్వీకరించిన సంగతి తెలిసిందే. బాధితురాలి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని సీఎం ఊమెన్ చాందీ తెలిపారు. మరి తాజా ఘటనపై ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తో, నిందితులను పట్టుకుని శిక్షించేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచిచూడలి. -
ఊరేసుకుని నర్సింగ్ విద్యార్థిని ఆత్మహత్య
చెన్నై: అనుమానస్పద స్థితిలో నర్సింగ్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. కాలేజీ హాస్టల్లోని తన రూంలో ఊరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. చదవుల్లో తాను సరిగ్గా రాణించలేక పోతున్నానని మనస్తాపం చెంది ఈ అఘాయిత్యానికి పాల్పడినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం మార్చూరీకి తరలించినట్టు పోలీసులు తెలిపారు. -
నర్సింగ్ విద్యార్థిని బలవన్మరణం
అనంతపురం అర్బన్ : అనంతపురంలోని ఓ నర్సింగ్ కాలేజీలో ద్వితీయ సంవత్సరం చదువుతున్న పరమేశ్వరి(20) అనే విద్యార్థిని శనివారం ఆత్మహత్య చేసుకుంది. హాస్టల్లో ఫ్యాన్‌కు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. మృతదేహాన్ని అనంతపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. -
రక్తహీనతతో నర్సింగ్ విద్యార్థిని మృతి
పార్వతీపురం టౌన్: తీవ్ర రక్తహీనత కారణంగా పార్వతీపురం ఏరియా ఆస్పత్రిలో నర్సింగ్ విద్యార్థిని గురువారం మృతి చెందింది. కురుపాం మండలం ద్రాక్షణి గ్రామానికి చెందిన బిడ్డిక గీత(20)అనే విద్యార్థిని పార్వతీపురం ఏరియా ఆస్పత్రి లో నర్సింగ్ శిక్షణ పొందుతోంది. వచ్చే ఆగస్టు నెలలో కోర్సు పూర్తి చేసుకోనున్న గీత తీవ్ర అస్వస్థత కారణంగా రెండు నెలలుగా స్వగ్రామం లోనే ఉంటోంది. గిరిజన గ్రామం కావడం పౌష్టికాహార లోపం కారణంగా రక్తహీనత ఏర్పడింది. పార్వతీపురం ఏరియా ఆస్పత్రిలో వైద్యం పొందుతూ మృతి చెందింది. తోటివారి చేయూత: ఏరియా ఆస్పత్రిలో శిక్షణ పొందుతూ మృతి చెందిన గీత విషయం తెలుసుకున్న సహోద్యోగులు అందరూ కొంత మొత్తాన్ని ఆమె కుటుంబానికి వితరణగా అందచేశారు. మృతదేహాన్ని ఆమె స్వగ్రామానికి తరలించే ఏర్పాట్లు చేశారు. -
హత్యను ఆత్మహత్యగా మార్చేందుకు బేరాలు
తిరువొత్తియూరు: అత్యాచారం చేసి సజీవ దహనం చేసిన నర్సింగ్ విద్యార్థిని కేసును ఆత్మహత్యగా మార్చేందుకు పోలీసులు డాక్టర్లతో బేరం మాట్లాడుతున్నారు. గత నెల 14వ తేదీ తిరుచ్చి సెంట్రల్ జైలు సమీపంలో వున్న ఆసుపత్రిలో ఒక బైకు చోరీ చేయడానికి ప్రయత్నించిన యువకున్ని ఆటో డ్రైవర్లు చుట్టుముట్టి అతన్ని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. అతను ముసిరి తాపేటకు చెందిన తంగదురై (30) అని తెలిసింది. ఇతను తాను చోరీ చేసిన బైకులకు నంబరు ప్లేట్లను మార్చి కోర్టు వేలం ఎత్తినట్లు నకిలీ సర్టిఫికెట్లు తయారు చేసి విక్రయిస్తున్నట్లు తెలిసింది. ఇలా విక్రయించిన డబ్బులతో ఉల్లాసంగా గడిపేవాడని తెలిసింది. అతని నుంచి పోలీసులు 103 బైకులను స్వాధీనం చేసుకున్నారు. అరెస్టు అయిన తంగదురై గత 23వ తేదీ జ్యుడిషియల్ కోర్టులో హాజరు పరిచారు. జైలులో బంధించారు. తంగదురైకు సహాయపడిన ప్రైవేటు ఆసుపత్రి ఉద్యోగి తురైయూర్ ఆంగియంకు చెందిన ఉదయన్ (29) అనే వ్యక్తిని అరెస్టు చేసి జైలులో ఉంచారు. పోలీసులు తంగదురైను రెండు రోజులు కస్టడీకి తీసుకుని విచారణ చేశారు. విచారణలో కొన్ని సంఘటనలు వెలుగులోకి వచ్చాయి. బైకుల విక్రయించగా అందులో వచ్చే నగదుతో కొంతమంది విద్యార్థినులను లోబరచుకునే వాడని తెలిసింది. ఇందుకు ప్రైవేటు ఆసుపత్రి ఉద్యోగి ఉదయన్ సహాయపడినట్టు తెలిపారు. కంటోన్మెంట్ ప్రాంతంలో ఉన్న ప్రైవేటు ఆసుపత్రిలో తంజావూరుకు చెందిన నర్సింగ్ విద్యార్థినిపై గత సంవత్సరం జనవరి 1వ తేదీ రాత్రి ఓ డాక్టరుతో కలసి అత్యాచారం చేశాడని, ఆ సమయంలో విద్యార్థిని ఎదురు తిరగడంతో ఆమెపై దాడి చేయడంతో విద్యార్థిని కింద పడి తలకు తీవ్ర గాయమై మృతి చెందింది. తంగదురై తన మిత్రుని సహాయంతో విద్యార్థినిపై కిరోసిన్ పోసి తగులపెట్టాడు. దీనిపై సమాచారం అందుకున్న పుదియ తలమురై కార్పొరేషన్ కార్యదర్శి శంకర్ నేతృత్వంలో విద్యార్థిని మృతిపై ఆందోళన చేశారు. ఆందోళనలో విద్యార్థిని మృతిలో సందేహం ఉందని ఆత్మహత్య చేసుకున్న గది అగ్నిజ్వాలలు గోడలపై తగులలేదని హత్య చేసి విద్యార్థిని తగులబెట్టారని సందేహం వెలిబుచ్చారు. ఆ సమయంలో విచారణ అధికారిగా ఉన్న సహాయ కమిషనర్ గణేషన్ హఠాత్తుగా మూడు రోజులకు సెలవు పెట్టి బయటకు వెళ్లారు. తరువాత ఈ కేసును ఆత్మహత్య కేసుగా చిత్రీకరించారు. ప్రస్తుతం ఈ కేసు ఆత్మహత్యగా రుజువు చేయడానికి సంబంధిత డాక్టరుతో పోలీసులు బేరం మాట్లాడుతున్నట్టు తంగదురై తెలిపాడు. -
నర్సింగ్ విద్యార్థినిపై అఘాయిత్యం!
నరరూప రాక్ష సుల కామవాంఛకు ‘నిర్భయ’ బలై ఏడాది గడిచింది. ఆ ఘటనకు నిరసనగా అప్పుడు దేశ వ్యాప్తంగా ఆందోళనలు పెద్ద ఎత్తున జరిగాయి. మహిళల రక్షణకు ‘నిర్భయ’లాంటి కఠిన చట్టాలు వచ్చాయి. అయినా అవి వారిపై దాడులను నిలువ రించలేకపోతున్నాయి. పనిచేసే స్థలాలు, జనసమ్మర్థమైన ప్రాంతాలు, చివరకు ఇళ్లలో కూడా మహిళలకు రక్షణ కరువవుతోంది. మృగాళ్లు... పిశాచాల్లా అవకాశం కోసం కాచుకుని కూర్చొని లైంగిక దాడులకు యత్నిస్తున్నారు. పట్టణంలో కేంద్రాస్పత్రిలో నర్సింగ్ విద్యార్థినిపై లైంగిక దాడికి ఒకరు యత్నించడం ఆస్పత్రి సిబ్బందిలో ఆందోళన రేకెత్తించింది. బరితెగించి... రోగులు, వైద్యులు, ఆస్పత్రిలో ఇతర ఉద్యోగులతో నిత్యం రద్దీగా ఉండే కేంద్రాస్పత్రిలోని క్యాజువాలటీ విభాగంలో శిక్షణ పొందుతున్న నర్సింగ్ విద్యార్థినిపై ఓ ఔట్సోర్సింగ్ ఉద్యోగి శనివారం లైంగిక దాడికి యత్నించాడు. విద్యార్థిని డ్రెస్సింగ్ మెటీరియ ల్ తేవడానికి క్యాజువాలిటీ పక్కన ఉన్న స్టోర్రూంకి వెళ్లింది. దీనిని గమనించిన ఔట్ సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్న ఎంఎన్ఓ( మే ల్ నర్సింగ్ ఆర్డర్) రాము అనే వ్యక్తి ఆమెను వెంబడించి స్టోర్‌రూంలో గడియ పెట్టి లైంగిక దాడికి యత్నించాడు. అంతటితో ఆగకుండా... సూపరింటెండెంట్ నాకు తెలుసని, నీకు ట్రైనింగ్ సర్టిఫకెట్ ఇవ్వకుండా చేస్తానని బెదిరించసాగాడు. ఊహించని పరిణామంతో తీవ్రం గా ఆందోళన చెందిన ఆమె పెద్దగా కేకలు వేసింది. తలుపు తీసుకుని ఏడ్చుకుంటూ బయటకు వచ్చేసింది. ఇది తెలుసుకున్న ఆస్పత్రి సిబ్బంది నిశ్చేష్టులయ్యారు. రెండు నెలల కింద ట ఘోషా ఆస్పత్రిలో ఓ సా్‌టఫ్ నర్సు పై ఆస్పత్రిలో పనిచేస్తున్న సెక్యూరిటీ గార్డు అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఇది మరువక ముందే మరో వ్యక్తి బరితెగించడంతో మహిళా ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. రాజీకి యత్నాలు: బాధితురాలికి అండగా నిల వాల్సిన కొంతమంది సంఘం నాయకులు రాజీకి ప్రయత్నించారు. ఏదో అయిపోయింది , క్షమాపణ చెబుతాడు ఫిర్యాదు వెనక్కి తీసుకోవాలని ఒత్తిడితెచ్చారు. అయితే విద్యార్థి మాత్రం రాజీకి అంగీకరించలేదని తెలిసింది. ఘోషా ఆస్పత్రిలో... వైద్య విధాన్ పరిషత్ ఆస్పత్రుల్లో తరచూ ఇటువంటి సంఘటనలు జరగుతున్నాయి. దీంతో నర్సులు, మహిళా ఉద్యోగులు, ఆస్పత్రి వచ్చే మహిళలు ఆందోళన చెందుతున్నారు. రెండు నెలలు క్రితం ఘోషా ఆస్పత్రిలో ఓ స్టాఫ్‌నర్స్‌పై ఆస్పత్రిలో పనిచేస్తున్న సెక్యూరిటీ గార్డు అసభ్యకరంగా ప్రవర్తించాడు. దీంతో అతన్ని విధులు నుంచి తొలిగించారు. అయితే అతనిపై ఎటువంటి చర్య తీసుకోలేదు. -
ఉస్మానియాలో జీహెచ్ఎంసీ అధికారుల తనిఖీలు
హైదరాబాద్ : ఉస్మానియా ఆస్పత్రిలో జీహెచ్ఎంసీ అధికారులు శనివారం తనిఖీలు నిర్వహించారు. అలాగే విద్యార్థినుల డెంగీ మరణాల నేపథ్యంలో నర్సింగ్ హాస్టల్ వసతి గృహంలో కూడా అధికారులు సోదాలు చేశారు. ఉస్మానియా ఆస్పత్రిలోని నర్సింగ్ హాస్టల్‌కు చెందిన ఇద్దరు విద్యార్థినులు డెంగీ బారినపడి ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. నర్సింగ్ స్కూల్ లో రెండో ఏడాది చదువుతున్న నిరీషా డెంగీతో నిన్న మధ్యాహ్నం మృతి చెందింది. కాగా మెదక్ జిల్లాకు చెందిన నర్సింగ్ విద్యార్థిని మౌనిక డెంగీతో చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున మృతి చెందింది. నర్సింగ్ స్కూ ల్ ప్రిన్సిపాల్,ఉస్మానియా వైద్యాధికారుల నిర్లక్ష్యం వల్లే విద్యార్థులు చనిపోయారని ఆరోపణలు వెల్లువెత్తాయి.ఈ నేపథ్యంలో అధికారులు ఆకస్మికంగా తనిఖీలు చేశారు. -
నర్సింగ్ విద్యార్థినిని కాటేసిన డెంగీ
సాక్షి, సిటీబ్యూరో : గ్రేటర్‌పై ‘బెంజీన్’ భూతం కోరలు చాస్తోంది. వాతావరణంలో ఈ మూలకం మోతాదు శ్రుతి మించుతోంది. ‘సిటీ’జనుల్లో క్యాన్సర్, గుండెపోటు, రక్తహీనత, టీబీ వ్యాధులు ప్రబలడానికి కారణమవుతోంది. క్యూబిక్ మీటరు గాలిలో 5 మైక్రోగ్రాములు దాటకూడని ఈ మూలకం వార్షిక మోతాదు గ్రేటర్లో ఇపుడు 8.4 మైక్రోగ్రాములకు చేరడం ఆందోళన కలిగిస్తోంది. మహానగరంలో వాహనాల సంఖ్య 38 లక్షలకు చేరుకోవడం.. ఇందులో పదేళ్లకు మించిన కాలం చెల్లిన వాహనాలు సుమారు 10 లక్షల మేర ఉండడంతో నగరం పొగచూరుతోంది. మరోవైపు కల్తీ ఇంధనాల వాడకం పెరగడం, పెట్రోలు, డీజీలు వంటి పెట్రో ఉత్పత్తులను విచక్షణారహితంగా వినియోగిస్తుండటం వెరసి బెంజీన్ భూతం జడలు విప్పుతోందని పర్యావరణ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అవధులు దాటితే అనర్థమే తీయటి వాసన గల బెంజీన్ మూలకం మోతాదు అవధులు దాటితే అనర్థమేనని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇది అతి త్వరగా గాలిలో ఆవిరిగా మారుతుంది. దీనికి మండే స్వభావమూ అధికమే. ఈ మూలకం విచ్ఛిన్నం అయ్యేందుకు 10-30 ఏళ్లు పడుతుంది. అంటే వాతావరణంలో సుదీర్ఘకాలం దీని ప్రభావం ఉంటుందన్నమాట. ఇది గాలి ప్రవాహం ద్వారా ఒక చోట నుంచి మరొక చోటకు తరలి వెళుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీని ప్రభావం అధికంగా ఉన్న చోట క్యాన్సర్, గుండెపోటు, రక్తహీనత, టీబీ వ్యాధులు ప్రబలుతాయని పీసీబీ శాస్త్రవేత్త వీరన్న ‘సాక్షి’కి తెలిపారు. వాహన కాలుష్యంతోనే ముప్పు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రస్తుతం అన్నిరకాల వాహనాలు (ద్విచక్రవాహనాలు, కార్లు, జీపులు, బస్సులు, ఆటోలు) కలిపి 38 లక్షలున్నాయి. ఇందులో పదేళ్లకు పైబడిన వాహనాలు పదిలక్షల మేర ఉన్నాయి. ఈ వాహనాల సామర్థ్యం దెబ్బతినడంతో వీటి నుంచి విపరీతంగా పొగ వెలువడుతుంది. ఫలితంగా నగరంలో కాలుష్య మేఘాలు కమ్ముకుంటున్నాయి. అలాగే సిటీలో పెట్రోలుతో నడిచే వాహనాలకు ఏటా 5400 లక్షల లీటర్ల పెట్రోలు, డీజిల్ వాహనాలకు 12వేల లక్షల లీటర్ల డీజిల్ వినియోగిస్తున్నారు. పైగా వాహనాల జాబితాలో ఏటా 1.75 లక్షల నుంచి 2 లక్షల వాహనాలు కొత్తగా వచ్చి చేరుతున్నాయి. ప్రతిరోజు 600 కొత్త వాహనాలు రిజిష్టర్ అవుతున్నట్లు రవాణా అధికారుల అంచనా. కానీ మహానగరంలో రహదారులు 8 శాతం మేరకే అందుబాటులో ఉండడంతో ట్రాఫిక్ రద్దీ పెరిగి ఇంధన వినియోగం అధికమౌతోంది. కాలుష్యం అంతకంతకూ పెరుగుతోంది. ఈ వాయుకాలుష్యంలో బెంజీన్ మోతాదు కూడా ఏటేటా పెరుగుతూ ఉంది. కాగా 2015 నాటికి వాహనాల సంఖ్య 45 లక్షలకు చేరుకోనున్నట్లు రవాణా శాఖ అంచనా వేస్తోంది. చెన్నై, బెంగళూరు, ఢిల్లీ వంటి నగరాలతో పోల్చుకుంటే ప్రస్తుతానికి నగరంలో వాహనాల సంఖ్య తక్కువగానే ఉన్నప్పటికీ వాహన సాంద్రత మాత్రం ఎక్కువగానే ఉంది. పరిశ్రమలు సైతం.. ప్లాస్టిక్, డిటర్జెంట్, క్రిమిసంహారకాలు, రబ్బరు, బల్క్‌డ్రగ్, రసాయన పరిశ్రమల నుంచి వెలువడే వాయువుల్లోనూ బెంజీన్ మోతాదు ఎక్కువగానే ఉన్నట్లు శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. కాలుష్య నియంత్రణ మండలి కళ్లుగప్పి పారిశ్రామికవర్గాలు విడుదల చేస్తున్న వాయువుల్లో బెంజీన్ ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. క్యాన్సర్ ప్రబలడం తథ్యం బెంజీన్ కాలుష్యం వల్ల ఊపిరితిత్తులు, మూత్రకోశ క్యాన్సర్లు ప్రబలే ప్రమాదం ఉంది. నగరంలో ఇటీవల ఈ క్యాన్సర్ల బారిన పడుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. మాస్క్‌లు ధరించినా అవి గాలిని పూర్తిగా ఫిల్టర్ చేయలేవు. కాలంచెల్లిన వాహనాలను రోడ్డెక్కకుండా చేయాలి. కల్తీ ఇంధనాల వినియోగం తగ్గించాలి. వాహనాల్లో యూరో-4 ప్రమాణాలను తప్పనిసరి చేస్తేనే పరిస్థితిలో మార్పు వస్తుంది. - డాక్టర్ మోహనవంశీ, క్యాన్సర్ వైద్యనిపుణుడు, ఒమేగా ఆసుపత్రి