అనంతపురం అర్బన్ : అనంతపురంలోని ఓ నర్సింగ్ కాలేజీలో ద్వితీయ సంవత్సరం చదువుతున్న పరమేశ్వరి(20) అనే విద్యార్థిని శనివారం ఆత్మహత్య చేసుకుంది. హాస్టల్‌లో ఫ్యాన్‌కు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. మృతదేహాన్ని అనంతపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.