Nursing Student Died to Snake Bite - Sakshi
Sakshi News home page

పాముకాటుతో నర్సింగ్‌ విద్యార్థిని షఫీనా మృతి

Published Mon, Aug 14 2023 11:07 AM | Last Updated on Sat, Aug 19 2023 8:31 PM

Nursing student Died To snake bite - Sakshi

వరంగల్: పాముకాటుతో ఓ విద్యార్థిని మృతి చెందింది. ఈ ఘటన సీరోలు మండలం కొత్తూరు(సీ) గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన బీఆర్‌ఎస్‌ నాయకుడు, ఆర్‌ఎంపీ షేక్‌ యాకూబ్‌ కుమార్తె నర్సింగ్‌ విద్యార్థిని షఫీనా(22) శనివారం రాత్రి ఇంట్లో నిద్రిస్తోంది. ఈ సమయంలో పాము కాటు వేసింది. దీంతో షఫీనా లేచి తండ్రి యాకూబ్‌తో ఏదో కుట్టిందని చెప్పింది. ఇంతలోనే షఫీనాకు వాంతులు అవుతుండగా యాకూబ్‌ వెంటనే మహబూబాబాద్‌లోని ఓ ఆస్పత్రికి తరలించారు.

పరిస్థితి విషమించడంతో ఖమ్మంలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందింది. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే రెడ్యానాయక్‌ గ్రామానికి చేరుకుని షఫీనా మృతదేహంపై పూలమాల వేసి నివాళులరి ్పంచారు.

కార్యక్రమంలో కాంపల్లి సొసైటీ చైర్‌పర్సన్‌ కొండపల్లి శ్రీదేవి, బీఆర్‌ఎస్‌ జిల్లా అధికార ప్రతినిధి బజ్జూరి పిచ్చిరెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు తోటలాలయ్య, సర్పంచ్‌ యానాల గంగాధర్‌రెడ్డి, నాయకులు రవి, భిక్షమయ్య,  సత్యనారాయణ, సైదులు, రాందాస్‌నాయక్‌ పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement