తిరువనంతపురం: మహభారతంలో అర్జునుడికి గొప్ప ప్రత్యేకత ఉంది. అదేంటంటే.. ఒకేసారి తన రెండు చేతులను ఉపయోగించి శత్రువులపై బాణాలను వేయగలడు. అందుకే, ఈయనకు సవ్యాసాచి మరొక పేరుతో పిలుస్తారు. అయితే, ఇక్కడ కొందరు రెండు చేతులతో ఒకేసారి రాయడం.. కాలి వేళ్లతో, నోటితో బొమ్మలు గీయడం వంటి కళలో నిష్ణాతులని మనకు తెలిసిందే. ఇక్కడ గొప్పతనం ఏంటంటే.. ఈ యువతి, ఒకేసారి తన రెండు చేతులను, కాళ్లను, నోటిని కూడా ఉపయోగించి బొమ్మలు గీయగలదు. దీంతో ప్రస్తుతం ఈ యువతి వార్తల్లో నిలిచింది.
వివరాలు.. కేరళలోని త్రిషుర్‌కు చెందిన దివ్య అనే యువతి నర్సింగ్ మూడో సంవత్సరం చదువుతుంది. ఆమె గత సంవత్సరం నుంచి లాక్‌డౌన్ కారణంగా ఇంట్లోనే ఉంటూ ఆన్‌లైన్ క్లాస్‌లలో చదువుకుంటుంది. ఈ క్రమంలో ఖాళీ సమయంలో ఏదైనా కొత్తగా చేయాలనుకుంది. ఈ క్రమంలో ఆమె క్యారికేచర్ (వ్యంగ్య బొమ్మలు గీయడం)పై ఆసక్తి పెంచుకుంది. మొదట ఆ యువతి తన కుడిచేత్తో బొమ్మలను గీయడాన్ని నేర్చుకుంది. మెల్లగా దానిలో నైపుణ్యం సాధించింది. అయితే, ఆ తర్వాత ఎడమ చేత్తో కూడా బొమ్మలు గీయటాన్ని ప్రాక్టిస్ చేయడం ప్రారంభించింది.
కొన్ని రోజుల తర్వాత ఎడమ చేతితో కూడా చాలా బాగా బొమ్మలు గీయసాగింది. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. దీనికోసం నా తల్లిదండ్రులు ఎంతగానో ప్రోత్సాహం అందించారని తెలిపింది. కొన్ని రోజులకి నాకు ఒక ఐడియా వచ్చింది.. కాళ్లతో, నోటితో ఎందుకు ప్రయత్నించోద్దు అనుకుని.. వెంటనే దాన్ని అమలులోకి పెట్టేశానని తెలియజేసింది. కొన్ని రోజుల కఠోర శ్రమ తర్వాత .. ఈ నైపుణ్యాన్ని కూడా తన సొంతం చేసుకున్నట్లు వివరించింది. కాగా, ఒకేసారి రెండు చేతులు, కాళ్లు, నోటిని ఉపయోగించి ఒకే చిత్రాన్ని విభిన్న శైలీలో గీస్తానని తెలిపింది.
అయితే, తొలిసారి గీసిన వ్యంగ్య చిత్రానికి కేరళ నటుడు జయసూర్య ప్రశంసలు కురిపించారని తెలియజేసింది. తనకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారని తెలియజేసింది. ఈ ప్రశంస నాలోపల మరింత మనోధైర్యాన్ని, ఉత్సాహన్ని రెట్టింపు చేసిందని తెలిపింది. ఈ సందర్బంగా దీని తర్వాత ఎవరి చిత్రాన్ని గీస్తారని ప్రశ్నించగా.. వెంటనే మళయాళ సూపర్ స్టార్ మమ్ముట్టీ చిత్రాన్ని గీస్తానని తెలిపింది. అయితే, మొదట్లో తనకు ఈ బొమ్మలు గీయడానికి ఆరు గంటల సమయం పట్టేదని, ఇప్పుడు నాలుగు గంటలు మాత్రమే పడుతుందని దివ్య తెలియజేసింది.
Comments
Please login to add a commentAdd a comment