Multi Talented Youngster
-
Aadi Swaroopa: లేడీ రజనీకాంత్.. సూపర్ టాలెంట్.. ‘వైరస్’ను గుర్తు చేసింది!
-
లేడీ రజనీకాంత్.. సూపర్ టాలెంట్.. ‘వైరస్’ను గుర్తు చేసింది!
ఈ అమ్మాయి గురించి తెలిసిన వారందరూ ఆమెను ‘లేడీ రజనీకాంత్’ అంటూ మెచ్చుకుంటున్నారు. ఈ యువతి పేరు ఆది స్వరూప. రెండు చేతులను సరి సమానంగా ఉపయోగించడం ఈమె ప్రత్యేకత. కర్ణాటకలోని మంగళూరుకు చెందిన 17 ఏళ్ల ఈ యువతి తన స్పెషల్ టాలెంట్‌తో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. ఒకే సమయంలో రెండు చేతులతో ఇంగ్లీషు, కన్నడ, తుళు, హిందీ, మళయాలం భాషల్లోనూ రాయగలదు. ఒక నిమిషంలో తన రెండు చేతులతో ఒకే దిశలో 45 పదాలను లిఖించి ఎక్స్‌క్లూజివ్ వరల్డ్ రికార్డు సృష్టించింది. లతా ఫౌండేషన్ ఈ రికార్డును గుర్తించింది. అంతేకాదు కళ్లగు గంతలు కట్టుకుని కూడా రెండు చేతులతో రాసి అందరినీ సంభ్రమాశ్చర్యాలకు గురిచేసింది. స్వరూప సాధించిన రికార్డుకు సంబంధించిన వీడియోలు గతంలో సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తాజాగా ఈ వీడియో ట్విటర్లో రీ షేర్ చేయడంతో మళ్లీ వెలుగులోకి వచ్చింది. నెటిజన్ల ప్రశంసలు ఆమెను ‘లేడీ రజనీకాంత్’ అని ఒకరు ప్రశంసించగా.. ‘త్రి ఇడియట్స్’ హిందీ సినిమాలో ‘వైరస్’పాత్ర చేసిన బొమన్ ఇరానీ గుర్తుకొచ్చారని మరో నెటిజన్ పేర్కొన్నారు. ఆమె ప్రతిభ చాలా ప్రత్యేకమైందని మరికొంత మంది మెచ్చుకున్నారు. స్వరూప గురించి తెలిసిన వారంతా ఆమె గిన్నీస్ రికార్డు సాధిస్తుందని ఆకాంక్షిస్తున్నారు. బహుముఖ ప్రతిభ ఆది స్వరూప.. బహుముఖ ప్రతిభతో ప్రత్యేకమైన గుర్తింపు దక్కించుకుంది. నటన, చిత్రలేఖనం, అనుకరణ(మిమిక్రీ)లోనూ రాణిస్తోంది. ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ 2021లోనూ తన పేరును లిఖించుకుంది. కుటుంబ సభ్యులతో కలిసి తరచుగా పర్యాటక ప్రాంతాల విహారానికి వెళ్లే స్వరూపకు జంతువులన్నా, పక్షులన్నా ఎంతో ప్రేమ. అన్నట్టు తన వీడియోలు, ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తుంటుంది. పాకిస్తాన్ బౌలర్ రికార్డు రెండు చేతులతో సమానంగా ఉపయోగించి పాకిస్తాన్ బౌలర్ యాసిర్ జాన్ 2017లో గిన్నీస్ రికార్డుకు ఎక్కాడు. తన కుడి చేతితో 145, ఎడమ చేతితో 135 కిలోమీటర్ల స్పీడ్‌తో బౌలింగ్ చేసి అతడు ఈ ఘనత సాధించాడు. -
ఒకే చిత్రాన్ని.. ఒకేసారి చేతులు, కాళ్లు, నోటితో భిన్న శైలీలో
తిరువనంతపురం: మహభారతంలో అర్జునుడికి గొప్ప ప్రత్యేకత ఉంది. అదేంటంటే.. ఒకేసారి తన రెండు చేతులను ఉపయోగించి శత్రువులపై బాణాలను వేయగలడు. అందుకే, ఈయనకు సవ్యాసాచి మరొక పేరుతో పిలుస్తారు. అయితే, ఇక్కడ కొందరు రెండు చేతులతో ఒకేసారి రాయడం.. కాలి వేళ్లతో, నోటితో బొమ్మలు గీయడం వంటి కళలో నిష్ణాతులని మనకు తెలిసిందే. ఇక్కడ గొప్పతనం ఏంటంటే.. ఈ యువతి, ఒకేసారి తన రెండు చేతులను, కాళ్లను, నోటిని కూడా ఉపయోగించి బొమ్మలు గీయగలదు. దీంతో ప్రస్తుతం ఈ యువతి వార్తల్లో నిలిచింది. వివరాలు.. కేరళలోని త్రిషుర్కు చెందిన దివ్య అనే యువతి నర్సింగ్ మూడో సంవత్సరం చదువుతుంది. ఆమె గత సంవత్సరం నుంచి లాక్డౌన్ కారణంగా ఇంట్లోనే ఉంటూ ఆన్లైన్ క్లాస్‌లలో చదువుకుంటుంది. ఈ క్రమంలో ఖాళీ సమయంలో ఏదైనా కొత్తగా చేయాలనుకుంది. ఈ క్రమంలో ఆమె క్యారికేచర్ (వ్యంగ్య బొమ్మలు గీయడం)పై ఆసక్తి పెంచుకుంది. మొదట ఆ యువతి తన కుడిచేత్తో బొమ్మలను గీయడాన్ని నేర్చుకుంది. మెల్లగా దానిలో నైపుణ్యం సాధించింది. అయితే, ఆ తర్వాత ఎడమ చేత్తో కూడా బొమ్మలు గీయటాన్ని ప్రాక్టిస్ చేయడం ప్రారంభించింది. కొన్ని రోజుల తర్వాత ఎడమ చేతితో కూడా చాలా బాగా బొమ్మలు గీయసాగింది. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. దీనికోసం నా తల్లిదండ్రులు ఎంతగానో ప్రోత్సాహం అందించారని తెలిపింది. కొన్ని రోజులకి నాకు ఒక ఐడియా వచ్చింది.. కాళ్లతో, నోటితో ఎందుకు ప్రయత్నించోద్దు అనుకుని.. వెంటనే దాన్ని అమలులోకి పెట్టేశానని తెలియజేసింది. కొన్ని రోజుల కఠోర శ్రమ తర్వాత .. ఈ నైపుణ్యాన్ని కూడా తన సొంతం చేసుకున్నట్లు వివరించింది. కాగా, ఒకేసారి రెండు చేతులు, కాళ్లు, నోటిని ఉపయోగించి ఒకే చిత్రాన్ని విభిన్న శైలీలో గీస్తానని తెలిపింది. అయితే, తొలిసారి గీసిన వ్యంగ్య చిత్రానికి కేరళ నటుడు జయసూర్య ప్రశంసలు కురిపించారని తెలియజేసింది. తనకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారని తెలియజేసింది. ఈ ప్రశంస నాలోపల మరింత మనోధైర్యాన్ని, ఉత్సాహన్ని రెట్టింపు చేసిందని తెలిపింది. ఈ సందర్బంగా దీని తర్వాత ఎవరి చిత్రాన్ని గీస్తారని ప్రశ్నించగా.. వెంటనే మళయాళ సూపర్ స్టార్ మమ్ముట్టీ చిత్రాన్ని గీస్తానని తెలిపింది. అయితే, మొదట్లో తనకు ఈ బొమ్మలు గీయడానికి ఆరు గంటల సమయం పట్టేదని, ఇప్పుడు నాలుగు గంటలు మాత్రమే పడుతుందని దివ్య తెలియజేసింది. చదవండి: ఆమె ఆరోగ్యం బాగు చేయడానికి ఆ దేవుడే ఇలా వచ్చాడేమో! -
పల్టీ టాస్కింగ్
చీర ఎటూ కదలనివ్వదు. చుట్టుకుని ఉండేది ఒంటికే.. మనసును బంధించేస్తుంది! బైక్‌ని నడపనిస్తుందా?బ్యాటింగ్ చేయనిస్తుందా? ఫుట్‌బాల్ ఆడనిస్తుందా? ఎత్తయిన మెట్టు ఎక్కనిస్తుందా? ఒక్క గెంతులో దూకనిస్తుందా?నాన్–అథ్లెటిక్.. పవర్‌లెస్. అవునా!మరి ఈ పవర్‌ని ఏమందాం? పచ్చటి చెట్ల మధ్య సన్నటి మట్టి దారి. అదెక్కడి ప్రదేశమో తెలియదు. వంగపండు రంగు బ్లవుజు, ఎల్లో శారీలో ఉన్న ఒక యువతి కాళ్లకు చెప్పుల్లేకుండా, ఆ గతుకుల దారిలోనే గాలిలోకి ఎగిరి వెనక్కి పల్టీ కొట్టడం రెండు నెలల క్రితం సోషల్ మీడియాలో వైరల్ అయింది. 360 డిగ్రీలలో గుండ్రంగా ఆమె వెనక్కు ‘ఫ్లిప్’ అవడం కాదు ఆశ్చర్యం. చీరలో.. చీరలో అలా సినిమాటిక్‌గా తిరగడం! వావ్ అనీ, వాట్ ఎ టాలెంట్ అనీ, దేశవాళీ సూపర్ ఉమన్ అనీ, జా డ్రాపింగ్ ఫ్లిప్ అని, ఫ్యాంటాస్టిక్ సోమర్సాల్ట్ (వృత్త విన్యాసం) అనీ కామెంట్స్ వచ్చాయి. అలా అందరికీ ఆమె తెలుసు. కానీ ఆమె ఎవరో ఈరోజుకీ ఎవరికీ తెలీదు. సంగీత వారియర్ అనే పేరు మీద ఉన్న ఒక ట్విట్టర్ అకౌంట్లో ‘ఇండియన్ ఉమెన్ ఆర్ రియల్లీ సూపర్ ఉమెన్’ అనే అభినందనతో ఈ క్లిప్ షేర్ అయింది. క్రీడలు, యువజన కార్యక్రమాల కేంద్ర సహాయ మంత్రి కిరేర్ రిజిజు కూడా ఆ వీడియోను ట్యాగ్ చేశారు. ‘ఎక్స్లెంట్’ అని కామెంట్ పెట్టారు. నెటిజన్లు ఆ అజ్ఞాత యువతిలోని విన్యాస నైపుణ్యాన్ని ప్రపంచం దృష్టికి తెచ్చినందుకు సంగీతకు కూడా అభినందనలు, ఆ తర్వాత ధన్యవాదాలు తెలిపారు. పారుల్ ఫ్రంట్ పల్టీ రెండు నెలలు గడిచాయి. ఇప్పుడు మరో యువతి అదే ‘ఫీట్’తో ఆ ఎల్లో శారీ యువతిని గుర్తుకు తెచ్చింది. ఎల్లో శారీ వెనక్కు పల్టీ కొడితే, ఈ బ్లూ శారీ ముందుకు పల్టీ కొట్టింది. రెండు విన్యాసాలూ కష్టమైనవే. చీరలో మరీ కష్టమైనవి. ఈ బ్లూ శారీ అమ్మాయిది హర్యానాలోని అంబాలా. తనే ఈ వీడియోను అప్లోడ్ చేసింది. పద్నాలుగేళ్లుగా తను జిమ్మాస్టిక్స్ చేస్తోందట. అంతకుమించిన వివరాలను ఈ యువతి తన గురించి చెప్పుకోలేదు. ఇలా గుండ్రంగా గాలిలోకి లేచి ఫ్లిప్ కొట్టడానికి ప్రయత్నించి రెండుసార్లు విఫలం అయ్యాక మూడోసారి విజయం సాధించానని మాత్రం చెప్పింది. ‘‘ఇదేం విజయం! ఎందుకైనా పనికొచ్చేదా!’’ అని ఒకరిద్దరు ట్రోల్ కూడా చేశారట. అలాంటివి పట్టించుకుంటే గాల్లోకి లేవడం అటుంచి, కనీసం భూమి మీద నాలుగు అడుగులైనా వేయలేం అంటోంది పారుల్. గట్టి మాటే. ఫెమినిస్ట్ స్టేట్మెంట్. ‘ఎల్లో శారీ’ బ్యాక్ పల్టీ -
రైజింగ్ రాజ్
ఈ అబ్బాయి పేరు రాజ్. అతని వయసెంతో తెలుసా? జస్ట్... 22 ఇయర్స్! బట్, రాజ్ గురించి చెప్పాలంటే జస్ట్ అనే పదం చాలదు. ఎందుకంటే... ఇతను పియానో ప్లేయర్, యాక్టర్, మ్యూజిక్ డైరెక్టర్ అండ్ మ్యూజిక్ ప్రొడ్యూసర్. యస్.. హి ఈజ్ మల్టీ టాలెంటెడ్ యంగ్‌స్టర్. అతి చిన్న వయసులో ‘రాయల్ స్కూల్ ఆఫ్ మ్యూజిక్ ఆఫ్ లండన్’ (ఆర్ఎస్ఎమ్) లో వెస్ట్రన్ క్లాసికల్ పియానోలో అన్ని గ్రేడులు కంప్లీట్ చేసిన టీనేజర్. సంగీతంపై తనకున్న ప్రేమ గురించి రాజ్ చెబుతూ – ‘‘ఆరేళ్ల వయసులో నాకు సంగీతం అంటే ఇష్టం ఏర్పడింది. నా పేరెంట్స్ ప్రోత్సాహంతో 12 ఏళ్లకు ఆర్ఎస్ఎమ్లో పియానోలో ఆల్ గ్రేడ్స్ కంప్లీట్ చేశా’’ అన్నారు. అలాగే, కర్ణాటక సంగీతంలో నూకల చినసత్యనారాయణ వద్ద శిక్షణ తీసుకున్నారు. జాజ్ పియానోలో స్పెషలైజేషన్ చేశారు. ఆ తర్వాత మ్యూజిక్ వీడియోలు చేసి... ఫేస్బుక్, యూట్యూబ్‌లలో అప్లోడ్ చేసేవారు. ఇతని మ్యూజిక్ వీడియోలు ఎంత హిట్ అంటే... రాజ్ యూట్యూబ్ ఛానల్ ‘బికాజ్ రాజ్’ను 30 వేల మందికి పైగా సబ్‌స్క్రైబ్ అయ్యారు. ఫేస్బుక్ పేజ్ ‘బికాజ్ రాజ్’ను 70 వేల మందికి పైగా లైక్ చేశారు. సోషల్ మీడియాలో ఈ యంగ్‌స్టర్ ఫాలోయింగ్, మ్యూజిక్ వీడియోలు చూసి ‘బెస్ట్ ఫ్రెండ్స్ ఫరెవర్’ దర్శక–నిర్మాతలు తమ సినిమాకు మ్యూజిక్ చేయమని అడిగారు. ఆ సినిమా చేసిన తర్వాత ఈడీఎమ్ (ఎలక్ట్రానిక్ డ్యాన్స్ మ్యూజిక్)పై రాజ్ దృష్టి పెట్టారు. ప్రముఖ సంగీత దర్శకులు లూక్, ఎం.ఎం. కీరవాణి తదితరుల వద్ద పనిచేశారు. సంగీతంలో సాఫీగా వెళ్తున్న రాజ్‌కి యాక్టింగ్ అంటే ఇష్టం ఏర్పడింది. యాక్టింగ్ వైపు ఎందుకొచ్చారు? అని ఆయన్ను అడిగితే... ‘‘మ్యూజిక్ వీడియోలు చేస్తున్న టైమ్‌లో నటనపై ఆసక్తి ఏర్పడింది. ‘వైజాగ్’ సత్యానంద్‌గారి దగ్గర నటనలో శిక్షణ తీసుకున్నా. తర్వాత పూరి జగన్నాథ్‌గారి ‘ఇజం’లో హీరో కల్యాణ్‌రామ్ స్నేహితుల్లో ఒకరిగా, హ్యాకర్‌గా నటించా. నిజం చెప్పాలంటే... పూరిగారు నా మ్యూజిక్ విని కాల్ చేశారు. కలసిన తర్వాత ‘నువ్వెందుకు నటించకూడదు?’ అనడిగారాయన. ‘ఫైన్, లెట్స్ డూ థిస్’ అని నటించా. రీసెంట్గా ‘రెండర్’ అనే షార్ట్‌ఫిల్మ్ చేశా. మంచి ఛాన్సులు వస్తే నటించడానికి నేను రెడీ’’ అన్నారు. పియానో ప్లేయర్‌గా, నటుడిగా, సంగీత దర్శకుడిగా సక్సెస్‌ఫుల్‌గా అడుగులు వేసిన రాజ్ ప్రస్తుతం తెలుగు సంగీత ప్రపంచంలో కొత్త ట్రెండ్ సృష్టించడానికి సిద్ధమయ్యారు. ఓ మ్యూజిక్ ప్రొడక్షన్ కంపెనీ స్టార్ట్ చేశారు. ఈ కంపెనీ ప్రత్యేకత ఏంటంటే... సంగీత దర్శకులకు అవసరమైన టూల్స్‌ను ప్రొడ్యూస్ చేస్తుంది. ఎవరైనా ఈ కంపెనీ నుంచి తమ సినిమాకు అనువైన మ్యూజిక్‌ను కొనుక్కోవచ్చు. ఆ మ్యూజిక్‌ను సాంగ్స్, రీ–రికార్డింగ్స్‌లో ఉపయోగించుకోవచ్చు. ఈ కాన్సెప్ట్ గురించి రాజ్ మాట్లాడుతూ– ‘‘సాధారణంగా మన సంగీత దర్శకులు తమకు అవసరమైన మ్యూజిక్ సాంపిల్స్, ఈడీఎమ్స్ను ఫారిన్ దేశాల నుంచి కొనుక్కుంటారు. మనకు, ఫారిన్‌కు మధ్య కల్చరల్ డిఫరెన్స్ ఎక్కువ ఉండడంతో ఇండియన్ సౌండ్‌ను మిస్ అవుతున్నాం. మ్యూజిక్ సాంపిల్ లైబ్రరీల్లో ఇండియన్ సౌండ్ ఎక్కడా వినిపించదు. అందువల్ల, మన సంగీత దర్శకులు ఎక్కువగా లైవ్ ఇన్స్ట్రుమెంట్స్ ఉపయోగిస్తున్నారు. అందుకు బడ్జెట్ ఎక్కువవుతుంది. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే... ఇండియన్ సౌండ్, మ్యూజిక్‌ను ప్రొడ్యూస్ చేస్తున్నా. బడ్జెట్ ఉన్నా టైమ్ లేనోళ్లు, లో బడ్జెట్లో మంచి మ్యూజిక్ కావాలనుకునే ‘బికాజ్ రాజ్ డాట్ కామ్’ వెబ్సైట్ ద్వారా నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. హైదరాబాద్‌లో నాకో సొంత స్టూడియో ఉంది’’ అన్నారు. ప్రస్తుతం రాజ్ ఓ తెలుగు సినిమా, మరో హిందీ సినిమాకు, కొన్ని వెబ్ సిరీస్‌లకు సంగీతమందిస్తున్నారు.