రైజింగ్‌ రాజ్‌ | At age of six, I liked music. | Sakshi
Sakshi News home page

రైజింగ్‌ రాజ్‌

Published Sun, Jul 30 2017 12:40 AM | Last Updated on Tue, Sep 5 2017 5:10 PM

రైజింగ్‌ రాజ్‌

రైజింగ్‌ రాజ్‌

ఈ అబ్బాయి పేరు రాజ్‌. అతని వయసెంతో తెలుసా? జస్ట్‌... 22 ఇయర్స్‌! బట్, రాజ్‌ గురించి చెప్పాలంటే జస్ట్‌ అనే పదం చాలదు. ఎందుకంటే... ఇతను పియానో ప్లేయర్, యాక్టర్, మ్యూజిక్‌ డైరెక్టర్‌ అండ్‌ మ్యూజిక్‌ ప్రొడ్యూసర్‌. యస్‌.. హి ఈజ్‌ మల్టీ టాలెంటెడ్‌ యంగ్‌స్టర్‌. అతి చిన్న వయసులో ‘రాయల్‌ స్కూల్‌ ఆఫ్‌ మ్యూజిక్‌ ఆఫ్‌ లండన్‌’ (ఆర్‌ఎస్‌ఎమ్‌) లో వెస్ట్రన్‌ క్లాసికల్‌ పియానోలో అన్ని గ్రేడులు కంప్లీట్‌ చేసిన టీనేజర్‌.
సంగీతంపై తనకున్న ప్రేమ గురించి రాజ్‌ చెబుతూ – ‘‘ఆరేళ్ల వయసులో నాకు సంగీతం అంటే ఇష్టం ఏర్పడింది. నా పేరెంట్స్‌ ప్రోత్సాహంతో 12 ఏళ్లకు ఆర్‌ఎస్‌ఎమ్‌లో పియానోలో ఆల్‌ గ్రేడ్స్‌ కంప్లీట్‌ చేశా’’ అన్నారు. అలాగే, కర్ణాటక సంగీతంలో నూకల చినసత్యనారాయణ వద్ద శిక్షణ తీసుకున్నారు. జాజ్‌ పియానోలో స్పెషలైజేషన్‌ చేశారు. ఆ తర్వాత మ్యూజిక్‌ వీడియోలు చేసి... ఫేస్‌బుక్, యూట్యూబ్‌లలో అప్‌లోడ్‌ చేసేవారు.

ఇతని మ్యూజిక్‌ వీడియోలు ఎంత హిట్‌ అంటే... రాజ్‌ యూట్యూబ్‌ ఛానల్‌ ‘బికాజ్‌ రాజ్‌’ను 30 వేల మందికి పైగా సబ్‌స్క్రైబ్‌ అయ్యారు. ఫేస్‌బుక్‌ పేజ్‌ ‘బికాజ్‌ రాజ్‌’ను 70 వేల మందికి పైగా లైక్‌ చేశారు. సోషల్‌ మీడియాలో ఈ యంగ్‌స్టర్‌ ఫాలోయింగ్, మ్యూజిక్‌ వీడియోలు చూసి ‘బెస్ట్‌ ఫ్రెండ్స్‌ ఫరెవర్‌’ దర్శక–నిర్మాతలు తమ సినిమాకు మ్యూజిక్‌ చేయమని అడిగారు. ఆ సినిమా చేసిన తర్వాత ఈడీఎమ్‌ (ఎలక్ట్రానిక్‌ డ్యాన్స్‌ మ్యూజిక్‌)పై రాజ్‌ దృష్టి పెట్టారు. ప్రముఖ సంగీత దర్శకులు లూక్, ఎం.ఎం. కీరవాణి తదితరుల వద్ద పనిచేశారు. సంగీతంలో సాఫీగా వెళ్తున్న రాజ్‌కి యాక్టింగ్‌ అంటే ఇష్టం ఏర్పడింది.

యాక్టింగ్‌ వైపు ఎందుకొచ్చారు? అని ఆయన్ను అడిగితే... ‘‘మ్యూజిక్‌ వీడియోలు చేస్తున్న టైమ్‌లో నటనపై ఆసక్తి ఏర్పడింది. ‘వైజాగ్‌’ సత్యానంద్‌గారి దగ్గర నటనలో శిక్షణ తీసుకున్నా. తర్వాత పూరి జగన్నాథ్‌గారి ‘ఇజం’లో హీరో కల్యాణ్‌రామ్‌ స్నేహితుల్లో ఒకరిగా, హ్యాకర్‌గా నటించా. నిజం చెప్పాలంటే... పూరిగారు నా మ్యూజిక్‌ విని కాల్‌ చేశారు. కలసిన తర్వాత ‘నువ్వెందుకు నటించకూడదు?’ అనడిగారాయన. ‘ఫైన్, లెట్స్‌ డూ థిస్‌’ అని నటించా. రీసెంట్‌గా ‘రెండర్‌’ అనే షార్ట్‌ఫిల్మ్‌ చేశా. మంచి ఛాన్సులు వస్తే నటించడానికి నేను రెడీ’’ అన్నారు.

పియానో ప్లేయర్‌గా, నటుడిగా, సంగీత దర్శకుడిగా సక్సెస్‌ఫుల్‌గా అడుగులు వేసిన రాజ్‌ ప్రస్తుతం తెలుగు సంగీత ప్రపంచంలో కొత్త ట్రెండ్‌ సృష్టించడానికి సిద్ధమయ్యారు. ఓ మ్యూజిక్‌ ప్రొడక్షన్‌ కంపెనీ స్టార్ట్‌ చేశారు. ఈ కంపెనీ ప్రత్యేకత ఏంటంటే... సంగీత దర్శకులకు అవసరమైన టూల్స్‌ను ప్రొడ్యూస్‌ చేస్తుంది.

ఎవరైనా ఈ కంపెనీ నుంచి తమ సినిమాకు అనువైన మ్యూజిక్‌ను కొనుక్కోవచ్చు. ఆ మ్యూజిక్‌ను సాంగ్స్, రీ–రికార్డింగ్స్‌లో ఉపయోగించుకోవచ్చు. ఈ కాన్సెప్ట్‌ గురించి రాజ్‌ మాట్లాడుతూ– ‘‘సాధారణంగా మన సంగీత దర్శకులు తమకు అవసరమైన మ్యూజిక్‌ సాంపిల్స్, ఈడీఎమ్స్‌ను ఫారిన్‌ దేశాల నుంచి కొనుక్కుంటారు. మనకు, ఫారిన్‌కు మధ్య కల్చరల్‌ డిఫరెన్స్‌ ఎక్కువ ఉండడంతో ఇండియన్‌ సౌండ్‌ను మిస్‌ అవుతున్నాం. మ్యూజిక్‌ సాంపిల్‌ లైబ్రరీల్లో ఇండియన్‌ సౌండ్‌ ఎక్కడా వినిపించదు.

అందువల్ల, మన సంగీత దర్శకులు ఎక్కువగా లైవ్‌ ఇన్‌స్ట్రుమెంట్స్‌ ఉపయోగిస్తున్నారు. అందుకు బడ్జెట్‌ ఎక్కువవుతుంది. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే... ఇండియన్‌ సౌండ్, మ్యూజిక్‌ను ప్రొడ్యూస్‌ చేస్తున్నా. బడ్జెట్‌ ఉన్నా టైమ్‌ లేనోళ్లు, లో బడ్జెట్‌లో మంచి మ్యూజిక్‌ కావాలనుకునే ‘బికాజ్‌ రాజ్‌ డాట్‌ కామ్‌’ వెబ్‌సైట్‌ ద్వారా నన్ను కాంటాక్ట్‌ చేయొచ్చు. హైదరాబాద్‌లో నాకో సొంత స్టూడియో ఉంది’’ అన్నారు. ప్రస్తుతం రాజ్‌ ఓ తెలుగు సినిమా, మరో హిందీ సినిమాకు, కొన్ని వెబ్‌ సిరీస్‌లకు సంగీతమందిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement