కేరళ ప్రభుత్వం ఏర్పాటు చేసిన హేమా కమిషన్ చిత్ర పరిశ్రమల్లో సంచలనం అయిన నేపథ్యంలో నటి రోహిణి అధ్యక్షతన ఇటీవల కోలీవుడ్‌లో ఈ తరహా కమిటీని ఏర్పాటు చేశారు. ఇక తాజాగా డా. కాంతరాజ్ ఇటీవల ఓ యూట్యూబ్ చానల్‌కు ఇచ్చిన భేటీలో సినీ పరిశ్రమలో అవకాశాల కోసం నటీమణులు అడ్జెస్ట్ అవుతారనే విధంగా మాట్లాడారు. ఈ వ్యాఖ్యలకు స్పందించి... ‘‘సోషల్ మీడియాలో వ్యూస్ కోసం ఆయన ఈ విధంగా మాట్లాడారు.
ఎలాంటి ఆధారాలు లేకుండా నటీమణుల గురించి వైరల్ కంటెంట్‌ని విడుదల చేశారు’’ అంటూ చెన్నైపోలీస్ కార్యాలయంలో కాంతరాజ్‌పై రోహిణి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో చెన్నై సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్‌పోలీసులు ఈ కేసుపై విచారణ చేపట్టారు. కాంతరాజ్‌పై ఐదు సెక్షన్లతో కేసు నమోదు చేశారు. – సాక్షి సినిమా ప్రతినిధి, చెన్నై
Comments
Please login to add a commentAdd a comment