Raj
-
అమెరికాలో సగం సినిమా
ఆదర్శ్ పుందిర్, అశ్రిత్ రెడ్డి, ప్రియాంకా సింగ్, పూజిత పుందిర్, రాజ్ గౌడ్, సునందిని, మధుసూదన్ కీలక పాత్రల్లో ఓ సినిమా రూపొందుతోంది. ఘంటసాల విశ్వనాథ్ దర్శకత్వం వహిస్తు న్నారు. స్ప్లాష్ కలర్స్ మీడియా, అలీనియ అవిజ్ఞ స్టూడియోస్, సెటిల్ కింగ్ ప్రొడక్షన్‌పై వేణుబాబు నిర్మిస్తున్నారు. ఘంటసాల విశ్వనాథ్ మాట్లాడుతూ– ‘‘టెక్నాలజీ, భావోద్వేగాలు, లింగ సమానత్వం నేపథ్యంలో ఈ మూవీ రూపొందుతోంది. డిసెంబరు 26న ఆరంభమైన ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ 50 శాతం పూర్తయింది. మిగతా సగభాగం షూటింగ్ కోసం అమెరికా వెళ్తున్నాం’’ అన్నారు. ప్రియాంకా సింగ్ మాట్లాడుతూ– ‘‘ఈ మూవీలో దర్శక–నిర్మాతలు నాకు చాలా మంచి పాత్ర ఇచ్చారు. ఈ రోజుల్లో ఇటువంటి సినిమాలు రావడం లేదు’’ అని చెప్పారు. ‘‘ఈ సినిమాలో టెక్నాలజీ అనేది కీలక ΄ాత్ర పోషించబోతోంది’’ అన్నారు ఆదర్శ్ పందిరి. ‘‘లింగ సమానత్వంపై వినోదాత్మకంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది’’ అని పూజిత పుందిర్, నటుడు అశ్రిత్ రెడ్డి చెప్పారు. కెమెరామేన్ దిలీప్ కుమార్ చిన్నయ్య మాట్లాడారు. ఈ చిత్రానికి సంగీతం: పవన్ చరణ్, జీవీ. -
రాజ్ పాకాల నివాసంలో ముగిసిన సోదాలు
-
రోహిణి ఫిర్యాదుతో డా. కాంతరాజ్‌పై కేసు
కేరళ ప్రభుత్వం ఏర్పాటు చేసిన హేమా కమిషన్ చిత్ర పరిశ్రమల్లో సంచలనం అయిన నేపథ్యంలో నటి రోహిణి అధ్యక్షతన ఇటీవల కోలీవుడ్‌లో ఈ తరహా కమిటీని ఏర్పాటు చేశారు. ఇక తాజాగా డా. కాంతరాజ్ ఇటీవల ఓ యూట్యూబ్ చానల్‌కు ఇచ్చిన భేటీలో సినీ పరిశ్రమలో అవకాశాల కోసం నటీమణులు అడ్జెస్ట్ అవుతారనే విధంగా మాట్లాడారు. ఈ వ్యాఖ్యలకు స్పందించి... ‘‘సోషల్ మీడియాలో వ్యూస్ కోసం ఆయన ఈ విధంగా మాట్లాడారు.ఎలాంటి ఆధారాలు లేకుండా నటీమణుల గురించి వైరల్ కంటెంట్‌ని విడుదల చేశారు’’ అంటూ చెన్నైపోలీస్ కార్యాలయంలో కాంతరాజ్‌పై రోహిణి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో చెన్నై సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్పోలీసులు ఈ కేసుపై విచారణ చేపట్టారు. కాంతరాజ్‌పై ఐదు సెక్షన్లతో కేసు నమోదు చేశారు. – సాక్షి సినిమా ప్రతినిధి, చెన్నై -
‘రేణుకాస్వామి ఇంటికి వెళ్లింది రాజీ కోసం కాదు’
దొడ్డబళ్లాపురం: పరప్పన అగ్రహార జైలులో దర్శన్‌ను కలిసిన నటుడు వినోద్ రాజ్ కొన్ని రోజుల వ్యవధిలోనే రేణుకాస్వామి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించడంపై సామాజిక మాధ్యమాల్లో ట్రోల్స్ వస్తున్నాయి. దర్శన్, రేణుకాస్వామి కుటుంబం మధ్య రాజీ చేయడానికి వినోద్‌రాజ్ వెళ్లారని వదంతులు వినిపిస్తున్నాయి.ఇందుకు సంబంధించి వివరణ ఇచ్చిన వినోద్ రాజ్...తోటి ఆర్టిస్టు అనే అభిమానంతో, దర్శన్‌తో ఉన్న అనుబంధం నేపథ్యంలో దర్శన్‌ను జైలుకు వెళ్లి కలిశానన్నారు. మానవత్వం కోణంలో ఆలోచించి ఆ కుటుంబానికి ఏమైనా సాయం చేద్దామని రేణుకాస్వామి కుటుంబ సభ్యులను కలిశానని, రాజీ కుదిర్చే ఉద్దేశం ఆలోచన తనకు లేవన్నారు. -
ఐదు భాషల్లో జాలరి
శ్రీహరి హీరోగా రాజ్ తాళ్లూరి దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘జాలరి’ సినిమాప్రారంభోత్సవం హైదరాబాద్‌లో జరిగింది. తొలి సన్నివేశానికి దర్శకుడు సముద్ర కెమెరా స్విచ్చాన్ చేసి, స్క్రిప్ట్‌ను నిర్మాతలకు అందించారు. ఐదు భాషల్లో ‘జాలరి’ని ఎమ్‌వై3 ప్రోడక్షన్స్ పతాకంపై ఆదిత్య పల్లా, రఘు కుడితిపూడి, సాయికిరణ్ బత్తుల, రక్తం దశరథ్ గౌడ్ నిర్మించనున్నారు. ‘‘1980 నేపథ్యంలో కమర్షియల్ ఫార్మాట్లో తెరకెక్కనున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్‌ను ఫిబ్రవరిలో ప్రారంభిస్తాం’’ అని యూనిట్ పేర్కొంది. -
మహాప్రస్థానంలో సంగీత దర్శకుడు రాజ్ అంత్యక్రియలు
ప్రముఖ సంగీత దర్శకుడు రాజ్(68) ఇక లేరు. ఆదివారం నాడు హైదరాబాద్‌లోని స్వగృహంలో ఆయన గుండెపోటుతో కన్నుమూశారు. ఆయన మరణంపై చిత్రపరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. కాగా సోమవారం ఉదయం రాజ్ అంతిమ యాత్ర ప్రారంభమైంది. కూకట్పల్లి హౌసింగ్ బోర్డు నుంచి మహాప్రస్థానం వరకు ఈ అంతిమయాత్ర కొనసాగింది. మహా ప్రస్థానంలో కోటి ,శివాజిరాజా , కాశీ విశ్వనాథ్ , జయంత్ , నల్లమల్లపు బుజ్జి తదితరులు రాజ్ మృతదేహాన్ని సందర్శించి ఆయనకు నివాళులు అర్పించారు. కాసేపటి క్రితమే మహాప్రస్థానంలో రాజ్ అంత్యక్రియలు ముగిశాయి. రాజ్ పెద్దల్లుడు కృష్ణంరాజు ఆయన అంతిమ సంస్కారాలు నిర్వహించారు. రాజ్ సినీప్రస్థానం మొదలైందిలా.. రాజ్ అసలు పేరు తోటకూర సోమరాజు. ప్రముఖ సంగీత దర్శకుడు టీవీ రాజు, సావిత్రి దంపతుల రెండో సంతానమే రాజ్. 1954 జూలై 7న జన్మించారు. చిన్నప్పటి నుంచి సినీ వాతావరణంలో, ముఖ్యంగా సంగీత నేపథ్యంలో పెరగడంతో రాజ్‌కు సంగీతంపై ఓ అవగాహన ఉండేది. చిన్నప్పటి నుంచే తండ్రి దగ్గర సంగీతం నేర్చుకున్నారు. ఓవైపు ఇంటర్ చదువుతూ మరోవైపు ప్రముఖ సంగీత దర్శకుడు సాలూరి హనుమంతరావు వద్ద అసిస్టెంట్‌గా చేరారు. అ సమయంలో తన తండ్రి మరణించడంతో కొద్దిరోజులు ఏం చేయకుండా ఉండిపోయిన రాజ్ తర్వాత ప్రముఖ సంగీత దర్శకుడు ఎస్పీ కోదండపాణి వద్ద అసిస్టెంట్‌గా చేరారు. ఓ ఏడాది అవగానే సాలూరి రాజేశ్వరరావు వద్ద అసిస్టెంట్‌గా చేరి ఆరేళ్లు పని చేశారు. సాలూరి రాజేశ్వరరావు కుమారుల్లో ఒకరైన కోటితో రాజ్‌కు మంచి స్నేహం ఏర్పడింది. ఆయనతో కలిసి ఎన్నో సినిమాలకు సంగీతం అందించి రాజ్-కోటి ద్వయంగా పేరు తెచ్చుకున్నారు.. సోలో మ్యూజిక్ డైరెక్టర్‌గానూ రాజ్ పలు చిత్రాలకు పని చేశారు. చదవండి: మమ్మల్ని కాలమే కలిపింది, కాలమే విడదీసింది: కోటి -
విడిపోవద్దురా అన్నాను.. కన్నీళ్లు పెట్టుకున్న కోటి
రాజ్- కోటి ద్వయం టాలీవుడ్లో తెలియని వారు ఉండరు. వారిద్దరు కలిసి ఎన్నో సూపర్ హిట్ చిత్రాలకు సంగీతమందించారు. ముఠామేస్త్రి, హలోబ్రదర్స్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చామన్నారు. ఆదివారం రాజ్ గుండెపోటుతో మృతి చెందడంతో ఆయన సహచరుడు కోటి తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. మా పాటల రూపంలో రాజ్ ఎప్పటికీ బతికే ఉంటారని ఆయన అన్నారు. రాజ్‌కి నేను ఒక తమ్ముడిలాంటి వాడినని కన్నీళ్లు పెట్టుకున్నారు. తనతో కలిసి చేసిన ఎన్నో సినిమాలు, వాటిలోని పాటలు ఇప్పటికీ ఎవర్ గ్రీన్‌గానే ఉంటాయన్నారు. (ఇది చదవండి: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ సంగీత దర్శకుడు కన్నుమూత) సంగీత దర్శకుడు కోటి మాట్లాడుతూ.. 'నేను ప్రస్తుతం చెన్నైలో ఉన్నా. కాసేపటి క్రితమే ఈ వార్త విన్నా. నా రాజ్ చనిపోయారనే వార్తను జీర్ణించుకోలేకపోతోన్నా. మొన్న ఈ మధ్యే ఓ సినిమా ఫంక్షన్లో కలుసుకున్నాం. ఆరోగ్య సమస్యలున్నట్టుగా నాకు అనిపించలేదు. రాజ్ కూడా చెప్పలేదు. ఈ రోజు ఉదయం హార్ట్ ఎటాక్‌తో ఆయన మరణించారని తెలిసి ఎంతో బాధగా ఉంది. రాజ్ కోటిగా మేం ఇద్దరం ఎన్నో సినిమాలకు కలిసి పని చేశాం. ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చాం. మేం ఇద్దరం విడిపోయిన తరువాత కోటిగా నేను ఎన్ని సినిమాలు చేసినా.. వాటిని కూడా రాజ్ కోటి పాటలు అనేవారు. మేం ఇద్దరం ఇరవై నాలుగు గంటలూ పని చేసేవాళ్లం.' అని చెప్పుకొచ్చారు. (ఇది చదవండి: నేను పుట్టాక మా అమ్మానాన్న నా ముఖం కూడా చూడలేదు: హీరోయిన్) వారి మధ్య బంధం గురించి మాట్లాడుతూ.. 'చక్రవర్తి దగ్గర మేం ఇద్దరం అసిస్టెంట్లుగా పని చేశాం. ముఠామేస్త్రి, హలోబ్రదర్స్ ఇలా ఎన్నెన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చాం. మేం ఇద్దరం తెలుగులో ఓ ట్రెండ్‌ను సృష్టించాం. ఈ రోజు నా రాజ్ లేడంటూ ఎంతో బాధగా ఉంది. మా పాటల రూపంలో నా రాజ్ కలకాలం ఉంటాడు. కాల ప్రభావం, పరిస్థితుల వల్ల మేం విడిపోయాం. నేను ఎన్ని సినిమాలు చేసినా కూడా రాజ్ నా పక్కన ఉన్నాడనే ధైర్యంతోనే చేయగలిగాను. రాజ్‌కి నేను ఒక తమ్ముడిలాంటి వాడిని. చిన్ననాటి స్నేహితులం. మేం ఇద్దరం విడిపోవడం నాకు ఇప్పటికీ బాధగానే ఉంటుంది. వద్దురా విడిపోవద్దు అని అన్నాను. కానీ అప్పటి పరిస్థితుల వల్ల విడిపోయాం. మా పాటల రూపంలో రాజ్ ఎప్పటికీ బతికే ఉంటాడు' అని అన్నారు. -
సంగీత దర్శకుడు మృతి.. మెగాస్టార్ ఎమోషనల్ ట్వీట్
ప్రముఖ టాలీవుడ్ సంగీత దర్శకుడు రాజ్ మృతి పట్ల మెగాస్టార్ చిరంజీవి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తన సంగీతం, అద్భుతమైన బాణీలు నా చిత్రాల విజయంలో కీలక పాత్ర పోషించాయని కొనియాడారు. సంగీత దర్శకుడు కోటితో కలిసి ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు సంగీతం అందించిన ఆయన మన మధ్య లేకపోవడం సంగీత ప్రపంచానికి తీరని లోటని అన్నారు. ఈ విషాద సమయంలో వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా అంటూ చిరంజీవి ట్వీట్ చేశారు. (ఇది చదవండి: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ సంగీత దర్శకుడు కన్నుమూత) కాగా.. 1983లో ప్రళయ గర్జన వీరిద్దరూ కలిసి పనిచేసిన మొదటి చిత్రం. యముడికి మొగుడు, లంకేశ్వరుడు, ముఠా మేస్త్రి, బాలగోపాలుడు, బంగారు బుల్లోడు, హలో బ్రదర్, అన్న-తమ్ముడు లాంటి విజయవంతమైన చిత్రాలకు రాజ్ కోటి ద్వయం సంగీతాన్ని సమకూర్చారు. ఆదివారం గుండెపోటుతో హైదరాబాద్‌లోని తన నివాసంలో ఆయన కన్నుమూశారు. కాగా.. ఆయనకు భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. (ఇది చదవండి: నాకు జరిగిన అవమానాలను గుర్తు పెట్టుకుంటా: డైరెక్టర్ తేజ) ప్రముఖ సంగీత దర్శక ద్వయం రాజ్-కోటి లలో 'రాజ్' ఇక లేరు అని తెలవటం దిగ్భ్రాంతికి గురి చేసింది. ఎంతో ప్రతిభ వున్న రాజ్ , నా కెరీర్ తొలి దశలలో నా చిత్రాలకందించిన ఎన్నో అద్భుత ప్రజాదరణ పొందిన బాణీలు, నా చిత్రాల విజయాలలో ముఖ్య పాత్ర వహించాయి. నన్ను ప్రేక్షకులకు మరింత చేరువ… pic.twitter.com/uPifYfmtFE — Chiranjeevi Konidela (@KChiruTweets) May 21, 2023 -
సంగీత రాజ్ ఇక లేరు
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో విషాదం చోటు చేసుకంది.ప్రముఖ సంగీత దర్శకుడు రాజ్(68) ఆదివారం కన్నుమూశారు. హైదరాబాద్‌లోని స్వగృహంలో గుండెపోటుతో ఆయన తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. రాజ్ అసలు పేరు తోటకూర సోమరాజు. ప్రముఖ సంగీత దర్శకుడు టీవీ రాజు, సావిత్రి దంపతులకు ఇద్దరు కుమారులు. వారిలో వెంకట సూర్యనారాయణ రాజు పెద్దవాడు కాగా, తోటకూర సోమరాజు(రాజ్) చిన్నవాడు. 1954 జూలై 27న రాజ్ జన్మించారు. టీవీ రాజు స్వస్థలం రాజమండ్రి సమీపంలోని రఘుదేవపురం. అయితే ఆయన చెన్నైలో స్థిరపడటంతో రాజ్ అక్కడే పుట్టి, పెరిగారు. చిన్నప్పటి నుంచి సినిమా వాతావరణంలో, ముఖ్యంగా సంగీత నేపథ్యంలో పెరగటంతో రాజ్‌కి సంగీతంపై అవగాహన ఉండేది. చదువులో యావరేజ్ స్టూడెంట్ అయిన రాజ్‌కి చిన్నతనం నుంచే సంగీతం నేర్పించారు టీవీ రాజు. ఓ వైపు ఇంటర్ చదువుతూనే మరోవైపు ప్రముఖ సంగీత దర్శకుడు సాలూరి హనుమంతరావు వద్ద అసిస్టెంట్‌గా చేరారు రాజ్. ఆ సమయంలో తన తండ్రి టీవీ రాజు 1973 ఫిబ్రవరి 20న యాభైఏళ్ల వయసులో హఠాన్మరణం చెందారు. దీంతో కొద్ది రోజులు ఏం చేయకుండా అలాగే ఉండిపోయిన రాజ్ ఆ తర్వాత ప్రముఖ సంగీత దర్శకుడు ఎస్పీ కోదండపాణి వద్ద అసిస్టెంట్‌గా చేరారు. ఓ ఏడాది తర్వాత సాలూరి రాజేశ్వరరావు వద్ద అసిస్టెంట్‌గా చేరి, ఆరేళ్లు పనిచేశారు. సాలూరి రాజేశ్వరరావు కుమారుల్లో ఒకరైన కోటితో రాజ్‌కి మంచి స్నేహం ఏర్పడింది. ఆ తర్వాత 1980లో సంగీత దర్శకుడు ^è క్రవర్తి వద్ద అసిస్టెంట్‌గా చేరారాయన. అప్పుడు చేతినిండా పని ఉండేది.. జేబు నిండా డబ్బులు వచ్చేవి. ఆ సమయంలో 1982 మార్చి 11న రాజ్ వివాహం ఉషతో జరిగింది. రాజ్–కోటి ద్వయం... సంగీత దర్శకునిగా రాజ్ అందుకున్న తొలి అవకాశం ‘ప్రళయగర్జన’(1983). మోహన్‌బాబు హీరోగా పీసీ రెడ్డి దర్శకత్వం వహించిన ఆ చిత్రానికి రాజ్‌కి తొలి సోలో సంగీత దర్శకునిగా అవకాశం వచ్చింది. అయితే తన మిత్రుడు, కొలీగ్ అయిన కోటిని కలుపుకొని సంగీతం అందించాలని నిర్ణయించుకున్నారు రాజ్. ఆ విషయాన్ని కోటికి చెప్పడం.. ఆయన కూడా ఒప్పుకోవడంతో సంగీత ప్రపంచంలో రాజ్–కోటి ద్వయం ప్రారంభమైంది. ‘సంసారం, యముడికి మొగుడు, ఖైదీనంబర్ 786, త్రినేత్రుడు, లంకేశ్వరుడు, ముఠామేస్త్రి, బాలగోపాలుడు, బంగారు బుల్లోడు, హలో బ్రదర్, అన్న–తమ్ముడు, శత్రువు’ వంటి ఎన్నో సినిమాలకు వారిద్దరూ సంగీతం అందించారు. సోలో మ్యూజిక్ డైరెక్టర్‌గా... అనుకోని కారణాల వల్ల కోటి నుంచి విడిపోయిన రాజ్ సోలో మ్యూజిక్ డైరెక్టర్‌గానూ తనదైన శైలిలో సంగీతం అందించి శ్రోతలను మైమరపించారు. ‘సిసింద్రీ, రాముడొచ్చాడు, ప్రేమంటే ఇదేరా(నేపథ్య సంగీతం)’.. ఇలా తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో దాదాపు 70 సినిమాలకు పనిచేశారాయన. అలాగే పలు టీవీ సీరియల్స్‌కి కూడా సంగీతం అందించారు. అదేవిధంగా నటుడిగానూ పలు సినిమాల్లో మెరిశారు రాజ్. బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్‌గా ‘హలోబ్రదర్’ సినిమాకి 1994లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి రాజ్–కోటి ద్వయం నంది అవార్డు అందుకున్నారు. మ్యూజిక్ డైరెక్టర్, నేపథ్య సంగీత దర్శకుడు, నటుడు.. ఇలా తనదైన శైలిలో ప్రేక్షకులను అలరించిన రాజ్ మృతితో చిత్రపరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆయన మృతికి చిరంజీవితో పాటు పలువురు సినీ ప్రముఖులు సంతాపం ప్రకటించి, ఆయన కుటుంబానికి సానుభూతి తెలియజేశారు. రాజ్‌కి భార్య ఉష, కుమార్తెలు దివ్య, దీప్తి, శ్వేత ఉన్నారు. కాగా హైదరాబాద్‌లోని మహా ప్రస్థానంలో నేడు (సోమవారం) రాజ్ అంత్య క్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు. (చదవండి: సినీ ఇండస్ట్రీలో విషాదం.. బుల్లితెర నటి స్పాట్ డెడ్!) మాకూ షాకింగ్‌గానే ఉంది – దివ్య, రాజ్ కుమార్తె ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో కార్డియాక్ అరెస్ట్‌తో నాన్న మృతిచెందారు. ఫ్యామిలీని, అభిమానులను ఎప్పుడూ సంతోషపరిచారాయన. నాన్నగారికి చిరంజీవిగారు ఎప్పుడూ ఓ బ్రదర్‌లా సపోర్ట్‌గా ఉన్నారు. నాన్న మరణంపై స్పందించినందుకు ఆయనకు థ్యాంక్స్. ఇటీవల ఓ సినిమా ఫంక్షన్లో కలిసిన నాన్న, కోటి అంకుల్ కబుర్లు చెప్పుకున్నారు. నాన్న మరణవార్త చెప్పగానే అంకుల్ షాక్ అయ్యారు. మా పాటల రూపంలో బతికే ఉంటారు – కోటి, సంగీత దర్శకుడు నేను చెన్నైలో ఉండగా రాజ్ చనిపోయారనే చేదు వార్తను విన్నాను. ఇటీవలే ఓ సినిమా ఫంక్షన్లో కలుసుకున్నాం. తనకు ఆరోగ్య సమస్యలున్నట్టు నాకు అనిపించలేదు. రాజ్ కూడా నాతో చెప్పలేదు. చక్రవర్తిగారి వద్ద మేమిద్దరం అసిస్టెంట్లుగా పనిచేశాం. రాజ్–కోటిగా ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చాం. మేం విడిపోయిన తర్వాత కూడా నేను ఎన్ని సినిమాలు చేసినా.. వాటిని కూడా రాజ్–కోటి పాటలు అనేవారు. అలాంటిది ఈ రోజు నా రాజ్ లేడంటే ఎంతో బాధగా ఉంది. మా పాటల రూపంలో నా రాజ్ ఎప్పటికీ బతికే ఉంటాడు. -
మాటే మంత్రమై...
చిన్న వయసులో ఉన్నప్పుడు ఇండోర్ (మధ్యప్రదేశ్)లో జరిగిన మ్యాజిక్ షోకు వెళ్లాడు రాజ్ షమని.మెజిషియన్ టోపి నుంచి కుందేలు పిల్లను బయటికి తీశాడు. మంత్రదండం నుంచి పూలవర్షం కురిపించాడు.ఈ అబ్బురాలను చూసి ‘మెజిషియన్ అయితే ఎన్ని అద్భుతాలు సాధించవచ్చో కదా!’ అనుకున్నాడు రాజ్. పెద్దయ్యాక రాజ్ మెజిషియన్ కాలేదుగానీ ‘మాటల మాంత్రికుడు’ అయ్యాడు! సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్‌గా బోలెడు పేరు తెచ్చుకున్నాడు.... పదహారు సంవత్సరాల వయసులో ఇండోర్‌లో తండ్రి చేసే వ్యా పారానికి చేదోడువాదోడుగా ఉండేవాడు రాజ్ షమని. తండ్రితో పాటు డిష్ సోప్స్ అమ్మేవాడు. ‘కాలాన్ని కనిపెట్టుకొని ఉండాలి’ అనేది వ్యా పారసూత్రం. ఆ వయసులో అతడికి ఇది తెలుసో లేదోగానీ డిష్ సోప్ నుంచి ΄పౌ డర్‌కు, ΄పౌ డర్ నుంచి లిక్విడ్‌కు, డిష్వాషర్ జెల్‌కు బిజినెస్‌ను మార్చాడు. అంతకు ముందు ఉండీ లేనట్లుగా ఉన్న వ్యా పారం కొత్త ఊపిరి పోసుకొని లాభాల బాటలో పరుగెత్తింది.రాజ్‌కు తన గురించి తాను తెలుసుకునేలా చేసింది. కొన్ని సంవత్సరాల తరువాత...సోషల్ మీడియాలో తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ముంబైకి వచ్చాడు రాజ్.‘మరీ ఎక్కువగా ఉత్సాహపడుతున్నావు. ఇక్కడ బాగానే ఉంది కదా’ అన్నారు ఇండోర్ ఫ్రెండ్స్. అయితే రాజ్ షమని ఒక్క విజయం దగ్గర ఆగిపోయే టైప్ కాదు. ఉత్సాహమే అతని ఇంధనం. కొన్ని సంవత్సరాల కష్టం తరువాత మన దేశంలోని మోస్ట్–ఫాలోవ్డ్ కంటెంట్ క్రియేటర్లలో ఒకరిగా పేరు తెచ్చుకున్నాడు రాజ్ షమని. మరో విశేషం...మన దేశంలోని ఎంటర్ప్రెన్యూర్షిప్కు సంబంధించిన పాడ్‌కాస్ట్‌లలో రాజ్ షమని చేసిన ‘ఫిగర్ ఔట్’ పాడ్‌కాస్ట్ టాప్‌లో నిలిచింది. పన్నెండు నెలల వ్యవధిలో 100 మిలియన్ వ్యూలు వచ్చాయి.తన స్ఫూర్తిదాయక ప్రసంగాలతో ఎంతోమంది స్టార్టప్‌ల వైపు రావడానికి కారణమైన రాజ్ తొమ్మిది స్టార్టప్‌లలో ఏంజెల్ ఇన్వెస్టర్‌గా ఉన్నాడు. ‘వినియోగదారుల ఇష్టాలపైనే వ్యా పారాన్ని నిర్మించాలి’ అని చెప్పే రాజ్ షమని డిజిటల్ కంటెంట్ క్రియేటర్స్ తమ కన్జ్యూమర్ బ్రాండ్స్‌ను ఎస్టాబ్లిష్ చేసుకోవడం, విజయవంతం చేయడంలో సహాయపడే ‘హౌజ్ ఆఫ్ ఎక్స్’ వెంచర్ స్టార్ట్ చేశాడు. ఈ వెంచర్ ఇన్వెస్టర్ల జాబితాలో నితిన్ కామత్( జెరోదా–కో ఫౌండర్), వినీత సింగ్ (షుగర్ కాస్మెటిక్స్)లాంటి వ్యా పారదిగ్గజాలు ఉండడం విశేషం. మోటివేషనల్ స్పీకర్‌గా కూడా మంచి పేరు తెచ్చుకుంటున్నాడు 26 సంవత్సరాల రాజ్ షమని.ఇప్పటివరకు ఇరవైకి పైగా దేశాల్లో స్ఫూర్తిదాయక ప్రసంగాలు ఇచ్చిన రాజ్ షమని ‘బిల్డ్, డోన్ట్ టాక్’ పేరుతో వ్యక్తిత్వ వికాస పుస్తకం రాశాడు. ఈ పుస్తకం గురించి ఇలా పరిచయం చేసుకుంటాడు రాజ్...‘మన స్కూల్లో మ్యాథ్స్, సైన్స్‌లాంటి సబ్జెక్ట్‌లు తెలుసుకుంటాం. అయితే ఒక వస్తువును ఎలా అమ్మాలి? స్నేహసంబంధాలను ఏర్పర్చుకోవడం ఎలా? మానసిక ఆరోగ్యంపై ఎలా శ్రద్ధ చూపా లి? ఆర్థిక విషయాల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి....మొదలైన విషయాలు స్కూల్లో తెలుసుకునే అవకాశం లేకపోవచ్చు. అందుకే ఈ పుస్తకం బడిలోకి రండి. ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు’ ‘హౌజ్ ఆఫ్ ఎక్స్’ ఇన్వెస్టర్లలో ఒకరైన నితిన్ కామత్ ఇలా అంటాడు...‘ఐడియాలు, ప్రో డక్ట్ ఎంత ముఖ్యమో వ్యక్తులు కూడా అంతే ముఖ్యం. సోషల్ మీడియాలో రాజ్ షమని సాధించిన విజయాలే మా నమ్మకానికి కారణం’ఒక్క విజయం దగ్గరే ఆగిపోయే అలవాటు లేని రాజ్ షమని, తన విజయాలకు మాత్రమే పరిమితం కావాలనుకోవడం లేదు. ఇతరులను కూడా గెలుపు బాటలో నడిపించాలనుకుంటున్నాడు. -
తాళి కట్టే టైమ్‌కి ప్రియుడి ఎంట్రీ.. వరుడి చేతిలో..
తిరువొత్తియూరు (చెన్నై): వరుడి చేతిలో ఉన్న తాళిని లాక్కుని వధువు మెడలో కట్టడానికి యత్నంచిన ప్రేమికుడిని వధువు సోదరుడు, బంధువులు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించిన ఘటన చెన్నై తండయార్ పేటలో జరిగింది. సినిమా తరహాలో జరిగిన ఈ వ్యవహారం అక్కడున్న వారిని దిగ్భ్రాంతికి గురిచేసింది. వివరాల్లోకి వెళితే.. చెన్నై తండయారుపేటకు చెందిన సుమతి (20). ఈమెకు అదే ప్రాంతానికి చెందిన రాజ్ (21) నౌక ఇంజినీర్‌తో నాలుగు నెలల క్రితం వివాహ నిశ్చితార్థం జరిగింది. తండయార్‌పేట నేతాజీ నగర్లో శుక్రవారం వివాహం జరగాల్సి ఉంది. ఇరు కుటుంబాల వారు వివాహ ఏర్పాట్లు పూర్తి చేశారు. ముహూర్తం దగ్గర పడుతున్న సమయంలో సుమారు 7 గంటలకు మంగళ వాయిద్యాలు వాయిస్తుండగా వరుడు తాళిని తీసుకుని వధువు మెడలో కట్టేందుకు సిద్ధమయ్యాడు. చదవండి: (‘104’ మృత్యు మార్గాలు.. ఈ దారుల్లోనే అత్యధిక ప్రమాదాలు) సరిగ్గా అదే సమయంలో అక్కడ నిలబడి ఉన్న యువకుడు ముందుకు దూసుకువచ్చి వరుడి చేతిలో ఉన్న తాళిని లాక్కుని వధువు మెడలో కట్టడానికి ప్రయత్నించాడు. ఇది చూసిన అక్కడి వారు అందరూ ఒక్క క్షణం నివ్వెర పోయారు. అక్కడే నిలబడి ఉన్న వధువు అన్న, బంధువులు యువకుడి చేతి నుంచి తాళి లాక్కుని అతనికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. పోలీసుల విచారణలో యువకుడు తండయార్ పేటకు చెందిన సుందరేష్ (25)గా గుర్తించారు. చాకలి పేటలోని ప్రముఖ నగల దుకాణంలో సుమతితో కలిసి పని చేసేవాడని నిర్ధారించారు. వీరిద్దరు రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారని, తల్లిదండ్రులను ఒప్పించలేక వివాహం జరుగుతున్న సమయంలో ఈ చర్యకు ప్రయత్నించినట్లు తెలిసింది. వివాహం జరిగిన సమయంలో అతను బంధువుగా వచ్చి ఏమి తెలియనట్లు పక్కన నిలబడి సరిగ్గా వివాహం జరిగే సమయంలో హఠాత్తుగా తాళి కట్టడానికి ప్రయత్నించినట్లు తెలిసింది. అయితే జరగాల్సిన పెళ్లి ఆగిపోయింది. వధువు బంధువులు, వరుడి కుటుంబ సభ్యులతో మాట్లాడినా ఫలితం లేకపోయింది. -
నా రాజీ.. గుండె బద్ధలవుతోంది: మందిర భావోద్వేగం
ముంబై: బాలీవుడ్ నటి మందిరా బేడి తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. తన భర్త రాజ్ కౌశల్‌ను గుర్తుచేసుకుని ఉద్వేగపూరిత ట్వీట్ చేశారు. రాజ్ కౌశల్‌తో కలిసి చిరునవ్వులు చిందిస్తున్న పాత ఫొటోను పంచుకున్న ఆమె... ‘‘నా రాజీ.. నీ ఆత్మకు శాంతి చేకూరుగాక. నా హృదయం ముక్కలైంది’’ అని ఎమోషనల్ అయ్యారు. కాగా సినీ దర్శకుడు రాజ్ కౌశల్(49) జూన్ 30న గుండెపోటుతో మరణించిన విషయం విదితమే. ఈ క్రమంలో మందిరానే స్వయంగా భర్త అంత్యక్రియలు నిర్వహించారు. నిప్పు కుండ చేతబట్టి తానే అంతిమ సంస్కారాలు చేసి తనలోని సగ భాగానికి తుది వీడ్కోలు పలికారు. ఈ క్రమంలో కొంతమంది నెటిజన్లు ఆమెపై విద్వేషపు విషం చిమ్మారు. కొడుకు ఉండగా, మందిర ఇలా ఎందుకు చేసిందంటూ విమర్శలు గుప్పించారు. అయితే, పలువురు సినీ ప్రముఖులు, సోషల్ మీడియా యూజర్లు మాత్రం మందిరకు మద్దతుగా నిలబడి ట్రోల్స్‌ను తిప్పికొట్టారు. ఇక మందిర- రాజ్ కౌశల్‌ది ప్రేమ వివాహం. 1999లో వీరిద్దరు పెళ్లి చేసుకున్నారు. ఈ క్రమంలో సుదీర్ఘ నిరీక్షణ అనంతరం 2011లో కొడుకు వీర్ వారి జీవితాల్లోకి కొత్త సంతోషాలు తీసుకొచ్చాడు. అనంతరం ఈ జంట తార అనే బాలికను దత్తత తీసుకున్నారు కూడా. మందిర యాంకర్‌గా, నటిగా రాణిస్తుండగా, మై బ్రదర్ నిఖిల్, ప్యార్ మే కభీ కభీ వంటి సినిమాలు డైరెక్ట్ చేసిన రాజ్ కౌశల్.. సుమారు 800కు పైగా యాడ్స్‌ను ప్రొడ్యూస్ చేశారు. -
‘4 గంటల సమయంలో గుండెపోటు.. అప్పటికే ఆలస్యమైంది’
ముంబై: ‘‘ఆరోజు సాయంత్రం నుంచే తను చాలా నీరసంగా ఉన్నాడు. టాబ్లెట్ కూడా వేసుకున్నాడు. మధ్యరాత్రి గుండె నొప్పి మొదలైంది. తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో రాజ్ పరిస్థితి విషమించింది. తనకు గుండెలో విపరీతంగా నొప్పి వస్తోందని మందిరకు చెప్పాడు. వెంటనే తను ఆశిష్ చౌదరికి ఫోన్ చేసింది. ఇద్దరూ కలిసి రాజ్‌ను కారులో కూర్చోబెట్టి లీలావతి ఆస్పత్రికి తీసుకువెళ్లేందుకు సిద్ధమయ్యారు. అయితే, అప్పటికే రాజ్ స్పృహ కోల్పోయాడు. సమయానికి హాస్పిటల్‌కు చేరుకుంటామని వారు భావించారు. కానీ అప్పటికే ఆలస్యమైపోయింది. పది నిమిషాల్లోనే రాజ్ పల్స్ ఆగిపోయినట్లు వారు గుర్తించారు. డాక్టర్ దగ్గరికి వెళ్లాల్సిన అవసరం లేకుండా పోయింది’’ అంటూ బాలీవుడ్ సంగీత దర్శకుడు సులేమాన్ మర్చంట్ భావోద్వేగానికి గురయ్యాడు. ‘‘ప్యార్ మే కభీ కభీ’’ సినిమా సమయం కంటే ముందు నుంచే రాజ్ కౌశల్‌తో తనకు అనుంబంధం ఉందని స్నేహితుడిని గుర్తుచేసుకున్నాడు. బాలీవుడ్ దర్శకుడు, ప్రముఖ నటి మందిరా బేడి భర్త రాజ్ కౌశల్ జూన్ 30న కన్నుమూసిన విషయం విదితమే. గుండెపోటుతో ఆయన మరణించారు. ఈ నేపథ్యంలో పలువురు బీ-టౌన్ సెలబ్రిటీలు ఆయన అంత్యక్రియలకు హాజరై నివాళులు అర్పించారు. ఈ క్రమంలో... ఓ జాతీయ మీడియాతో మాట్లాడిన సులేమాన్ మర్చంట్... ‘‘రాజ్‌కు 30-32 ఏళ్ల వయస్సు ఉన్నపుడు అనుకుంటా ఒకసారి గుండెపోటు వచ్చింది. అప్పటి నుంచి తను చాలా జాగ్రత్తగా ఉండేవాడు. కానీ విధి రాత మరోలా ఉంది. తను అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఉన్ననాటి నుంచే నాకు పరిచయం. అంతేకాదు... తన మొదటి సినిమా ప్యార్ మే కభీ కభీకి నేనూ, సలీం కలిసి సంగీతం అందించాం. అప్పటి నుంచి తనతో నా అనుబంధం కొనసాగుతోంది. 25 ఏళ్ల స్నేహం మాది. తను ఎంతో మంచివాడు. తన ఇక లేడు అన్న వార్త ఇంకా జీర్ణించుకోలకపోతున్నాను. ఇంతకంటే షాకింగ్ మరొకటి ఉండదు’’ అని ఆవేదన వ్యక్తం చేశాడు. కాగా మందిరా బేడి- రాజ్ కౌశల్ 1999లో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. 2011లో వీరికి కుమారుడు జన్మించగా, వీర్‌గా నామకరణం చేశారు. అంతేగాక గతేడాది జూలైలో తార అనే నాలుగేళ్ల చిన్నారిని దత్తత తీసుకున్నారు. -
ఆస్తులు అమ్మి ఈ సినిమా తీశా
నటుడు సూర్య (పింగ్ పాంగ్) హీరోగా నటించి, నిర్మించిన సినిమా ‘కలియుగ’. రాజ్, స్వాతి దీక్షిత్ జంటగా నటించారు. తిరుపతి దర్శకత్వంలో సూర్య నిర్మించిన ఈ సినిమా నేడు రిలీజవుతోంది. సూర్య మాట్లాడుతూ– ‘‘18ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నా. ఇప్పటి వరకూ నేను పడిన కష్టాన్నంతా ‘కలియుగ’ సినిమాకి ప్రాణంగా పెట్టా. ప్రస్తుత సమాజంలో జరుగుతున్న సంఘటనలకు మా సినిమా అద్దం పడుతుంది. ఈ కథని కొందరు నిర్మాతలకి చెప్పినా వారు ముందుకు రాలేదు. ఓ మంచి సినిమాని ప్రేక్షకులకు అందించాలనే ఉద్దేశంతో నా తల్లిదండ్రుల సహకారంతో ఆస్తులు అమ్మి మరీ ఈ సినిమా నిర్మించా’’ అన్నారు. -
ఆలోచింపజేసే కలియుగ
రాజ్, స్వాతీ దీక్షిత్ జంటగా తిరుపతి దర్శకత్వంలో నటుడు సూర్య (పింగ్ పాంగ్) నిర్మించిన చిత్రం ‘కలియుగ’. ఈ నెల 6న విడుదల కానున్న ఈ సినిమా ప్రీ–రిలీజ్ వేడుక హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నటుడు సత్యదేవ్ మాట్లాడుతూ– ‘‘సమాజంలో జరుగుతున్న సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తీసిన సూర్యకు అభినందనలు. సినిమా ప్రేక్షకులకు నచ్చుతుందని అనుకుంటున్నాను’’ అన్నారు. ‘‘దర్శకుడు తిరుపతి సినిమాను బాగా తెరకెక్కించారు. భవిష్యత్‌లో సూర్య ఇలాంటి సినిమాలను ఎన్నో నిర్మించాలని కోరుకుంటున్నాను’’ అన్నారు రాజ్. ‘‘రెగ్యులర్ కథలను పక్కనపెట్టి సమాజంలో జరుగుతున్న సంఘటనల ఆధారంగా స్క్రిప్ట్ రాసుకున్నాను. చిత్రీకరణ సమయంలో సూర్య సపోర్ట్ మరువలేనిది. మా చిత్రం పాటను విడుదల చేసిన పవన్‌కల్యాణ్‌గారికి థ్యాంక్స్’’ అన్నారు తిరుపతి. ‘‘లవ్, యాక్షన్, సెంటిమెంట్ అన్నీ ఉన్న ఈ చిత్రం ప్రేక్షకులను ఆలోచింపజేస్తుంది. సునీల్ కశ్యప్ మంచి సంగీతం ఇచ్చారు’’ అన్నారు సూర్య. ‘‘సూర్య మంచి సినిమా తీశాడు’’ అన్నారు తాగుబోతు రామేష్. -
ప్రేమ.. వినోదం.. రణస్థలం
‘‘రణస్థలం’ సినిమాని మా ప్రాంతం వారు తీసినందుకు గర్వపడుతున్నాను. రాజు చిన్న స్థాయి నుంచి ఈరోజు సినిమాలు నిర్మించే స్థాయికి ఎదగడం సంతోషంగా ఉంది. ఈ సినిమా మంచి విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా’’ అని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. రాజ్, షాలు జంటగా ఆది అరవల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రణస్థలం’. సంతోష ఆంజనేయులు సమర్పణలో శ్రీలక్ష్మి ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై కావాలి రాజు నిర్మించిన ఈ చిత్రం ఫస్ట్ లుక్‌ను సబితా ఇంద్రారెడ్డి విడుదల చేశారు. కావాలి రాజు మాట్లాడుతూ–‘‘లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందిన చిత్రం ‘రణస్థలం’. ఎక్కడా రాజీ పడకుండా తెరకెక్కించాం. ప్రస్తుతం సెన్సార్ చివరి దశలో ఉంది. నవంబర్ మొదటి వారంలో సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. ‘‘మా సినిమాకి కథే హీరో. మంచి కథతో చక్కటి అవుట్‌పుట్ తీసుకొచ్చాం. ప్రతి ఒక్కర్నీ మా చిత్రం ఆకట్టుకుంటుందని ఆశిస్తున్నాం’’అన్నారు ఆది అరవల. చిత్ర సంగీత దర్శకుడు రాజకిరణ్, కెమెరామన్ ప్రభాకర్, పాటల రచయిత రామారావు, కో డైరెక్టర్ శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు. -
రైజింగ్ రాజ్
ఈ అబ్బాయి పేరు రాజ్. అతని వయసెంతో తెలుసా? జస్ట్... 22 ఇయర్స్! బట్, రాజ్ గురించి చెప్పాలంటే జస్ట్ అనే పదం చాలదు. ఎందుకంటే... ఇతను పియానో ప్లేయర్, యాక్టర్, మ్యూజిక్ డైరెక్టర్ అండ్ మ్యూజిక్ ప్రొడ్యూసర్. యస్.. హి ఈజ్ మల్టీ టాలెంటెడ్ యంగ్‌స్టర్. అతి చిన్న వయసులో ‘రాయల్ స్కూల్ ఆఫ్ మ్యూజిక్ ఆఫ్ లండన్’ (ఆర్ఎస్ఎమ్) లో వెస్ట్రన్ క్లాసికల్ పియానోలో అన్ని గ్రేడులు కంప్లీట్ చేసిన టీనేజర్. సంగీతంపై తనకున్న ప్రేమ గురించి రాజ్ చెబుతూ – ‘‘ఆరేళ్ల వయసులో నాకు సంగీతం అంటే ఇష్టం ఏర్పడింది. నా పేరెంట్స్ ప్రోత్సాహంతో 12 ఏళ్లకు ఆర్ఎస్ఎమ్లో పియానోలో ఆల్ గ్రేడ్స్ కంప్లీట్ చేశా’’ అన్నారు. అలాగే, కర్ణాటక సంగీతంలో నూకల చినసత్యనారాయణ వద్ద శిక్షణ తీసుకున్నారు. జాజ్ పియానోలో స్పెషలైజేషన్ చేశారు. ఆ తర్వాత మ్యూజిక్ వీడియోలు చేసి... ఫేస్బుక్, యూట్యూబ్‌లలో అప్లోడ్ చేసేవారు. ఇతని మ్యూజిక్ వీడియోలు ఎంత హిట్ అంటే... రాజ్ యూట్యూబ్ ఛానల్ ‘బికాజ్ రాజ్’ను 30 వేల మందికి పైగా సబ్‌స్క్రైబ్ అయ్యారు. ఫేస్బుక్ పేజ్ ‘బికాజ్ రాజ్’ను 70 వేల మందికి పైగా లైక్ చేశారు. సోషల్ మీడియాలో ఈ యంగ్‌స్టర్ ఫాలోయింగ్, మ్యూజిక్ వీడియోలు చూసి ‘బెస్ట్ ఫ్రెండ్స్ ఫరెవర్’ దర్శక–నిర్మాతలు తమ సినిమాకు మ్యూజిక్ చేయమని అడిగారు. ఆ సినిమా చేసిన తర్వాత ఈడీఎమ్ (ఎలక్ట్రానిక్ డ్యాన్స్ మ్యూజిక్)పై రాజ్ దృష్టి పెట్టారు. ప్రముఖ సంగీత దర్శకులు లూక్, ఎం.ఎం. కీరవాణి తదితరుల వద్ద పనిచేశారు. సంగీతంలో సాఫీగా వెళ్తున్న రాజ్‌కి యాక్టింగ్ అంటే ఇష్టం ఏర్పడింది. యాక్టింగ్ వైపు ఎందుకొచ్చారు? అని ఆయన్ను అడిగితే... ‘‘మ్యూజిక్ వీడియోలు చేస్తున్న టైమ్‌లో నటనపై ఆసక్తి ఏర్పడింది. ‘వైజాగ్’ సత్యానంద్‌గారి దగ్గర నటనలో శిక్షణ తీసుకున్నా. తర్వాత పూరి జగన్నాథ్‌గారి ‘ఇజం’లో హీరో కల్యాణ్‌రామ్ స్నేహితుల్లో ఒకరిగా, హ్యాకర్‌గా నటించా. నిజం చెప్పాలంటే... పూరిగారు నా మ్యూజిక్ విని కాల్ చేశారు. కలసిన తర్వాత ‘నువ్వెందుకు నటించకూడదు?’ అనడిగారాయన. ‘ఫైన్, లెట్స్ డూ థిస్’ అని నటించా. రీసెంట్గా ‘రెండర్’ అనే షార్ట్‌ఫిల్మ్ చేశా. మంచి ఛాన్సులు వస్తే నటించడానికి నేను రెడీ’’ అన్నారు. పియానో ప్లేయర్‌గా, నటుడిగా, సంగీత దర్శకుడిగా సక్సెస్‌ఫుల్‌గా అడుగులు వేసిన రాజ్ ప్రస్తుతం తెలుగు సంగీత ప్రపంచంలో కొత్త ట్రెండ్ సృష్టించడానికి సిద్ధమయ్యారు. ఓ మ్యూజిక్ ప్రొడక్షన్ కంపెనీ స్టార్ట్ చేశారు. ఈ కంపెనీ ప్రత్యేకత ఏంటంటే... సంగీత దర్శకులకు అవసరమైన టూల్స్‌ను ప్రొడ్యూస్ చేస్తుంది. ఎవరైనా ఈ కంపెనీ నుంచి తమ సినిమాకు అనువైన మ్యూజిక్‌ను కొనుక్కోవచ్చు. ఆ మ్యూజిక్‌ను సాంగ్స్, రీ–రికార్డింగ్స్‌లో ఉపయోగించుకోవచ్చు. ఈ కాన్సెప్ట్ గురించి రాజ్ మాట్లాడుతూ– ‘‘సాధారణంగా మన సంగీత దర్శకులు తమకు అవసరమైన మ్యూజిక్ సాంపిల్స్, ఈడీఎమ్స్ను ఫారిన్ దేశాల నుంచి కొనుక్కుంటారు. మనకు, ఫారిన్‌కు మధ్య కల్చరల్ డిఫరెన్స్ ఎక్కువ ఉండడంతో ఇండియన్ సౌండ్‌ను మిస్ అవుతున్నాం. మ్యూజిక్ సాంపిల్ లైబ్రరీల్లో ఇండియన్ సౌండ్ ఎక్కడా వినిపించదు. అందువల్ల, మన సంగీత దర్శకులు ఎక్కువగా లైవ్ ఇన్స్ట్రుమెంట్స్ ఉపయోగిస్తున్నారు. అందుకు బడ్జెట్ ఎక్కువవుతుంది. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే... ఇండియన్ సౌండ్, మ్యూజిక్‌ను ప్రొడ్యూస్ చేస్తున్నా. బడ్జెట్ ఉన్నా టైమ్ లేనోళ్లు, లో బడ్జెట్లో మంచి మ్యూజిక్ కావాలనుకునే ‘బికాజ్ రాజ్ డాట్ కామ్’ వెబ్సైట్ ద్వారా నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. హైదరాబాద్‌లో నాకో సొంత స్టూడియో ఉంది’’ అన్నారు. ప్రస్తుతం రాజ్ ఓ తెలుగు సినిమా, మరో హిందీ సినిమాకు, కొన్ని వెబ్ సిరీస్‌లకు సంగీతమందిస్తున్నారు. -
రేపిస్టుల కాళ్లు, చేతులు నరికేయండి: ఠాక్రే
అహ్మద్ నగర్: మహిళలు, పిల్లలపై అఘాయిత్యాలకు పాల్పడేవారిపై 'షరియా' (ఇస్లామిక్) వంటి కఠినచట్టాలను అమలు చేయాలని ఎంఎన్ఎస్ ఛీఫ్ రాజ్ ఠాక్రే అన్నారు. బీజేపీ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వంలో ఓ బాలికపై గ్యాంగ్ రేప్, హత్య జరగడం నిజంగా ఆందోళనకరమన్నారు. మైనర్లు, మహిళలపై నేరాలకు పాల్పడేవారిని కాళ్లు, చేతులు నరికేయడమే సరైన పద్ధతంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మహారాష్ట్ర అహ్మద్ నగర్ జిల్లా కోపర్ది గ్రామంలో జూలై 13న జరిగిన దారుణ ఘటనపై ఎంఎన్ఎస్ ఛీఫ్ రాజ్ ఠాక్రే తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. 15 ఏళ్ల మైనర్ బాలికపై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాఛారం చేసి, ఆపై హత్యచేయడం రాష్ట్రంలో శాంతి భద్రతలు కొరవడ్డాయనడానికి నిదర్శనమన్నారు. అందుకే ఇటువంటి తీవ్ర సంఘటనలు చోటు చేసుకుంటున్నాయని ఆరోపించారు. ఈ ఘటనతో గత కాంగ్రెస్ ప్రభుత్వంకంటే బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం అధ్వాన్న స్థితికి చేరినట్లు నిరూపించుకుందన్నారు. జిల్లా కేంద్రానికి సుమారు 76 కిలోమీటర్ల దూరంలోని కంర్ణత్ తాలూకా కోపర్ది గ్రామం సందర్శించిన రాజ్ ఠాక్రే.. బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి, సంతాపం తెలిపారు. మహిళలు, పిల్లలపై జరుగుతున్న అకృత్యాలను అరికట్టాలంటే ప్రస్తుత చట్టాలను అత్యవసరంగా మార్చాలని, తీవ్ర నేరాలకు పాల్పడేవారిని, సంఘవ్యతిరేక శక్తులను సమూలంగా నిర్మూలించేందుకు 'షరియా' వంటి కఠిన చట్టాలను అమల్లోకి తేవాలని అభిప్రాయపడ్డారు. ఇదిలా ఉంటే.. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ సహా అహ్మద్ నగర్ గార్డియన్ మినిస్టర్ రామ్ షిండే సైతం ఆదివారం కోపర్దిలోని బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. తమ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి.. నేరస్థులను ఎట్టిపరిస్థితిలో వదిలి పెట్టేది లేదని, ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా నేరస్థులకు కఠినంగా శిక్షపడేట్లు చూస్తామని బాధితకుటుంబానికి భరోసా ఇచ్చారు. -
అసదుద్దీన్ మెడపై కత్తిపెట్టి...
ముంబైః మహరాష్ట్ర నవ నిర్మాణ సేన అధ్యక్షుడు రాజ్ థాకరే 48వ పుట్టిన రోజు కార్యక్రమంలో తనదైన తీరును ప్రదర్శించారు. అభిమానుల సమక్షంలో పుట్టినరోజు వేడుకలు జరుపుకున్న ఆయన..ఆయన మద్దతుదారులు తెచ్చిన ఏఐఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ చిత్రంతోకూడిన కేక్ ను ముందుగా పీకదగ్గర కట్ చేసి, తన శైలిని చాటుకున్నారు. మహరాష్ట్రకు వ్యతిరేకంగా మాట్లాడేవారిని సైతం ఇలా కేక్ ముక్కల్లా కట్ చేస్తామని కూడ రాజ్ థాకరే అన్నట్లు తెలుస్తోంది. ముంబై దాదర్ లోని తన నివాసం కృష్ణ కుంజ్ లో పుట్టిన రోజు వేడుకలను జరుపుకున్న రాజ్ థాకరే... అసదుద్దీన్ ఫొటోతో కూడిన కేక్ ను కట్ చేసి తనదైన శైలిలో మరోసారి వివాదానికి తెరతీశారు. తాను కట్ చేసిన కేక్ ను అభిమానులందరికీ పంచిన ఆయన... మహరాష్ట్రను వ్యతిరేకించేవారిపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తన మెడమీద కత్తి పెట్టినా భారత్ మాతాకీ జై అనేది లేదని చెప్పిన ఒవైసీ పై గతంలో మండిపడ్డ థాకరే.. పార్టీ నిర్వహిస్తున్న మొదటి గుడిపడ్వా ర్యాలీ సందర్భంగా చిత్రంలోని ఒవైసీ మెడపై కత్తిపెట్టి కేక్ కట్ చేశారు. ఇదిలా ఉంటే అసదుద్దీన్ కేక్ ను కట్ చేసిన ఘటనను ఏఐఎంఐఎం ఎమ్మెల్యే వారిస్ పఠాన్ ఖండించారు. కేక్ కట్ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
ప్రేమ... ద్వేషం
రాజ్, గీతాభగత్ జంటగా స్వీయ దర్శకత్వంలో మహేశ్ నిర్మించిన చిత్రం ‘కలయా నిజమా’. వంశీకృష్ణ స్వరపరచిన ఈ చిత్రం పాటలను నిర్మాత దామోదర్ ప్రసాద్ ఆవిష్కరించారు. ‘‘మహేశ్ ఈ కాన్సెప్ట్ నాకు చెప్పాడు. కానీ, దర్శక, నిర్మాతగా రెండు బాధ్యతలు కష్టమవుతుందేమో అన్నాను. కొన్ని రోజుల తర్వాత సినిమా పూర్తి చేశానని చెప్పాడు. ఎంతో మమకారంతో ఈ సినిమా చేశాడు’’ అని దామోదర ప్రసాద్ అన్నారు. ఈ చిత్రం ట్రైలర్ చూసి, దాసరి నారాయణరావుగారు ఇంప్రెస్ అయ్యారని దర్శకుడు రేలంగి నరసింహారావు చెప్పారు. మంచి పాటలివ్వడానికి ఆస్కారం ఉన్న కథ అని వంశీకృష్ణ తెలిపారు. ప్రేమ, ద్వేషం నేపథ్యంలో సాగే చిత్రం ఇదనీ, భార్యాభర్తల మధ్య ద్వేషం ఏర్పడితే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయనేది కథ అని మహేశ్ చెప్పారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ నిర్మాత: నవీన్ జోయెల్. -
హార్సిలీహిల్స్ భూమి లీజుకు గ్రీన్ సిగ్నల్ !
మూడెకరాలు పర్యాటక శాఖకు అప్పగించిన రెవెన్యూ ఎకరా విలువ రూ.40 లక్షల నుంచి రూ.6.6లక్షలకు కుదింపు {పారంభం కానున్న ప్రయివేటు కార్యకలాపాలు బి.కొత్తకోట, న్యూస్‌లైన్: ఓ ప్రయివేటు సంస్థ హార్సిలీహిల్స్‌లో నిర్వహించతలపెట్టిన అడ్వంచర్స్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మా ణం కోసం భూమి లీజు ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకరించింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులు వె లువడిన క్రమంలో శుక్రవారం బి.కొత్తకోట రెవెన్యూ అధికారులు ఆ భూమిని పర్యాటకశాఖకు అప్పగిం చారు. ఈ మేరకు సంబంధిత ఉత్తర్వులను జాయిం ట్ కలెక్టర్‌కు అందజేశారు. హార్సిలీహిల్స్‌లో తొలి సారిగా ఇక ప్రయివేటు కార్యకలాపాలు ప్రారంభంకానున్నాయి. రాష్ట్రంలోని ఏకైక వేసవి విడిది కేంద్రంగా బి.కొత్తకోట మండలంలోని హార్సిలీహిల్స్ ప్రసిద్ధిచెందింది. అక్కడ సాహస విన్యాసాల ప్రాంగణం ఏర్పాటు కోసం ఓ సంస్థకు 33 ఏళ్ల లీజు ప్రాతిపదికన మూడెకరాల స్థలాన్ని 2005లో ప్రభుత్వం కేటాయిం చేందుకు అనుమతినిచ్చింది. అప్పట్లో స్థలం స్వాధీనం చేసుకునే విషయంలో సంస్థ జాప్యం చేసింది. రెండేళ్లుగా దీనిపై దృష్టిపెట్టింది. స్థలం కేటాయించాలంటూ ప్రభుత్వాన్ని కోరింది. దీనిపై పూర్వ కలెక్టర్ ఆరోగ్యరాజ్ అధ్యక్షతన పలుమార్లు సమావేశాలు జరిగాయి. ఆ భూమికి విలువ నిర్ధారించే విషయంలో తర్జనభర్జనలు జరిగాయి. చివరకు ప్రస్తుత కలెక్టర్ దీనిపై చర్యలు చేపట్టారు. భూమి అప్పగింతకు సంబంధించిన నివేదిక కలెక్టర్‌కు చేరగా, దాన్ని సీసీఎల్ఏకు పంపారు. అక్కడి నుంచి మార్చి 21న అనుమతులు మంజూరు కావడంతో బి.కొత్తకోట రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకున్నారు. కొండజింకల పార్కు సమీపంలో సర్వే నంబర్ 592/1లోని 3 ఎకరాల భూమిని కేటాయించాలని నిశ్చయించారు. ఆ భూమిని రెవెన్యూ శాఖ నుంచి పర్యాటకశాఖకు బదిలీచేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఆ భూమిని పర్యాటకశాఖ అధికారులు లీజుదారులకు అప్పగించనున్నారు. దీనిపై శుక్రవారం జిల్లా పర్యాటకశాఖ అధికారి డీ.చంద్రమౌళిరెడ్డి ‘న్యూస్‌లైన్’తో మాట్లాడుతూ భూమిని తమకు అప్పగించార ని, ఆ సంస్థతో ఒప్పందం చేసుకున్నాక భూమి అప్పగిస్తామని చెప్పారు. రూ.40 లక్షల నుంచి రూ.6.6 లక్షలకు హార్సిలీహిల్స్‌లోని భూమికి విలువను నిర్ణయించడంలో రెవెన్యూ అధికారులు ఇబ్బందులు పడ్డారు. ఇక్కడి భూమికి విలువకట్టలేం. అయితే ప్రయివేటు సంస్థకు 33 ఏళ్ల పాటు లీజుకు ఇవ్వాల్సిన భూమికి విలువ కట్టాల్సివచ్చింది. దీంతో తొలుత ఇక్కడ ఎకరా భూమికి ఏడాదికి రూ.5.5 లక్షలుగా నిర్ణయిం చి నివేదిక పంపారు. దీనిపై ఉన్నతాధికారుల నుంచి అభ్యంతరాలు రావడంతో వెనక్కు పంపారు. తర్వా త ఎకరా విలువను రూ.40 లక్షలుగా నిర్ణయించారు. దీనిపై కూడా అభ్యంతరాలొచ్చాయి. చివరకు ఎకరా కు రూ.6.6 లక్షలు చొప్పున మూడెకరాలకు రూ.19.8 లక్షలుగా నిర్ణయించారు. వచ్చేది మొక్కుబడి లీజు కొండపై పట్టుపరిశ్రమశాఖ భవనాల సమీపంలోని 3 ఎకరాలు లీజుకు అప్పగిస్తే ఏడాదికి ప్రభుత్వానికి వచ్చే ఆదాయం ఆ భూమికి నిర్ణయించిన విలువలో 5 శాతమే. 3 ఎకరాల విలువ రూ.19.8లక్షలు. అంటే తొలిసంవత్సరం సంస్థ ప్రభుత్వానికి చెల్లించే లీజు రూ.99వేలు. రెండో ఏడాది ఈ మొత్తానికి అదనంగా మరో ఐదు శాతం కలిపి చెల్లిస్తారు. మూడో ఏడాది అభివృద్ధి రుసుము, లీజు మొత్తం కలిపితే రూ.2 లక్షలు ప్రభుత్వానికి అందుతుంది. ఇలా ఏడాదికేడాది పెరుగుతూ ఉంటుంది.