ప్రముఖ టాలీవుడ్ సంగీత దర్శకుడు రాజ్ మృతి పట్ల మెగాస్టార్ చిరంజీవి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తన సంగీతం, అద్భుతమైన బాణీలు నా చిత్రాల విజయంలో కీలక పాత్ర పోషించాయని కొనియాడారు. సంగీత దర్శకుడు కోటితో కలిసి ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు సంగీతం అందించిన ఆయన మన మధ్య లేకపోవడం సంగీత ప్రపంచానికి తీరని లోటని అన్నారు. ఈ విషాద సమయంలో వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా అంటూ చిరంజీవి ట్వీట్ చేశారు.
(ఇది చదవండి: టాలీవుడ్‌లో విషాదం.. ప్రముఖ సంగీత దర్శకుడు కన్నుమూత)
కాగా.. 1983లో ప్రళయ గర్జన వీరిద్దరూ కలిసి పనిచేసిన మొదటి చిత్రం. యముడికి మొగుడు, లంకేశ్వరుడు, ముఠా మేస్త్రి, బాలగోపాలుడు, బంగారు బుల్లోడు, హలో బ్రదర్, అన్న-తమ్ముడు లాంటి విజయవంతమైన చిత్రాలకు రాజ్ కోటి ద్వయం సంగీతాన్ని సమకూర్చారు. ఆదివారం గుండెపోటుతో హైదరాబాద్‌లోని తన నివాసంలో ఆయన కన్నుమూశారు. కాగా.. ఆయనకు భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.
(ఇది చదవండి: నాకు జరిగిన అవమానాలను గుర్తు పెట్టుకుంటా: డైరెక్టర్ తేజ)
ప్రముఖ సంగీత దర్శక ద్వయం రాజ్-కోటి లలో 'రాజ్' ఇక లేరు అని తెలవటం దిగ్భ్రాంతికి గురి చేసింది. ఎంతో ప్రతిభ వున్న రాజ్ , నా కెరీర్ తొలి దశలలో నా చిత్రాలకందించిన ఎన్నో అద్భుత ప్రజాదరణ పొందిన బాణీలు, నా చిత్రాల విజయాలలో ముఖ్య పాత్ర వహించాయి. నన్ను ప్రేక్షకులకు మరింత చేరువ… pic.twitter.com/uPifYfmtFE
— Chiranjeevi Konidela (@KChiruTweets) May 21, 2023
Comments
Please login to add a commentAdd a comment