ప్రముఖ డైరెక్టర్ శ్యామ్ బెనెగల్ మృతి పట్ల మెగాస్టార్ చిరంజీవి సంతాపం వ్యక్తం చేశారు. మనదేశంలో అత్యుత్తమ డైరెక్టర్లలో ఆయన ఒకరని కొనియాడారు. ఆయన సినిమాలు, డాక్యుమెంటరీలు మనదేశం గొప్ప సంస్కృతిని తెలుపుతాయంటూ ట్వీట్ చేశారు. మన హైదరాబాదీ, మాజీ రాజ్యసభ సభ్యుడైన శ్యామ్ బెనెగల్ సాబ్ రచనలు ఇండియన్ సినీ చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతాయని మెగాస్టార్ పోస్ట్ చేశారు.
డైరెక్టర్ శ్యామ్ బెనెగల్ మృతి..
సినీ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. ప్రముఖ డైరెక్టర్ శ్యామ్ బెనగల్ కన్నుమూశారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధుపడుతున్న ఆయన ఇవాళ తుదిశ్వాస విడిచారు. ముంబయిలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.
శ్యామ్ బెనగల్ సినీ ప్రస్థానం
1934 డిసెంబర్ 14న హైదరాబాద్‌లో జన్మించిన ఆయన పలు చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఉస్మానియా వర్సిటీలో ఎంఏ విద్యను అభ్యసించారు. ఆయన దర్శకత్వ ప్రతిభకుగానూ దాదాసాహెబ్ ఫాల్కే పద్మశ్రీ, పద్మభూషణ్ లాంటి సినీ అత్యున్నత అవార్డులు అందుకున్నారు. 1976లో పద్మశ్రీ అవార్డ్ అందుకున్నారు. అంకుర్ (1974) అనే చిత్రం ద్వారా దర్శకుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. ఆ తర్వాత నిశాంత్ (1975), మంథన్ (1976), భూమిక, జునూన్ (1978), మండి (1983, త్రికాల్ (1985), అంతర్నాద్ (1991) లాంటి సూపర్ హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించారు.
Deeply saddened at the departure of Shri Shyam Benegal,one of the finest film makers and great intellectuals of our country. He discovered & nurtured some of the brightest film talents of India. His films, biographies and documentaries form part of India’s greatest cultural…
— Chiranjeevi Konidela (@KChiruTweets) December 23, 2024
Comments
Please login to add a commentAdd a comment