condolecnce
-
ఆయన మరణం తీవ్రంగా కలిచివేసింది: మెగాస్టార్ ట్వీట్
సిపీఎం అగ్రనేత సీతారాం ఏచూరి మరణం పట్ల మెగాస్టార్ చిరంజీవి సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కన్నుమూశారనే వార్త తనను తీవ్ర మనోవేదనకు గురిచేసిందన్నారు. విద్యార్థి కార్యకర్త స్థాయి నుంచి సామాన్య ప్రజల గొంతుగా ఆయన చేసిన కృషి మరువలేనిదని ట్వీట్ చేశారు. ఈ విషాద సమయంలో ఆయన కుటుంబానికి, అభిమానులకు నా హృదయపూర్వక సానుభూతి తెలియజేస్తున్నానని తెలిపారు. సీతారాం ప్రజా సేవ, దేశం పట్ల నిబద్ధత ఎప్పటికీ గుర్తుండిపోతుందని మెగాస్టార్ పోస్ట్ చేశారు. కాగా.. తీవ్ర అనారోగ్యంతో ఢిల్లీలోని ఓ ఆస్పత్రిలో చేరిన సీతారాం ఏచూరి మరణించిన సంగతి తెలిసిందే. (ఇది చదవండి: 'విశ్వంభర'లో అడుగుపెట్టిన ఇద్దరు హీరోయిన్లు)కాగా.. చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర చిత్రంలో నటిస్తున్నారు. బింబిసార ఫేమ్ వశిష్ట ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. . సోషియో ఫ్యాంటసీ అడ్వెంచరస్‌గా ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. యూవీ క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్, విక్రమ్ ఈ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో మెగాస్టార్ సరసన త్రిష కనిపించనుంది. చాలా ఏళ్ల తర్వాత ఈ జంట వెండితెరపై సందడి చేయనుంది. ఈ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతి పండగకి జనవరి 10న విడుదల కానుంది. Deeply distressed by the news of the passing of Shri Sitaram Yechury, a veteran leader with over five decades of political journey and a tall leader of the CPM. Since starting as a student activist, Shri Yechuri had always strived to be the voice of the downtrodden and common…— Chiranjeevi Konidela (@KChiruTweets) September 13, 2024 -
సీతారాం ఏచూరి మృతి పట్ల వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
సాక్షి, తాడేపల్లి: సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మరణంపై వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.ఏచూరి పట్ల వైఎస్ జగన్..జీవితాంతం వామపక్ష భావాలతో గడిపిన ఆయన, దేశ ప్రగతి కోసం నిర్విరామంగా చొరవ చూపారని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడలో జన్మించిన సీతారాం ఏచూరి, స్వశక్తితో జాతీయ స్థాయికి ఎదిగారని, విద్యార్థి దశ నుంచే ఆయన నాయకత్వ లక్షణాలు కనబర్చారని గుర్తు చేశారు. సీపీఎంలోనూ నాయకత్వ లక్షణాలు చూపి, పార్టీలో అత్యున్నత విధాన నిర్ణాయక పోలిట్‌బ్యూరో సభ్యుడిగానూ, పార్టీ ప్రధాన కార్యదర్శిగానూ పని చేశారు. ఏచూరి మృతి, దేశ రాజకీయాల్లో తీరని లోటని అన్నారు. ఇది కూడా చదవండి: వామపక్ష దిగ్గజ నేత ఏచూరి రాజకీయ ప్రస్థానం ఇలా.. -
డీఎస్ చివరి కోరిక అదే.. మేము నెరవేర్చాం: సీఎం రేవంత్
సాక్షి, నిజామాబాద్: సీనియర్ నాయకుడు ధర్మపురి శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీకి ఎంతో సేవ చేశారు. ఆయన కుటుంబానికి కాంగ్రెస్ అండగా నిలబడుతుందన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అలాగే, డీఎస్ కోరికను కూడా మేము నెరవేర్చాము అని తెలిపారు.కాగా, సీఎం రేవంత్ ఆదివారం నిజామాబాద్‌కు వెళ్లారు. ఈ సందర్భంగా డీఎస్ భౌతికకాయానికి నివాళులు అర్పించారు. డీఎస్ కుమారులు అర్వింద్, సంజయ్‌లను పరామర్శించారు. అనంతరం, సీఎం రేవంత్ మాట్లాడుతూ..‘ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ అధికారంలోకి రావడానిక డీఎస్ కష్టపడ్డారు. విద్యార్థి నాయకుడి స్థాయి నుంచి అంచెలంచెలుగా ఎదిగిన వ్యక్తి శ్రీనివాస్. కొంత కాలం కాంగ్రెస్ పార్టీకి దూరమైన పార్లమెంట్లో డీఎస్‌ను సోనియా గాంధీ అప్యాయంగానే పలకరించేవారు.పదవులపై తనకు ఎప్పుడూ ఆశ లేదని డీఎస్ అనేవారు. చనిపోయినపుడు తనపై కాంగ్రెస్ జెండా కప్పి ఉంచాలన్నది డీఎస్ కోరిక. అందుకే ముఖ్య నాయకులను పంపి వారి కోరిక తీర్చాము. డీఎస్ కాంగ్రెస్ పార్టీకి ఎంతో సేవ చేశారు. ఆయన కుటుంబానికి కాంగ్రెస్ అండగా నిలబడుతుంది. కుటుంబ సభ్యులతో చర్చించి డీఎస్ జ్ఞాపకార్ధం ఏం చేయాలో నిర్ణయం తీసుకుంటాం. డీఎస్ మరణం కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు’ అంటూ కామెంట్స్ చేశారు. -
రామోజీరావు మృతి పట్ల నాట్స్ సంతాపం
తెలుగుజాతి ముద్దు బిడ్డ... తెలుగు మీడియా దిగ్గజం రామోజీ రావు మృతి తమను తీవ్రంగా కలిచివేసిందని ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ బోర్డ్ ఛైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని ఒక ప్రకటనలో తెలిపారు. తెలుగు భాష వైభవానికి రామోజీరావు చేసిన కృషి మరువలేనిదన్నారు.. ప్రతి తెలుగువాడికి రామోజీరావు జీవితం ఓ స్ఫూర్తిదాయక పాఠమని నాట్స్ అధ్యక్షుడు మదన్ పాములపాటి అన్నారు. రామోజీరావు ఈనాడు, ఈటీవీ సంస్థలను ఉన్నత విలువలు ఉన్న సంస్థలుగా నిలబెట్టి మనందరికి విజ్ఞానాన్ని, విలువైన సమాచారాన్ని అందించారని తెలిపారు. రామోజీరావు మరణవార్త అమెరికాలో ఉండే తెలుగువారందరిని దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు. రామోజీరావు మృతి పట్ల నాట్స్ సంతాపాన్ని వెలిబుచ్చింది. ఆయన ఆత్మకు శాంతి కలగాలని నాట్స్ సభ్యులు ప్రార్థించారు. రామోజీరావు కుటుంబ సభ్యులకు నాట్స్ ప్రగాఢ సానుభూతిని తెలిపింది.(చదవండి: రష్యా నది నుంచి భారతీయ వైద్య విద్యార్థుల మృతదేహాలు వెలికితీత) -
విజయకాంత్ మరణం.. కన్నీళ్లు పెట్టుకున్న స్టార్ హీరో!
తమిళస్టార్ నటుడు, డీఎండీకే అధినేత మృతి పట్ల పలువురు సినీతారలు సంతాపం ప్రకటిస్తున్నారు. ఇప్పటికే కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్ ప్రముఖులు సైతం ఆయనకు నివాళులర్పించారు. తాజాగా విజయ్‌కాంత్ మృతిపట్ల కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ విచారం వ్యక్తం చేశారు. ఆయన మరణాన్ని తలుచుకుని కన్నీటి పర్యంతమయ్యారు. దీనికి సంబంధించిన ఓ వీడియోను ట్విటర్లో పంచుకున్నారు. ప్రస్తుతం అమెరికాలో పర్యటనలో విశాల్ ఏడుస్తున్న వీడియో అభిమానులకు కన్నీళ్లు తెప్పిస్తోంది. విశాల్ వీడియోలో మాట్లాడుతూ..' కెప్టెన్ మరణించిన విషయం ఇప్పుడే నాకు తెలిసింది. ఈ వార్త విన్నాక నా కాళ్లు, చేతులు పనిచేయడం లేదు. కెప్టెన్‌ను కోల్పోవడం చాలా బాధగా ఉంది. ఆయన చివరి చూపునకు కూడా నోచుకోలేకపోతున్నా. నేను నడిగర్ సంఘం అధ్యక్షునిగా ఉన్నప్పుడు అండగా నిలిచారు. ఈ సమయంలో వారి కుటుంబానికి ఆ దేవుడు ధైర్యం ఇవ్వాలని కోరుకుంటున్నా. విజయ్‌కాంత్ సార్‌కు ఇదే నా కన్నీటి నివాళి' అంటూ ఏడుస్తూ పోస్ట్ చేశారు. కాగా.. తమిళనాడు డీఎండీకే అధినేత, నటుడు విజయకాంత్ బుధవారం కన్నుమూశారు. చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న ఆయన తుదిశ్వాస విడిచారు. అనారోగ్యంతో మంగళవారం ఆస్పత్రిలో చేరిన ఆయన మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. ఈ మేరకు చెన్నై మియాట్ వైద్యులు ప్రకటన విడుదల చేశారు. విజయ్‌కాంత్ మృతి పట్ల కోలీవుడ్ ప్రముఖులు, రాజకీయ నాయకులు సంతాపం ప్రకటించారు. -
రియల్ హీరో అంటే మీరే సార్.. !
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య తన గొప్ప మనసును చాటుకున్నారు. తన అభిమాని ఒకరు మృతి చెందడంతో ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరలయ్యాయి. సినిమాలతో ఎప్పుడు హీరో తన అభిమాని కుటుంబం కష్టాల్లో ఉన్నప్పుడు రావడంతో ఆయనపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. సినిమాల్లోనే కాదు.. రియల్ లైఫ్‌లోనూ మీలో హీరో ఉన్నాడంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. (ఇది చదవండి: జవాన్ టీం బంపరాఫర్.. ఆ మూడు రోజులు టికెట్ ఫ్రీ! ) చెన్నైలోని ఎన్నూర్‌లో నివసించే అరవింద్ హీరో సూర్యకు వీరాభిమాని. సూర్య ఫ్యాన్స్ క్లబ్లో కొన్నేళ్లుగా మెంబర్ కూడా పని చేశారు. ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన చనిపోయారు. ఈ విషయం తెలుసుకున్న సూర్య వెంటనే అరవింద్ వాళ్ల ఇంటికి వెళ్లారు. అతడి తల్లిదండ్రులతో మాట్లాడి వారిలో ధైర్యాన్ని నింపారు. గతంలోనూ అభిమానులు చనిపోతే వాళ్ల కుటుంబాలకి అండగా నిలిచారు. కాగా.. సూర్య ప్రస్తుతం కంగువ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్నారు. (ఇది చదవండి: సైలెంట్‌గా ఓటీటీకి వచ్చేసిన ధోని 'ఎల్‌జీఎమ్'... తెలుగు సినిమాలు ఎన్నో తెలుసా?) The Man With Golden Heart 🛐❤️#Aravind a fan and a member of Fans Club lost his life in a road accident. Upon hearing the news, @Suriya_offl visited Aravind's home in Ennore to meet the family and conveyed his prayers and condolences.@rajsekarpandian #Kanguva pic.twitter.com/IycmuazAMC — SURIYA FANS TELUGU (@SuryaFansAndhra) September 28, 2023 -
'ఆ గొంతు ఎప్పటికీ వినిపిస్తూనే ఉంటుంది'.. మెగాస్టార్ ఎమోషనల్ ట్వీట్
ప్రజా గాయకుడు గద్దర్ మృతి పట్ల మెగాస్టార్ చిరంజీవి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన గొంతు అజరామరం అంటూ కొనియాడారు. ప్రజా ప్రయోజనాల కోసం గొంతు ఎత్తి పోరాడిన ప్రజా గాయకుడు గద్దర్ అంటూ ప్రశంసించారు. ఈ విషాద సమయంలో వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ మేరకు గద్దర్‌కు సంతాపం ప్రకటిస్తూ ట్వీట్ చేశారు. కాగా.. చిరంజీవి నటించిన చిత్రం గాడ్ ఫాదర్లో గద్దర్ కీలక పాత్రలో కనిపించారు. (ఇది చదవండి: గద్దర్ మృతికి ప్రధాన కారణమిదే!) మెగాస్టార్ ట్వీట్లో రాస్తూ..' వారి గళం అజరామరం. ఆయన ఏ పాట పాడినా, దానికో ప్రజా ప్రయోజనం ఉండేలా గొంతు ఎత్తి పోరాడిన ప్రజా గాయకుడు. 'ప్రజా యుద్ధ నౌక' గద్దరన్న కి లాల్ సలాం! సరళంగా ఉంటూనే అత్యంత ప్రభావవంతమైన తన మాటలు, పాటలతో దశాబ్దాల పాటు ప్రజల్లో స్ఫూర్తిని రగిల్చిన గద్దరన్న ఇక లేరు అనే వార్త తీవ్ర విషాదాన్ని నింపింది. ప్రజా సాహిత్యంలో, ప్రజా ఉద్యమాలలో ఆయన లేని లోటు ఎప్పటికీ పూడ్చలేనిది. పాటల్లోనూ, పోరాటంలోనూ ఆ గొంతు ఎప్పటికీ వినిపిస్తూనే ఉంటుంది. ఆయన కుటుంబ సభ్యులకు ,లక్షలాది అభిమానులకు , శ్రేయోభిలాషులకు నా ప్రగాఢ సంతాపం!' అంటూ ట్వీట్ చేశారు. కాగా.. అనారోగ్య సమస్యలతో ఆస్పత్రిలో చేరిన ప్రజా గాయకుడు గద్దర్ ఆగస్టు 6న తుదిశ్వాస విడిచారు. (ఇది చదవండి: ఒక శకం ముగిసింది.. గద్దర్ మరణంపై ఆర్ నారాయణమూర్తి దిగ్భ్రాంతి) వారి గళం అజరామరం. ఏ పాట పాడినా, దానికో ప్రజా ప్రయోజనం ఉండేలా గొంతు ఎత్తి పోరాడిన ప్రజా గాయకుడు, 'ప్రజా యుద్ధ నౌక' గద్దరన్న కి లాల్ సలాం ! 🙏🙏 సరళంగా ఉంటూనే అత్యంత ప్రభావవంతమైన తన మాటల పాటల తో దశాబ్దాల పాటు ప్రజల్లో స్ఫూర్తిని రగిల్చిన గద్దరన్న ఇక లేరు అనే వార్త తీవ్ర… pic.twitter.com/a7GtDUFYeD — Chiranjeevi Konidela (@KChiruTweets) August 6, 2023 హీరో బాలకృష్ణ సంతాపం ప్రజా గాయకుడు గద్దర్ మృతి పట్ల నందమూరి బాలకృష్ణ సంతాపం తెలిపారు. తన ఆటపాటలతో ప్రజా ఉద్యమాలు నడిపించిన విప్లవకారుడు, ప్రజా ఉద్యమ నాయకుడు గద్దర్ మృతి పట్ల ఆయన తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. గద్దర్ ఓ విప్లవశక్తి. ప్రజా ఉద్యమ పాటలంటే తెలుగు రాష్ట్రాల్లోనూ దేశవ్యాప్తంగా మన గద్దర్ గుర్తుకు వస్తారంటూ కొనియాడారు. ప్రజా ఉద్యమాల్లో గద్దర్ లేని లోటును ఎవ్వరు తీర్చలేరు. గద్దర్ ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతున్ని ప్రార్థిస్తున్నా.. ఈ విషాద సమయంలో వారి కుటుంబ సభ్యులకు బాలకృష్ణ ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా అని అన్నారు. జూనియర్ ఎన్టీఆర్ సంతాపం ప్రజా గాయకుడు గద్దర్ మరణం పట్ల జూనియర్ ఎన్టీఆర్ సంతాపం ప్రకటించారు. ఆయన రచనలతో కొన్ని దశాబ్దాలుగా ప్రజల గుండెల్లో స్పూర్థిని నింపిన ప్రజా గాయకుడు గద్దర్.. మన మధ్యన లేకున్నా, ఆయన ఆటా, మాటా, పాటా ఎప్పటికీ మనతోనే సజీవంగానే ఉంటాయని అన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు, కోట్లాది అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా అంటూ ట్వీట్ చేశారు. ఆయన రచనలతో కొన్ని దశాబ్దాలుగా ప్రజల గుండెల్లో స్పూర్థిని నింపిన ప్రజా గాయకుడు గద్దర్ గారు మన మధ్యన లేకున్నా, ఆయన ఆటా, మాటా, పాటా ఎప్పటికీ మన మధ్యన సజీవంగానే ఉంటుంది. గద్దర్ గారి కుటుంబ సభ్యులకు మరియు కోట్లాది అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. pic.twitter.com/oksRc840PC — Jr NTR (@tarak9999) August 6, 2023 -
రైలు ప్రమాద ఘటనతో నా గుండె పగిలింది: అల్లు అర్జున్
ఒడిశా రైలు ప్రమాద ఘటనపై సినీ తారలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. టాలీవుడ్ ప్రముఖులతో పాటు దక్షిణాది పరిశ్రమకు చెందిన పలువురు నటీనటులు వారికి సంతాపం ప్రకటిస్తున్నారు. ఈ ఘోర ప్రమాదంలో దాదాపు 200లకు పైగా ఇప్పటికే ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదం చూసి యావత్ భారత్ ఉలిక్కిపడింది. వారి మృతికి సంతాపంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా, బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్, హీరోయిన్ నివేదా పేతురాజ్, కేజీఎఫ్ నటుడు యశ్ ట్వీట్ చేశారు. అల్లు అర్జున్ ట్వీట్లో రాస్తూ..'ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాద ఘటన చూసి నా గుండె పగిలింది. తమ ఆత్మీయులను కోల్పోయిన కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని మనస్ఫూర్తిగా ఆ దేవుడిని ప్రార్థిస్తున్నా.' అంటూ పోస్ట్ చేశారు. (ఇది చదవండి: సహానటుడితో హీరోయిన్ డేటింగ్.. పోస్ట్ వైరల్!) Shocked & heart broken by the tragic train accident in Odisha. My condolences to the families who have suffered the loss of their loved ones. Sending heartfelt prayers for the recovery of those who were injured. — Allu Arjun (@alluarjun) June 3, 2023 రష్మిక తన ట్వీట్లో రాస్తూ..'ఒడిశాలో జరిగిన రైలు ప్రమాద వార్త వింటే గుండె తరుక్కుపోతుంది. మరణించిన వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా.గాయపడిన వారంతా త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా.' అంటూ పోస్ట్ చేశారు. Hearbreaking to hear about the news of the train accident in Odisha.. My deepest condolences to the families of the departed. My prayers for the people who are injured… — Rashmika Mandanna (@iamRashmika) June 3, 2023 కేజీఎఫ్ హీరో యశ్ తన ట్వీట్లో రాస్తూ..'ఒడిశా రైలు దుర్ఘటన ఎంతమంది హృదయాలను కలచివేసిందో మాటల్లో వర్ణించడం కష్టం. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నా. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా. రెస్క్యూ ఆపరేషన్లలో సహాయం చేయడానికి పెద్ద సంఖ్యలో వచ్చిన ప్రజలకు కృతజ్ఞతలు.' అంటూ పోస్ట్ చేశారు. ఈ ప్రమాద ఘటనపై ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్ కూడా స్పందించారు. (ఇది చదవండి: ఒడిశా రైలు ప్రమాదం: ఆ పని చేయాలంటూ ఫ్యాన్స్‌కి చిరు విజ్ఞప్తి) It’s difficult to describe in words how heart-wrenching the train tragedy of Odisha is. My deepest condolences to the families of the deceased and praying for the speedy recovery of those injured. Gratitude to the people who have come out in large numbers to help with rescue… — Yash (@TheNameIsYash) June 3, 2023 Really saddened to hear abt the accident,May God rest the souls of the deceased in peace,Protect n give strength to the families n the injured from this unfortunate accident. — Salman Khan (@BeingSalmanKhan) June 3, 2023 Odisha train accident is the most chilling news I’ve heard in recent times. May all the souls who lost their lives rest in peace. My prayers and heartfelt condolences to the families of the affected. — Nivetha Pethuraj (@Nivetha_Tweets) June 3, 2023 -
మాజీ ఎమ్మెల్యే ఎంవీ రమణారెడ్డి మృతికి సీఎం జగన్ సంతాపం
సాక్షి, వైఎస్సార్ జిల్లా: ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎం.వీ. రమణారెడ్డి ఆకస్మిక మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. రమణారెడ్డి కుటుంబ సభ్యులకు సీఎం జగన్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న రమణారెడ్డి బుధవారం కర్నూలులోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. ఆయన మృతిపట్ల పలువురు రాజకీయ నేతలు తమ సంతాపాన్ని తెలియజేశారు. చదవండి: Proddatur: మాజీ ఎమ్మెల్యే ఎంవీ రమణారెడ్డి కన్నుమూత -
సుశాంత్ మరణం అబద్ధమైతే బాగుండు
ముంబై: ‘నేను, నా కుటుంబం.. కాస్తా ప్రశాంతమైన జీవితం అంతే ఇంతకు మించి నేను కోరుకోవడం లేదు’ అంటూ భోజ్‌పురి స్టార్ హీరోయిన్ రాణి ఛటర్జీ సోమవారం ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు. బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ తీవ్ర ఒత్తిడితో అదివారం ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సెలబ్రిటీలంతా సోషల్ మీడియాలో సుశాంత్‌కు నివాళులు అర్పిస్తున్నారు. అదే విధంగా రాణి, సుశాంత్ మృతిపై స్పందిస్తూ.. ‘‘ప్రస్తుతం నేను కోరుకుంటుంది ఒకటే.. నేను నా కుటుంబం ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా ఉండాలని. ఈ దశాబ్థ కాలంలో అత్యంత కలతకు గురిచేసిన సంఘటనలో సుశాంత్ మరణం ఒకటి. ఇకపై ఇలాంటి విషాద ఘటనలు జరగకూడదని ఆ దేవుడిని పార్థిస్తున్నాను’’ అంటూ ఇన్‌స్టాలో రాసుకొచ్చారు. (నవంబర్‌లో పెళ్లికి సిద్ధమైన సుశాంత్) View this post on Instagram A post shared by Rani Chatterjee Official (@ranichatterjeeofficial) on Jun 14, 2020 at 10:23pm PDT అంతేగాక సుశాంత్ ఫొటోను షేర్ చేస్తూ.. ‘‘ ఆయన మరణించాడన్న విషయాన్ని నమ్మలేకపోతున్న, ఆయన మరణ వార్త అబద్ధమైతే బాగుండు. WHY??????? SHUSHANT #shushantsinghrajput’’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల తను కూడా ఒత్తిడికి లోనయ్యాయని, ఆ సమయంలో క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొన్నానని వెల్లడించారు. ఆ తర్వాత కుటుంబ సభ్యులు, స్నేహితుల సహయంతో మెల్లిగా ఒత్తిడి నుంచి బయటపడిగలిగానని చెప్పారు. కావున ఒత్తిడితో పోరాడుతున్న వారికి సహాయం చేయాలని ఆమె విజ్ఞప్తి చేశారు. కాగా ప్రస్తుతం రాణి భోజ్‌పురి యాక్షన్ డ్రామా 'లేడీ సింఘం'లో నటిస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు శక్తి కపూర్ ప్రధాన పాత్రలో కినిపించనున్నట్లు సమాచారం. (అవును... త్వరగా వెళ్లిపోయావ్ సుశాంత్..) View this post on Instagram It is getting very hard to believe that someone will say that this is not true 😭😭😭😭😭😭 RIP . WHY??????? SHUSHANT #shushantsinghrajput A post shared by Rani Chatterjee Official (@ranichatterjeeofficial) on Jun 14, 2020 at 2:18am PDT -
కశ్మీర్ సీఎం మృతి పట్ల తెలుగు సీఎంల సంతాపం
హైదారాబాద్: అనారోగ్యంతో గురువారం కన్నుమూసిన జమ్ముకశ్మీర్ ముఖ్యమంత్రి ముఫ్తీ మహ్మద్ సయీద్(79)కు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇద్దరూ సంతాపం తెలిపారు. తెలంగాణకు మఫ్తీ మహ్మద్ మద్దతుగా నిలిచారని ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గుర్తు చేసుకున్నారు. అంత్యక్రియలకు రాష్ట్రం నుంచి డిప్యూటీ సీఎం మహమూద్ అలీ బృందం హాజరు కానున్నట్లు సమాచారం. ముఫ్తీ మహ్మద్ సయీద్ మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఒక ప్రకటనలో సంతాపం తెలిపారు.