ప్రజా గాయకుడు గద్దర్ మృతి పట్ల మెగాస్టార్ చిరంజీవి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన గొంతు అజరామరం అంటూ కొనియాడారు. ప్రజా ప్రయోజనాల కోసం గొంతు ఎత్తి పోరాడిన ప్రజా గాయకుడు గద్దర్ అంటూ ప్రశంసించారు. ఈ విషాద సమయంలో వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ మేరకు గద్దర్‌కు సంతాపం ప్రకటిస్తూ ట్వీట్ చేశారు. కాగా.. చిరంజీవి నటించిన చిత్రం గాడ్ ఫాదర్‌లో గద్దర్ కీలక పాత్రలో కనిపించారు.
(ఇది చదవండి: గద్దర్ మృతికి ప్రధాన కారణమిదే!)
మెగాస్టార్ ట్వీట్‌లో రాస్తూ..' వారి గళం అజరామరం. ఆయన ఏ పాట పాడినా, దానికో ప్రజా ప్రయోజనం ఉండేలా గొంతు ఎత్తి పోరాడిన ప్రజా గాయకుడు. 'ప్రజా యుద్ధ నౌక' గద్దరన్న కి లాల్ సలాం! సరళంగా ఉంటూనే అత్యంత ప్రభావవంతమైన తన మాటలు, పాటలతో దశాబ్దాల పాటు ప్రజల్లో స్ఫూర్తిని రగిల్చిన గద్దరన్న ఇక లేరు అనే వార్త తీవ్ర విషాదాన్ని నింపింది. ప్రజా సాహిత్యంలో, ప్రజా ఉద్యమాలలో ఆయన లేని లోటు ఎప్పటికీ పూడ్చలేనిది. పాటల్లోనూ, పోరాటంలోనూ ఆ గొంతు ఎప్పటికీ వినిపిస్తూనే ఉంటుంది. ఆయన కుటుంబ సభ్యులకు ,లక్షలాది అభిమానులకు , శ్రేయోభిలాషులకు నా ప్రగాఢ సంతాపం!' అంటూ ట్వీట్ చేశారు. కాగా.. అనారోగ్య సమస్యలతో ఆస్పత్రిలో చేరిన ప్రజా గాయకుడు గద్దర్ ఆగస్టు 6న తుదిశ్వాస విడిచారు.
(ఇది చదవండి: ఒక శకం ముగిసింది.. గద్దర్ మరణంపై ఆర్ నారాయణమూర్తి దిగ్భ్రాంతి)
వారి గళం అజరామరం. ఏ పాట పాడినా, దానికో ప్రజా ప్రయోజనం ఉండేలా గొంతు ఎత్తి పోరాడిన ప్రజా గాయకుడు, 'ప్రజా యుద్ధ నౌక' గద్దరన్న కి లాల్ సలాం ! 🙏🙏
— Chiranjeevi Konidela (@KChiruTweets) August 6, 2023
సరళంగా ఉంటూనే అత్యంత ప్రభావవంతమైన తన మాటల పాటల తో దశాబ్దాల పాటు ప్రజల్లో స్ఫూర్తిని రగిల్చిన గద్దరన్న ఇక లేరు అనే వార్త తీవ్ర… pic.twitter.com/a7GtDUFYeD
హీరో బాలకృష్ణ సంతాపం
ప్రజా గాయకుడు గద్దర్ మృతి పట్ల నందమూరి బాలకృష్ణ సంతాపం తెలిపారు. తన ఆటపాటలతో ప్రజా ఉద్యమాలు నడిపించిన విప్లవకారుడు, ప్రజా ఉద్యమ నాయకుడు గద్దర్ మృతి పట్ల ఆయన తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. గద్దర్ ఓ విప్లవశక్తి. ప్రజా ఉద్యమ పాటలంటే తెలుగు రాష్ట్రాల్లోనూ దేశవ్యాప్తంగా మన గద్దర్ గుర్తుకు వస్తారంటూ కొనియాడారు. ప్రజా ఉద్యమాల్లో గద్దర్ లేని లోటును ఎవ్వరు తీర్చలేరు. గద్దర్ ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతున్ని ప్రార్థిస్తున్నా.. ఈ విషాద సమయంలో వారి కుటుంబ సభ్యులకు బాలకృష్ణ ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా అని అన్నారు.
జూనియర్ ఎన్టీఆర్ సంతాపం
ప్రజా గాయకుడు గద్దర్ మరణం పట్ల జూనియర్ ఎన్టీఆర్ సంతాపం ప్రకటించారు. ఆయన రచనలతో కొన్ని దశాబ్దాలుగా ప్రజల గుండెల్లో స్పూర్థిని నింపిన ప్రజా గాయకుడు గద్దర్.. మన మధ్యన లేకున్నా, ఆయన ఆటా, మాటా, పాటా ఎప్పటికీ మనతోనే సజీవంగానే ఉంటాయని అన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు, కోట్లాది అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా అంటూ ట్వీట్ చేశారు.
ఆయన రచనలతో కొన్ని దశాబ్దాలుగా ప్రజల గుండెల్లో స్పూర్థిని నింపిన
— Jr NTR (@tarak9999) August 6, 2023
ప్రజా గాయకుడు గద్దర్ గారు మన మధ్యన లేకున్నా, ఆయన ఆటా, మాటా, పాటా ఎప్పటికీ మన మధ్యన సజీవంగానే ఉంటుంది.
గద్దర్ గారి కుటుంబ సభ్యులకు మరియు కోట్లాది అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. pic.twitter.com/oksRc840PC
Comments
Please login to add a commentAdd a comment