రియల్ హీరో అంటే మీరే సార్.. ! | Suriya Visited The Family Of A Fan And Conveyed His Condolences - Sakshi
Sakshi News home page

Suriya: రియల్‌ లైఫ్‌ హీరో అనిపించుకున్నారు.. అభిమాని కుటుంబం కోసం!

Published Thu, Sep 28 2023 3:23 PM | Last Updated on Thu, Sep 28 2023 3:33 PM

Kollywood Hero Surya Condolences To His fan Family In Chennai  - Sakshi

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య తన గొప్ప మనసును చాటుకున్నారు.  తన అభిమాని ఒకరు మృతి చెందడంతో ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరలయ్యాయి. సినిమాలతో ఎప్పుడు హీరో తన అభిమాని కుటుంబం కష్టాల్లో ఉన్నప్పుడు రావడంతో ఆయనపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. సినిమాల్లోనే కాదు.. రియల్‌ లైఫ్‌లోనూ మీలో హీరో ఉన్నాడంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. 

(ఇది చదవండి: జవాన్ టీం బంపరాఫర్‌.. ఆ మూడు రోజులు టికెట్ ఫ్రీ! )

చెన్నైలోని ఎన్నూర్‌లో నివసించే అరవింద్‌ హీరో సూర్యకు వీరాభిమాని. సూర్య ఫ్యాన్స్‌ క్లబ్‌లో కొన్నేళ్లుగా మెంబర్‌ కూడా పని చేశారు. ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన చనిపోయారు. ఈ విషయం తెలుసుకున్న సూర్య వెంటనే అరవింద్‌ వాళ్ల ఇంటికి వెళ్లారు. అతడి తల్లిదండ్రులతో మాట్లాడి వారిలో ధైర్యాన్ని నింపారు. గతంలోనూ అభిమానులు చనిపోతే వాళ్ల కుటుంబాలకి అండగా నిలిచారు. 

కాగా.. సూర్య ప్రస్తుతం కంగువ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతమందిస్తున్నారు.

(ఇది చదవండి: సైలెంట్‌గా ఓటీటీకి వచ్చేసిన ధోని 'ఎల్‌జీఎమ్‌'... తెలుగు సినిమాలు ఎన్నో తెలుసా?)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement