
సినిమా ఇండస్ట్రీలో ఫ్యాన్ వార్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అని అభిమానులు హడావుడి చేస్తుంటారు. ఇక అభిమాన హీరో సినిమా రిలీజ్ అయితే ఆ హంగామా అంతా ఇంతా కాదు. కటౌట్స్, డ్యాన్స్‌లు, డైలాగ్స్‌తో ఊగిపోతుంటారు. ముఖ్యంగా థియేటర్ల వద్ద అభిమాన సంఘాలు రచ్చ రచ్చ చేస్తుంటారు. అప్పుడప్పుడు ఇవీ కాస్తా శృతి మించి గొడవలు కూడా జరుగుతుంటాయి.
అయితే తాజాగా కేరళలోని ఓ థియేటర్‌లో ఇద్దరు స్టార్ హీరోల అభిమానుల మధ్య గొడవ జరిగింది. ఇటీవల కోలీవుడ్ స్టార్ అజిత్ నటించిన గుడ్ బ్యాడ్ అగ్లీ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు వచ్చిన కొందరు ఫ్యాన్స్.. విజయ్, విజయ్ అంటూ కేకలు వేశారు. దీంతో అక్కడే అజిత్ అభిమానులు ఒక్కసారిగా వారిపై దాడి చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటన కేరళలోని పాలక్కాడ్‌లోని ఓ థియేటర్‌లో జరిగినట్లు సమాచారం.
కాగా.. అజిత్ కుమార్ నటించిన యాక్షన్ థ్రిల్లర్'గుడ్ బ్యాడ్ అగ్లీ' ఏప్రిల్ 10 న థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమాకు అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించారు. త్రిష హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో.. అర్జున్ దాస్ విలన్‌గా మెప్పించారు. సిమ్రాన్ ముఖ్య అతిథి పాత్రలో నటించారు. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ భారీ ఎత్తున నిర్మించారు. ఇప్పటికే వంద కోట్ల మార్క్ దాటేసిన గుడ్ బ్యాడ్ అగ్లీ.. బాక్సాఫీస్ వద్ద వసూళ్లపరంగా దూసుకెళ్తోంది. ఇటీవలే ఈ సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ గ్రాండ్‌గా నిర్వహించారు మేకర్స్.
கேரளாவில் தியேட்டர் ஒன்றில் Good Bad Ugly படம் ஓடிக்கொண்டிருக்கும்போது TVK, Tvk இன்று கோஷமிட்ட விஜய் ரசிகர்கள், விஜய் ரசிகர்களை வெளுத்து வாங்கிய அஜித் ரசிகர்கள் #GoodBadUgly #Ajithkumar #TvkVijay #Kerala pic.twitter.com/BjLMRZWOgG
— VSV Cinemas (@vsvcinecreation) April 12, 2025