'గుడ్ బ్యాడ్‌ అగ్లీ' సెన్సార్ పూర్తి.. రన్‌ టైమ్‌ ఎంతంటే? | Ajith Kumar Latest Movie Good Bad Ugly Cut Censor Completed | Sakshi
Sakshi News home page

Good Bad Ugly Movie: 'గుడ్ బ్యాడ్‌ అగ్లీ' సెన్సార్ పూర్తి.. ఏ సర్టిఫికేట్ వచ్చిందంటే?

Published Mon, Apr 7 2025 7:37 PM | Last Updated on Mon, Apr 7 2025 7:42 PM

Ajith Kumar Latest Movie Good Bad Ugly Cut Censor Completed

కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ నటించిన ఫుల్ యాక్షన్‌ థ్రిల్లర్‌ 'గుడ్ బ్యాడ్ అగ్లీ'. ఈ చిత్రంలో త్రిష హీరోయిన్‌గా నటించింది.  ఈ సినిమాకు అధిక్ రవిచంద్రన్‌ దర్శకత్వం వహించారు. ఈ మూవీని మైత్రి మేకర్స్ బ్యానర్‌లో  వై రవిశంకర్, నవీన్ యేర్నేని నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ నెల 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ మూవీ తెలుగు, తమిళంలో ట్రైలర్స్ కూడా రిలీజ్ చేశారు మేకర్స్.

తాజాగా ఈ మూవీ సెన్సార్ కూడా పూర్తి చేసుకుంది. గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రానికి యూ/ఏ సర్టిఫికేట్ జారీ చేశారు. ఈ మూవీ రన్‌ టైమ్‌ను దాదాపు 140 నిమిషాలుగా సెన్సార్ బోర్డు నిర్ణయించింది. అదే సమయంలో అభ్యంతరకరంగా ఉన్న దాదాపు 2 నిమిషాల సీన్స్‌ను తొలగించినట్లు తెలుస్తోంది. అంతే కాకుండా 1 నిమిషం 41 సెకన్ల పాటు ఉన్న సీన్స్‌లో మార్పులు చేసినట్లు కనిపిస్తోంది.  మొత్తానికి అజిత్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న ఫుల్ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గానే థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమైంది. కాగా.. ఈ చిత్రంలో సునీల్, ప్రసన్న కీలక పాత్రలు పోషిస్తున్నారు. కాగా.. ఈ సినిమాకు జీవీ ప్రకాష్‌కుమార్‌ సంగీతం అందించారు. 
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement