Good Bad ugly
-
'అజిత్' అభిమానులకు గూస్బంప్స్ తెప్పించిన సాంగ్ విడుదల
అజిత్ (Ajith Kumar) హీరోగా నటించిన ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ (Good Bad Ugly) చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ ఇప్పటికే రూ. 200 కోట్ల క్లబ్లో చేరింది. ఏకంగా తన కెరీర్లోనే టాప్ కలెక్షన్స్ సాధించిన సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది. అయితే, ఈ సినిమాలోని ఒక మ్యూజిక్ థీమ్‌తో ఉన్న పాట అజిత్ అభిమానుల్లో పూనకాలను తెప్పించింది. దానిని ఇప్పుడు వీడియో వర్షన్‌ను మేకర్స్ విడుదల చేశారు. మలేషియాకు చెందిన సింగర్ డార్కీ ప్రత్యేకమైన వాయిస్‌తో ఈ పాటలో మెప్పించాడు. అతని వాయిస్‌కు పోటీగా జి. వి. ప్రకాష్ కొట్టిన మ్యూజిక్ అదిరిపోయిందని చెప్పవచ్చు. అజిత్ అభిమానులను విపరీతంగా ఆకట్టకున్న సాంగ్‌ను మీరూ చూసేయండి. -
అజిత్ కుమార్ గుడ్ బ్యాడ్ అగ్లీ.. గూస్బంప్స్ తెప్పించే ఫుల్ సాంగ్ వచ్చేసింది!
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ గుడ్ బ్యాడ్ అగ్లీ. స్టార్ డైరెక్టర్ అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈ నెల 10న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. విదాముయార్చి తర్వాత ఈ ఏడాదిలోనే వచ్చిన రెండో చిత్రం కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. తొలిరోజే పాజిటివ్ టాక్ రావడంతో బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే కలెక్షన్స్ రాబట్టిం. కేవలం మూడు రోజుల్లోనే వంద కోట్ల మార్కు దాటేసింది.తాజాగా ఈ మూవీలోని సూపర్ హిట్ సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఓజీ సంభవం పేరిట అజిత్ ఫ్యాన్స్‌ను ఊపేస్తోన్న పాటను రిలీజ్ చేశారు. తెలుగుతో పాటు తమిళ వర్షన్ కూడా వచ్చేసింది. ఈ ఫుల్ వీడియో సాంగ్‌ను మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. కాగా.. ఈ సినిమాను టాలీవుడ్ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ భారీ ఎత్తున నిర్మించింది. ఈ చిత్రంలో అజిత్ కుమార్ గ్యాంగ్‌స్టర్ పాత్రలో మెప్పించారు. గుడ్ బ్యాడ్ అగ్లీలో త్రిష హీరోయిన్గా నటించగా.. అర్జున్ దాస్ విలన్ పాత్రలో అలరించారు. ఈ సినిమాలో టాలీవుడ్ నటుడు సునీల్, కార్తికేయ దేవ్, ప్రియా ప్రకాష్ వారియర్, ప్రభు, ప్రసన్న, టిన్ను ఆనంద్, రఘు రామ్ కీలక పాత్రల్లో నటించారు. ఈ మూవీకి జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతమందించారు. The unmatched style and swag ❤️🔥#OGSambavam video song from #GoodBadUgly out now!Tamil - https://t.co/knfimOefHVTelugu - https://t.co/XgRHz7UxHhBook your tickets for #GoodBadUgly now!🎟️ https://t.co/jRftZ6vpJD#BlockbusterGBU pic.twitter.com/h7wmmbZvbH— Mythri Movie Makers (@MythriOfficial) April 21, 2025 -
'గుడ్ బ్యాడ్ అగ్లీ' కలెక్షన్స్.. అజిత్ కెరీర్లో ఇదే టాప్
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ నటించిన 'గుడ్ బ్యాడ్ అగ్లీ' (Good Bad Ugly) భారీ కలెక్షన్స్ సాధించింది. అజిత్ మూడు దశాబ్ధాల సినీ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్‌గా ఈ చిత్రం నిలిచింది. ఏప్రిల్ 10న విడుదలైన ఈ చిత్రం కలెక్షన్స్‌ను తాజాగా మైత్రి మూవీ మేకర్స్ విడుదల చేసింది. దర్శకుడు అధిక్ రవిచంద్రన్ తెరకెక్కించిన ఈ చిత్రంలో అజిత్‌కు జోడీగా త్రిష మరోసారి మెరిసింది. ఈ సినిమాతో మలయాళ బ్యూటీ ప్రియా ప్రకాష్ వారియర్‌తో పాటు సునీల్, అర్జున్ దాస్‌లకు కూడా ప్రత్యేక గుర్తింపు వచ్చింది.'గుడ్ బ్యాడ్ అగ్లీ' చిత్రం తొమ్మిదిరోజుల్లోనే రూ. 200 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించి అజిత్ కెరీర్లోనే టాప్ చిత్రంగా నిలిచింది. బాక్సాఫీస్ షేకింగ్ కలెక్షన్స్ అంటూ చిత్ర నిర్మాణ సంస్థ ఒక పోస్టర్‌ను విడుదల చేసింది. కలెక్షన్స్ పరంగా అజిత్ కెరీర్లో రూ. 200 కోట్ల క్లబ్లో చేరిన ఏకైక చిత్రంగా గుడ్ బ్యాడ్ అగ్లీ నిలిచింది. అయితే, ఇప్పటి వరకు అజిత్ కెరీర్లో టాప్-5 కలెక్షన్స్ సాధించిన చిత్రాలు ఇవే.. తెగింపు (రూ. 194 కోట్లు), విశ్వాసం (రూ.180 కోట్లు), వలిమై (రూ.152 కోట్లు), వివేకం (రూ. 121 కోట్లు), వేదాళం (రూ.119 కోట్లు) ఉన్నాయి. ఇప్పుడు 'గుడ్ బ్యాడ్ అగ్లీ' రూ. 200 కోట్లు రాబట్టడంతో ఆయన కెరీర్లోనే టాప్ చిత్రంగా నిలిచింది. మూడు దశాబ్దాల అజిత్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ ఇచ్చిన దర్శకుడు అధిక్ రవిచంద్రన్‌కు ఆయన ఫ్యాన్స్ అభినందనలు తెలుపుతున్నారు.అజిత్ నెక్ట్స్ ప్రాజెక్ట్అజిత్ ప్రస్తుతం మరోసారి అంతర్జాతీయ స్థాయిలో కార్ రేసులో పాల్గొనడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. దీంతో తన తదుపరి చిత్రాన్ని ఈ ఏడాది చివరిలో ప్రారంభించి 2026లో దీపావళి సందర్భంగా విడుదల చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. కాగా ఈ చిత్రాన్ని ఏ నిర్మాణ సంస్థ తీయనుంది.. ఇతర నటీనటులు, సాంకేతిక వర్గం వివరాటేమిటి అన్నది త్వరలోనే తెలిసే అవకాశం ఉంది. కాగా నటుడు తాను ఎంతగా అభిమానిస్తున్నాను అన్న విషయాన్ని తెలిపేలా గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రం చివర్లో ఒక మేకింగ్ వీడియోను దర్శకుడు అదిక్ రవిచంద్రన్ విడుదల చేశారు. అందులో ఈయన నటుడు అజిత్ కాళ్లకు నమస్కరించడం, ఆయన చేతుల్ని పట్టుకొని ముద్దాడడం వంటి దృశ్యాలు చోటుచేసుకున్నాయి. దీంతో నటుడు అజిత్ మళ్లీ అదిక్ రవిచంద్రన్‌కు అవకాశం ఇవ్వడం ఖాయం అనే టాక్ సినీ వర్గాల్లో వైరల్ అవుతోంది.The MASS SAMBAVAM is shaking the box office ❤🔥#GoodBadUgly hits 200 CRORES WORLDWIDE GROSS 💥💥Book your tickets for #GoodBadUgly now!🎟️ https://t.co/jRftZ6vpJD#200crGrossForGBU#BlockbusterGBU#AjithKumar @trishtrashers @MythriOfficial @Adhikravi @gvprakash… pic.twitter.com/CUrTW1NB2D— Mythri Movie Makers (@MythriOfficial) April 18, 2025 -
అజిత్ గుడ్ బ్యాడ్ అగ్లీ... ఆరు రోజుల్లో ఎన్ని కోట్లంటే?
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ గుడ్ బ్యాడ్ అగ్లీ. స్టార్ డైరెక్టర్ అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈ నెల 10న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. విదాముయార్చి తర్వాత ఈ ఏడాదిలోనే వచ్చిన రెండో చిత్రం కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్లుగానే తొలిరోజే రూ.30 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. కేవలం మూడు రోజుల్లోనే వంద కోట్ల మార్కు దాటేసిన గుడ్ బ్యాడ్ అగ్లీ.. రెండొందల మార్క్ దిశగా దూసుకెళ్తోంది.ఈ సినిమా విడుదలైన ఆరు రోజుల్లోనే రూ.180 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించింది. ఇప్పటికే ప్రదీప్ రంగనాథన్ తమిళ సూపర్ హిట్ మూవీ డ్రాగన్ సాధించిన లైఫ్ టైమ్ వసూళ్లను అధగమించిన గుడ్ బ్యాడ్ అగ్లీ వసూళ్ల పరంగా దూసుకెళ్తోంది. ఇదే జోరు కొనసాగితే వారం రోజుల్లోనే రూ.200 కోట్ల క్లబ్లో చేరడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే ఈ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన తమిళ చిత్రంగా గుడ్ బ్యాడ్ అగ్లీ నిలిచింది. దేశవ్యాప్తంగా కలెక్షన్స్ చూస్తే ఆరు రోజుల్లో రూ.108.30 కోట్ల నెట్ వసూళ్లు చేసింది. ఇండియన్ బాక్సా ఫీస్ వద్ద రూ.127.50 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది.ఈ సినిమాను టాలీవుడ్ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ భారీ ఎత్తున నిర్మించింది. ఈ చిత్రంలో అజిత్ కుమార్ గ్యాంగ్‌స్టర్ పాత్రలో మెప్పించారు.గుడ్ బ్యాడ్ అగ్లీలో త్రిష హీరోయిన్గా నటించగా.. అర్జున్ దాస్ విలన్ పాత్రలో అలరించారు. ఈ సినిమాలో టాలీవుడ్ నటుడు సునీల్, కార్తికేయ దేవ్, ప్రియా ప్రకాష్ వారియర్, ప్రభు, ప్రసన్న, టిన్ను ఆనంద్, రఘు రామ్ కీలక పాత్రల్లో నటించారు. ఈ మూవీకి జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతమందించారు. -
ఫేట్ మార్చిన సినిమా.. ఇన్నాళ్లకు మళ్లీ గుర్తింపు
మలయాళ బ్యూటీ ప్రియా ప్రకాష్ వారియర్ గుర్తుందా? అప్పట్లో కన్నుగీటిన వీడియోతో సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈమె.. తర్వాత పలు సినిమాల్లో నటించింది. కాకపోతే పెద్దగా గుర్తింపు రాలేదు. తాజాగా ఓ సినిమాలో నటించి హిట్ కొట్టింది. దీంతో ఈమె ఎక్కడ లేని గుర్తింపు వస్తోంది.(ఇదీ చదవండి: 'పుష్ప 2'కి నా మ్యూజిక్ పెట్టుకోలేదు.. అయినా బాధ లేదు) 2018లో నటిగా ఇండస్ట్రీలోకి వచ్చిన ప్రియా వారియర్.. 2019లో రిలీజైన 'ఒరు అడార్ లవ్' హీరోయిన్ అయింది. కన్నుగీటి ఫేమస్ అయింది ఈ మూవీతోనే. కాకపోతే పెద్దగా ఆకట్టుకోలేదు. తర్వాత తెలుగులో చెక్, ఇష్క్ నాట్ ఏలవ్ స్టోరీ లాంటి చిత్రాల్లో హీరోయిన్ గా చేసింది. కానీ పెద్దగా గుర్తింపు రాలేదు. దాదాపు ఏడెనిమిది ఏళ్లనుంచి ఇండస్ట్రీలో ఉండటమైతే ఉంది గానీ పేరు రాలేదు. కానీ రీసెంట్ గా రిలీజైన 'గుడ్ బ్యాడ్ అగ్లీ'లో ఈమె విలన్ గా చేసిన అర్జున్ దాస్ ప్రియురాలిగా నటించింది. ఇతడితో కలిసి సుల్తానా పాటకు డాన్స్ చేసింది. ఇది గతంలో సిమ్రాన్ చేసిన పాటకు మళ్లీ అలానే స్టెప్పులేసి ప్రియా వారియర్ ఫేమస్ అయింది. ఒకరకంగా చెప్పాలంటే మళ్లీ లైమ్ లైట్ లోకి వచ్చింది. మరి దీన్ని ఎంతవరకు నిలబెట్టుకుంటుందో చూడాలి?(ఇదీ చదవండి: 57 ఏళ్ల వయసులో మళ్లీ తండ్రి కాబోతున్న నటుడు?) -
అజిత్ 'గుడ్ బ్యాడ్ అగ్లీ'.. సూపర్ హిట్ మూవీ రికార్డ్ బ్రేక్
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ గుడ్ బ్యాడ్ అగ్లీ. స్టార్ డైరెక్టర్ అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈ నెల 10న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. విదాముయార్చి తర్వాత ఈ ఏడాదిలోనే వచ్చిన రెండో చిత్రం కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్లుగానే తొలిరోజే రూ.30 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. కేవలం మూడు రోజుల్లోనే వంద కోట్ల మార్కు దాటేసిన గుడ్ బ్యాడ్ అగ్లీ.. రెండొందల మార్క్ దిశగా దూసుకెళ్తోంది.ఈ సినిమా విడుదలైన ఐదు రోజుల్లోనే రూ.170 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించింది. ప్రదీప్ రంగనాథన్ తమిళ సూపర్ హిట్ మూవీ డ్రాగన్ సాధించిన లైఫ్ టైమ్ వసూళ్లను దాటేసింది. కేవలం ఐదు రోజుల్లోనే ఆ సినిమాను అధిగమించింది. డ్రాగన్ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.152 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ మాత్రమే రాబట్టింది. ఇదే జోరు కొనసాగితే వారం రోజుల్లోనే రూ.200 కోట్ల క్లబ్లో చేరడం ఖాయంగా కనిపిస్తోంది. అదే జరిగితే ఈ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన తమిళ చిత్రంగా నిలవనుంది. కాగా.. 'గుడ్ బ్యాడ్ అగ్లీ' వీకెండ్ తర్వాత సోమవారం రూ. 15 కోట్ల నెట్ వసూలు చేసి.. ఐదు రోజుల్లోనే రూ. 101.3 కోట్ల నెట్ కలెక్షన్స్ సాధించింది.(ఇది చదవండి: ఇళయరాజా నోటీసులు.. రూ.5 కోట్లు డిమాండ్ )కాగా.. ఈ సినిమాలో త్రిష హీరోయిన్గా నటించారు. టాలీవుడ్ నటుడు సునీల్ కీలక పాత్రలో అలరించదగా.. అర్జున్ దాస్ ప్రతినాయకుడిగా మెప్పించారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమాకు జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతమందించారు. -
ఇళయరాజా నోటీసులు.. రూ.5 కోట్లు డిమాండ్
దిగ్గజ సంగీత దర్శకుడు ఇళయరాజా(Ilayaraja) ప్రస్తుతం పెద్దగా సినిమాలేం చేయట్లేదు. కానీ ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు. దానికి కారణం.. తన పాటల్ని అనుమతి లేకుండా ఉపయోగించారని పలువురు నిర్మాణలు నోటీసులు పంపడమే దీనికి కారణం.(ఇదీ చదవండి: విజయ్ దేవరకొండ జస్ట్ టైర్-2 హీరో.. ఇక్కడ దేవుడిలా ట్రీట్ చేస్తున్నారు!)గతంలో మంజుమ్మెల్ బాయ్స్, కూలీ తదితర చిత్రాలకు నోటీసులు పంపిన ఇళయరాజా.. ఇప్పుడు అజిత్ 'గుడ్ బ్యాడ్ అగ్లీ'(Good Bad Ugly Movie) నిర్మాతలకు నోటీసులు పంపించారు. ఏకంగా రూ.5 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. 7 రోజుల్లోగా తనకు క్షమాపణ చెప్పాలని కూడా పేర్కొన్నారు.గుడ్ బ్యాడ్ అగ్లీ మూవీలో చాలావరకు పాత పాటల్ని.. వింటేజ్ ఫీల్ కోసం ఉపయోగించారు. అవి బాగానే వర్కౌట్ అయ్యాయి కూడా. అయితే తాము అన్ని అనుమతులు తీసుకునే పాటల్ని ఉపయోగించామని మూవీ టీమ్ అంటోంది. మరి ఈ వివాదం ఎన్ని రోజులు నడుస్తుందో చూడాలి?(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 12 సినిమాలు.. అవేంటంటే?) -
అజిత్ 'గుడ్ బ్యాడ్ అగ్లీ'.. థియేటర్లో పొట్టు పొట్టు కొట్టుకున్న ఫ్యాన్స్!
సినిమా ఇండస్ట్రీలో ఫ్యాన్ వార్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అని అభిమానులు హడావుడి చేస్తుంటారు. ఇక అభిమాన హీరో సినిమా రిలీజ్ అయితే ఆ హంగామా అంతా ఇంతా కాదు. కటౌట్స్, డ్యాన్స్‌లు, డైలాగ్స్‌తో ఊగిపోతుంటారు. ముఖ్యంగా థియేటర్ల వద్ద అభిమాన సంఘాలు రచ్చ రచ్చ చేస్తుంటారు. అప్పుడప్పుడు ఇవీ కాస్తా శృతి మించి గొడవలు కూడా జరుగుతుంటాయి.అయితే తాజాగా కేరళలోని ఓ థియేటర్లో ఇద్దరు స్టార్ హీరోల అభిమానుల మధ్య గొడవ జరిగింది. ఇటీవల కోలీవుడ్ స్టార్ అజిత్ నటించిన గుడ్ బ్యాడ్ అగ్లీ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు వచ్చిన కొందరు ఫ్యాన్స్.. విజయ్, విజయ్ అంటూ కేకలు వేశారు. దీంతో అక్కడే అజిత్ అభిమానులు ఒక్కసారిగా వారిపై దాడి చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటన కేరళలోని పాలక్కాడ్‌లోని ఓ థియేటర్లో జరిగినట్లు సమాచారం.కాగా.. అజిత్ కుమార్ నటించిన యాక్షన్ థ్రిల్లర్'గుడ్ బ్యాడ్ అగ్లీ' ఏప్రిల్ 10 న థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమాకు అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించారు. త్రిష హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో.. అర్జున్ దాస్ విలన్‌గా మెప్పించారు. సిమ్రాన్ ముఖ్య అతిథి పాత్రలో నటించారు. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ భారీ ఎత్తున నిర్మించారు. ఇప్పటికే వంద కోట్ల మార్క్ దాటేసిన గుడ్ బ్యాడ్ అగ్లీ.. బాక్సాఫీస్ వద్ద వసూళ్లపరంగా దూసుకెళ్తోంది. ఇటీవలే ఈ సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ గ్రాండ్‌గా నిర్వహించారు మేకర్స్. கேரளாவில் தியேட்டர் ஒன்றில் Good Bad Ugly படம் ஓடிக்கொண்டிருக்கும்போது TVK, Tvk இன்று கோஷமிட்ட விஜய் ரசிகர்கள், விஜய் ரசிகர்களை வெளுத்து வாங்கிய அஜித் ரசிகர்கள் #GoodBadUgly #Ajithkumar #TvkVijay #Kerala pic.twitter.com/BjLMRZWOgG— VSV Cinemas (@vsvcinecreation) April 12, 2025 -
హైదరాబాద్ లో అజిత్ ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)
-
ఆ విజువల్స్‌ని మర్చిపోలేను: నిర్మాత నవీన్ ఎర్నేని
‘‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ సినిమాను ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తూ, ఉత్సాహంతో కేరింతలు కొడుతున్నారు. ఈ విజువల్స్‌ని మర్చిపోలేను. తమిళనాడు, ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, ఓవర్సీస్ అన్ని చోట్ల నుంచి ఈ సినిమాకు అద్భుతమైన స్పందన లభిస్తోంది. ఈ సినిమా హ్యూజ్ బ్లాక్‌బస్టర్. అజిత్గారు చాలా సింపుల్ పర్సన్. ఆయన మనసుతో మాట్లాడే వ్యక్తి. అధిక్ ఈ సినిమాను 95 రోజుల్లోనే పూర్తి చేశాడు. అధిక్లాంటి దర్శకులు ఇండస్ట్రీకి కావాలి’’ అని నిర్మాత నవీన్ ఎర్నేని అన్నారు. అజిత్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’. ఈ చిత్రంలో త్రిష హీరోయిన్గా నటించారు. టీ–సిరీస్ గుల్షన్ కుమార్, భూషణ్ కుమార్ సమర్పణలో అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 10న విడుదలైంది.ఈ సందర్భంగా ఆదివారం నిర్వహించిన సక్సెస్ మీట్లో అధిక్ రవిచంద్రన్ మాట్లాడుతూ– ‘‘మైత్రీ నిర్మాతలకు తమిళంలో తొలి సినిమా ఇది. ఈ సినిమాతో తమిళనాడులో మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ హిస్టరీ క్రియేట్ చేసింది’’ అని తెలిపారు. ‘‘తమిళంలో తొలిసారి సినిమా తీసి, మంచి హిట్ సాధించిన మైత్రీ మూవీ మేకర్స్‌కు కంగ్రాట్స్’’ అని పేర్కొన్నారు సునీల్. ‘‘18 నెలల తర్వాత అజిత్‌గారితో కలిసి మళ్లీ ఈ సినిమా చేశాను. దర్శకుడు అధిక్‌తో ఇది నా మూడో చిత్రం’’ అని తెలిపారు జీవీ ప్రకాశ్‌కుమార్. ‘‘ఈ మూవీలో నేను చేసిన పాత్రకి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. చాలా రోజుల తర్వాత మళ్లీ వైరల్ అయ్యింది’’ అన్నారు ప్రియా ప్రకాశ్ వారియర్. -
అంత ఎనర్జీ ఎక్కడా చూడలేదు.. సింగిల్ షాట్లో చేశారు: సునీల్
టాలీవుడ్ నటుడు సునీల్ ఇటీవల అజిత్ కుమార్ హీరోగా నటించిన గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రంలో కనిపించారు. ఈ సినిమాలో స్టైలిష్ గెటప్‌లో కనిపించి అభిమానులను సర్ప్రైజ్ ఇచ్చారు. అధిక్ రవిచంద్రన్ తెరకెక్కించిన ఈ సినిమా ప్రస్తుతం థియేటర్లలో సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. ఈ మూవీకి సూపర్ హిట్ టాక్ రావడంతో మేకర్స్ సక్సెస్‌ను సెలబ్రేట్ చేసుకున్నారు. బ్లాక్ బస్టర్ సంభవం పేరిట వేడుకలు నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు సునీల్ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్‌ను ఉద్దేశించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఆయన ఎనర్జీ వేరే లెవెల్ అని సునీల్ మాట్లాడారు. ఇంత సింప్లిసిటీ ఉన్న మనిషిని చూసిన ఫీలింగ్ వచ్చిందని అన్నారు.అజిత్ గురించి మాట్లాడుతూ..'మీరు పొద్దున్నే రన్నింగ్‌కు వెళ్తారంట కదా అని నన్ను అడిగారు. నేను కూడా రావొచ్చా అండి అజిత్ అన్నారు. సరే అని అన్నా. ఉదయం 4 గంటలకే ఒక్కరే కారు నడుపుకుంటూ వచ్చారు. దాదాపు ఆరు కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్లాం. ఆ తర్వాత ఇంకా వాకింగ్ చేద్దామని ఆయన అన్నారు. మొత్తం 9 కిలోమీటర్లు నడిచాం. ఆ తర్వాత షూటింగ్ లోకేషన్ మియాపూర్‌కు గంటన్నర పడుతుంది. అక్కడికి ఆయనతో కలిసి వెళ్లా. ఇంటర్వెల్ ఫైట్‌లో వచ్చిన షాట్ అప్పుడే చేశారు. ఆ రోజు 27 మందితో సింగిల్‌షాట్‌లో చేశారు. మళ్లీ వచ్చేటప్పుడు ఆయనే గంటన్నర కారు డ్రైవింగ్ చేశారు. అంత ఎనర్జీ పర్సన్‌ను నేనేప్పుడూ చూడలేదు. పైగా ఆయన సినిమాలో డూప్‌లు పెట్టకూడదు. ఈ సినిమా ద్వారా అజిత్ నుంచి చాలా నేర్చుకున్నా. ఆయనను భగవంతుడు బాగా చూడాలని కోరుకుంటున్నా. ఫ్యాన్స్ ఈ సినిమా చూసి అందరూ పండగ చేసుకుంటున్నారు.' అని అన్నారు.విదాముయార్చి తర్వాత అజిత్ కుమార్ నటించిన చిత్రం గుడ్ బ్యాడ్ అగ్లీ. ఈ సినిమాకు అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమాలో త్రిష హీరోయిన్గా నటించింది. ఫుల్ యాక్షన్ థ్రిల్లర్‌గా వచ్చిన ఈ సినిమా కేవలం మూడు రోజుల్లోనే రూ.100 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ సినిమాకు జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతమందించారు. -
అజిత్ కుమార్ గుడ్ బ్యాడ్ అగ్లీ.. మూడు రోజుల్లోనే సెంచరీ!
విదాముయార్చి తర్వాత స్టార్ హీరో అజిత్ కుమార్ నటించిన తాజా చిత్రం గుడ్ బ్యాడ్ అగ్లీ. ఈ సినిమాను అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కించారు. ఈ మూవీని టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్లో నిర్మించారు. అభిమానుల భారీ అంచనాల మధ్య ఈ యాక్షన్ థ్రిల్లర్ వఈ నెల 10న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. మొదటి రోజే ఈ మూవీకి పాజిటివ్ టాక్ రావడంతో వసూళ్లపపరంగా దూసుకెళ్తోంది.ఈ సినిమా విడుదలైన మూడు రోజుల్లోనే వంద కోట్ల మార్కును దాటేసింది. తొలి రోజే రూ.30 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు రాబట్టిన ఈ చిత్రం.. ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల పరంగా దూసుకెళ్తోంది. కేవలం మూడు రోజుల్లోనే రూ.100 కోట్ల మార్కును చేరుకుంది. దీంతో అజిత్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇదే జోరు కొనసాగితే రాబోయే రోజుల్లో ఈ సినిమా మరిన్ని రికార్డులు బద్దలు కొట్టనుంది. నెట్ కలెక్షన్స్ పరంగా చూస్తే ఇండియా వ్యాప్తంగా మూడు రోజుల్లోనే రూ.62.75 కోట్ల నెట్ వసూళ్లు సాధించింది.అధిక్ రవిచంద్రన్ డైరెక్షన్లో వచ్చిన 'గుడ్ బ్యాడ్ అగ్లీ' భారీ అంచనాల థియేటర్లలో విడుదలైంది. దర్శకుడు మగిజ్ తిరుమేని 'విదాముయార్చి' తర్వాత ఈ ఏడాదిలో అజిత్ కుమార్‌కి ఇది రెండో మూవీ కావడం విశేషం. ఈ చిత్రం అజిత్ కుమార్ గ్యాంగ్‌స్టర్‌గా అందరినీ ఆకట్టుకున్నాడు. ఈ చిత్రంలో అర్జున్ దాస్, త్రిష కృష్ణన్, ప్రభు, ప్రియా ప్రకాష్ వారియర్, రఘు రామ్, కార్తికేయ కీలక పాత్రలు పోషించారు. -
ఫ్యాన్స్ కోసమే తీసిన సినిమా.. Day 1 కలెక్షన్స్ ఎంత?
తమిళంలో మాత్రం కోట్లాది మంది అభిమానులున్న హీరో అజిత్. సదరు ఫ్యాన్స్ కోసం మాత్రమే తీసిన సినిమా 'గుడ్ బ్యాడ్ అగ్లీ'(Good Bad Ugly Movie). తెలుగులో జనాలకు పెద్దగా నచ్చలేదు గానీ తమిళంలో మాత్రం మంచి రెస్పాన్స్ వచ్చింది. అందుకు తగ్గట్లే వసూళ్లలో అజిత్ సరికొత్త రికార్డ్ నెలకొల్పాడు.(ఇదీ చదవండి: తేడాకొట్టిన 'జాక్'.. తొలిరోజు కలెక్షన్ ఇంత తక్కువా?)అజిత్ (Ajith) వన్ మ్యాన్ షో చేసిన 'గుడ్ బ్యాడ్ అగ్లీ'లో చాలావరకు ఎలివేషన్ షాట్సే ఉంటాయి. దీనికి తోడు అజిత పాత సినిమాల రిఫరెన్సులు కూడా గట్టిగానే ఉంటాయి. ఈ క్రమంలోనే తొలిరోజు రూ.30.9 కోట్ల మేర గ్రాస్ కలెక్షన్స్(Day 1 Collection) వచ్చినట్లు నిర్మాతలు ప్రకటించారు.ఈ వసూళ్లతో అజిత్.. తొలిరోజు వసూళ్లలో తన గత చిత్రాల కంటే ఎక్కువ సాధించాడు. సరికొత్త రికార్డ్ సెట్ చేశాడు. గతంలో పలు చిత్రాలతో ఆకట్టుకున్నప్పటికీ ఈ స్థాయి వసూళ్లు రాలేదు. తెలుగు నిర్మాతలైన మైత్రీ మూవీ మేకర్స్ తీసిన ఈ సినిమాకు లాంగ్ రన్ లో వంద రెండొందల కోట్లకు పైగా వసూళ్లు రావడం గ్యారంటీ ఏమో!(ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీల్లోకి వచ్చేసిన 21 సినిమాలు) (ఇదీ చదవండి: తెలుగు కథతో తీసిన హిందీ సినిమా.. Day 1 కలెక్షన్స్ ఎంత?) View this post on Instagram A post shared by Mythri Movie Makers (@mythriofficial) -
పిరికిపందల్లారా.. ఒళ్లంతా విషం నింపుకుని ఎలా బతుకుతున్నార్రా?: త్రిష
సెలబ్రిటీలను ట్రోల్ (Trolling) చేయడం ఈ మధ్య చాలామందికి ఆటవిడుపుగా మారింది. వారేం చేసినా, చేయకపోయినా.. ప్రతి చిన్నదానికి విమర్శిస్తూనే ఉన్నారు. తాజాగా ఈ ట్రోలింగ్ బ్యాచ్ హీరోయిన్ త్రిష మీద పడ్డారట! ఈమె కథానాయికగా నటించిన గుడ్ బ్యాడ్ అగ్లీ ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమాలో ఆమె పాత్ర చూసి కొందరు యావరేజ్‌గా ఉందని పెదవి విరిచారు.అర్థం కావట్లే..అక్కడితో ఆగకుండా తనపై విద్వేషపూరిత కామెంట్లు చేశారు. అవన్నీ చూసి భరించలేకపోయింది త్రిష (Trisha Krishnan). ఇన్స్టాగ్రామ్ వేదికగా ట్రోలర్స్‌కు గడ్డి పెట్టే ప్రయత్నం చేసింది. కొందరు మనుషులకు ఒళ్లంతా విషమే! మీకు నిద్రెలా పడుతుంది? ఇంత హాయిగా ఎలా బతుకుతున్నారో నాకర్థం కావడం లేదు. ఎంతసేపూ సోషల్ మీడియాకు వచ్చి అర్థంపర్థం లేని పనులు చేస్తూ అడ్డదిడ్డంగా పోస్టులు పెట్టమే మీ పనా? అవతలివారిని విమర్శిస్తేగానీ మీకు రోజు గడవదా? మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా భయమేస్తోంది. మీ చుట్టూ ఉన్నవాళ్లు ఎలా బతుకుతున్నారో? ఏంటో? పిరికిపందల్లారా.. ఆ దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలని కోరుకుంటున్నాను అని ఇన్స్టాగ్రామ్ స్టోరీ వేదికగా అసహనం వ్యక్తం చేసింది.సినిమా..గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమా విషయానికి వస్తే.. అజిత్ హీరోగా నటించిన ఈ సినిమాలో అర్జున్ దాస్, ప్రసన్న, కార్తికేయ దేవ్, ప్రభు, ప్రియ ప్రకాశ్ వారియర్, సునీల్, రాహుల్ దేవ్, రెడిన్ కింగ్స్లీ కీలక పాత్రలు పోషించారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ నిర్మించింది. జీవీ ప్రకాశ్ సంగీతం అందించాడు. అజిత్‌తో ఇది త్రిషకు ఆరో సినిమా కావడం విశేషం. గతంలో వీరి కాంబినేషన్లో జి, కిరీడం, మంకత, ఎన్నై అరిందల్, విదాముయర్చి సినిమాలు వచ్చాయి.చదవండి: గుండు గీయించుకున్న ఒకప్పటి స్టార్ హీరోయిన్.. ఎవరో తెలుసా? -
అజిత్ కుమార్ యాక్షన్ థ్రిల్లర్.. 'గుడ్ బ్యాడ్ అగ్లీ' ఎలా ఉందంటే?
టైటిల్: గుడ్ బ్యాడ్ అగ్లీనటీనటులు: అజిత్ కుమార్, త్రిష, సునీల్, అర్జున్ దాస్, జాకీ ష్రాఫ్, సిమ్రాన్ తదితరులుదర్శకత్వం: అధిక్ రవిచంద్రన్నిర్మాణ సంస్థ: మైత్రి మూవీ మేకర్స్నిర్మాతలు: నవీన్ యేర్నేని, వై రవిశంకర్ఎడిటర్: విజయ్ వేల్‌కుట్టిసినిమాటోగ్రఫీ: అభినందన్ రామానుజంసంగీతం: జీవీ ప్రకాశ్ కుమార్విడుదల తేదీ: ఏప్రిల్ 10, 2025విదాముయార్చి తర్వాత కోలీవుడ్ స్టార్ అజిత్ కుమార్ నటించిన చిత్రం 'గుడ్ బ్యాడ్ అగ్లీ'. విదాముయార్చి ఆశించిన స్థాయిలో రాణించకపోవడంతో తాజా యాక్షన్ థ్రిల్లర్‌పై అభిమానులు భారీగానే ఆశలు పెట్టుకున్నారు. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. యాక్షన్ హీరోగా పేరున్న అజిత్.. ఈ సినిమాతో అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులతో గుడ్ అనిపించాడా? లేదా? అనేది రివ్యూలో తెలుసుకుందాం.గుడ్ బ్యాడ్ అగ్లీ కథేంటంటే..ముంబయిలో పేరు మోసిన గ్యాంగ్‌స్టర్ ఏకే(అజిత్ కుమార్) అలియాస్ రెడ్ డ్రాగన్. అతనంటే విదేశాల్లో ఉండే గ్యాంగస్టర్లకు సైతం హడల్. అలా వరల్డ్ ఫేమస్ గ్యాంగ్‌స్టర్ అయిన ఏకే.. తన భార్య రమ్య(త్రిష) కోసం తన వృత్తిని వదిలేసేందుకు సిద్ధమవుతాడు. భార్యకు, తన కుమారుడు విహాన్‌కి (కార్తీక్ దేవ్) ఇచ్చిన మాట కోసం.. జైలుకు వెళ్తాడు. అలా జైలుకెళ్లిన ఏకే దాదాపు 17 ఏళ్ల తర్వాత విడుదలై.. 18వ పుట్టినరోజు నాడు తన కుమారుడిని చూసేందుకు వచ్చిన ఏకేకు ఊహించని పరిస్థితులు ఎదురవుతాయి? తండ్రి కోసం ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న విహాన్.. ఒక అమ్మాయి ప్రేమ కారణంగా.. అనూహ్యంగా ఓ కేసులో జైలుకు వెళ్తాడు. అసలు కుమారుడిని చూసేందుకు వస్తున్న అజిత్‌ను టార్గెట్ చేసింది ఎవరు? తండ్రి వల్లే తన కుమారుడు జైలుకు వెళ్లాడని భావిస్తున్న రమ్య(త్రిష) ఆ తర్వాత ఏం చేసింది? అజిత్‌కు.. విహాన్ కేసుతో ఏమైనా సంబంధం ఉందా? లేదంటే త్రిష వల్లే విహాన్ కేసులో చిక్కుకున్నాడా? చివరికీ ఈ కేసు నుంచి తన కుమారుడిని అజిత్ బయట పడేశాడా? కుమారుడిని విడిపించుకునేందుకు త్రిష ఏం చేసింది? విహాన్ ప్రేమించిన అమ్మాయి ఎవరు? అనే విషయాలు తెలియాలంటే గుడ్ బ్యాడ్ అగ్లీ చూడాల్సిందే.ఎలా ఉందంటే..గుడ్ బ్యాడ్ అగ్లీ..టైటిల్ వినగానే అందరికీ కాస్తా కొత్తగానే అనిపిస్తూ ఉండొచ్చు. ఇది చూసి సగటు ప్రేక్షకునికి అంతా ఫుల్ యాక్షన్, వయోలెన్స్ ఉంటుందేమో అనిపించి ఉంటుంది. ముంబయి బ్యాక్‌డ్రాప్‌లో మొదలైన ఈ కథ.. స్పెయిన్‌లో ముగించేలా ప్లాన్ చేశాడు డైరెక్టర్. యాక్షన్ హీరోగా పేరున్న అజిత్‌ను ప్రేక్షకుల అంచనాలకు తగినట్లుగానే డైరెక్టర్ చూపించాడు. ఫస్ట్ హాఫ్‌లో అజిత్ జైలు జీవితం, భార్య త్రిషతో ఉన్న అనుబంధం చుట్టూ తిరుగుతుంది. జైలులో అజిత్ ఫైట్ సీక్వెన్స్ అభిమానులకు మాత్రం హై ఫీస్ట్‌లా అనిపిస్తుంది. యాక్షన్ సినిమా అంటే అంతా రక్తపాతంలా ఉంటుందని ప్రేక్షకులు భావిస్తారు.. కానీ అధిక్ మాత్రం ఫైట్స్‌ను తనదైన డిఫరెంట్ స్టైల్లో చూపించారు. టాలీవుడ్ నటుడు సునీల్ స్టైల్ మాత్రం తెలుగు అభిమానులకు కొత్తగా అనిపిస్తుంది.జైలు నుంచి రిలీజ్‌కు ఇంకా మూడు నెలలు ఉండగా.. ముందుగానే అజిత్ బయటికి రావడం..ఆ తర్వాత జరిగే పరిణామాలు సగటు ప్రేక్షకునికి రోటీన్‌గానే అనిపిస్తాయి. కానీ ఏకే బయటికి వచ్చాకే అసలు కథ మొదలవుతుంది. అలా ఇంటర్వెల్‌కు ముందు ఓ బిగ్ ఫైట్ సీన్‌తో బ్యాంగ్ పడేశాడు. ఇక్కడే ప్రేక్షకుల్లో ఆసక్తి పెరుగుతుందన్న టైమ్‌లోనే ఇంటర్వెల్‌కు ముందు ప్రధాన ప్రతినాయకుడు అర్జున్ దాస్(జానీ)కి సంబంధించిన ట్విస్ట్ రివీల్ కావడంతో సెకండాఫ్‌పై క్యూరియాసిటీ మిస్సవుతుంది. ట్విస్ట్‌లు కాస్తా రివీల్ చేయడంతో సెకండాఫ్ ఆడియన్స్ ఉహకందేలా చేశాడు దర్శకుడు. అయితే ఫైట్ సీక్వెన్స్‌లో జీవీ ప్రకాశ్ బీజీఎం మాత్రం అదిరిపోయింది. అలాగే సాంగ్స్ కూడా ఫర్వాలేదనిపిస్తాయి.ఇక ద్వితీయార్థం వచ్చేసరికి ముంబయితో పాటు ప్రపంచవ్యాప్తంగా గ్యాంగస్టర్లకు సైతం చెమటలు పట్టించే రెడ్ డ్రాగన్‌గా ఏకే ఎలా మారాడు? అతని ప్రస్థానం ఎలా మొదలైంది? అనే అంశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా ఏకే అలియాస్ రెడ్ డ్రాగన్ టీమ్ చేసే ఫైట్స్ ఆకట్టుకునేలా ఉన్నా.. కొత్తదనం లేకపోవడంతో సగటు ప్రేక్షకుడికి కాస్తా బోరింగ్‌గానే అనిపిస్తాయి. కానీ యాక్షన్ చిత్రాలు ఇష్టపడేవారికి మాత్రం విజువల్ ఫీస్ట్ అనే చెప్పొచ్చు. కుమారుడి(విహాన్) కోసం ఏకే చేసే పోరాట సన్నివేశాలు అభిమానులను ఆకట్టుకునేలా ఉన్నాయి. అలాగే సెకండాఫ్‌లో సిమ్రాన్(సుల్తానా) ఎంట్రీతో ఫుల్ యాక్షన్ మోడ్‌లో సాగుతున్న కథలో కామెడీ పండించాడు. సాంగ్స్‌లో ఎక్కువగా తమిళం స్లాంగ్ రావడంతో తెలుగు ఆడియన్స్‌కు అంతా ఆసక్తిగా అనిపించదు. క్లైమాక్స్ సీన్ వచ్చేసరికి.. అర్జున్ దాస్‌తో ఫైట్స్ సీక్వెన్స్ మాత్రం అదిరిపోయింది. క్లైమాక్స్ యాక్షన్ సీన్స్‌లోనూ కామెడీ పండించడం అధిక్ రవిచంద్రన్‌కే సాధ్యమైంది. చివర్లో కేజీఎఫ్, యానిమల్ మూవీ స్టైల్లో క్లైమాక్స్ ఉండడంతో కొత్తగా అనిపించదు. చివరికీ మనం బ్యాడ్ నుంచి గుడ్‌గా మారినా.. మనల్ని మళ్లీ బ్యాడ్ వైపే తీసుకెళ్తే ఎలా ఉంటుందనేది గుడ్ బ్యాడ్ అగ్లీతో సందేశమిచ్చాడు డైరెక్టర్. యాక్షన్ చిత్రాలు ఇష్టపడేవారికి మాత్రం ఫుల్ మీల్స్.. అలా కాకుండా ఏదైనా కొత్తదనం ఉంటుందన్న ఆశతో వెళ్తే మాత్రం బ్రేక్ ఫాస్ట్ చేసిన ఫీలింగ్‌తో బయటికొస్తారు.ఎవరెలా చేశారంటే..యాక్షన్ హీరోగా పేరున్న అజిత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అభిమానులు ముద్దుగా పిలుచుకునే ఏకే స్టైల్లో మరోసారి అదరగొట్టారు. త్రిష తన పాత్రలో జీవించేసింది. సీనియర్ హీరోయిన్గా తన నటనతో అభిమానులను ఆకట్టుకుంది. టాలీవుడ్ నటుడు సునీల్, కోలీవుడ్ కమెడియన్ కింగ్స్లే, సిమ్రాన్, ప్రకాశ్ దేవ్, ప్రభు, ప్రసన్న, టినూ ఆనంద్, జాకీ ష్రాఫ్ తమ పాత్రల్లో ఒదిగిపోయారు. ప్రతి నాయకుడిగా అర్జున్ దాస్ డిఫరెంట్ స్టైల్లో ఆకట్టుకున్నారు. ఇక సాంకేతికత విషయానికొస్తే.. అభినందన్ రామానుజం సినిమాటోగ్రఫీ బాగుంది. జీవీ ప్రకాశ్ బీజీఎం ఈ సినిమాకు అదనపు బలం. అలాగే నేపథ్య సంగీతం కూడా ఫర్వాలేదు. ఎడిటర్ విజయ్ వేల్‌కుట్టి కొన్ని సీన్స్ మరింత క్రిస్పీగా కట్ చేయాల్సింది. నిర్మాణ విలువలు సంస్థకు తగినట్లుగా ఉన్నతంగా ఉన్నాయి. -
'గుడ్ బ్యాడ్ అగ్లీ' ట్విటర్ రివ్యూ.. ఒక్క మాటలో చెప్పేశారు
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ నటించిన 'గుడ్ బ్యాడ్ అగ్లీ' (Good Bad Ugly) నేడు ఏప్రిల్ 10న థియేటర్స్‌లోకి వచ్చేసింది. ఇప్పటికే ఓవర్సీస్లో మొదటి ఆట పూర్తి కావడంతో నెటిజన్లు తమ అభిప్రాయాన్ని ఎక్స్, ఇన్స్టాగ్రామ్ పేజీలలో పంచుకుంటున్నారు. దర్శకుడు అధిక్ రవిచంద్రన్ తెరకెక్కించిన ఈ చిత్రాన్ని మైత్రి మేకర్స్ బ్యానర్లో వై రవిశంకర్, నవీన్ యేర్నేని ఈ మూవీని నిర్మించారు. ఇందులో అజిత్‌కు జోడీగా త్రిష మరోసారి మెరిసింది. రీసెంట్టా విడాముయార్చి సినిమాలో ఈ జోడి మెప్పించిన విషయం తెలిసిందే. అయితే, ప్రీమియర్స్ షోల తర్వాత 'గుడ్ బ్యాడ్ అగ్లీ' సినిమా గురించి ఎలాంటి టాక్ వచ్చిందో తెలుసుకుందాం..ఓవర్సీస్ ప్రీమియర్స్ ప్రకారం ఈ సినిమా అజిత్ ఫ్యాన్స్‌కు బాగా నచ్చుతుంది అని అంటున్నారు. పూర్తిగా మాస్ ఎంటర్టైనర్గా ఈ మూవీని దర్శకుడు అధిక్ రవిచంద్రన్ తెరకెక్కించాడని నెటిజన్లు తెలుపుతున్నారు. చాలా ఏళ్ల తర్వాత ఫ్యాన్స్ కోసం ఒక బెస్ట్ సినిమాను అజిత్ ఇచ్చారంటూ కొందరు రివ్యూవర్స్ చెబుతున్నారు. వింటేజ్ మాస్ ఈజ్ బ్యాక్ అంటూ పోస్ట్‌లు పెడుతున్నారు. చాలామంది నెటిజన్లు చెబుతున్న మాట ఒక్కటే 'గుడ్ బ్యాడ్ అగ్లీ' కేవలం అభిమానులకు మాత్రమే అంటూ పేర్కొనడం విశేషం. సినిమా చూసిన వారందూరు కూడా పాజిటివ్ రివ్యూలే ఇస్తున్నారు. సినిమాలో అజిత్ పాత్రను దర్శకుడు చాలా చక్కగా చూపించాడని చెబుతున్నారు. అయితే, ఈ సినిమాలో త్రిష, సిమ్రాన్‌లు ఇద్దరూ కూడా పెద్దగా ప్రభావం చూపలేదని కామెంట్లతో తెలుపుతున్నారు. అసలు వారిద్దరినీ ఎందుకు తీసుకున్నారో అర్థం కావడం లేదంటున్నారు. 'గుడ్ బ్యాడ్ అగ్లీ' ఫస్ట్ హాఫ్ సినిమా మొత్తం అజిత్ ఫ్యాన్స్ ను దృష్టిలో పెట్టుకునే దర్శకుడు ప్లాన్ చేశాడని తెలుస్తోంది. ఈ మూవీలో భారీ యాక్షన్ సీన్స్ ఒక రేంజ్లో ఉంటాయని కామెంట్ చేస్తున్నారు. ముఖ్యంగా ఇంటర్వెల్ బ్లాక్‌లో వచ్చే సీన్ అజిత్ కెరీర్లోనే బెస్ట్‌గా ఉంటుందని అంటున్నారు. అయితే, ఆ తర్వాత కాస్త కథ నెమ్మదిస్తుందని తెలుపుతున్నారు. జీవి ప్రకాష్ బీజీఎమ్ బాగన్నప్పటికీ అందుకు తగ్గట్టుగా సీన్‌కు ఎమోషనల్ కనెక్ట్ లేదని అభిప్రాయపడుతున్నారు. సినిమా మొత్తంగా అజిత్ ఫ్యాన్స్‌కు పండుగలాంటిదని తెలుపుతున్నారు. సినిమా గురించి ఒక్కమాటలో 'గుడ్ ఫర్ అజిత్ ఫ్యాన్స్.. ఒకే ఫర్ ఆడియెన్స్.. బ్యాడ్ ఫర్ అజిత్ హేటర్స్' అంటూ రివ్యూవర్స్ చెబుతున్నారు. From Overseas Premieres..#GoodBadUgly : An Out and Out Mass Entertainer..Best #AK movie in years..Mega Blockbuster.. Vintage Mass Ajith is Back! .— Ramesh Bala (@rameshlaus) April 10, 2025Fans after the movie. Tells you about the result 🔥🔥🥵💥😁 #GoodBadUglypic.twitter.com/Vrv5BJ8FV2— Trollywood 𝕏 (@TrollywoodX) April 10, 2025GOOD - For Fans 💥BAD - For Neutrals😐UGLY - For Haters😭Strictly & Only for AK Fans!#GoodBadUgly— Christopher Kanagaraj (@Chrissuccess) April 10, 2025#GoodBadUgly is an Alright Out and Out Mass Entertainer that works in parts and is a pure fan service to Ajith. After a Solid 1st half, the second half starts well with a flashback episode but has nothing much to offer after that and feels dragged till the end. A few mass…— Venky Reviews (@venkyreviews) April 10, 2025#GoodBadUgly Movie Review🍿 : - A Madness Mass Entertainer which surely satisfies all class of audience🔥- #AK 's career best intro 🌟⚡- #Ajithkumar𓃵 as Red Dragon 👌 Shoulders this Film with his terrific screen presence 🥵- #GVPrakash is the Second Hero of the film💥 He… pic.twitter.com/TmPmG0ugeX— k (@Gabbafied) April 10, 2025#GoodBadUgly Review : IT’S Thala RAMPPAGEE SHOW - 3.25/5 💥🔥Thala #AjithKumar IS PERFECTLY VINTAGE MARANAMASS 🔥🔥🔥💥💥💥💥🙌🙌🙌🙌🏆🏆🏆🏆Mainly @gvprakash BGM AND MUSIC IS SEEMAA MASSS DA 🥵🥵🥵🥵🥵🥵🔥🔥🔥🏆🏆🏆💥💥KUDOS TO DIRECTOR @Adhikravi FOR SHOWING HIS FANISM ON… pic.twitter.com/yFRV31KSzg— Telugu Cult 𝐘𝐓 (@Telugu_Cult) April 10, 2025Cringe title card loading 🤣😂🔥#GoodBadUgly #GoodBadUglyFromApril10 pic.twitter.com/iMdtorGBsq— VJ WARRIORS (@Vijay_fans_army) April 9, 2025#GoodBadUgly - Pakka Fanboy Sambavam 💯🔥 AK broke all his barriers and screen presence Vera level 🔥Adhik surprise elements vera level particularly climax AK Look , every fan's dream 🥵💥Don't miss the theatre experience pic.twitter.com/J40Mfbifql— Kolly Corner (@kollycorner) April 10, 2025 -
అజిత్ కుమార్ 'ఓజీ సంభవం'.. తెలుగు వర్షన్ వచ్చేసింది!
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ నటించిన ఫుల్ యాక్షన్ థ్రిల్లర్ 'గుడ్ బ్యాడ్ అగ్లీ'. ఈ చిత్రంలో త్రిష హీరోయిన్గా నటించింది. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించిన ఈ మూవీని మైత్రి మేకర్స్ బ్యానర్లో వై రవిశంకర్, నవీన్ యేర్నేని నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ గురువారమే ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది. ఈ మూవీ తెలుగు, తమిళంలో ట్రైలర్స్ రిలీజ్ చేశారు మేకర్స్.ఇప్పటికే ఓజీ సంభవం పేరుతో తమిళంలో ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేసిన మేకర్స్.. తాజాగా తెలుగులోనూ విడుదల చేశారు. ఈ చిత్రంపై అజిత్ అభిమానుల్లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ పాటకు కృష్ణకాంత్ లిరిక్స్ అందించారు. కాగా.. ఈ చిత్రంలో సునీల్, ప్రసన్న కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకు జీవీ ప్రకాష్‌కుమార్ సంగీతం అందించారు. -
'గుడ్ బ్యాడ్ అగ్లీ' సెన్సార్ పూర్తి.. రన్ టైమ్ ఎంతంటే?
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ నటించిన ఫుల్ యాక్షన్ థ్రిల్లర్ 'గుడ్ బ్యాడ్ అగ్లీ'. ఈ చిత్రంలో త్రిష హీరోయిన్గా నటించింది. ఈ సినిమాకు అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించారు. ఈ మూవీని మైత్రి మేకర్స్ బ్యానర్లో వై రవిశంకర్, నవీన్ యేర్నేని నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ నెల 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ మూవీ తెలుగు, తమిళంలో ట్రైలర్స్ కూడా రిలీజ్ చేశారు మేకర్స్.తాజాగా ఈ మూవీ సెన్సార్ కూడా పూర్తి చేసుకుంది. గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రానికి యూ/ఏ సర్టిఫికేట్ జారీ చేశారు. ఈ మూవీ రన్ టైమ్‌ను దాదాపు 140 నిమిషాలుగా సెన్సార్ బోర్డు నిర్ణయించింది. అదే సమయంలో అభ్యంతరకరంగా ఉన్న దాదాపు 2 నిమిషాల సీన్స్‌ను తొలగించినట్లు తెలుస్తోంది. అంతే కాకుండా 1 నిమిషం 41 సెకన్ల పాటు ఉన్న సీన్స్‌లో మార్పులు చేసినట్లు కనిపిస్తోంది. మొత్తానికి అజిత్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్గానే థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమైంది. కాగా.. ఈ చిత్రంలో సునీల్, ప్రసన్న కీలక పాత్రలు పోషిస్తున్నారు. కాగా.. ఈ సినిమాకు జీవీ ప్రకాష్‌కుమార్ సంగీతం అందించారు. #GoodBadUgly CBFC CertificateRun Time : 2hrs 19mins 52secsCertified: UA 16+ pic.twitter.com/UGGSkzVIXw— Sreedhar Pillai (@sri50) April 7, 2025 -
అజిత్ కుమార్ 'గుడ్ బ్యాడ్ అగ్లీ'.. పరుగులు తీసి ప్రాణాలు దక్కించుకున్న ఫ్యాన్స్!
విదాముయార్చి తర్వాత స్టార్ హీరో అజిత్ కుమార్ నటించిన తాజా చిత్రం గుడ్ బ్యాడ్ అగ్లీ. ఈ సినిమాను అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కించారు. ఈ మూవీని టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్లో నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ విడుదలకు అంతా సిద్దమైంది. ఈ నెల 10న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది.అయితే ఈ మూవీకి ఇంకా రెండు రోజుల సమయం మాత్రమే ఉండడంతో ఫ్యాన్స్ ఏర్పాట్లతో బిజీగా ఉన్నారు. థియేటర్ల వద్ద తమ అభిమాన హీరో కటౌట్స్ ఏర్పాటు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే చెన్నైలోని ఓ థియేటర్ వద్ద బిగ్గెస్ట్ కటౌట్‌ను అభిమానులు ఏర్పాటు చేశారు. చాలా ఎత్తులో ఈ కటౌట్ నిర్మించడంతో ఒక్కసారిగా కుప్ప కూలిపోయింది. అదే సమయంలో అక్కడే ఉన్న అజిత్ అభిమానులు పరుగులు పెట్టారు. అదృష్టవశాత్తూ అభిమానులంతా తప్పించుకోవడం అందరూ ఊపిరి పీల్చుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది.#Ajithkumar𓃵 #GoodBadUgly pic.twitter.com/mOhztO63OS— 𝘼𝙅𝙄𝙏𝙃 𝙑𝙄𝙇𝙇𝘼𝙄𝙉 𝘼𝙆 ᴿᵉᵈ ᴰʳᵃᵍᵒⁿ 🐉 (@AJITHVILLAINAK) April 7, 2025 -
'గుడ్ బ్యాడ్ అగ్లీ' తెలుగు ట్రైలర్ విడుదల
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ నటించిన 'గుడ్ బ్యాడ్ అగ్లీ' (Good Bad Ugly) తెలుగు ట్రైలర్ వచ్చేసింది. మైత్రి మేకర్స్ బ్యానర్లో వై రవిశంకర్, నవీన్ యేర్నేని ఈ మూవీని నిర్మించారు. ఏప్రిల్ 10న ఈ చిత్రం విడుదల కానుంది. దర్శకుడు అధిక్ రవిచంద్రన్ తెరకెక్కించిన ఈ చిత్రంలో హీరోయిన్గా త్రిష నటించారు. ఇప్పటికే 'గుడ్ బ్యాడ్ అగ్లీ' మూవీ తమిళ్ వర్షన్ ట్రైలర్ విడుదలైంది. ఏకంగా 35 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించి ట్రెండింగ్‌లో ఉంది. ఫ్యాన్స్‌కు నచ్చే భారీ యాక్షన్ సీన్లు ఈ మూవీలో ఉన్నట్లు తెలుస్తోంది. -
అజిత్ కుమార్ యాక్షన్ మూవీ.. ట్రైలర్ వచ్చేసింది
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ నటించిన ఫుల్ యాక్షన్ థ్రిల్లర్ 'గుడ్ బ్యాడ్ అగ్లీ'. ఈ చిత్రంలో త్రిష హీరోయిన్గా నటించింది. ఈ సినిమాకు అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించారు. ఈ మూవీని మైత్రి మేకర్స్ బ్యానర్లో వై రవిశంకర్, నవీన్ యేర్నేని నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ నెల 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో గుడ్ బ్యాడ్ అగ్లీ ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్.తాజాగా విడుదలైన ట్రైలర్ చూస్తే ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్గానే తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఈ మూవీ ట్రైలర్లో అజిత్ యాక్షన్ సన్నివేశాలు ఆడియన్స్‌ను తెగ ఆకట్టుకుంటున్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్, సాంగ్‌కు ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. దీంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. కాగా.. ఈ చిత్రంలో సునీల్, ప్రసన్న కీలక పాత్రలు పోషిస్తున్నారు. కాగా.. ఈ సినిమాకు జీవీ ప్రకాష్‌కుమార్ సంగీతం అందించారు. Maamey!THE MASS CELEBRATION is here 🤩#GoodBadUglyTrailer out now ❤🔥▶️ https://t.co/9KbtVtrkqP#GoodBadUgly Grand release worldwide on April 10th, 2025 with VERA LEVEL ENTERTAINMENT 💥💥#AjithKumar @trishtrashers @MythriOfficial @Adhikravi @gvprakash @AbinandhanR… pic.twitter.com/d2ECC3CoJz— Mythri Movie Makers (@MythriOfficial) April 4, 2025 -
ఆ సినిమా తొలి రోజే అన్ని రికార్డ్స్ బద్దలు కొడుతుంది: నిర్మాత రవిశంకర్
టాలీవుడ్ నిర్మాత వై.రవిశంకర్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. నితిన్, శ్రీలీల జంటగా నటించిన రాబిన్‌హుడ్ మూవీ ప్రీ రిలీజ్ ప్రెస్మీట్లో మాట్లాడారు. ఈ సందర్భంగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోన్న భారీ బడ్జెట్ మూవీ గురించి వ్యాఖ్యానించారు. అజిత్ కుమార్ హీరోగా నటించిన గుడ్ బ్యాడ్ అగ్లీ మొదటి రోజే రికార్డులు కొల్లగొడుతుందని ధీమా వ్యక్తం చేశారు. కోలీవుడ్‌లోనే ఓపెనింగ్ డే ఆల్ రికార్డ్స్ సృష్టిస్తుందని మా డిస్ట్రిబ్యూటర్స్ చెప్పారని అన్నారు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్లో తెరకెక్కించిన గుడ్ బ్యాడ్ అగ్లీ వచ్చేనెల 10న విడుదల కానుంది. ఈ మూవీలో అజిత్ కుమార్ సరసన త్రిష హీరోయిన్గా కనిపించనుంది.కాగా.. నితిన్ రాబిన్ హుడ్ చిత్రానికి వెంకీ కుడుముల దర్శకత్వం వహించారు. భీష్మ సూపర్ హిట్ తర్వాత వీరిద్దరి కాంబోలో వస్తోన్న చిత్రం కావడంతో అభిమానుల్లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. అంతేకాకుండా ఈ సినిమాలో ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ నటించడం మరో విశేషం. ఇటీవల ఏర్పాటు చేసిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆయన సందడి చేశారు. శ్రీలీల, కేతికా శర్మతో కలిసి అది దా సర్ప్రైజ్ అంటూ స్టెప్పులు కూడా వేశారు. ఈ సినిమా ఉగాది కానుకగా ఈ శుక్రవారం థియేటర్లలో సందడి చేయనుంది. తమిళ ఇండస్ట్రీలో #GoodBadUgly DAY 1 రికార్డులు కొడుతుంది - #RaviShankar#AjithKumar #Robinhood #TeluguFilmNagar pic.twitter.com/90DmdTZclA— Telugu FilmNagar (@telugufilmnagar) March 26, 2025 -
హీరో అజిత్‌ను పేరు పెట్టి పిలిచా.. అందరూ షాకయ్యారు: నటుడు
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ (Ajith)ను పేరు పెట్టి పిలిచినందుకు అందరూ తనను గుర్రుగా చూశారంటున్నాడు నటుడు రఘురామ్. ఇతడు ప్రస్తుతం అజిత్ గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా సెట్లో జరిగిన ఆసక్తికర విషయాన్ని తాజా ఇంటర్వ్యూలో వెల్లడించాడు. రఘురామ్ (Raghu Ram) మాట్లాడుతూ.. నేను పెరిగిందంతా ఢిల్లీలో.. ఉంటోంది ముంబైలో! అక్కడ మాకంటే పెద్ద స్థాయిలో ఉండేవారిని కూడా పేరు పెట్టే పిలుస్తాం. నాకూ అదే అలవాటైపోయింది.తల కొట్టేసినట్లయిందిగుడ్బ్యాడ్ అగ్లీ సినిమా (Good Bad Ugly) షూటింగ్లో అజిత్ తనను తాను పరిచయం చేసుకున్నాడు. నన్ను నేను పరిచయం చేసుకునే క్రమంలో అతడి పేరు పెట్టి పిలిచాను. అందరూ షాకయ్యారు. సెట్ నిశ్శబ్దంగా మారిపోయింది. అలా పేరు పెట్టి పిలవడం ఆయన్ను అవమానించినట్లు కాదా అన్నారు. నాకు తల కొట్టేసినట్లుగా అనిపించింది. అంత పెద్ద హీరోతో కలిసి నటించే ఛాన్స్ వస్తే నేనిలా చేశానేంటి? అనుకున్నాను. స్పెయిన్‌లో షూటింగ్‌కు వెళ్లినప్పుడు దర్శకుడు, సహాయ దర్శకుడు కూడా అజిత్‌ను పేరు పెట్టి పిలవొద్దన్నారు. అందుకే అలా పిలుస్తున్నా..సరే.. సర్ అని పిలుస్తానని చెప్పాను. సాధారణంగా ఆయన ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడరనుకుంటాను. జనాలు ఇబ్బందిపడుతున్నారని నేనే ఆయన్ను సర్ అనడం మొదలుపెట్టాను అని చెప్పుకొచ్చాడు. రఘురామ్ ఝూఠా హై సహీ అనే చిత్రంతో నటుడిగా వెండితెరకు పరిచయం య్యాడు. తీస్మార్ ఖాన్ మూవీలోనూ నటించాడు. తమిళంలో డాక్టర్, తెలుగులో గాంధీ తాత చెట్టు, మెకానిక్ రాకీ చిత్రాల్లో నటించాడు.చదవండి: బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశాం.. సారీ చెప్పాం.. ఇంకేంటి? సురేఖావాణి ఫైర్ -
అజిత్ కుమార్ గుడ్ బ్యాడ్ అగ్లీ.. ఫస్ట్ సాంగ్ వచ్చేసింది!
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ నటించిన ఫుల్ యాక్షన్ థ్రిల్లర్ 'గుడ్ బ్యాడ్ అగ్లీ'. ఈ చిత్రంలో త్రిష హీరోయిన్గా నటించింది. ఈ సినిమాకు అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించారు. ఈ మూవీని మైత్రి మేకర్స్ బ్యానర్లో వై రవిశంకర్, నవీన్ యేర్నేని నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ప్రమోషన్స్ ప్రారంభించారు. తాజాగా ఈ మూవీ నుంచి ఓజీ సంభవం పేరుతో ఫస్ట్ లిరికల్ సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఇప్పటికే ఈ మూవీ టీజర్ విడుదల చేయగా ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. గుడ్ బ్యాడ్ అగ్లీ టీజర్లో అజిత్ యాక్షన్ సన్నివేశాలు ఆడియన్స్‌ను తెగ ఆకట్టుకున్నాయి. దీంతో ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. కాగా.. ఈ యాక్షన్ మూవీ ఏప్రిల్ 10న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. కాగా.. ఈ చిత్రంలో సునీల్, ప్రసన్న కీలక పాత్రలు పోషిస్తున్నారు. కాగా.. ఈ సినిమాకు జీవీ ప్రకాష్‌కుమార్ సంగీతం అందించారు. Maameyyyyy!!!The Blast is here 💥💥#OGSambavam from #GoodBadUgly 🔥🔥https://t.co/FWr6nWOpB5In cinemas April 10th.— Mythri Movie Makers (@MythriOfficial) March 18, 2025 -
అజిత్ కుమార్ 'గుడ్ బ్యాడ్ అగ్లీ'.. టీజర్ మేకింగ్ వీడియో చూశారా?
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ నటించిన ఫుల్ యాక్షన్ థ్రిల్లర్ 'గుడ్ బ్యాడ్ అగ్లీ'. ఈ చిత్రంలో త్రిష హీరోయిన్గా నటించింది. ఈ సినిమాకు అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించారు. ఈ మూవీని మైత్రి మేకర్స్ బ్యానర్లో వై రవిశంకర్, నవీన్ యేర్నేని నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ప్రమోషన్స్ ప్రారంభించారు.ఇప్పటికే ఈ మూవీ టీజర్ విడుదల చేసిన మేకర్స్.. తాజాగా టీజర్ మేకింగ్ వీడియోతో ఆడియన్స్‌కు సర్ప్రైజ్ ఇచ్చారు. ఈ మేకింగ్ వీడియోలో అజిత్ కుమార్ టీమ్ పడిన కష్టాన్ని కళ్లకు కట్టినట్లుగా చూపించారు. ముఖ్యంగా తన ఫర్మామెన్స్తో సీన్స్‌లో అద్భుతంగా నటించారు. మీరు ఈ మేకింగ్ వీడియో చూసేయండి. ఈ యాక్షన్ మూవీ ఏప్రిల్ 10న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. కాగా.. ఈ చిత్రంలో సునీల్, ప్రసన్న కీలక పాత్రలు పోషిస్తున్నారు. కాగా.. ఈ సినిమాకు జీవీ ప్రకాష్‌కుమార్ సంగీతం అందించారు.(ఇది చదవండి: అజిత్ కుమార్ 'గుడ్ బ్యాడ్ అగ్లీ'.. తెలుగు టీజర్ చూశారా?)అజిత్ కుమార్ ఇటీవల విదాముయార్చి మూవీతో ప్రేక్షకులను పలకరించారు. తెలుగులో పట్టుదల పేరుతో ఈ సినిమా విడుదలైంది. అయితే ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఊహించినంత స్థాయిలో రాణించలేకపోయింది. దీంతో అజిత్ ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు గురయ్యారు. మరి గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాతోనైనా బ్లాక్ బస్టర్ కొట్టాలని అజిత్ ఫ్యాన్స్ భావిస్తున్నారు.Here is the making of #GoodBadUglyTeaser ❤️🔥▶️ https://t.co/qLYnc6f41WAfter Teaser Sambavam, it is time for the first single. Ready, Maamey?#OGSambavam from March 18th.A @gvprakash Musical ❤️🔥#GoodBadUgly Grand release on 10th April, 2025 with VERA LEVEL entertainment 🤩… pic.twitter.com/2K5Makpxph— Mythri Movie Makers (@MythriOfficial) March 14, 2025 -
అజిత్ కుమార్ 'గుడ్ బ్యాడ్ అగ్లీ'.. ధనుశ్ పోటీ నుంచి తప్పుకున్నట్టేనా?
విదాముయార్చి మూవీ తర్వాత కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ మరో యాక్షన్ థ్రిల్లర్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ వేసవిలో మరోసారి అభిమానులను అలరించేందుకు సిద్ధమయ్యారు. మైత్రి మూవీ మేకర్స్ తెరకెక్కిస్తోన్న గుడ్ బ్యాడ్ అగ్లీలో అజిత్ నటిస్తున్నారు. ఇటీవలే ఈ మూవీ టీజర్‌ను విడుదల చేశారు. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కిస్తోన్న ఈ చిత్రం సమ్మర్ కానుకగా ఏప్రిల్ 10న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ చిత్రంలో త్రిష హీరోయిన్గా కనిపించనుంది.అయితే అదే రోజు ధనుశ్ హీరోగా నటిస్తోన్న ఇడ్లీ కడై విడుదల కానుంది. ఈ మూవీలో నిత్యామీనన్ హీరోయిన్గా నటిస్తోంది. అజిత్ కుమార్ గుడ్ బ్యాడ్ అగ్లీ కూడా అదే రోజు కావడంతో ఇడ్లీ కడై మేకర్స్ పునరాలోచనలో పడ్డారు. ఇడ్లీ కడై మూవీ రిలీజ్ వాయిదా వేయాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కాగా.. తిరుచిత్రంబలం మూవీ తర్వాత ధనుశ్, నిత్యా మీనన్ మరోసారి జంటగా కనిపించనున్నారు. ఇదిలా ఉండగా.. ధనుశ్ డైరెక్షన్లో అజిత్ కుమార్ నటించనున్నట్లు మరో టాక్ వినిపిస్తోంది. ధనుశ్ సొంత నిర్మాణ సంస్థ అయిన వండర్‌బార్ పిక్చర్స్ బ్యానర్లో అజిత్ కుమార్ నటించే అవకాశం ఉందని రూమర్స్ అయితే వస్తున్నాయి. ఇంకా టైటిల్ ఖరారు చేయని ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించనున్నట్లు కోలీవుడ్ టాక్. -
అజిత్ కుమార్ 'గుడ్ బ్యాడ్ అగ్లీ'.. తెలుగు టీజర్ చూశారా?
కోలీవుడ్ స్టార్ అజిత్ కుమార్ హీరోగా నటిస్తోన్న యాక్షన్ థ్రిల్లర్ మూవీ 'గుడ్ బ్యాడ్ అగ్లీ'. ఈ మూవీలో త్రిష హీరోయిన్గా కనిపించనుంది. ఈ సినిమాను మార్క్ ఆంటోని ఫేమ్ అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీమూవీమేకర్స్ బ్యానర్లో నవీన్ ఎర్నేని, వై. రవి శంకర్ నిర్మిస్తున్నారు. ఈ యాక్షన్ థ్రిల్లర్ వేసవిలో థియేటర్లలో సందడి చేయనుంది.ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా తెలుగు టీజర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఇప్పటికే తమిళ టీజర్‌ను విడుదల చేసిన మేకర్స్ ఇవాళ తెలుగుతో పాటు హిందీలోనూ గుడ్ బ్యాడ్ అగ్లీ టీజర్‌ను రిలీజ్ చేశారు. ఈ మూవీ టీజర్లో అజిత్ యాక్షన్ సన్నివేశాలు ఆడియన్స్‌ను తెగ ఆకట్టుకుంటున్నాయి. కాగా.. ఈ చిత్రంలో సునీల్, ప్రసన్న కీలక పాత్రలు పోషిస్తున్నారు. కాగా.. ఈ సినిమాకు జీవీ ప్రకాష్‌కుమార్ సంగీతం అందించారు.అజిత్ కుమార్ ఇటీవల విదాముయార్చి మూవీతో ప్రేక్షకులను పలకరించారు. తెలుగులో పట్టుదల పేరుతో ఈ సినిమా విడుదలైంది. అయితే ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఊహించినంత స్థాయిలో రాణించలేకపోయింది. దీంతో అజిత్ ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు గురయ్యారు. ఏప్రిల్ 10న విడుదల కానున్న గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాతోనైనా బ్లాక్ బస్టర్ కొట్టాలని అజిత్ ఫ్యాన్స్ భావిస్తున్నారు.This summer, it is going to be a crazy entertaining ride 💥💥#GoodBadUglyTeaser out now!Telugu ▶️ https://t.co/Ynl6esv1jhHindi ▶️ https://t.co/Y5QRRG1E67#GoodBadUgly Grand release on 10th April, 2025 with VERA LEVEL entertainment 🤩A @gvprakash Musical ❤️🔥… pic.twitter.com/5BxIRxZ1sz— Mythri Movie Makers (@MythriOfficial) March 1, 2025 -
అజిత్ యాక్షన్ థ్రిల్లర్.. గుడ్ బ్యాడ్ అగ్లీ టీజర్ రిలీజ్
కోలీవుడ్ స్టార్ అజిత్ కుమార్ హీరోగా నటిస్తోన్న యాక్షన్ థ్రిల్లర్ మూవీ 'గుడ్ బ్యాడ్ అగ్లీ'. ఈ మూవీలో త్రిష హీరోయిన్గా కనిపించనుంది. ఈ సినిమాను మార్క్ ఆంటోని ఫేమ్ అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీమూవీమేకర్స్ బ్యానర్లో నవీన్ ఎర్నేని, వై. రవి శంకర్ నిర్మిస్తున్నారు. ఈ యాక్షన్ థ్రిల్లర్ సంక్రాంతికి రిలీజ్ కావాల్సి ఉన్నా అలా జరగలేదు. దీంతో వేసవిలో థియేటర్లలో సందడి చేయనుంది.ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా టీజర్‌ను మేకర్స్ విడుదల చేశారు. టీజర్లో అజిత్ యాక్షన్ సన్నివేశాలు ఆడియన్స్‌ను తెగ ఆకట్టుకుంటున్నాయి. అజిత్‌పాత్రలో డిఫరెంట్ షేడ్స్ ఉన్నట్లు అర్థమవుతోంది. ఈ చిత్రంలో సునీల్, ప్రసన్న కీలక పాత్రలు పోషిస్తున్నారు. కాగా.. ఈ సినిమాకు జీవీ ప్రకాష్‌కుమార్ సంగీతం అందించారు.అజిత్ కుమార్ ఇటీవల విదాముయార్చి మూవీతో ప్రేక్షకులను పలకరించారు. తెలుగులో పట్టుదల పేరుతో ఈ సినిమా విడుదలైంది. అయితే ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఊహించినంత స్థాయిలో రాణించలేకపోయింది. దీంతో అజిత్ ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు గురయ్యారు. ఏప్రిల్ 10న విడుదల కానున్న గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాతోనైనా బ్లాక్ బస్టర్ కొట్టాలని అజిత్ ఫ్యాన్స్ భావిస్తున్నారు.Maamey! The festival is here 💥This summer is going to be SUPER CRAZY 🔥🔥Here's the #GoodBadUglyTeaser ❤️🔥▶️ https://t.co/evp1QJiM2J#GoodBadUgly Grand release on 10th April, 2025 with VERA LEVEL entertainment 🤩A @gvprakash Musical ❤️🔥#AjithKumar… pic.twitter.com/M4hRGPdbAr— Mythri Movie Makers (@MythriOfficial) February 28, 2025 -
అజిత్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. వీడియో వైరల్
కోలీవుడ్ హీరో అజిత్ కారు రెండు పల్టీలు కొట్టింది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. స్పెయిన్‌లో జరుగుతున్న కారు రేసింగ్‌లో అజిత్ పాల్గొన్నారు. రేసింగ్‌లో భాగంగా మరో కారును తప్పించే క్రమంలో అజిత్ కారు ప్రమాదానికి గురైంది. ఆ సమయంలో ఒక్కసారిగా ఆయన కారు ట్రాక్ తప్పింది. అయితే, సిబ్బంది వెంటనే అలర్ట్ కావడంతో ఆయన సురక్షితంగా బయటకొచ్చారు. ఇదే విషయాన్ని ఆయన యూనిట్ సభ్యులు ప్రకటించారు. ఈ ప్రమాదంలో అజిత్ తప్పులేదని వారు తెలిపారు. రేసులో ఉన్న ఇతర కార్ల వల్లే ఈ ఘటన జరిగిందన్నారు. అయితే, మళ్లీ అజిత్ రేసులో పాల్గొనడం విశేషం.అజిత్ కారు రేసింగ్‌లో భాగంగా ఇప్పటి వరకు మూడు సార్లు ప్రమాదానికి గురయ్యారు. అజిత్ ఇటీవల దుబాయ్‌లో జరిగిన అంతర్జాతీయ కారు రేస్ క్రీడా పోటీల్లో పాల్గొని తృతీయ పతకాన్ని గెలుచుకున్న విషయం తెలిసిందే. ఆప్పుడు కూడా ఆయన ప్రమాదానికి గురికావడం జరిగింది. స్పెయిన్ రేసులో పాల్గొనేందుకు ఆయన శిక్షణ తీసుకుంటున్న సమయంలో కూడా ప్రమాదం జరిగింది. అయితే, ఆయన అన్నిసార్లు కూడా ఎలాంటి గాయాలు లేకుండా సురక్షితంగా బయటపడ్డారు. దీంతో ఆయన అభిమానులు ఆందోళ చెందుతూ జాగ్రత్తగా ఉండాలని అజిత్‌ను సూచిస్తున్నారు.అజిత్ కుమార్ హీరోగా నటించిన స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ ఏప్రిల్ 10న విడుదల కానుంది. త్రిష హీరోయిన్ . ‘మార్క్ ఆంటోని’ ఫేమ్ అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో మైత్రీమూవీమేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవి శంకర్ నిర్మించారు. ఇండియన్ మూవీ చరిత్రలోనే ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ ఓ మైలురాయిగా నిలుస్తుందని చిత్ర యూనిట్ ఆశిస్తుంది. ఈ సినిమాకు జీవీ ప్రకాష్‌కుమార్ సంగీతం అందించారు. View this post on Instagram A post shared by Ajith Kumar Racing Team (@ajithkumarracing) -
వేసవిలో యాక్షన్
అజిత్ కుమార్ హీరోగా నటించిన స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’. త్రిష హీరో యిన్ . ‘మార్క్ ఆంటోని’ ఫేమ్ అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో మైత్రీమూవీమేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవి శంకర్ నిర్మించారు.ఈ మూవీని వేసవిలో ఏప్రిల్ 10న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించి, కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ‘‘అజిత్‌పాత్రలో డిఫరెంట్ షేడ్స్ ఉంటాయి. ఇండియన్ మూవీ చరిత్రలోనే ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ ఓ మైలురాయిగా నిలుస్తుంది’’ అని యూనిట్ పేర్కొంది. ఈ సినిమాకు జీవీ ప్రకాష్‌కుమార్ సంగీతం అందించారు. కాగా ఈ చిత్రాన్ని తొలుత సంక్రాంతికి రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ, ఏప్రిల్‌లో రిలీజ్ అవుతోంది. -
స్టార్ హీరో రెండు సినిమాలూ సంక్రాంతికే విడుదల
సంక్రాంతి లాంటి పండగని స్టార్ హీరోలు వదులుకోవాలని అనుకోరు. ఇద్దరు ముగ్గురు హీరోలైనా సరే తమ సినిమాల్ని రెడీ చేస్తారు. తెలుగులో అయితే రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్', బాలకృష్ణ 'డాకు మహారాజ్', వెంకటేశ్ 'సంక్రాంతికి వస్తున్నాం' చిత్రాలతో రాబోతున్నారు. తమిళంలో ఈసారి కొత్త మూవీస్ ఏమున్నాయా అని చూస్తే ఒకే స్టార్ హీరో రెండు సినిమాల్ని రిలీజ్ చేయబోతున్నట్లు చెప్పి అభిమానుల్ని తికమక పెడుతున్నారు.(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 28 సినిమాలు)తమిళ స్టార్ హీరోల్లో అజిత్ ఒకడు. తెలుగు నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌తో కలిసి 'గుడ్ బ్యాడ్ అగ్లీ' అనే సినిమా చేస్తున్నాడు. దీన్ని సంక్రాంతికే రిలీజ్ చేస్తామని ఈ మధ్య నిర్మాతలు ప్రకటించారు. ఇదిలా ఉండగానే.. అజిత్ మరో మూవీ 'విడాముయార్చి' కూడా సంక్రాంతికే వస్తున్నట్లు చెప్పి షాకిచ్చారు.గురువారం రాత్రి 'విడాముయార్చి' టీజర్ రిలీజ్ చేశారు. యాక్షన్ ఎంటర్టైనర్లా అనిపించింది. అనిరుధ్ మ్యూజిక్ కూడా వెరైటీగా బాగానే ఉంది. కానీ పొంగల్ రిలీజ్ అని చివర్లో చెప్పడం విచిత్రంగా అనిపించింది. ఎందుకంటే అజిత్ నుంచే రెండు సినిమాలు, అది కూడా సంక్రాంతికి రిలీజ్ అని నిర్మాతలు ప్రకటించారు. కానీ ఇద్దరిలో ఎవరో ఒకరు తగ్గుతారా? లేదా పంతానికి పోయి ఇద్దరూ తమ మూవీస్ తీసుకొస్తారా అనేది చూడాలి? ఒకవేళ ఏది రిలీజైనా సరే 'గేమ్ ఛేంజర్' తమిళ వెర్షన్‌కి థియేటర్ల సమస్య మాత్రం గ్యారంటీ.(ఇదీ చదవండి: చైతూ-శోభిత పెళ్లి సందడి.. హల్దీ ఫొటోలు వైరల్) -
భార్య పుట్టినరోజు.. ఖరీదైన కారు గిఫ్ట్ ఇచ్చిన స్టార్ హీరో
తమిళ స్టార్ హీరో అజిత్ ఒకడు. ప్రస్తుతం 'గుడ్ బ్యాడ్ అగ్లీ' సినిమా చేస్తున్నాడు. ఇతడి భార్య షాలిని.. తెలుగు ప్రేక్షకులకు కాస్త పరిచయమే. చిరంజీవి 'జగదేకవీరుడు అతిలోక సుందరి' మూవీలో చైల్డ్ ఆర్టిస్టుగా చేసింది. రీసెంట్గా తన 44వ పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకుంది. షూటింగ్ నిమిత్తం యూకేలో ఉన్న అజిత్.. భార్య పుట్టినరోజుకి రాలేకపోయాడు. అయితేనేం ఖరీదైన లగ్జరీ కారుని బహుమతి ఇచ్చాడు.(ఇదీ చదవండి: టాలీవుడ్ హీరోయిన్గా టీమిండియా క్రికెటర్ భార్య!)నవంబర్ 20న షాలినీ.. తన పుట్టినరోజు నాడే లెక్సెస్ LM 350h మోడల్ కొత్త కారుతో కనిపించింది. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అలా అజిత్.. షాలినికి కారు బహమతిగా ఇవ్వడం బయటకొచ్చింది. మార్కెట్లో కారు ఖరీదు రెండున్నర కోట్ల రూపాయలకు పైనే ఉందని తెలుస్తోంది. అంతకు ఈ ఏడాది మే 1న అజిత్ పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకున్నాడు. అప్పుడు తన భర్తకు ఇష్టమని చెప్పి, డుకాటీ లేటెస్ట్ మోడల్ రేస్ బైక్‌ని షాలినీ గిఫ్ట్ ఇచ్చింది. ఇలా భార్య, భర్తకు బహుమతి ఇవ్వగా.. ఇప్పుడు తిరిగి అతడి భార్యకు కారు గిఫ్ట్ ఇచ్చాడు.ఇదంతా పక్కనబెడితే అజిత్ 'గుడ్ బ్యాడ్ అగ్లీ' మూవీ సంక్రాంతి రేసులో ఉందని అంటున్నారు. అది కూడా 'గేమ్ ఛేంజర్'తో పాటు జనవరి 10నే థియేటర్లలోకి వస్తుందని అంటున్నారు. ఒకవేళ ఇదే జరిగితే మాత్రం తెలుగు రాష్ట్రాల వరకు ఇబ్బంది ఉండకపోవచ్చు గానీ తమిళనాడులో మాత్రం చరణ్ మూవీ కలెక్షన్స్ తగ్గే అవకాశముంది.(ఇదీ చదవండి: నిశ్చితార్థం చేసుకున్న 'బిగ్‌బాస్ 8' సోనియా.. పెళ్లెప్పుడంటే?) -
సంక్రాంతి బరిలోనే...
అజిత్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ స్పెయిన్‌లోని మ్యాడ్రిడ్‌లో జరుగుతోంది. ఈ లాంగ్ షెడ్యూల్లో ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలతో పాటు యాక్షన్, సాంగ్ చిత్రీకరణలను కూడా ప్లాన్ చేశారు. ఈ చిత్రంలో సునీల్, ప్రసన్న కీలక పాత్రలు పోషిస్తున్నారు. అలాగే ఈ చిత్రంలో త్రిష హీరోయిన్గా నటిస్తున్నారని, హీరోయిన్ శ్రీలీల మరో లీడ్ రోల్లో కనిపిస్తారనే ప్రచారం సాగుతోంది.మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్న ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ సంక్రాంతికి విడుదల కానుంది. అయితే ఈ సినిమాకన్నా ముందే అజిత్ హీరోగా కమిటైన ‘విడాముయర్చి’ చిత్రం సంక్రాంతికి విడుదలతుందని, ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ వచ్చే వేసవిలో రిలీజ్ కానుందనే ప్రచారం తెరపైకి వచ్చింది. కానీ తాజాగా ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ సంక్రాంతికే రిలీజ్ అవుతుందని వెల్లడించి, అజిత్ కొత్త లుక్‌ను యూనిట్ రిలీజ్ చేసింది. దీంతో ‘విడాముయర్చి’ చిత్రం వచ్చే వేసవిలో రిలీజ్ అవుతుందని ఊహించవచ్చు. -
స్టైలిష్ యాక్షన్
అజిత్ కుమార్ హీరోగా నటిస్తున్న ద్విభాషా చిత్రం (తెలుగు, తమిళ్) ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. ‘‘స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతోన్న మూవీ ఇది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో శరవేగంగా జరుగుతోంది.ఈ కీలకమైన షెడ్యూల్లో అజిత్‌తోపాటు ఇతర నటీనటులపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నాం. ఇప్పటికే రిలీజైన ఈ సినిమా ఫస్ట్ లుక్‌కి అనూహ్యమైన స్పందన వచ్చింది. 2025 సంక్రాంతికి ఈ చిత్రాన్ని విడుదల చేస్తాం’’ అని చిత్రబృందం పేర్కొంది. -
గుడ్ బ్యాడ్ అగ్లీ.. ఆ ఓటీటీ అన్ని కోట్లు పెట్టిందా?
అన్నం ఉడికిందో లేదో తెలియడానికి ఒక్క మెతుకు చూస్తే చాలంటారు. అలాగే కొన్ని చిత్రాల జాతకం ఒక్క పోస్టర్‌తోనే తెలిసిపోతుంది. ఈ విషయాన్ని అజిత్ 'గుడ్ బ్యాడ్ అగ్లీ' చిత్రం నిరూపించింది. అజిత్ ప్రస్తుతం విడాయుయర్చి చిత్రంలో నటిస్తున్నారు. మగిళ్ తిరుమేణి దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తున్న ఇందులో త్రిష హీరోయిన్గా నటిస్తున్నారు. పలు సమస్యలను అధిగమిస్తూ ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. గుడ్ బ్యాడ్ అగ్లీఇకపోతే అజిత్ తన తదుపరి చిత్రానికి సిద్ధం అవుతున్నారు. అదే గుడ్ బ్యాడ్ అగ్లీ. మార్క్ ఆంటోని వంటి సూపర్‌హిట్ చిత్రాన్ని తెరకెక్కించిన అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ప్రముఖ టాలీవుడ్ చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ఇందులో అజిత్ త్రిపాత్రాభినయం చేస్తున్నట్లు సమాచారం. పోస్టర్‌కు పాజిటివ్ రెస్పాన్స్ఆయనకు జంటగా శ్రీలీల, మీనా, సిమ్రాన్‌లు నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. కాగా చిత్ర షూటింగ్ వచ్చే నెలలో ప్రారంభం అవుతుందని సమాచారం. గుడ్ బ్యాడ్ అగ్లీ అనే టైటిల్‌కు సూపర్ రెస్పాన్స్ రాగా ఫస్ట్‌లుక్ పోస్టర్ కూడా అదిరిపోయింది. అజిత్ మూడు ముఖాలతో కూడిన ఆ పోస్టర్ చిత్రంపై మరింత ఆసక్తిని పెంచేసింది. ఓటీటీ రైట్స్ఇక ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ రూ.95 కోట్లు పెట్టి సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. మొత్తం మీద అజిత్ గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రం ప్రారంభానికి ముందే సంచలనం సృష్టిస్తోందన్నమాట. ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి థియేటర్లలో రానుంది.చదవండి: బిగ్ బాస్ ఓటీటీ సీజన్ 3 అప్డేట్ వచ్చేసింది.. మారనున్న హోస్ట్ -
చివరి నిమిషంలో ‘గూగ్లీ’.. అస్సలు ఊహించలేరు
సాక్షి, సినిమా : నటుడిగానే కాదు, ఇష్క్, మనం వంటి చిత్రాలతో రచయితగా కూడా హర్షవర్ధన్ మంచి పేరు సంపాదించుకున్నాడు. కొంతకాలం క్రితం డైరెక్టర్ అవతారంలోకి మారి గుడ్ బ్యాడ్ అగ్లీ అనే చిత్రాన్ని తెరకెక్కించాడు. ఆ చిత్రం గతేడాది రిలీజ్ కావాల్సి ఉన్నప్పటికీ ఎందుకనో వాయిదా పడింది. ఇక ఇప్పుడు విడుదలకు సిద్ధమైపోయింది. అయితే అనూహ్యంగా ఇప్పుడు ఆ చిత్ర టైటిల్‌ను మార్చేశాడు దర్శకుడు హర్షవర్ధన్. ‘‘క్రికెట్లో గూగ్లీ గురించి చాలా మందికి తెలిసి ఉంటుంది. మా చిత్రం కూడా అంతే. క్రికెట్ లో గూగ్లీని బ్యాట్స్ మెన్ ఏ విధంగా ఊహించరో.. అలాగే ప్రేక్షకులు కూడా మా చిత్రాన్ని, అందులోని పాత్రల తీరును అస్సలు ఊహించలేరు. అందుకే టైటిల్‌ను ఇలా మార్చేశాం’’ అని హర్ష చెప్పారు. శ్రీ ముఖి, కిషోర్, మురళీ కృష్ణ, ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రంలో హర్షవర్ధన్ కూడా ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన ఈ విలేజ్ డ్రామా ఫిబ్రవరి చివరి వారంలో విడుదలయ్యే అవకాశం ఉంది. -
మంచీ చెడూ త్వరలో...
‘‘గుడ్, బ్యాడ్, అగ్లీ ఈ మూడు కోణాలు మన అందరిలోనూ ఉంటాయి. సందర్భం వచ్చినప్పుడు బయటకు వస్తుంటాయి. ఈ మూడు అంశాల మీదే ఈ సినిమా నడుస్తు్తంది. సినిమా మొత్తం ఎంటర్టైన్మెంట్తో సాగుతుంది. కథకు సూట్ అవుతుందనే ఈ టైటిల్‌ను ఫిక్స్ చేశాం’’ అన్నారు దర్శకుడు హర్షవర్థన్. మురళీ, శ్రీముఖి, కిశోర్ ముఖ్య పాత్రల్లో రచయిత హర్షవర్థన్ దర్శకత్వంలో అంజిరెడ్డి నిర్మించిన చిత్రం ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్మీట్లో.. ‘‘సినిమా కంప్లీట్ అయింది. ఈ నెలాఖరులో రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నాం’’ అని నిర్మాత అన్నారు. ‘‘నా గత సినిమాలతో పోలిస్తే ఈ సినిమా చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. నన్ను నేను కొత్తగా చూసుకునే అవకాశం ఈ సినిమా వల్ల వచ్చింది’’ అన్నారు శ్రీముఖి. -
రుతురాగాలతో నటజీవితం ప్రారంభం
విజయనగరం టౌన్: రుతురాగాలు సీరియల్‌తో బుల్లితెర ప్రవేశం చేసి అంచలంచెలుగా ఎదిగి అమృతం సీరియల్‌తో అందరి మన్ననలు పొంది, లీడర్, గుండెజారి గల్లంతయ్యిందే, మనం వంటి హిట్ చిత్రాలకు కథ, స్క్రీన్‌ప్లే అందించిన మన జిల్లావాసి ఎమ్.హర్షవర్దన్ ఆదివారం గోల్డెన్ హెరిటేజ్ ఆఫ్ విజయనగరం స్వచ్ఛంద సంస్థ నిర్వహించిన ఆత్మీయకలయిక కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన సాక్షితో తన అనుభవాలను పంచుకున్నారు. అవి ఆయన మాటల్లోనే... అప్పుడు మొదలైంది.. దూరదర్శన్‌లో ప్రసారమైన రుతురాగాలతో నట జీవితాన్ని ప్రారంభించాను. పుట్టింది రాజాంలోనైనా విద్యాభ్యాసం, పెరిగిందంతా విజయనగరంలోనే కావడం నా అదృష్టం. రుతురాగాలు తర్వాత కస్తూరీ, శాంతినివాసం సీరియల్స్‌లో నటించాను. అమృతం సీరియల్ ఎక్కువ పేరుప్రఖ్యాతులు తీసుకువచ్చింది. సినీరంగ ప్రవేశంలో లీడర్, అనుకోకుండా ఒకరోజు వంటి చిత్రాలు బాగా పేరుప్రఖ్యాతులు తీసుకువచ్చాయి. గుండెజారి గల్లంతయ్యిందే, మనం వంటి చిత్రాలకు కథ, స్క్రీన్‌ప్లే దర్శకునిగా పనిచేశాను. ప్రస్తుతం స్వీయ దర్శకత్వంలో ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ చిత్రాన్ని స్వీయదర్శకత్వంలో నిర్మిస్తున్నాను. సినిమా అంతా విజయనగరం పరిసర ప్రాంతాల్లోనే జరుగుతుంది. ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం వహిస్తున్నాను. యాంకర్ శ్రీముఖి ఇందులో హీరోయిన్గా ప్రధానపాత్ర పోషిస్తున్నారు. 1989లో పల్లెటూర్లో జరిగిన యధార్ధ సంఘటన ఆధారంగా సినిమా తెరకెక్కిస్తున్నాను. -
హీరోయిన్గా మరో ఛాన్స్ కొట్టేసిన యాంకర్
బుల్లితెర మీద సత్తా చాటుతున్న యాంకర్స్ వెండితెర మీద కూడా అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఇప్పటికే అనసూయ, రష్మీ లాంటి వారు వరుస అవకాశాలతో దూసుకుపోతుండగా మరికొందరు సత్తా చాటేందుకు కష్టపడుతున్నారు. అదే బాటలో బుల్లితెర స్టార్ యాంకర్ శ్రీముఖి వరుస అవకాశాలతో సత్తా చాటుతోంది. త్వరలో రిలీజ్‌కు రెడీ అవుతున్న పీరియాడిక్ కామెడీ డ్రామా ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’. ఈ సినిమాలో లీడ్ క్యారెక్టర్లో నటిస్తున్న శ్రీముఖి హీరోయిన్ గా మరో ఛాన్స్ కొట్టేసింది. వి.ఎస్ వాసు దర్శకత్వంలో తెరకెక్కబోయే కొత్త చిత్రంలో శ్రీముఖి హీరోయిన్గా నటిస్తోంది. ‘కుటుంబ కథా చిత్రం’ అనే పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నందు హీరోగా నటిస్తున్నాడు. కొత్తగా పెళ్లైన జంట నేపథ్యంలో సాగే కథతో తెరకెక్కుతున్న ఈ సినిమాతో హీరోయిన్ గా ప్రూవ్చేసుకోవాలని భావిస్తోంది శ్రీముఖి. -
పెళ్లి సింపుల్‌గా.. షష్టిపూర్తి ఘనంగా...
నటుడు, రచయిత హర్షవర్ధన్ తొలిసారి దర్శకత్వం వహించడంతో పాటు సంగీతం అందించిన సినిమా ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’. మురళి, శ్రీముఖి, కిశోర్, అజయ్ గోష్, హర్షవర్ధన్ ముఖ్య తారలుగా అంజిరెడ్డి ప్రొడక్షన్, ఎస్.కె. విశ్వేష్‌బాబు సమర్పణలో అంజిరెడ్డి నిర్మించిన ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను హైదరాబాద్‌లో విడుదల చేశారు. హర్షవర్ధన్ మాట్లాడుతూ– ‘‘పెళ్లిని ఘనంగా చేస్తుంటారు. కానీ, షష్టిపూర్తి కార్యక్రమాలు అలా జరగడం లేదు. పెళ్లి సైలెంట్‌గా జరగాలి. షష్టిపూర్తి ఘనంగా జరగాలనే ఆలోచన నుంచి పుట్టిన కథే ఈ చిత్రం. సినిమాలో ఏకైక లేడీ పాత్రను శ్రీముఖి చేశారు. 1988–89 కాలంలో ఓ మారుమూల గ్రామంలో జరిగిన ప్రేమకథే ఈ చిత్రం. ఫీల్ గుడ్ ఎలిమెంట్స్‌తో పాటు పక్కా కమర్షియల్ అంశాలూ ఉంటాయి. సంగీత దర్శకుడు కావాలనే నేను హైదరాబాద్ వచ్చా. అందుకే ఈ చిత్రానికి సంగీతం అందించా’’ అన్నారు. శ్రీముఖి, విశ్వేష్, కిశోర్, మురళి, సంతోష్, సురేష్, శ్రీధర్, కమల్, టిఎన్ఆర్ తదితరులు పాల్గొన్నారు. -
పీరియాడిక్ సినిమాలో స్టార్ యాంకర్
బుల్లితెరపై స్టార్ ఇమేజ్ అందుకున్న చాలా మంది తారలు ఇప్పుడు వెండితెర మీద సత్తా చాటేందుకు రెడీ అవుతున్నారు. ఇప్పటికే అనసూయ, రష్మీ, లాస్య లాంటి వారు వెండితెర మీద కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పటికే పలు చిత్రాల్లో సపోర్టింగ్ రోల్స్ లో అలరించిన యాంకర్ శ్రీముఖి.. ఇప్పుడు లీడ్ రోల్ ఓ సినిమా చేస్తోంది.ఈ సినిమా 80ల నాటి కథతో పీరియాడిక్ జానర్ లో తెరకెక్కుతోంది. ప్రముఖ నటుడు, రచయిత హర్షవర్దన్ తొలి సారిగా దర్శకుడిగా పరిచయం అవుతూ తెరకెక్కిస్తున్న గుడ్ బ్యాడ్ అగ్లీ అనే సినిమాలో శ్రీముఖి లీడ్ రోల్ లో నటిస్తోంది. ఈ సినిమా ఫస్ట్ లుక్ లాంచ్ కార్యక్రమం పలువురు సినీ ప్రముఖుల సమక్షంలో ఘనంగా జరిగింది. అంజి రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాలో శ్రీముఖితో పాటు కిశోర్ మరో కీలక పాత్రలో నటిస్తున్నాడు. "GOOD BAD UGLY" A 80's period film! My next in telugu! And it's really close to my heart! Thanks @harrsham #GOODBADUGLY #GBU pic.twitter.com/tXjBIBRpZH — SreeMukhi (@MukhiSree) 13 August 2017 GOOD BAD UGLY! Need all your love! #GBU #GOODBADUGLY #mynextintelugu #Harshavardhansmusicalnarrative pic.twitter.com/BfGAkAoWkh — SreeMukhi (@MukhiSree) 13 August 2017 #mymovie #first pressmeet pic.twitter.com/edOgxmqOE7 — harshavardhan (@harrsham) 12 August 2017