
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ నటించిన ఫుల్ యాక్షన్ థ్రిల్లర్ 'గుడ్ బ్యాడ్ అగ్లీ'. ఈ చిత్రంలో త్రిష హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమాకు అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించారు. ఈ మూవీని మైత్రి మేకర్స్ బ్యానర్‌లో వై రవిశంకర్, నవీన్ యేర్నేని నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ప్రమోషన్స్ ప్రారంభించారు.
ఇప్పటికే ఈ మూవీ టీజర్ విడుదల చేసిన మేకర్స్.. తాజాగా టీజర్ మేకింగ్ వీడియోతో ఆడియన్స్‌కు సర్‌ప్రైజ్ ఇచ్చారు. ఈ మేకింగ్ వీడియోలో అజిత్ కుమార్ టీమ్ పడిన కష్టాన్ని కళ్లకు కట్టినట్లుగా చూపించారు. ముఖ్యంగా తన ఫర్మామెన్స్‌తో సీన్స్‌లో అద్భుతంగా నటించారు. మీరు ఈ మేకింగ్ వీడియో చూసేయండి. ఈ యాక్షన్ మూవీ ఏప్రిల్ 10న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. కాగా.. ఈ చిత్రంలో సునీల్, ప్రసన్న కీలక పాత్రలు పోషిస్తున్నారు. కాగా.. ఈ సినిమాకు జీవీ ప్రకాష్‌కుమార్ సంగీతం అందించారు.
(ఇది చదవండి: అజిత్ కుమార్ 'గుడ్ బ్యాడ్ అగ్లీ'.. తెలుగు టీజర్ చూశారా?)
అజిత్ కుమార్ ఇటీవల విదాముయార్చి మూవీతో ప్రేక్షకులను పలకరించారు. తెలుగులో పట్టుదల పేరుతో ఈ సినిమా విడుదలైంది. అయితే ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఊహించినంత స్థాయిలో రాణించలేకపోయింది. దీంతో అజిత్ ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు గురయ్యారు. మరి గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాతోనైనా బ్లాక్ బస్టర్ కొట్టాలని అజిత్ ఫ్యాన్స్ భావిస్తున్నారు.
Here is the making of #GoodBadUglyTeaser ❤️🔥
▶️ https://t.co/qLYnc6f41W
After Teaser Sambavam, it is time for the first single. Ready, Maamey?#OGSambavam from March 18th.
A @gvprakash Musical ❤️🔥#GoodBadUgly Grand release on 10th April, 2025 with VERA LEVEL entertainment 🤩… pic.twitter.com/2K5Makpxph— Mythri Movie Makers (@MythriOfficial) March 14, 2025
Comments
Please login to add a commentAdd a comment