అన్నం ఉడికిందో లేదో తెలియడానికి ఒక్క మెతుకు చూస్తే చాలంటారు. అలాగే కొన్ని చిత్రాల జాతకం ఒక్క పోస్టర్‌తోనే తెలిసిపోతుంది. ఈ విషయాన్ని అజిత్ 'గుడ్ బ్యాడ్ అగ్లీ' చిత్రం నిరూపించింది. అజిత్ ప్రస్తుతం విడాయుయర్చి చిత్రంలో నటిస్తున్నారు. మగిళ్ తిరుమేణి దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తున్న ఇందులో త్రిష హీరోయిన్‌గా నటిస్తున్నారు. పలు సమస్యలను అధిగమిస్తూ ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది.
గుడ్ బ్యాడ్ అగ్లీ
ఇకపోతే అజిత్ తన తదుపరి చిత్రానికి సిద్ధం అవుతున్నారు. అదే గుడ్ బ్యాడ్ అగ్లీ. మార్క్ ఆంటోని వంటి సూపర్‌హిట్ చిత్రాన్ని తెరకెక్కించిన అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ప్రముఖ టాలీవుడ్ చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ఇందులో అజిత్ త్రిపాత్రాభినయం చేస్తున్నట్లు సమాచారం.
పోస్టర్‌కు పాజిటివ్ రెస్పాన్స్
ఆయనకు జంటగా శ్రీలీల, మీనా, సిమ్రాన్‌లు నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. కాగా చిత్ర షూటింగ్ వచ్చే నెలలో ప్రారంభం అవుతుందని సమాచారం. గుడ్ బ్యాడ్ అగ్లీ అనే టైటిల్‌కు సూపర్ రెస్పాన్స్ రాగా ఫస్ట్‌లుక్ పోస్టర్ కూడా అదిరిపోయింది. అజిత్ మూడు ముఖాలతో కూడిన ఆ పోస్టర్ చిత్రంపై మరింత ఆసక్తిని పెంచేసింది.
ఓటీటీ రైట్స్
ఇక ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ రూ.95 కోట్లు పెట్టి సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. మొత్తం మీద అజిత్ గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రం ప్రారంభానికి ముందే సంచలనం సృష్టిస్తోందన్నమాట. ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి థియేటర్లలో రానుంది.
చదవండి: బిగ్ బాస్ ఓటీటీ సీజన్ 3 అప్డేట్ వచ్చేసింది.. మారనున్న హోస్ట్
Comments
Please login to add a commentAdd a comment