
హిందీ బిగ్ బాస్ ఓటీటీ సీజన్ 3 ప్రారంభం కానుంది. జియో సినిమాలో ఇప్పటికే రెండు ఓటీటీ సీజన్‌లను పూర్తి చేసుకుని భారీగా అభిమానలను ఈ కార్యక్రమం సొంతం చేసుకుంది. ఓటీటీలో గత సీజన్‌కు మంచి ఆధరణ రావడంతో ఇప్పుడు సీజన్ 3 కోసం రంగం సిద్ధమైంది. జియో సినిమాలో ఐపీఎల్ తర్వాత ఎక్కువ మంది చూసిన షోగా బిగ్ బాస్ సీజన్ 2 నిలిచిన విషయం తెలిసిందే.

బిగ్ బాస్ ఓటీటీ సీజన్ 3ను బాలీవుడ్ స్టార్ అనిల్ కపూర్ హోస్ట్ చేయనున్నట్లు తెలుస్తోంది. వాస్తవంగా హిందీ బిగ్ బాస్‌కు సంబంధించిన అన్ని సీజన్లను సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా కొనసాగిన విషయం తెలిసిందే. కానీ, సల్మాన్ ఖాన్ ఈ సీజన్ నుంచి తప్పుకున్నట్లు సమాచారం. దీనికి ప్రధాన కారణం గత నెలలో సల్మాన్ ఇంటి వద్ద ఇద్దరు దుండగులు కాల్పులు జరపడంతో భద్రతాపరమైన చిక్కులు ఎదురౌతాయని ఈ కార్యక్రమానికి ఆయన దూరంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. బిగ్ బాస్ ఓటీటీ సీజన్ జూన్‌లో ప్రారంభమౌతుందని మేకర్స్ ప్రకటించారు. కానీ, హోస్ట్ విషయంలో ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.
Comments
Please login to add a commentAdd a comment