అజిత్‌ కుమార్‌ 'ఓజీ సంభవం'.. తెలుగు వర్షన్ వచ్చేసింది! | Ajith Kumar Good Bad Ugly Movie Og Sambavam song Out now | Sakshi
Sakshi News home page

Good Bad Ugly Movie: అజిత్‌ కుమార్‌ 'ఓజీ సంభవం'.. తెలుగు వర్షన్ వచ్చేసింది!

Published Tue, Apr 8 2025 6:23 PM | Last Updated on Tue, Apr 8 2025 6:48 PM

 Ajith Kumar Good Bad Ugly Movie Og Sambavam song Out now

కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ నటించిన ఫుల్ యాక్షన్‌ థ్రిల్లర్‌ 'గుడ్ బ్యాడ్ అగ్లీ'. ఈ చిత్రంలో త్రిష హీరోయిన్‌గా నటించింది.   అధిక్ రవిచంద్రన్‌ దర్శకత్వం వహించిన ఈ మూవీని మైత్రి మేకర్స్ బ్యానర్‌లో  వై రవిశంకర్, నవీన్ యేర్నేని నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ గురువారమే ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది. ఈ మూవీ తెలుగు, తమిళంలో ట్రైలర్స్ రిలీజ్ చేశారు మేకర్స్.

ఇప్పటికే ఓజీ సంభవం పేరుతో తమిళంలో ఫస్ట్‌ సింగిల్‌ రిలీజ్‌ చేసిన మేకర్స్.. తాజాగా తెలుగులోనూ విడుదల చేశారు. ఈ చిత్రంపై అజిత్ అభిమానుల్లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ పాటకు కృష్ణకాంత్ లిరిక్స్ అందించారు. కాగా.. ఈ చిత్రంలో సునీల్, ప్రసన్న కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకు జీవీ ప్రకాష్‌కుమార్‌ సంగీతం అందించారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement