![Ajith Good Bad Ugly to release in Telugu for Sankranthi 2025](/styles/webp/s3/article_images/2024/10/11/Ajithh_News_0.jpg.webp?itok=bhvaLAuM)
అజిత్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ స్పెయిన్‌లోని మ్యాడ్రిడ్‌లో జరుగుతోంది. ఈ లాంగ్ షెడ్యూల్‌లో ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలతో పాటు యాక్షన్, సాంగ్ చిత్రీకరణలను కూడా ప్లాన్ చేశారు. ఈ చిత్రంలో సునీల్, ప్రసన్న కీలక పాత్రలు పోషిస్తున్నారు. అలాగే ఈ చిత్రంలో త్రిష హీరోయిన్‌గా నటిస్తున్నారని, హీరోయిన్ శ్రీలీల మరో లీడ్ రోల్‌లో కనిపిస్తారనే ప్రచారం సాగుతోంది.
మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్న ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ సంక్రాంతికి విడుదల కానుంది. అయితే ఈ సినిమాకన్నా ముందే అజిత్ హీరోగా కమిటైన ‘విడాముయర్చి’ చిత్రం సంక్రాంతికి విడుదలతుందని, ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ వచ్చే వేసవిలో రిలీజ్ కానుందనే ప్రచారం తెరపైకి వచ్చింది. కానీ తాజాగా ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ సంక్రాంతికే రిలీజ్ అవుతుందని వెల్లడించి, అజిత్ కొత్త లుక్‌ను యూనిట్ రిలీజ్ చేసింది. దీంతో ‘విడాముయర్చి’ చిత్రం వచ్చే వేసవిలో రిలీజ్ అవుతుందని ఊహించవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment