వేసవిలో యాక్షన్‌ | Ajith Good Bad Ugly movie new poster releases | Sakshi
Sakshi News home page

వేసవిలో యాక్షన్‌

Published Tue, Jan 7 2025 12:17 AM | Last Updated on Tue, Jan 7 2025 12:17 AM

Ajith Good Bad Ugly movie new poster releases

అజిత్‌ కుమార్‌ హీరోగా నటించిన స్టైలిష్‌ యాక్షన్  థ్రిల్లర్‌ మూవీ ‘గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ’. త్రిష హీరో యిన్ . ‘మార్క్‌ ఆంటోని’ ఫేమ్‌ అధిక్‌ రవిచంద్రన్‌ దర్శకత్వంలో మైత్రీమూవీమేకర్స్‌ పతాకంపై నవీన్‌ ఎర్నేని, వై. రవి శంకర్‌ నిర్మించారు.

ఈ మూవీని వేసవిలో ఏప్రిల్‌ 10న రిలీజ్‌ చేయనున్నట్లు ప్రకటించి,  కొత్త పోస్టర్‌ను రిలీజ్‌ చేశారు మేకర్స్‌. ‘‘అజిత్‌పాత్రలో డిఫరెంట్‌ షేడ్స్‌ ఉంటాయి. ఇండియన్  మూవీ చరిత్రలోనే ‘గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ’ ఓ మైలురాయిగా నిలుస్తుంది’’ అని యూనిట్‌ పేర్కొంది. ఈ సినిమాకు జీవీ ప్రకాష్‌కుమార్‌ సంగీతం అందించారు. కాగా ఈ చిత్రాన్ని తొలుత సంక్రాంతికి రిలీజ్‌ చేయాలనుకున్నారు. కానీ, ఏప్రిల్‌లో రిలీజ్‌ అవుతోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement