poster releases
-
వేసవిలో యాక్షన్
అజిత్ కుమార్ హీరోగా నటించిన స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’. త్రిష హీరో యిన్ . ‘మార్క్ ఆంటోని’ ఫేమ్ అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో మైత్రీమూవీమేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవి శంకర్ నిర్మించారు.ఈ మూవీని వేసవిలో ఏప్రిల్ 10న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించి, కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ‘‘అజిత్‌పాత్రలో డిఫరెంట్ షేడ్స్ ఉంటాయి. ఇండియన్ మూవీ చరిత్రలోనే ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ ఓ మైలురాయిగా నిలుస్తుంది’’ అని యూనిట్ పేర్కొంది. ఈ సినిమాకు జీవీ ప్రకాష్‌కుమార్ సంగీతం అందించారు. కాగా ఈ చిత్రాన్ని తొలుత సంక్రాంతికి రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ, ఏప్రిల్‌లో రిలీజ్ అవుతోంది. -
తెలంగాణ నేపథ్యంలో...
నేత్ర, శ్రేయస్ బట్టోజు, సుధీర్ శర్మ, సాయి రాఘవేంద్ర, ప్రద్యుమ్న ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘పొక్కిలి’. మహేష్ గంగిమళ్ల దర్శకత్వంలో వీఆర్‌జీఆర్ మూవీస్‌పై గొంగటి వీరాంజనేయ నాయుడు నిర్మిస్తున్నారు. ఈ చిత్రం టైటిల్ అనౌన్స్ మెంట్‌తో పాటు పోస్టర్ని డైరెక్టర్ సుకుమార్ విడుదల చేశారు. ‘‘తెలంగాణ పల్లెటూరి నేపథ్యంలో, వాస్తవ ఘటనలతో రూ΄÷ందుతోన్న చిత్రం ‘΄÷క్కిలి’. క్లైమాక్స్, రెండు ΄ాటలు మినహా షూటింగ్ పూర్తయింది’’ అన్నారు దర్శక–నిర్మాతలు. ఈ చిత్రానికి కెమెరా: జయ΄ాల్ నిమ్మల. -
వై.ఎస్. జగన్ రైతు దీక్ష పోస్టర్ విడుదల
ఏలూరు: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రైతు సమస్యలపై ఈ నెల 31, ఫిబ్రవరి 1న తణుకులో దీక్ష చేయనున్నారు. దీక్షకు సంబంధించిన పోస్టర్ ను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ త్రిసభ్య కమిటీ ఈ రోజు మధ్యాహ్నం విడుదల చేసింది. కార్యక్రమంలో త్రిసభ్య కమిటీ సభ్యులు విజయసాయి రెడ్డి, ఉమ్మారెడ్డి, ప్రసాద్ రాజు , జిల్లా అధ్యక్షుడు ఆళ్లనాని, ఎమ్మెల్యేలు, జ్యోతుల నెహ్రూ, చిర్ల జగ్గిరెడ్డి, ఎమ్మెల్సీ మేక శేషుబాబు, నియోజక వర్గ సభ్యులు పాల్గొన్నారు. అనంతరం తణుకులోని దీక్షా స్థలం ను త్రిసభ్యకమిటీ సభ్యులు పరిశీలించారు. ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ, టీడీపీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలుచేసి రైతులు, డ్వాక్రా మహిళలకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్ జగన్మోహన్రెడ్డి రెండు రోజుల దీక్ష చేస్తున్నారు.